న్యూదిల్లీలోని ప్రగతిమైదాన్‌లో ఏర్పాటు చేసిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023ను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించి మాట్లాడారు. దేశం ప్రస్తుతం 6జీ దిశగా అడుగులు వేస్తోందన్నారు. 5జీని అందుబాటులోకి తీసుకొచ్చిన ఏడాదిలోపే దేశవ్యాప్తంగా నాలుగు లక్షల 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. బ్రాడ్‌బ్యాండ్ వేగంలో భారత్ గతంలో 118 ర్యాంక్‌లో ఉండగా..ఇప్పుడు 43వ ర్యాంక్‌కు చేరిందని తెలిపారు.
ఇటీవలే గూగుల్.. భారత్‌లో పిక్సెల్ ఫోన్‌ను తయారు చేయనున్నట్లు ప్రకటించిందన్నారు. శామ్‌సంగ్ ఫోల్డ్ 5, యాపిల్ ఐఫోన్ 15 ఇప్పటికే దేశంలో తయారవుతున్నాయని గుర్తచేశారు. ప్రపంచమంతా మేడ్ ఇన్ ఇండియా ఫోన్లను ఉపయోగిస్తుండటం గర్వంగా ఉందని మోదీ కొనియాడారు. భారత టెక్ విప్లవంలో యువత పాత్ర కీలకమని, అంతరిక్ష రంగంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. 6జీ టెక్నాలజీలో భారత్ ప్రపంచానికి మార్గనిర్దేశంగా నిలుస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment