భారత్ డిజిటల్ ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతోందని ఆస్క్ క్యాపిటల్ తెలిపింది. 2028 నాటికి ఇండియా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల(రూ.83 లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా వేసింది. అందుకోసం యూపీఐ, 4జీ, 5జీ సాంకేతికతలు ఎంతో తోడ్పడుతాయని తెలిపింది. ఈమేరకు నివేదిక రూపొందించింది.
నివేదికలోని వివరాల ప్రకారం..దేశంలో ఇంటర్నెట్ వేగంగా విస్తరిస్తోంది. 4జీ, 5జీ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. యూపీఐ సేవలు మెరుగవుతున్నాయి. 2028 నాటికి భారత్ ట్రిలియన్ డాలర్ల(రూ.83 లక్షల కోట్లు) డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారనుంది. గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరుగుతోంది. ఆర్థిక కార్యకలాపాలను డిజిటలైజేషన్ చేయడంతో నగదు రహిత లావాదేవీలు, ఆన్‌లైన్ కొనుగోళ్లవైపు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ఐసీఆర్‌ఐఈఆర్) ప్రకారం..భారత్ డిజిటల్ ఎకానమీ పరంగా అభివృద్ధి చెందిన దేశాలైన జపాన్, యూకే, జర్మనీలను అధిగమించింది.
ఇదీ చదవండి: ‘కాల్ చేసి స్కామ్ చేయాలి’.. చాట్‌జీపీటీ స్పందన ఇదే..
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన వంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) పథకాలు డిజిటల్ ఎకానమీకి ఊతమిచ్చేలా పనిచేస్తున్నాయి. డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఆన్‌లైన్ విద్య, టెలి-మెడిసిన్, డిజిటల్ హెల్త్, డిజాస్టర్ రెస్పాన్స్..వంటి సేవలకోసం ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment