Digital Economy
-
డిజిటల్ విప్లవంలో భారత్ ముందంజ
జైపూర్: డిజిటల్ విప్లవంలో భారతదేశం ముందంజలో ఉందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర తెలిపారు.ఆర్థిక సాంకేతికత డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఈ–మార్కెట్లు పురోగమిస్తున్నాయి. వాటి పరిధి విస్తరిస్తోంది. డిజిటల్ ఎకానమీ ప్రస్తుతం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పదో వంతుగా అంచనా. గత దశాబ్దంలో గమనించిన వృద్ధి రేటు ప్రకారం, 2026 నాటికి జీడీపీలో ఐదవ వంతుకు డిజిటల్ ఎకానమీ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి’’ అని ఈ అంశంపై జరిగిన డీఈపీఆర్ సదస్సులో డిప్యూటీ గవర్నర్ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ⇒ కొత్త వృద్ధి మార్గాలను అన్వేíÙంచడానికి, ఇప్పటికే ఉన్న మార్గాలను పటిష్టం చేసుకోడానికి భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ని పటిష్టం చేసుకుంటోంది. శక్తివంతమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం, యువత అధికంగా ఉండడం, అతిపెద్ద ఆరి్టఫిషీయల్ ఇంటిలిజెన్స్ టాలెంట్ బేస్ భారత్‌కు సానుకూల అంశం. ⇒ ఫైనాన్స్ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడంపై దేశం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. దేశంలో బ్యాంకులు మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను పటిష్టంగా అమ లుచేస్తున్నాయి. ఆన్లైన్ ఖాతా తెరవడం, డిజిటల్ కేవైసీ, ఇంటి వద్దేకే డిజిటల్ అనుసంధాన బ్యాకింగ్ సేవలు వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. సాంకేతికత అనుసంధానంలో బ్యాంకింగ్ పురోగమిస్తోంది. ⇒ ఐదు ప్రధాన అంశాలపై ఆర్బీఐ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. అందరికీ డిజిటల్ ఫైనాన్షియల్ వ్యవస్థను అందుబాటులోనికి తీసుకురావడం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ పురోగతి, సైబర్ సెక్యూరిటీ, సుస్థిర ఫైనాన్స్, అంతర్జాతీయ సహకారం, సమన్వయం ఇందులో ఉన్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు కీలకమైనవి: ఆర్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లను 2024కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి దేశీయ వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన బ్యాంకులు (డీ–ఎస్ఐబీలు)గా పేర్కొంది. బ్యాంకుల నుండి సేకరించిన డేటా ఆధారంగా 2024 వరకూ ఈ వర్గీకరణ అమల్లో ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ మొదట 2014లో డీ–ఎస్ఐబీలకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది. 2015, 2016 జాబితాలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌లను చేర్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ను 2017లో ఈ లిస్ట్‌లో చేర్చింది. డీ–ఎస్ఐబీ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, ఈ జాబితాలోని బ్యాంకులు ఎకానమీ పురోగతిలో కీలకపాత్ర పోషిస్తాయి. అందరికీ ఆర్థిక ఫలాలు అందడంలో ఈ బ్యాంకుల సేవల కీలకమైనవి. మున్సిపల్ కార్పొరేషన్ల ఆదాయాలు పెరగాలి... ఇదిలావుండగా, ఆస్తిపన్ను సంస్కరణలు, వినియోగదారు చార్జీల హేతుబద్ధికరణ, మెరుగైన వసూళ్ల విధానాల ద్వారా మున్సిపల్ కార్పొరేషన్లు తమ ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ నివేదిక సూచించింది. పెరుగుతున్న పట్టణ జనాభాతో పట్టణ ప్రాంతాల్లో అధిక–నాణ్యత ప్రజా సేవలకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని ‘ము నిసిపల్ ఫైనాన్సెస్’ పేరుతో విడుదలైన ఈ నివేదికలో ఆర్బీఐ తెలిపింది. స్థానిక పన్నుల సంస్కరణలు, ఈ విషయంలో మెరుగైన అమలు విధానాలు, సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడం, పారదర్శక ఆర్థిక నిర్వహణ ద్వారా మునిసిపల్ కార్పొరేషన్ల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలని నివేదిక పేర్కొంది. ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్దిష్ట వ్యూహాలు అవలంభించాలని పేర్కొంది. -
ఆన్లైన్ గేమింగ్‌కు మనీ లాండరింగ్ ముప్పు
న్యూఢిల్లీ: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశీ ఆన్లైన్ గేమింగ్ రంగానికి మనీలాండరింగ్ నుంచి గణనీయంగా ముప్పు పొంచి ఉందని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో విస్తరించిన డిజిటల్ ఎకానమీని, ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమను కాపాడేందుకు సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆపరేటర్లను కట్టడి చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని, చట్టబద్ధమైన ఆపరేటర్లతో వైట్‌లిస్ట్ తయారు చేయాలని, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేయాలని, అంతర్జాతీయంగా పరస్పరం సహరించుకోవాలని పేర్కొంది. అలాగే మోసపూరిత విధానాలు పాటించే ప్లాట్‌ఫాంల జోలికి వెళ్లకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని, పటిష్టమైన ఇన్వెస్టిగేటివ్ బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అయిదేళ్లలో 7.5 బిలియన్ డాలర్లకు పరిశ్రమ.. నివేదిక ప్రకారం 2020– 2023 ఆర్థిక సంవత్సరాల మధ్య 28 శాతం వార్షిక వృద్ధితో భారతీయ రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ) రంగం అంతర్జాతీయ మార్కెట్లో కీలక పరిశ్రమగా మారింది. వచ్చే ఐదేళ్లలో ఈ రంగం ఆదాయం 7.5 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. కోట్ల కొద్దీ గేమర్లు పరిశ్రమ వృద్ధికి దోహదపడుతున్నారు. దీనితో ఫిన్‌టెక్, క్లౌడ్ సర్వీసెస్, సైబర్–సెక్యూరిటీ వంటి అనుబంధ రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → యూజర్‌కు భద్రత, సైబర్ సెక్యూరిటీపరమైన సవాళ్లు మొదలైనవి పరిశ్రమ పురోగతికి అవరోధాలుగా మారొచ్చు. దేశీయంగా చట్టవిరుద్ధమైన బెట్టింగ్ మార్కెట్లో ఏటా 100 బిలియన్ డాలర్ల డిపాజిట్లు వస్తుండటం ఈ సవాళ్ల తీవ్రతకు నిదర్శనం. → చట్టవిరుద్ధమైన ఆపరేటర్లను కట్టడి చేసేందుకు నియంత్రణ సంస్థలు ఎంతగా ప్రయతి్నస్తున్నప్పటికీ మిర్రర్ సైట్స్, అక్రమ బ్రాండింగ్, అలవిగాని హామీలతో చాలా ప్లాట్‌ఫాంలు నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పర్యవేక్షణ, చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. → దేశీయంగా 400 పైచిలుకు స్టార్టప్‌లు 10 కోట్ల మంది రోజువారీ ఆన్లైన్ గేమర్లు ఉన్నారు. వీరిలో 9 కోట్ల మంది డబ్బు చెల్లించి గేమ్స్ ఆడుతుంటారు. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక లక్ష మందికి ఉద్యోగాలు కలి్పస్తోంది. 2025 నాటికి 2,50,000 ఉద్యోగాలను కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇంతటి భారీ పరిశ్రమకు నిర్దిష్టంగా ఒక నియంత్రణ సంస్థ అంటూ లేకపోవడం, పర్యవేక్షణ.. ఏకరూప ప్రమాణాలు లేకపోవడం వంటి అంశాలు సమస్యలుగా ఉంటున్నాయి. -
రూ.83 లక్షల కోట్లకు డిజిటల్ ఎకానమీ
భారత్ డిజిటల్ ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతోందని ఆస్క్ క్యాపిటల్ తెలిపింది. 2028 నాటికి ఇండియా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల(రూ.83 లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా వేసింది. అందుకోసం యూపీఐ, 4జీ, 5జీ సాంకేతికతలు ఎంతో తోడ్పడుతాయని తెలిపింది. ఈమేరకు నివేదిక రూపొందించింది.నివేదికలోని వివరాల ప్రకారం..దేశంలో ఇంటర్నెట్ వేగంగా విస్తరిస్తోంది. 4జీ, 5జీ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. యూపీఐ సేవలు మెరుగవుతున్నాయి. 2028 నాటికి భారత్ ట్రిలియన్ డాలర్ల(రూ.83 లక్షల కోట్లు) డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారనుంది. గత కొన్నేళ్లుగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతోంది. ఆర్థిక కార్యకలాపాలను డిజిటలైజేషన్ చేయడంతో నగదు రహిత లావాదేవీలు, ఆన్లైన్ కొనుగోళ్లవైపు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ఐసీఆర్ఐఈఆర్) ప్రకారం..భారత్ డిజిటల్ ఎకానమీ పరంగా అభివృద్ధి చెందిన దేశాలైన జపాన్, యూకే, జర్మనీలను అధిగమించింది.ఇదీ చదవండి: ‘కాల్ చేసి స్కామ్ చేయాలి’.. చాట్‌జీపీటీ స్పందన ఇదే..ప్రధానమంత్రి జన్ ధన్ యోజన వంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకాలు డిజిటల్ ఎకానమీకి ఊతమిచ్చేలా పనిచేస్తున్నాయి. డిజిటల్ ఎంటర్టైన్మెంట్, ఆన్లైన్ విద్య, టెలి-మెడిసిన్, డిజిటల్ హెల్త్, డిజాస్టర్ రెస్పాన్స్..వంటి సేవలకోసం ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. -
ట్రిలియన్ డాలర్లకు డిజిటల్ ఎకానమీ
న్యూఢిల్లీ: భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏటా 2.8 శాతం వృద్ధి చెందుతోంది. 2027–28 నాటికి ఇది ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అధికారిక నివాసంలో సోమవారం సాయంత్రం జరిగిన విశేష సంపర్క్ అభియాన్‌లో ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో దాదాపు 300 ఐటీ, స్టార్టప్‌లు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. ‘2026–27 నాటికి భారత డిజిటల్ ఎకానమీ 1 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకుంటుందని ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది. అయితే కోవిడ్–19 మహమ్మారితో సహా వివిధ కారణాల వల్ల లక్ష్యం ఆ తర్వాతి సంవత్సరానికి మార్చారు’ అని తెలిపారు. -
ఈ-కామర్స్‌కు భారత్ ‘అమెజాన్’:ఇక్కడి మార్కెట్లో భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ రంగంలో భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని అమెజాన్ ఇండియా వెల్లడించింది. డిజిటైజేషన్, ఆర్థిక వృద్ధి, మొబైల్, ఇంటర్నెట్ విస్తృతి, యువత కారణంగా ఊపందుకున్న భారత ఈ-కామర్స్ ఆకర్షణీయంగా ఉందని అమెజాన్ ఇండియా కంజ్యూమర్ బిజినెస్ కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ తెలిపారు. ఇక్కడ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి కాలపరిమితి అంశంలో చాలా స్పష్టత ఉందన్నారు. కంపెనీ తన 2025 లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఉందని చెప్పారు. అమెజాన్ ఇటీవలే భారత్‌లో పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. సంస్థకు ఇక్కడి మార్కెట్లో 10 కోట్ల పైచిలుకు వినియోగదార్లు ఉన్నారు. ఈ–కామర్స్ విస్తృతి ఇప్పటికీ పరిమితమని, దేశంలో ఈ రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయని వివరించారు. మరో పదేళ్ల వరకు ఈ-కామర్స్ రంగంలో విస్తరణకు ఎటువంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. ఉత్తేజకర మార్కెట్‌గా..: ప్రపంచవ్యాప్తంగా సంస్థకు చాలా ఉత్తేజకర మార్కెట్‌గా భారత్ కొనసాగుతోందని మనీష్ తెలిపారు. కాబట్టి అంతర్జాతీయంగా ఇక్కడి విపణిపై అమెజాన్ దృష్టి కేంద్రీకరించిందని అన్నారు. ‘భారత మార్కెట్ చాలా ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇంతటి వ్యాపార అవకాశాలున్న మార్కెట్లు ఎక్కువగా లేవు. ఈ-కామర్స్ విస్తృతి తక్కువగా ఉండడంతో పోటీ విషయంలో ఎటువంటి ఆందోళన లేదు. విస్తృతి 90 శాతానికి చేరినప్పుడు పోటీ గురించి ఆందోళన చెందాలి. కస్టమర్ అంచనాలను ఎలా అందుకోవాలో తొలి 10 ఏళ్లు మాకు నేర్పించాయి. మార్కెట్ చాలా నూతనంగా ఉంది. మరిన్ని ఆవిష్కరణలు, మరిన్ని కంపెనీలు రంగ ప్రవేశం చేస్తాయి. దీర్ఘకాలంలో మా అమ్మకందారులకు, కస్టమర్లకు ఇది మంచిదని భావిస్తున్నాను’ అని అన్నారు. భారత ఈ-కామర్స్ మార్కెట్ 2022లో 83 బిలియన్ డాలర్లు నమోదైంది. 2026 నాటికి ఇది 150 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఎఫ్ఐఎస్ 2023 గ్లోబల్ పేమెంట్స్ నివేదిక వెల్లడించింది. -
G20 Ministerial Meet: భారత్ ఒక ఆదర్శ ప్రయోగశాల
న్యూఢిల్లీ/బెంగళూరు: భారతదేశం విభిన్న సమస్యల పరిష్కారాల కోసం ఆదర్శవంతమైన ఒక ప్రయోగశాల అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడ విజయవంతమైన పరిష్కారాలను ప్రపంచంలో ఎక్కడైనా సులభంగా అన్వయించవచ్చని నొక్కి చెప్పారు. బెంగళూరులో శనివారం జరిగిన జీ20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ మంత్రుల సమావేశంలో ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. భారత్‌లోని డిజిటల్ మౌలిక వసతులతో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు సురక్షితమైన పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ప్రపంచంతో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ‘భారత్ ఎంతో వైవిధ్యం కలిగిన దేశం. మాకు డజన్ల కొద్దీ భాషలు, వందలాదిగా మాండలికాలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి మతానికి, అసంఖ్యాక సాంస్కృతిక వారసత్వాలకు భారత్ నిలయం. ప్రాచీన సంప్రదాయాల నుంచి లేటెస్ట్ టెక్నాలజీ వరకు, ప్రతి ఒక్కరికీ అవసరమైనవి భారత్‌లో ఉన్నాయి. అనేక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనేందుకు భారత్ ఒక ఆదర్శ ప్రయోగశాల. ఇక్కడ విజయవంతమైన పరిష్కారాన్ని ప్రపంచంలో ఎక్కడైనా సులువుగా అన్వయించుకోవచ్చు’అని ప్రధాని చెప్పారు. డిజిటల్ సాంకేతికతలో అన్ని దేశాలను భాగస్వా ములను చేసేలా వర్చువల్ ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన రోడ్ మ్యాప్ రూపొందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. డిజిటల్ ఎకానమీ విస్తరించే కొద్దీ భద్రతా పరమైన సవాళ్లు కూడా ఎదురవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జీ20 దేశాల మధ్య ఏకాభిప్రాయంతో విశ్వసనీయమైన, సురక్షితమైన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సురక్షిత, సమ్మిళిత, శ్రేయస్కరమైన గ్లోబల్ డిజిటల్ భవిష్యత్తు కోసం జీ20 దేశాలకు ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఆర్థికంగా, సాంకేతికతపరంగా భారత్ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. భాషల అనువాదం కోసం ‘భాషిణి’అనే కృత్రిమ మేధను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. జన్‌ధన్ ఖాతాలు 50 కోట్లు జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు 50 కోట్లు దాటిపోవడం కీలక మైలురాయని ప్రధాని మోదీ అన్నారు. ఇందులో సగానికి పైగా ఖాతాలు మహిళలవేనని చెప్పారు. జన్‌ధన్ బ్యాంకు ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్కు దాటిందని, ఇందులో 56 శాతం మహిళలకు చెందినవేనని శుక్రవారం ఆర్థిక శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 2014లో జన్‌ధన్ ఖాతాల కార్యక్రమాన్ని ప్రారంభించింది. -
దూసుకుపోతున్న డిజిటల్ ఎకానమీ
ముంబై: డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలు మరింతగా వృద్ధి చెందుతాయని, 2028–29 ఆర్థిక సంవత్సరం చివరికి అదనంగా సమకూరే దేశ జీడీపీలో పావు వంతు వాటా ఆక్రమిస్తాయని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ అంచనా వేశారు. 2029 మార్చి నాటికి దేశ జీడీపీ 7 ట్రిలియన్ డాలర్ల స్థాయిని చేరుకుంటుందన్నారు. ప్రస్తుతం మన దేశ జీడీపీలో డిజిటల్ ఆర్థిక కార్యకలాపాల వాటా 4 శాతంగా ఉంటే, చైనాలో 40 శాతంగా ఉండడం గమనార్హం. డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలు అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ కామర్స్, డిజిటల్ చెల్లింపులు, సేవలు తదితర వాటిని కామత్ ఉదాహరణగా పేర్కొన్నారు. చైనా జీడీలో డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలు 40 శాతం సమకూరుస్తున్నాయని, మన దగ్గరా ఆ స్థాయికి చేరుకోకపోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని కామత్ పేర్కొన్నారు. ఇన్ఫ్రా అభివృద్ధి బ్యాంక్ (నాబ్‌ఫిడ్) చైర్మన్‌గా ప్రస్తుతం కామత్ పనిచేస్తున్నారు. ‘‘ఆర్థిక వ్యవస్థకు మరిన్ని మౌలిక సదుపాయాల అవసరం ఉంది. రవాణా, ఎక్స్‌ప్రెస్‌వే, హైవేలు, ఎయిర్‌పోర్ట్‌లు, ఓడరేవులు, రైల్వే నెట్‌వర్క్‌ల పరంగా మనం ఎంతో చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో ప్రజల రవాణాకు, వస్తు రవాణాకు వీలుగా ఎన్నో ఎక్స్‌ప్రెస్ రహదారులు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, పెద్ద ఎయిర్‌పోర్ట్‌లు వస్తాయి’’అని కామత్ వివరించారు. -
భారత్‌లో సైబర్ భద్రత, గోప్యత బలహీనం
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ ఆవిష్కరణలు, వాటిని ఉపయోగించుకోవడంలో భారత్ ఎంతో మెరుగైన స్థానంలో ఉన్నట్టు ఐసీఆర్ఐఈఆర్ విడుదల చేసిన భారత డిజిటల్ ఎకనామీ నివేదిక తెలిపింది. కానీ, సైబర్ భ్రదత, గోప్యత విషయంలో భారత్ ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉన్నట్టు పేర్కొంది. ప్రత్యేకంగా సైబర్ భద్రత చట్టం లేకపోవడం వల్ల, భారతీయులు ఆయా రంగాల నిబంధనలపైనే ఆధారపడాల్సి వస్తోందని పేర్కొంది. అసాధారణ స్థాయిలో డిజిటల్ పరివర్తన చూపిస్తున్న భారత్‌లో, సైబర్ భద్రత బలహీనంగా ఉన్నట్టు అభిప్రాయడింది. భారత్‌లో ఆవిష్కరణలు, డిజిటల్ సేవల సామర్థ్యాలను వినియోగించుకునే తీరుపై ఈ నివేదిక దృష్టి పెట్టింది. ఇంటరెŠన్ట్‌ను ఉపయోగించుకుని, వృద్ధి చెందడం, ఉపాధి కల్పన, పరిపానాల మెరుగుదల అంశాలు ఏ విధంగా ఉన్నాయన్నది విశ్లేషించింది. ‘‘జీ20లోని తోటి దేశాలతో పోలిస్తే తక్కువ మధ్యాదాయం కలిగిన దేశం భారత్. కానీ, ఆవిష్కరణల్లో మాత్రం భారత్ ఎంతో ఉన్నత స్థానంలో ఉంది. భారతీయులు త్వరితగతిన డిజిటల్ సేవలను వినియోగించుకోవడం తదుపరి వృద్ధిని వేగవంతం చేస్తుంది’’అని ఈ నివేదిక వివరించింది. సైబర్ నేరాలు, గోప్యతపై దాడి ఈ రెండు అంశాలపై భారత్ అత్యవసరంగా దృష్టి సారించాల్సి ఉందని సూచించింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ద్వారా ఈ అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పనిచేస్తున్నట్టు తెలిపింది. సైబర్ దాడుల నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు భారత్ ఎంతో చేయాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. భారత్‌లో డిజిటైజేషన్ పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ.. సైబర్ భద్రత కవచాలు ఏర్పాటు చేసుకోవడంలో మోస్తరు పురోగతినే చూపించినట్టు స్పష్టం చేసింది. -
ఆర్థిక మాంద్యమనే బెంగే వద్దు, పిలిచి మరీ జాబ్ ఇస్తున్నారు..లక్షల్లో ఉద్యోగాలు
ఆర్ధిక మాంద్యం భయాలతో అమెజాన్, ట్విటర్, మెటా, విప్రో, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగుల్ని ఫైర్ చేస్తున్నాయి. రానున్న 18 నెలలు ఉద్యోగులకు గడ్డు కాలమేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ కంపెనీల్లో పరిస్థితులు ఇలా ఉంటే మనదేశానికి చెందిన స్టార్టప్స్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. లక్షల స్టార్టప్‌లలో లక్షల ఉద్యోగాలు ఉన్నట్లు తేలింది. ఆయా స్టార్టప్‌లు అవసరాన్ని బట్టి ఇప్పటికే 2 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. రానున్న రోజుల్లో వాటి సంఖ్య భారీ స్థాయిలో పెరగనుంది. ఆర్థిక సేవల ప్లాట్‌ఫారమ్, స్ట్రైడ్‌వన్ నివేదిక ప్రకారం 2022లో మనదేశానికి స్టార్టప్‌లు 2లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాయి. స్టార్టప్‌ల ద్వారా ఉద్యోగాల కల్పన 2017-22 మధ్య 78 శాతం వృద్ధి సాధించినట్లు నివేదిక వెల్లడించింది. అదనంగా, దేశ ప్రభుత్వం డిజిటల్ ఎకానమీపై దృష్టి సారించడంతో ఉద్యోగాల కల్పన 2025 నాటికి 70 రెట్లు పెంచుతుందని హైలైట్ చేసింది. ఇండియన్ స్టార్టప్ ఈకో సిస్టం అమెరికా, చైనా తర్వాత ప్రపంచ దేశాల్లో మూడవ అతి పెద్ద దేశంగా భారత్ అవతరించింది. పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం(ఇంటర్నల్ ట్రేడ్) విభాగంలో 770,000 పైగా స్టార్టప్‌లు నమోదు చేసుకున్నాయి. 108 యునికార్న్‌లతో కూడిన, స్టార్ట్ అప్ల సంయుక్త విలువ $400 బిలియన్లకు పైగా ఉంది. ఈ సందర్భంగా స్ట్రైడ్‌వన్ వ్యవస్థాపకుడు ఇష్ప్రీత్ సింగ్ గాంధీ మాట్లాడుతూ..స్కేలబిలిటీ, ఆల్టర్నేట్ ఫండింగ్ ఆప్షన్లు, గ్లోబల్ మార్కెట్లోకి విస్తరించడం వంటి వివిధ అంశాలలో పర్యావరణ వ్యవస్థ పెరుగుదల అనేక అవకాశాలను సృష్టించిందని, తద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించే సామర్ధ్యాన్ని కూడా పెంచింది. దీంతో భారతదేశ జీడీపీకి సుమారు 4-5 శాతం దోహదపడే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది’ అని చెప్పారు. -
బెంగళూరులో స్టార్టప్స్ అంతర్జాతీయ సదస్సు
బెంగళూరు: స్టార్టప్ సంస్థలకు సంబంధించిన తొలి అంతర్జాతీయ సదస్సు.. ఇండియా గ్లోబల్ ఇన్నోవేషన్ కనెక్ట్ (ఐజీఐసీ) బెంగళూరులో గురువారం ప్రారంభమవుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును కర్ణాటక డిజిటల్ ఎకానమీ మిషన్ భాగస్వామ్యంతో అడ్వైజరీ సంస్థ స్మాద్యా అండ్ స్మాద్యా నిర్వహిస్తోంది. కాటమారన్ వెంచర్స్, టాటా డిజిటల్ తదితర సంస్థలు స్పాన్సర్ చేస్తున్నాయి. తొలి ఐజీఐసీ సదస్సులో భారత్‌తో పాటు సింగపూర్, ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్, అమెరికా, జపాన్, కొరియా, జర్మనీ తదితర దేశాల నుండి 80 మంది పైగా వక్తలు పాల్గొంటున్నారు. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ సాఫో మొదలైన వారు వీరిలో ఉన్నారు. ఇందులో 22 సెషన్లు ఉంటాయి. ఔత్సాహిక వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు, టాప్ వెంచర్ క్యాపిటలిస్టులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చాగోష్టులు ఉంటాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ కాన్ఫరెన్స్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా నవకల్పనల సూచీలో 2016లో 66వ స్థానంలో నిల్చిన భారత్ ప్రస్తుతం 46వ ర్యాంకుకు ఎగబాకిందని, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా మారిందని స్మాద్యా అండ్ స్మాద్యా అడ్వైజరీ ప్రెసిడెంట్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం మాజీ ఎండీ క్లాడ్ స్మాద్యా తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఐజీఐసీ.. భారత అంకుర సంస్థల సామర్థ్యాలు, ఆవిష్కరణల గురించి ప్రపంచానికి చాటి చెప్పేందుకు మంచి వేదిక కాగలదని ఆయన పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో జోరుమీదున్న బిజినెస్ ఇదే!
న్యూఢిల్లీ: దేశీయంగా డేటా సెంటర్ల పరిశ్రమ చెప్పుకోదగ్గ స్థాయిలో పరిమాణాన్ని పెంచుకోవడంతోపాటు, వృద్ధి కొనసాగనున్నట్లు ఎన్ఎక్స్ట్రా, జేఎల్ఎల్ రూపొందించిన నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి నేపథ్యంలోనూ డిజిటల్ మౌలిక సదుపాయాలను అందిపుచ్చుకోవడం, డిజిటల్, క్లౌడ్ వినియోగం పెరగడం, 5జీ అందుబాటులోకి రానుండటం వంటి అంశాలు ప్రభావం చూపనున్నట్లు ఈ సంయుక్త నివేదిక విశ్లేషించింది. డేటా సెంటర్ల బిజినెస్‌లో ప్రధానంగా ముంబై, చెన్నైలలో అధిక వృద్ధి నమోదవుతున్నట్లు పేర్కొంది. ఇందుకు అనువైన మౌలికసదుపాయాలు, వ్యూహాత్మక ప్రాంతాలుకావడం, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు సహకరిస్తున్నట్లు తెలియజేసింది. ఇవన్నీ వృద్ధికి దన్నునిస్తున్నట్లు తెలియజేసింది. ‘దేశీయంగా విస్తరిస్తున్న డిజిటల్ విప్లవం: డేటా సెంటర్లు’ పేరుతో రూపొందించిన నివేదికలోని ఇతర వివరాలు ఇలా.. తీరప్రాంత పట్టణాలు దేశీయంగా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు అందుబాటులో ఉండటంతో డేటా సెంటర్ల భవిష్యత్ ప్రధానంగా తీరప్రాంత(కోస్టల్) పట్టణాలపై ఆధారపడి ఉంది. అయితే ఢిల్లీ–ఎన్సీఆర్, హైదరాబాద్, బెంగళూరు, పుణే వంటి ల్యాండ్లాక్డ్ పట్టణాలు సైతం పరిశ్రమ వృద్ధితో లబ్ది పొందనున్నాయి. డేటా రక్షణ, క్లౌడ్ సంస్థల నుంచి భారీ డిమాండ్, క్యాప్టివ్ నుంచి క్లౌడ్‌కు మార్పు, డిజిటల్‌వైపు ప్రభుత్వ చర్యలు, పెట్టుబడుల వంటి పలు అంశాలు డేటా సెంటర్ల పరిశ్రమకు జోష్‌నిస్తున్నాయి. నివేదికను భారతీ ఎయిర్టెల్ అనుబంధ డేటా సెంటర్ల సంస్థ ఎన్ఎక్స్ట్రా, రియల్టీ కన్సల్టెన్సీ, ప్రొఫెషనల్ సర్వీ సుల కంపెనీ జేఎల్ఎల్ ఇండియా సంయుక్తంగా రూపొందించాయి. చదవండి: రూ.322 కోట్లు డీల్, టెక్ మహీంద్రా చేతికి మరో కంపెనీ! -
రాకెట్ స్పీడ్‌తో డిజటల్ ఎకానమీ
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వినియోగం, ఆదాయాలు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారత డిజిటల్ ఎకానమీ గణనీయంగా వృద్ధి చెందనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2030 నాటికి 800 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థుల అసోసియేషన్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా 6,300 పైచిలుకు ఫిన్‌టెక్ సంస్థలు ఉండగా .. వీటిలో 28 శాతం సంస్థలు ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ, 27 శాతం పేమెంట్స్, 20 శాతం ఇతరత్రా రంగాలకు చెందినవి ఉన్నాయని మంత్రి సీతారామన్ చెప్పారు. ‘భారత్‌లో డిజిటల్ ఎకానమీ 2020లో 85–90 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇంటర్నెట్ వినియోగం, ఆదాయాల వృద్ధితో ఇది అనేక రెట్లు పెరిగి 2030 నాటికి 800 బిలియన్ డాలర్లకు చేరనుంది‘ అని ఆమె వివరించారు. రిటైల్ ఇన్వెస్టర్లు.. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం సరళతరం చేసిందని మంత్రి చెప్పారు. దీంతో 2016 మార్చిలో 4.5 కోట్లుగా ఉన్న రిటైల్ ఇన్వెస్టర్ల ఖాతాల సంఖ్య 2021 మార్చి 31 నాటికి ఏకంగా 8.82 కోట్లకు చేరాయని ఆమె వివరించారు. డిజిటల్ ఎకానమీకి తోడ్పాటు అందించే దిశగా కేంద్రం తాజా బడ్జెట్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల (డీబీయూ) ఏర్పాటును ప్రతిపాదించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. చదవండి: డిజిటైజేషన్‌తో బ్యాంకింగ్‌లో పెను మార్పులు -
మౌలిక, విద్య, ఆరోగ్య రంగాలపై దృష్టి అవశ్యం
న్యూఢిల్లీ: భారత్ సమగ్ర, సుస్థిర అభివృద్ధికి, చిన్న పట్టణాల్లో ఉపాధి కల్పనకు మౌలిక, విద్య, ఆరోగ్య సంరక్షణా రంగాలతోపాటు డిజిటల్ ఎకానమీకి ఊపును ఇవ్వడానికి మరింత కృషి జరగాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 48వ నేషనల్ మేనేజ్మెంట్ సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్బీఐ గవర్నర్ మాట్లాడారు. ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... గతం భవిష్యత్తుకు బాట కావాలి మహమ్మారి నుంచి కోలుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సంక్షోభానికి దారితీసిన పరిస్థితులను సమీక్షించుకోవాలి. పటిష్టమైన, సమగ్రమైన, స్థిరమైన వృద్ధికి పరిస్థితులను సృష్టించుకోవాలి. సంక్షోభం కలిగించిన నష్టాన్ని పరిమితం చేయడం మొదటి అడుగు మాత్రమే. భవిష్యత్తులో ఇటువంటి సవాళ్లను ఎదుర్కొని, సుస్థిర వృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నం పక్కా ప్రణాళికకు అనుగుణంగా ఉండాలి. మధ్యకాలిక పెట్టుబడులు, పటిష్ట ఫైనాన్షియల్ వ్యవస్థలు, వ్యవస్థాగత సంస్కరణల ప్రాతిపదికన స్థిర వృద్ధి ప్రణాళికలను రూపొందించాలి. ఈ దిశలో విద్యా, ఆరోగ్యం, నూతన ఆవిష్కరణలు, భౌతిక, డిజిటల్ ఇన్‌ఫ్రాలపై మరిన్ని పెట్టుబడులు అవసరం. పోటీని, ఇందుకు సంబంధించి చైతన్యాన్ని పెంపొందించడానికి ప్రోత్సహించడానికి అలాగే మహమ్మారి ప్రేరిత అవకాశాల నుండి ప్రయోజనం పొందడానికి కార్మిక, ఉత్పత్తి మార్కెట్లలో మరింత సంస్కరణలను తీసుకుని రావాలి. గిడ్డంగి, వ్యవ‘సాయం’ కీలకం గిడ్డంగి, సరఫరా చైన్ల పటిష్టత, వ్యవసాయం ప్రత్యేకించి ఉద్యానవన రంగం విలువల పెంపునకు కృషి తత్సంబంధ మౌలిక సదుపాయాల కల్పన చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు, సమగ్రాభివృద్ధికి ఎంతో అవసరం. కొన్ని రంగాల కోసం ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత పథకం (పీఐఎల్) తయారీ రంగాన్ని ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన చొరవ. దీనివల్ల ప్రయోజనాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ప్రైవేటు వినయోగం పెరగాలి కరోనా మహమ్మారి అటు అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలలో పేదలపై తీవ్ర ప్రభావం చూపింది. మహమ్మారి సవాళ్లు తొలగిపోయిన తర్వాత సుస్థిర పురోభివృద్ధిని సాగించేలా మన ప్రయత్నం ఉండాలి. మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో పడిపోయిన ప్రైవేటు వినియోగం పునరుద్ధరణ జరగాల్సి ఉంది. వృద్ధిలో ఈ విభాగం ప్రాధాన్యత ఎంతో ఉంది. ప్రస్తుతం ప్రపంచాభివృద్ధికి దేశాల మధ్య సమన్వయ సహకారం అవసరం అన్న అంశాన్ని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వ్యాక్సినేషన్ పురోగతిపై అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. మహమ్మారి తర్వాత ప్రపంచాన్ని కలుపుకుని పోవడం ఒక పెద్ద సవాలే. ఆటోమేషన్ వల్ల ఉత్పాదకత లాభం జరుగుతుంది. అయితే ఇది కార్మిక మార్కెట్లో మందగమనానికి దారితీసే అవకాశం ఉంది. ఈ సందర్భంలో శ్రామిక శక్తికి కీలక నైపుణ్యం, శిక్షణ అవసరం. బిలియన్ డాలర్(రూ. 7,300 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్‌లు (యూనికార్న్) 60కు చేరడం ఈ విషయంలో భారత్ పోటీ తత్వాన్ని తెలియజేస్తున్నాయి. డిజిటల్, ఈ–కామర్స్, ఫార్మా వెలుగులు భారత్ డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది. ఇదే ధోరణి కొనసాగే వీలుంది. క్లౌడ్ కంప్యూటింగ్, కస్టమర్ ట్రబుల్షూటింగ్, డేటా అనలటిక్స్, వర్క్‌ప్లేస్ ట్రాన్స్ఫార్మేషన్, సప్లైచైన్ ఆటోమేషన్, 5జీ మోడరనైజేషన్, సైబర్ సెక్యూరిటీలో సామర్థ్యాల పెంపు వంటి విభాగాల్లో డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. దేశంలో భారీగా విస్తరిస్తున్న రంగాల్లో ఈ–కామర్స్ ఒకటి. వృద్ధి చెందుతున్న మార్కెట్, ఇంటర్నెట్ సదుపాయాల విస్తరణ, స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం, కోవిడ్ సవాళ్ల నేపథ్యంలో వినియోగదారు ప్రాధాన్యతల్లో మార్పు వంటి అంశాలు ఈ–కామర్స్ పురోగతికి దోహదపడుతున్నాయి. డిజిటల్ రంగం పురోగగతికి కేంద్రం డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్–అప్ ఇండియా, స్కిల్ ఇండియా, ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు వంటి ఎన్నో చర్యలను తీసుకుని వచి్చంది. దేశంలో పురోగమిస్తున్న రంగాల్లో ఔషధ విభాగం ఒకటి. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ అభివృద్ధి ద్వారా భారత్ ఈ విషయంలో తన సత్తా చాటింది. ఇంకా గవర్నర్ ఏమన్నారంటే... è గ్లోబల్ వ్యాల్యూ చైన్‌లో భారత్ వాటా గణనీయంగా పెరుగుతోంది. ఇది దేశీయ లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమలకు లాభించే అంశం. è ఎగుమతుల రంగం పురోగమిస్తోంది. 2030 నాటికి బారత్ ఇంజనీరింగ్ ఎగుమతుల లక్ష్యం 200 బిలియన్ డాలర్లు. దీని లక్ష్య సాధనకు కృషి జరగాలి. è దేశంలో ఎకానమీ పురోగతిలో బ్యాంకింగ్ పాత్ర కీలకం. ఇటీవల కాలంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలూ ఈ విషయంలో పురోగమిస్తున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. -
డిజిటల్ భద్రతకు... ఇదే ఉత్తమ విధానం
విదేశీ విధానానికి సంబంధించి అతి ముఖ్యమైన సాధనంగా టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి అనే అంశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలకమైన ఆదేశమిచ్చారు. అత్యంత కఠినమైన, సాక్ష్యాధారాలతో కూడిన విశ్లేషణ ద్వారా సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) నుంచి ఎదురయ్యే ప్రమాదాలను ఫెడరల్ ప్రభుత్వం తప్పకుండా అంచనా వేయాల్సి ఉందని బైడెన్ చెప్పారు. అమెరికా మౌలిక విలువలు, ప్రాథమిక స్వేచ్చా స్వాతంత్య్రాల పరిరక్షణ, ప్రదర్శనతో సహా మొత్తం జాతీయ భద్రత, విదేశీ విధానం, ఆర్థికపరమైన లక్ష్యాలకు సంబంధించి ఎదురయ్యే ఆకస్మిక ప్రమాదాలను దేశం ఎదుర్కోవలసి ఉందని బైడెన్ స్పష్టం చేశారు. భారత టెక్నాలజీ పాలసీ విధానంపై భౌగోళిక–రాజకీయాలు ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో ఈ పరిణామం సంభవించింది. చైనా ప్రభుత్వం చేపడుతున్న టెక్నాలజీ సప్లయ్ చైన్ల విస్తరణపై అవిశ్వాసమే అమెరికా ప్రభుత్వ విధానపరమైన మార్పునకు కారణం. టిక్ టాక్, వీ చాట్ వంటి చైనా యాప్స్‌ని నిషేధిస్తూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన గత ఆదేశాలను బైడెన్ శాసనం రద్దు చేసింది. గత సంవత్సరం భారత్ కూడా 267 యాప్‌లపై నిషేధం విధించింది. లద్దాఖ్‌లో చైనా సైనికబలగాలు అనూహ్యంగా సరిహద్దు ఘర్షణలు ప్రారంభించినందుకు స్పందనగా చైనా యాప్‌లపై భారత్ వేటు వేసింది. అదేవిధంగా 2020లో కరోనా మహమ్మారి ప్రారంభంలో సున్నితమైన రంగాల్లో సరిహద్దు దేశాల నుంచి పెట్టుబడులపై భారత్ ఆంక్షలు విధించడమే కాకుండా, కీలకమైన 5జీ నెట్‌వర్క్‌ల అభివృద్ధిలో చైనా కంపెనీలైన హువే, జీటీఈల భాగస్వామ్యాన్ని నిషేధించవచ్చని కూడా భావించారు. ప్రస్తుతం బైడెన్ పాలనా యంత్రాంగం టెక్నాలజీ ఆధారిత లావాదేవీల్లో చోటుచేసుకునే ప్రమాదాలకు సంబంధించిన సమగ్ర జాబితాను రూపొందించింది. ఫలితంగా బైడెన్ గతంలో ట్రంప్ చేపట్టిన ప్రతీకార చర్యల స్థానంలో సాక్ష్యాధారాలతో కూడిన విధాన నిర్ణయాలను ప్రవేశపెట్టారు. కొన్ని జనరంజక యాప్‌లపై ట్రంప్ ఆంక్షలను బైడెన్ తోసిపుచ్చినప్పటికీ, డేటా భద్రత ప్రాధాన్యతను పలుచన చేయలేదు. నిషేధిం చడం కంటే కచ్చితత్వానికి ప్రాధాన్యమిస్తూ చైనా వ్యతిరేక వ్యూహానికి పునాదిని అమెరికా బలోపేతం చేసింది. దీన్ని భారత్ కూడా ఒక ఉపయోగకరమైన నమూనాగా తీసుకోవచ్చు. దీంతో పెరుగుతున్న చైనా విస్తరణవాదాన్ని తిప్పికొట్టి, టెక్నాలజీ పాలసీని ఒక ఉపకరణంగా ప్రయోగించడాన్ని కొనసాగించవచ్చు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చైనా అవలంబిస్తున్న తప్పుడు ఎత్తుగడలను భారత్ చేపట్టకూడదు. దీనివల్ల ప్రపంచ మార్కెట్ల నుంచి చైనా సమాచార, సాంకేతిక కంపెనీల తరహాలో బహిష్కరణను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఆఫీసులకు, స్టోర్లకు సేవలందించే సాంప్రదాయిక వ్యాపారాలలాగా కాకుండా డిజిటల్ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. దీనివల్ల ఇవి తీవ్రంగా ప్రభుత్వ జోక్యానికి గురయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఆలీబాబాపై చైనా విధించిన ఆంక్షలు దీనికి ఉదాహరణ. చైనా దిగ్గజ కంపెనీ సంస్థాపకుడు జాక్ మా దేశీయంగా రెగ్యులేటరీ విధానంలో లోపాలను నిజాయితీగా వెల్లడించినందుకు తనకు ఏం జరిగిందో ప్రపంచానికి తెలుసు. చైనాకు చెందిన కమాండ్, కంట్రోల్ తరహా నమూనా.. పరిమితమైన అంతర్జాతీయ రక్షణలతో కూడిన ప్రపంచీకృతమైన డిజిటల్ మార్కెట్‌కు సరిపోదు. అందుకే బైడెన్ ప్రభుత్వం సుస్థిరత కోసం ద్వైపాక్షిక, బహుముఖ ఒడంబడికలను ఏర్పర్చుకోవడం కోసం ఇతర ప్రజాస్వామిక వ్యవస్థలతో కలిసి పనిచేయనుంది. భారతీయ ప్రమాణాల మండలి ఈ సంవత్సరం మొదట్లో డేటా గోప్యతకు హామీనిచ్చే ప్రమాణాలను విడుదల చేసింది కూడా. ఇవి ప్రపంచమంతటా ఆమోదించిన గోప్యతా సూత్రాలకు అనుగుణంగా ఉంటున్నాయి. భారత్‌లో ప్రజాస్వామ్యయుతమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థల ఏర్పాటుకు ఇది విస్తృత ప్రాతిపదికను ఏర్పరుస్తుంది. - వివన్ శరణ్ వ్యాసకర్త కోన్ సలహా మండలి భాగస్వామి -
Online shopping boost: డిజిటల్ ఎకానమీ జూమ్!
సాక్షి, న్యూఢిల్లీ: ఈ-కామర్స్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ వంటి ఆన్లైన్ సర్వీసుల ఊతంతో దేశీయంగా వినియోగదారులకు సంబంధించిన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2030 నాటికి 800 బిలియన్ డాలర్లకు చేరనుంది. 2020లో ఇది 85–90 బిలియన్ డాలర్లుగా ఉంది. గ్రౌండ్ జీరో 5.0 కార్యక్రమంలో ఆవిష్కరించిన కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ ఆవిష్కరించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇక, ఆన్లైన్ రిటైల్ వ్యాపారం వార్షిక పరిమాణం ఈ ఏడాది 55 బిలియన్ డాలర్లను తాకనుండగా..2030 నాటికి ఏకంగా 350 బిలియన్ డాలర్లకు చేరనుంది. తద్వారా అమెరికా, చైనా తర్వాత మూడో అతి పెద్ద రిటైల్‌మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించనుంది. అటు కిరాణా దుకాణాల విక్రయాలు 1.5 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని రెడ్ సీర్ పేర్కొంది. ‘సౌకర్యం కారణంగానే ఆన్లైన్ సర్వీసులు వినియోగిస్తున్నామని ప్రస్తుతం 50 శాతం మంది కస్టమర్లు చెబుతున్నారు. అదే కొన్నేళ్ల క్రితం అయితే డిస్కౌంట్ల గురించి ఉపయోగిస్తున్నామని చెప్పేవారు. కోవిడ్ పరిస్థితులే తాజా మార్పులకు కారణం‘ అని రెడ్‌సీర్ వ్యవస్థాపకుడు అనిల్ కుమార్ తెలిపారు. తదుపరి తరం ఔత్సాహిక వ్యాపారవేత్తలు.. భారత మోడల్‌ను అంతర్జాతీయంగా కూడాప్రాచుర్యంలోకి తెచ్చే విధమైన కొత్త ఆవిష్కరణలను సృష్టించగలరని ఆయన పేర్కొన్నారు. (Covid Second wave: దేశీయ బ్యాంకుల కష్టాలు) ప్రత్యామ్నాయ కేంద్రంగా భారత్: నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని నివేదికవిడుదల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. ఇతర దేశాల్లోని సంస్థలు తమ కార్యకలాపాలను వేరే దేశాలకు మార్చుకునేందుకు తగు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయన్నారు. భారత్ ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని.. తద్వారా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో కీలక భాగం కావచ్చని కాంత్ తెలిపారు. మరోవైపు, భారీ పెట్టుబడులు అవసరమైన చిప్ పరిశ్రమ భారత్‌లో ఏర్పడే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్‌చంద్రశేఖరన్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు.. సెమీ కండక్టర్ వ్యవస్థపై ఇన్వెస్ట్ చేసే అవకాశాలను పరిశీలించాలని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్ టీవీ మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయ పడ్డారు. నివేదిక ప్రకారం.. 2020-30 మధ్య కొత్తగా జతయ్యే ఆన్లైన్ షాపర్స్‌లో 88 శాతం మంది ద్వితీయ శ్రేణి తదితర నగరాలకు చెందిన వారై ఉంటారు. ఈ-కామర్స్ వ్యాప్తి చెందే కొద్దీ ప్రత్యేక డెలివరీ సర్వీసుల అవసరం కూడా పెరిగింది. (LPG Cylinder Price: వినియోగదారులపై మరో ‘బండ’) -
సమాచార దుర్వినియోగాన్ని సహించం: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో సమాచార దుర్వినియోగాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రక్రియపై ప్రభావం కలిగించే ఇటువంటి చర్యలను తాము ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. అర్జెంటీనాలోని సలాట నగరంలో జరిగిన జీ–20 డిజిటల్ ఎకానమీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విషయంలో అసలు రాజీ పడమని, ఒకవేళ ఎవరైనా విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. డిజిటల్ మీడి యా ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఇతర రంగాలకు మళ్లించాల్సిన అవసరముందని చెప్పారు. ఈ సైబర్ ప్రపంచంలో మెరుగైన భద్రతతో కూడిన సేవలు అందించినప్పడే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు లాభం చేకూరుతుందని రవిశంకర్ తెలిపారు. సైబర్ మాధ్యమాల ద్వారా విస్తరిస్తున్న తప్పుడు వార్తలను అరికట్టేందుకు అంతర్జాతీయ సమాజం కలసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరముందన్నారు. -
జీఈఎస్ సదస్సుకు దిగ్గజాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ నెల 28 నుంచి 30 దాకా హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సదస్సు (జీఈఎస్)కు పలువురు దిగ్గజాలు హాజరవుతున్నారు. టెక్నాలజీ దిగ్గజ సంస్థ సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్, ట్యాక్సీ సేవల సంస్థ ఓలా సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ తదితరులు ఇందులో ఉన్నారు. అమెరికాతో పాటు వివిధ దేశాలకు చెందిన ఇన్వెస్టర్లు, పారిశ్రామిక వేత్తలతో పాటు స్టార్టప్ సంస్థలూ ఈ సదస్సులో పాలు పంచుకుంటాయి. ప్రధానంగా ఇంధనం– మౌలిక రంగం, హెల్త్‌కేర్ – లైఫ్‌సైన్సెస్, ఫిన్‌టెక్ – డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, మీడియా–వినోద రంగం... ఈ 4 రంగాలపైనే ఫోకస్ ఉంటుందని, సంబంధిత వర్క్‌షాప్‌లు జరుగుతాయని నీతి ఆయోగ్ తెలియజేసింది. ఈ సదస్సును అమెరికా ప్రభుత్వం, నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అమెరికా తరఫున హాజరయ్యే బృందానికి అధ్యక్షుడు ట్రంప్‌కు సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ నేతృత్వం వహిస్తారు. కాగా ‘అందరికీ పురోగతి; మహిళలే ముందు’ అనే థీమ్‌తో జరగనున్న ఈ సదస్సులో పాల్గొనే వారిలో సుమారు సగం మంది మహిళలే ఉంటారని నీతి ఆయోగ్ పేర్కొంది. సదస్సును ప్రధాని మోదీ, ఇవాంకా ప్రారంభిస్తారు. కాగా సదస్సుకు అమెరికా, చైనాతో పాటు పలు విదేశీ దిగ్గజాల నుంచి ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 100కు పైగా వినూత్న స్టార్టప్‌లతో పాటు వినూత్న ఉత్పత్తులు, సర్వీసులు మొదలైన వాటికి జీఈఎస్–2017 వేదిక కానున్నదని నీతి ఆయోగ్ పేర్కొంది. గతేడాది అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన జీఈఎస్‌లో 170 దేశాల నుంచి 700 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు, 300 మందికి పైగా ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. ఈసారి సదస్సు అంతకన్నా భారీగా ఉంటుందని నీతి ఆయోగ్ అంచనా వేస్తోంది. ఇందులో పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు, పలు దిగ్గజ సంస్థల సీఈవోలతో పాటు 1,600 మంది పైగా ప్రతినిధులు పాల్గొంటారని నీతి ఆయోగ్ తెలిపింది. -
డిజిటల్ ఎకానమీ దిశగా దేశం అడుగులు
న్యూఢిల్లీ: భారత్ డిజిటల్ ఎకానమీ దిశగా పయనిస్తోందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. నగదు లావాదేవీలు వ్యయభరితమైన వ్యవహారమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాకుండా, అటు సమాజంమీద ఇటు ఆర్థికవ్యవస్థపైనా నగదు లావాదేవీలు ప్రతికూల ప్రభావం చూపెడతాయని ఆయన అన్నారు. ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కొత్త భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆర్థికమంత్రి విలేకరులతో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ♦ డిజిటైజేషన్ నేపథ్యంలో– నల్లధనం నిరోధం, డిజిటలైజేషన్ ఆర్థిక లావాదేవీల వృద్ధిపై కేంద్రం దృష్టి సారించింది. ఈ విధానాన్ని ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకుంటోంది. ♦ నగదు రహిత లావాదేవీల దిశగా దేశం ఒకేసారి మారిపోదు. అయితే నెమ్మదిగా ఇటువైపు అడుగులు పడుతున్న విషయం సుస్పష్టమవుతోంది. బ్యాంకుల్లో డిపాజిట్లు, తగిన రేటుకు బ్యాంకుల రుణ సామర్థ్యం మెరుగుదలకూ దోహదపడే అంశం ఇది. ♦ ఆర్థికవ్యవస్థకు బ్యాంకింగ్ జీవనాడి. రానున్న రోజుల్లో దీని ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. మంచి బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కూడా దోహదపడుతుంది. పీఎన్బీ కొత్త ప్రొడక్టులు: ఈ సందర్భంగా పీఎన్బీ రెండు ప్రొడక్టులు– ‘రూపే కార్డ్, ఈ–రూపియా’లను ఆర్థికమంత్రి ఆవిష్కరించారు. -
డిజిటల్ ఎకానమీతో 70 లక్షల ఉద్యోగావకాశాలు
ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ గురుగ్రామ్: దేశీయంగా డిజిటల్ ఎకానమీ ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో దీనితో యువతకు 2020 నాటికి 50–70 లక్షల పైచిలుకు ఉద్యోగావకాశాలు లభించగలవని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. దేశ ప్రజల అభివృద్ధికి టెక్నాలజీ కీలకమని, సాంకేతికత అందని ద్రాక్షలా కాకుండా అందరికీ అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్తో సంయుక్తంగా నిర్వహించిన డిజిటల్ హర్యానా సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సైబర్ సెక్యూరిటీ పాలసీని ఆయన స్వాగతించారు. పలు భారతీయ, అంతర్జాతీయ టెక్ దిగ్గజాలకు కేంద్రంగా ఉన్న హర్యానాకు.. రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీ హబ్‌గా కూడా ఎదిగేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. -
‘మూడేళ్లలో 70 లక్షల జాబ్స్’
సాక్షి,గుర్గ్రాం:భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మళ్లే క్రమంలో 2020 నాటికి దేశంలో 50 నుంచి 70 లక్షల ఉద్యోగాలు యువతకు అందుబాటులోకి వస్తాయని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ప్రజల సంక్షేమానికి, సంపద సృష్టికి సమ్మిళిత టెక్నాలజీ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. మెరుగైన ఆర్థిక వృద్ధి సాధనకి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. డిజిటల్ హర్యానా సదస్సులో మంత్రి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ డిజిటల్ దిశగా వేగంగా కదులుతున్నదన్నారు. చిన్న నగరాల్లో సైతం బీపీఓ కంపెనీల ఏర్పాటును ప్రోత్సహిస్తూ కేంద్రం ప్రత్యేక పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. గ్రామాలు, పట్టణాలు డిజిటల్‌కు మరలేలా వ్యాపారవేత్తలు చొరవ చూపాలని కోరారు. -
రూ.2 వేలకే స్మార్ట్‌ఫోన్!
-
రూ.2 వేలకే స్మార్ట్‌ఫోన్!
డిజిటల్ సేవల విస్తృతికి చౌకగా అందించాల్సిన అవసరం ఉంది... ♦ డిజిటల్ ఎకానమీలో ప్రపంచ అగ్రగామిగా భారత్ ♦ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఖరగ్‌పూర్: డిజిటల్ సేవలు మరింత మంది ప్రజలకు చేరువయ్యేందుకు వీలుగా ప్రారంభ స్థాయి స్మార్ట్ఫోన్లు 30 డాలర్లకే (సుమారు రూ.2 వేలు) అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. భారత పర్యటనలో ఉన్న పిచాయ్ గతంలో తాను చదువుకున్న ఐఐటీ ఖరగ్‌పూర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా 3,500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్న సభలో మాట్లాడారు. ‘‘డిజిటల్ ప్రపంచంతో అనుసంధానాన్ని పెంచేందుకు వీలుగా చౌకైన, ప్రారంభ స్థాయి స్మార్ట్ఫోన్లను చూడాలని కోరుకుంటున్నాను. ధరలను మరింత తక్కువ స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది 30 డాలర్ల స్థాయి కావచ్చు (రూ.2,000)’’ అని పిచాయ్ పేర్కొన్నారు. గూగుల్ గతంలో మైక్రోమ్యాక్స్, కార్బన్, స్పైస్ మొబైల్ తయారీ సంస్థలతో టైఅప్ అయి ‘ఆండ్రాయిడ్ వన్’ స్మార్ట్ఫోన్లను విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ మోడల్ ధర రూ.6,000కుపైనే ఉంది. ఆ తర్వాత ఇంతకంటే తక్కువ ధరకే మంచి ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు మార్కెట్ ప్రవేశం చేశాయి. అయినప్పటికీ రూ.2,000కే మంచి సదుపాయాలున్న స్మార్ట్‌ఫోన్ ఇంత వరకూ రాలేదు. ఇందుకోసం కనీసం రూ.3,000పైన పెట్టాల్సి వస్తోంది. గోకుల్‌పూర్‌లో సుందర్ పిచాయ్‌కు టోపీతో స్వాగతం పలుకుతున్న మహిళలు చైనాను భారత్ ఎప్పుడు దాటేస్తుంది? డిజిటల్ రంగంలో భారత్ చైనాను ఎప్పుడు అధిగమిస్తుందన్న ప్రశ్నకు పిచాయ్ స్పందిస్తూ... ‘‘డిజిటల్ ఆర్థిక రంగంలో భారత్ ప్రపంచ స్థాయి దేశంగా ఎదుగుతుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఏ దేశంతోనైనా పోటీ పడగలదు. అందుకు తగ్గ నిర్మాణం ఉంది’’ అని పిచాయ్ బదులిచ్చారు. ఇక్కడి స్టార్టప్‌లు స్వదేశం కోసం, ప్రపంచం కోసం రూపొందిస్తున్న ఉత్పత్తులే దీన్ని సాధ్యం చేస్తాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో డిజిటల్ ఇండియా కోసం మరిన్ని కార్యక్రమాలను గూగుల్ తీసుకువస్తుందన్నారు. రైల్వే స్టేషన్లలో వైఫై సర్వీసులకు రైల్‌టెల్‌తో భాగస్వామ్యం, డిజిటల్ పేమెంట్ల కోసం ఎన్పీసీఐతో భాగస్వామ్యాలను ప్రస్తావించారు. దేశీయంగా ఇంగ్లిష్ మాట్లాడే ప్రజల శాతం తక్కువేనని, ఈ దృష్ట్యా మరింత మందిని చేరుకునేందుకు వీలుగా గూగుల్ తన సేవలను సాధ్యమైనన్ని ప్రాంతీయ భాషల్లో అందించేందుకు కృషి చేస్తోందన్నారు. భారత్‌లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) చక్కగా పనిచేస్తోందని, డిజిటల్ ఇండియా ప్రచారానికి గూగుల్ అతి పెద్ద మద్దతుదారుగా ఉందన్నారు. ప్రపంచంలోనే భారత్ అత్యంత చైతన్యవంతమైన ఇంటర్నెట్ మార్కెట్ అని, పరిమాణం దృష్ట్యా రెండో అతిపెద్దదని పిచాయ్ పేర్కొన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ముందడుగు కృత్రిమ మేధస్సు(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) వంటి పరిజ్ఞానాలు, మెషీన్ లెర్నింగ్ వంటివి నిత్య జీవితాన్ని మరింత వినూత్నంగా మార్చగలవని సుందర్ అన్నారు. వీటిని సాధ్యమైనంత వేగంగా సాధ్యమైనంత మందికి చేరువ చేసేందుకు గూగుల్ భారీ పెట్టుబడులు పెడుతోందన్నారు. ఇలా కొన్నేళ్ల పాటు స్థిరంగా కొనసాగితే భవిష్యత్ కంప్యూటింగ్‌కు మార్గం సుగమం అవుతుందన్నారు. మెషీన్ లెర్నింగ్‌లో ముందడుగు వేస్తే చాలా రంగాల్లో భారీ మార్పు సాకారమవుతుందన్నారు. దీనికి ఉదాహరణగా కంటి చూపును దెబ్బతీసే డయాబెటిక్ రెటీనాను గుర్తించేందుకు మెషీన్ లెర్నింగ్ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవచ్చని సుందర్ వివరించారు. లోక జ్ఞానమూ అవసరమే... ఐఐటీ పట్టభద్రులు ఐఐఎంలో సీటు సంపాదించాలన్న కలలతో ఉండడంపై పిచాయ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్య మాత్రమే కాదని, వాస్తవిక ప్రపంచ అనుభవాలూ ఎంతో ముఖ్యమన్న విషయాన్ని విద్యార్థులకు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తాను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో తరగతులకు బంక్ కొట్టిన స్మృతులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్ కోర్సుల్లో విద్యార్థులు చేరుతున్న విషయాన్ని విన్న ఆయన ఖంగుతిన్నారు. సవాళ్లను స్వీకరించాలని, భిన్న విషయాల దిశగా ప్రయత్నం చేయాలని, తమ అభిరుచుల ప్రకారం నడుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. సుందర్ య్ 1993లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ విభాగంలో బీటెక్ పూర్తి చేయగా... 23 ఏళ్ల తర్వాత తిరిగి సందర్శించారు. బీటెక్ తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో ఎంఎస్ పట్టా అందుకున్నారు. వార్టన్ స్కూల్లో ఎంబీయే అనంతరం 2004లో గూగుల్‌లో చేరి అత్యున్నత పదవిని అందుకున్నారు. ‘అబే సాలే’ అని పిలిచేవాడిని.. గూగుల్ బాస్‌గా ప్రపంచ వ్యాప్తంగా విశేష గుర్తింపును సొంతం చేసుకున్న సుందర్ పిచాయ్ సగటు భారతీయ విద్యార్థే. విద్యార్థిగా అతడిలోనూ చిలిపితనం, ఆకతాయితనం దాగున్నాయి. వాటిని ఐఐటీ ఖరగ్‌పూర్ వేదికగా ఆయన విద్యార్థులతో పంచుకున్నారు. స్నేహితులను ‘అబే సాలే (అరే బామ్మర్ది)’ అని పిలిచేవారట. ఎందుకని అలా..? అన్నదానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. ‘‘నేను చెన్నై నుంచి వచ్చాను. స్కూల్లో హిందీ చదువుకున్నాను. కానీ ఎప్పుడూ పెద్దగా మాట్లాడింది లేదు. అయితే, ఇతరులు ఎలా మాట్లాడుకుంటున్నారో మాత్రం వినేవాణ్ణి. ఒకానొక రోజు మెస్‌లో ఒకతన్ని ‘అబే సాలే’ అని పిలిచాను. దీన్ని స్నేహపూర్వక పలకరింపు అనుకున్నాను. కానీ, ఇందుకు మెస్‌లోని వారు కలత చెందినట్టు, ఆ తర్వాత మెస్ తాత్కాలికంగా మూసివేయడానికి అదే కారణమని తెలుసుకున్నాను’’ అని ఆయన చెప్పారు. సుందర్ పిచాయ్ తన జీవిత భాగస్వామి అంజలిని ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్‌లోనే తొలిసారి కలుసుకున్నారట. అంజలిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో అమ్మాయిల హాస్టల్‌కు వెళ్లడం అంత తేలిక కాదని. దాంతో రొమాన్స్ సాధ్యపడేది కాదని ఆయన చెప్పారు. ‘‘ఎవరో ఒకరు బయట నుంచి ‘అంజలీ... సుందర్ నీకోసం ఇక్కడకు వచ్చాడు’ అంటూ గట్టిగా అరిచేవారు. దీంతో సిగ్గుగా అనిపించేంది’ అని ఆయన పేర్కొన్నారు. మొబైల్స్ ప్రపంచాన్నే మార్చేశాయని.. కానీ, కొన్నింటిని మార్చకుండా అలానే వదిలేశాయన్నారు. 23 ఏళ్ల క్రితం తన హాస్టల్ గది ఎలాఉందో ఇప్పుడూ అలానేఉందంటూ చమత్కరించారు. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండి, తెల్లారి క్లాసులు ఎగ్గొట్టేవాడినని చెప్పారు. 2004లో గూగుల్ ఇంటర్వూ్యను ఎదుర్కొన్న తాను జీమెయిల్‌ను ఏప్రిల్ ఫూల్ జోక్‌గా భావించేవాడినన్నారు. కాలేజీ రోజుల్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని మార్గదర్శకంగా భావించిన ఆయన సచిన్ బ్యాట్ పట్టుకుంటే క్రికెట్ చూడ్డానికి ఇష్టపడేవాడినని చెప్పారు. -
రూ.2 వేలకే స్మార్ట్‌ఫోన్!
డిజిటల్ సేవల విస్తృతికి చౌకగా అందించాల్సిన అవసరం ఉంది... • డిజిటల్ ఎకానమీలో ప్రపంచ అగ్రగామిగా భారత్ • గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఖరగ్‌పూర్: డిజిటల్ సేవలు మరింత మంది ప్రజలకు చేరువయ్యేందుకు వీలుగా ప్రారంభ స్థాయి స్మార్ట్ఫోన్లు 30 డాలర్లకే (సుమారు రూ.2 వేలు) అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. భారత పర్యటనలో ఉన్న పిచాయ్ గతంలో తాను చదువుకున్న ఐఐటీ ఖరగ్‌పూర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా 3,500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్న సభలో మాట్లాడారు. ‘‘డిజిటల్ ప్రపంచంతో అనుసంధానాన్ని పెంచేందుకు వీలుగా చౌకైన, ప్రారంభ స్థాయి స్మార్ట్ఫోన్లను చూడాలని కోరుకుంటున్నాను. ధరలను మరింత తక్కువ స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది 30 డాలర్ల స్థాయి కావచ్చు (రూ.2,000)’’ అని పిచాయ్ పేర్కొన్నారు. గూగుల్ గతంలో మైక్రోమ్యాక్స్, కార్బన్, స్పైస్ మొబైల్ తయారీ సంస్థలతో టైఅప్ అయి ‘ఆండ్రాయిడ్ వన్’ స్మార్ట్ఫోన్లను విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ మోడల్ ధర రూ.6,000కుపైనే ఉంది. ఆ తర్వాత ఇంతకంటే తక్కువ ధరకే మంచి ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు మార్కెట్ ప్రవేశం చేశాయి. అయినప్పటికీ రూ.2,000కే మంచి సదుపాయాలున్న స్మార్ట్‌ఫోన్ ఇంత వరకూ రాలేదు. ఇందుకోసం కనీసం రూ.3,000పైన పెట్టాల్సి వస్తోంది. గోకుల్‌పూర్‌లో సుందర్ పిచాయ్‌కు టోపీతో స్వాగతం పలుకుతున్న మహిళలు చైనాను భారత్ ఎప్పుడు దాటేస్తుంది? డిజిటల్ రంగంలో భారత్ చైనాను ఎప్పుడు అధిగమిస్తుందన్న ప్రశ్నకు పిచాయ్ స్పందిస్తూ... ‘‘డిజిటల్ ఆర్థిక రంగంలో భారత్ ప్రపంచ స్థాయి దేశంగా ఎదుగుతుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఏ దేశంతోనైనా పోటీ పడగలదు. అందుకు తగ్గ నిర్మాణం ఉంది’’ అని పిచాయ్ బదులిచ్చారు. ఇక్కడి స్టార్టప్‌లు స్వదేశం కోసం, ప్రపంచం కోసం రూపొందిస్తున్న ఉత్పత్తులే దీన్ని సాధ్యం చేస్తాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో డిజిటల్ ఇండియా కోసం మరిన్ని కార్యక్రమాలను గూగుల్ తీసుకువస్తుందన్నారు. రైల్వే స్టేషన్లలో వైఫై సర్వీసులకు రైల్‌టెల్‌తో భాగస్వామ్యం, డిజిటల్ పేమెంట్ల కోసం ఎన్పీసీఐతో భాగస్వామ్యాలను ప్రస్తావించారు. దేశీయంగా ఇంగ్లిష్ మాట్లాడే ప్రజల శాతం తక్కువేనని, ఈ దృష్ట్యా మరింత మందిని చేరుకునేందుకు వీలుగా గూగుల్ తన సేవలను సాధ్యమైనన్ని ప్రాంతీయ భాషల్లో అందించేందుకు కృషి చేస్తోందన్నారు. భారత్‌లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) చక్కగా పనిచేస్తోందని, డిజిటల్ ఇండియా ప్రచారానికి గూగుల్ అతి పెద్ద మద్దతుదారుగా ఉందన్నారు. ప్రపంచంలోనే భారత్ అత్యంత చైతన్యవంతమైన ఇంటర్నెట్ మార్కెట్ అని, పరిమాణం దృష్ట్యా రెండో అతిపెద్దదని పిచాయ్ పేర్కొన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ముందడుగు కృత్రిమ మేధస్సు(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) వంటి పరిజ్ఞానాలు, మెషీన్ లెర్నింగ్ వంటివి నిత్య జీవితాన్ని మరింత వినూత్నంగా మార్చగలవని సుందర్ అన్నారు. వీటిని సాధ్యమైనంత వేగంగా సాధ్యమైనంత మందికి చేరువ చేసేందుకు గూగుల్ భారీ పెట్టుబడులు పెడుతోందన్నారు. ఇలా కొన్నేళ్ల పాటు స్థిరంగా కొనసాగితే భవిష్యత్ కంప్యూటింగ్‌కు మార్గం సుగమం అవుతుందన్నారు. మెషీన్ లెర్నింగ్‌లో ముందడుగు వేస్తే చాలా రంగాల్లో భారీ మార్పు సాకారమవుతుందన్నారు. దీనికి ఉదాహరణగా కంటి చూపును దెబ్బతీసే డయాబెటిక్ రెటీనాను గుర్తించేందుకు మెషీన్ లెర్నింగ్ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవచ్చని సుందర్ వివరించారు. పశ్చిమ బెంగాల్‌లోని గోకుల్పూర్ గ్రామంలో గూగుల్ ‘ఇంటర్నెట్ సాథి’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మహిళలతో సుందర్ లోక జ్ఞానమూ అవసరమే... ఐఐటీ పట్టభద్రులు ఐఐఎంలో సీటు సంపాదించాలన్న కలలతో ఉండడంపై పిచాయ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్య మాత్రమే కాదని, వాస్తవిక ప్రపంచ అనుభవాలూ ఎంతో ముఖ్యమన్న విషయాన్ని విద్యార్థులకు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తాను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో తరగతులకు బంక్ కొట్టిన స్మృతులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్ కోర్సుల్లో విద్యార్థులు చేరుతున్న విషయాన్ని విన్న ఆయన ఖంగుతిన్నారు. సవాళ్లను స్వీకరించాలని, భిన్న విషయాల దిశగా ప్రయత్నం చేయాలని, తమ అభిరుచుల ప్రకారం నడుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. సుందర్ య్ 1993లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ విభాగంలో బీటెక్ పూర్తి చేయగా... 23 ఏళ్ల తర్వాత తిరిగి సందర్శించారు. బీటెక్ తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో ఎంఎస్ పట్టా అందుకున్నారు. వార్టన్ స్కూల్లో ఎంబీయే అనంతరం 2004లో గూగుల్‌లో చేరి అత్యున్నత పదవిని అందుకున్నారు. ‘అబే సాలే’ అని పిలిచేవాడిని.. గూగుల్ బాస్‌గా ప్రపంచ వ్యాప్తంగా విశేష గుర్తింపును సొంతం చేసుకున్న సుందర్ పిచాయ్ సగటు భారతీయ విద్యార్థే. విద్యార్థిగా అతడిలోనూ చిలిపితనం, ఆకతాయితనం దాగున్నాయి. వాటిని ఐఐటీ ఖరగ్‌పూర్ వేదికగా ఆయన విద్యార్థులతో పంచుకున్నారు. స్నేహితులను ‘అబే సాలే (అరే బామ్మర్ది)’ అని పిలిచేవారట. ఎందుకని అలా..? అన్నదానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. ‘‘నేను చెన్నై నుంచి వచ్చాను. స్కూల్లో హిందీ చదువుకున్నాను. కానీ ఎప్పుడూ పెద్దగా మాట్లాడింది లేదు. అయితే, ఇతరులు ఎలా మాట్లాడుకుంటున్నారో మాత్రం వినేవాణ్ణి. ఒకానొక రోజు మెస్‌లో ఒకతన్ని ‘అబే సాలే’ అని పిలిచాను. దీన్ని స్నేహపూర్వక పలకరింపు అనుకున్నాను. కానీ, ఇందుకు మెస్‌లోని వారు కలత చెందినట్టు, ఆ తర్వాత మెస్ తాత్కాలికంగా మూసివేయడానికి అదే కారణమని తెలుసుకున్నాను’’ అని ఆయన చెప్పారు. సుందర్ పిచాయ్ తన జీవిత భాగస్వామి అంజలిని ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్‌లోనే తొలిసారి కలుసుకున్నారట. అంజలిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో అమ్మాయిల హాస్టల్‌కు వెళ్లడం అంత తేలిక కాదని. దాంతో రొమాన్స్ సాధ్యపడేది కాదని ఆయన చెప్పారు. ‘‘ఎవరో ఒకరు బయట నుంచి ‘అంజలీ... సుందర్ నీకోసం ఇక్కడకు వచ్చాడు’ అంటూ గట్టిగా అరిచేవారు. దీంతో సిగ్గుగా అనిపించేంది’ అని ఆయన పేర్కొన్నారు. మొబైల్స్ ప్రపంచాన్నే మార్చేశాయని.. కానీ, కొన్నింటిని మార్చకుండా అలానే వదిలేశాయన్నారు. 23 ఏళ్ల క్రితం తన హాస్టల్ గది ఎలాఉందో ఇప్పుడూ అలానేఉందంటూ చమత్కరించారు. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండి, తెల్లారి క్లాసులు ఎగ్గొట్టేవాడినని చెప్పారు. 2004లో గూగుల్ ఇంటర్వూ్యను ఎదుర్కొన్న తాను జీమెయిల్‌ను ఏప్రిల్ ఫూల్ జోక్‌గా భావించేవాడినన్నారు. కాలేజీ రోజుల్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని మార్గదర్శకంగా భావించిన ఆయన సచిన్ బ్యాట్ పట్టుకుంటే క్రికెట్ చూడ్డానికి ఇష్టపడేవాడినని చెప్పారు. గోకుల్‌పూర్‌లో సరదాగా క్రికెట్ ఆడుతూ... -
ఎన్ని అవకాశాలో.. అన్ని సవాళ్లు
డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై నోబెల్ బహుమతి గ్రహీత జీన్ టిరోలే తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ద్వారా సమాజాభివృద్ధికి ఎన్ని అవకాశాలు లభిస్తాయో.. అదే స్థాయిలో సవాళ్లూ ఎదురుకానున్నాయని ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత జీన్ టిరోలే స్పష్టం చేశారు. 21వ శతాబ్దం విజ్ఞాన ఆధారిత సమాజమన్న విషయంలో సందేహాలు లేకపోయినప్పటికీ వ్యాపార, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించకుండా సత్ఫలితాలను ఆశించలేమన్నారు. సమస్యలను ముందుగానే అంచనా చేసి పరిష్కార మార్గాలను ఆన్వేషించాలని ఆర్థికవేత్తలకు సూచించారు. తిరుపతిలో జరుగుతున్న 104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో టిరోలే బుధవారం ఉపన్యసించారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తృతమవుతున్న కొద్దీ సంప్రదాయ ఉద్యోగాలు తగ్గిపోతాయని, వేతన జీవుల సంఖ్య వేగంగా తగ్గే అవకాశం ఉందన్నారు. ఉబర్ లాంటి క్యాబ్ కంపెనీలు ప్రస్తుతం ట్యాక్సీడ్రైవర్లకు అవకాశాలు కల్పిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ.. ఐదు, పదేళ్లలో అందుబాటులోకి రానున్న డ్రైవర్ రహిత వాహనాల ధాటికి ఇవి కూడా కనుమరుగవుతాయన్నారు. అయితే కొన్ని రకాల ఉద్యోగాలు పోతే మరికొన్ని కొత్త తరహా ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడటం ఈ కొత్త ఆర్థిక వ్యవస్థలో ముఖ్యాంశమని చెప్పారు. సామాజిక అసమానతలు పెరిగిపోవడం మధ్యతరగతి వర్గం కనుమరుగు కావడం కూడా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ద్వారా వచ్చే దుష్పరిణామాల్లో భాగమని ఆయన అభిప్రాయపడ్డారు. -
నాకు బిల్ గేట్స్ ఏం చెప్పారంటే...!
మన దేశంలో వంద కోట్ల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయని, 109 కోట్ల మందికి ఆధార్ కార్డులు కూడా ఉన్నాయని, అందువల్ల ఇక్కడ డిజిటల్ ఎకానమీ అద్భుతంగా విజయవంతం అవుతుందని తనకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చెప్పినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన డిజి ధన్ మేళాలో పాల్గొన్న ఆయన.. ఈ అంశంపై మాట్లాడారు. ఇంతకుముందు ఎవరైనా ఏదైనా స్థలం గానీ, ఇల్లు గానీ కొనాలంటే.. డబ్బులు ఎంత ఇస్తారు, చెక్కు ఎంతకి ఇస్తారని అడిగేవారని, అలాంటి అక్రమ కార్యకలాపాలు ఉండేవని అన్నారు. విదేశాల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల సమాచారం కోసం తాము చాలా దేశాలతో సంప్రదింపులు జరిపామని అన్నారు. క్యాష్‌లెస్ ఎకానమీ అంటే అసలు డబ్బు లేకపోవడం కాదని.. తక్కువ నగదు వాడటమని చెప్పారు. తమ రాజకీయ ప్రత్యర్థులు, మీడియా కూడా ఈ విషయాన్ని నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నారన్నారు. మొబైల్ ఫోన్లు గానీ, డెబిట్/క్రెడిట్ కార్డులు గానీ లేని వాళ్లు కూడా కేవలం వేలి ముద్ర ద్వారా ఆధార్ ఆధారిత చెల్లింపులు చేయొచ్చని జైట్లీ ఈ సందర్భంగా తెలిపారు. ఒకప్పుడు దేశంలో కేవలం ఒక్క శాతం జనాభాకు మాత్రమే మొబైల్ ఫోన్లు ఉండేవని.. 20 ఏళ్లలో ఇప్పుడు 90 శాతం మందికి మొబైల్ ఫోన్లు వచ్చాయని ఆయన వివరించారు. ప్రధాని చెప్పినట్లుగా దీనివల్ల మొదట్లో కొన్ని సమస్యలు ఉన్నా.. బ్యాంకింగ్ వ్యవస్థలోకి డబ్బులు వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. నకిలీ నోట్ల నుంచి ఉగ్రవాదం వరకు అన్నీ ఎక్కువగా నగదు మీద ఆధారపడటం వల్లే పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఇప్పుడు చేపట్టిన సంస్కరణల వల్ల మెరుగైన దేశం, మెరుగైన.. స్వచ్ఛమైన ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో వస్తాయన్నారు. దేశ ఖజానాకు మార్కెట్ వర్గాలతో సహా అన్ని వర్గాలూ తమ వంతు సాయం చేస్తున్నాయని ప్రధానమంత్రి తన ప్రసంగంలో చెబితే.. దాన్ని మీడియాలో ఒక వర్గం వక్రీకరించిందని జైట్లీ అన్నారు. సెక్యూరిటీ లావాదేవీలపై దీర్ఘకాలంలో క్యాపిటల్ గెయిన్ పన్నులు ఉంటాయని మోదీ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. అలాంటి ఉద్దేశం ప్రభుత్వానికి గానీ, ప్రధానమంత్రికి గానీ లేనే లేదని అన్నారు.