2027–28 నాటికి కార్యరూపం
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
న్యూఢిల్లీ: భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏటా 2.8 శాతం వృద్ధి చెందుతోంది. 2027–28 నాటికి ఇది ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అధికారిక నివాసంలో సోమవారం సాయంత్రం జరిగిన విశేష సంపర్క్ అభియాన్‌లో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో దాదాపు 300 ఐటీ, స్టార్టప్‌లు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. ‘2026–27 నాటికి భారత డిజిటల్ ఎకానమీ 1 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకుంటుందని ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది. అయితే కోవిడ్–19 మహమ్మారితో సహా వివిధ కారణాల వల్ల లక్ష్యం ఆ తర్వాతి సంవత్సరానికి మార్చారు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment