Trillion dollars
-
ట్రిలియన్ డాలర్లకు డిజిటల్ ఎకానమీ
న్యూఢిల్లీ: భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏటా 2.8 శాతం వృద్ధి చెందుతోంది. 2027–28 నాటికి ఇది ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అధికారిక నివాసంలో సోమవారం సాయంత్రం జరిగిన విశేష సంపర్క్ అభియాన్‌లో ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో దాదాపు 300 ఐటీ, స్టార్టప్‌లు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. ‘2026–27 నాటికి భారత డిజిటల్ ఎకానమీ 1 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకుంటుందని ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది. అయితే కోవిడ్–19 మహమ్మారితో సహా వివిధ కారణాల వల్ల లక్ష్యం ఆ తర్వాతి సంవత్సరానికి మార్చారు’ అని తెలిపారు. -
బీఎస్ఈ కంపెనీల సరికొత్త రికార్డ్ 5 లక్షల కోట్ల డాలర్లు
దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈ తాజాగా 5 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను సాధించింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. ఈ ఏడాది ప్రారంభం నుంచి 633 బిలియన్ డాలర్లకుపైగా జమ చేసుకుంది. నిజానికి మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ చరిత్రాత్మక గరిష్టానికి 1.7 శాతం దూరంలో ఉన్నప్పటికీ బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి 5 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించడం విశేషం!ముంబై: బీఎస్ఈ తొలిసారి 5 లక్షల కోట్ల డాలర్ల విలువను అందుకుంది. ఓవైపు బ్లూచిప్స్ పరుగుతీస్తుంటే.. మరోపక్క మధ్య, చిన్నతరహా కంపెనీల ఇండెక్సులు సైతం సరికొత్త గరిష్టాలకు చేరాయి. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రికార్డ్ నెలకొల్పింది. వెరసి బీఎస్ఈ విలువ తొలిసారి రూ. 415 లక్షల కోట్లకు చేరింది. 2023 నవంబర్‌లో తొలిసారి బీఎస్ఈ విలువ 4 ట్రిలియన్ డాలర్లను తాకింది.ఆపై ఆరు నెలల్లోనే 5 లక్షల కోట్లకు చేరింది. ఇప్పటివరకూ ప్రపంచంలో 5 ట్రిలియన్ డాలర్ల క్లబ్లో యూఎస్ఏ, చైనా, జపాన్, హాంకాంగ్ మాత్రమే ఉన్నాయి. మిడ్, స్మాల్ క్యాప్స్ భారీగా సహకరించడం ఈ సందర్భంగా గమనార్హం. ఇటీవల మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ.. 2024 జనవరి మొదలు సెన్సెక్స్ 2.3 శాతం బలపడగా.. మిడ్ క్యాప్ 16.3 శాతం, స్మాల్ క్యాప్ 11.5 శాతం ఎగశాయి. జర్నీ తీరిలా 2007 మే నెలలో ట్రిలియన్ డాలర్ల విలువను సాధించిన బీఎస్ఈ ఆపై దశాబ్దం తదుపరి అంటే 2017 జులైలో 2 ట్రిలియన్ డాలర్లను చేరింది. ఈ బాటలో 2021 మే నెలకల్లా 3 లక్షల కోట్ల డాలర్లను తాకింది. 5 లక్షల కోట్ల డాలర్ల జాబితాలో 55.65 ట్రిలియన్ డాలర్లతో యూఎస్ఏ టాప్ ర్యాంకులో ఉంది. 9.4 ట్రిలియన్లతో చైనా, 6.4 ట్రిలియన్లతో జపాన్, 5.47 ట్రిలియన్లతో హాంకాంగ్ తదుపరి నిలుస్తున్నాయి.మార్కెట్ విలువ మదింపులో మార్పులు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను మదింపు చేయడంలో సెబీ తాజాగా నిబంధనలను పునర్వ్యవస్థీకరించింది. దీంతో ఇకపై రోజువారీ మార్కెట్ విలువ మదింపునకు బదులుగా ఆరు నెలల సగటును ప్రాతిపదికగా తీసుకోనున్నారు. దీని వలన సరైన విలువ మదింపునకు వీలుంటుందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.స్వల్ప నష్టాలతో సరి.. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల వేళ అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 53 పాయింట్లు నష్టపోయి 73,953 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 22,529 వద్ద నిలిచింది. మెటల్, ఇంధన షేర్లు రాణించగా, బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోన య్యాయి.ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు.., మిడ్ సెషన్లో కాసేపు లాభాల్లో ట్రేడయ్యా యి. తదుపరి అమ్మకాలు తలెత్తడంతో స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు వెల్లడికి ముందు(బుధవారం రాత్రి) అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో (జూన్ 4న) ఎన్నికల ఫలితాల వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ సూచీ 7% పెరిగి 23 నెలల గరిష్టస్థాయి 22.3 స్థాయిని తాకింది. -
5 ట్రిలియన్లు ఎన్నడు?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ మధ్య ఒక ఇంగ్లిష్ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ భారతదేశ ప్రగతి ఎంతో ఉజ్వలమని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడంలో మన పాత్ర అద్భుతం అని సమాధానం చెప్పారు. 2024 కల్లా భారతదేశం 5 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థగా బలోపేతమవుతుందని, చాలా బలమైన విశ్వాసాన్ని ప్రకటించారు. కేంద్రం-రాష్ట్రాల మధ్య ఫెడరల్ వ్యవస్థ ఆదర్శవంతంగా సాగుతోందని కితాబు ఇచ్చారు. వ్యవసాయంలోనూ, కార్మిక రంగంలోనూ తీసుకువచ్చిన సంస్కరణలు గతంలో ఎన్నడూ లేనంత ప్రభావాన్ని చూపిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కరోనా వంటి కష్టకాలంలో, విపత్తుల్లో పేదవాడికి ప్రభుత్వం అందించిన చేయూత అద్భుతమైనదని,ఆత్మతృప్తిని వ్యక్తం చేశారు.ఉత్పత్తి, తయారీ రంగంలో ప్రపంచం మొత్తానికి సరఫరా చేయగలిగిన మార్కెట్ కేంద్రంగా సమీప భవిష్యత్తులో భారత్ నిలుస్తుందనే విశ్వాసాన్ని ప్రకటించారు.సంస్కరణల పరంపర నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంటుందని సమాధానం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా, దానికి తగ్గట్టుగా రాష్ట్రాలు స్పందించక పోతే, ఆశించిన అభివృద్ధి జరగదని తెలిపారు.పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాలు తమ వంతు పాత్ర పోషించడం కీలకమని సూచించారు. చేయాలనుకున్న మేలు,చిట్ట చివరి మైలు వరకూ చేరుకునే డెలివరీ వ్యవస్థ మనల్ని కాపాడిందని,ఈ యంత్రాంగాన్ని అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళల్లోనే నిర్మించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే చెల్లిందని తమ పాలన పట్ల అత్యంత ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు.లక్షలాది మంది ప్రజలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే నగదును బదిలీ చేయగలిగామనే ఆత్మతృప్తి తనకు ఎంతో ఉత్సహాన్ని,శక్తిని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఇది తమ ప్రభుత్వం మాత్రమే చేసిన చారిత్రక చర్య అని తెలిపారు.ఇలా,ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన భావాలను, అనుభవాలను,ఆలోచనలను, ఆశయాలను,సంకల్పాలను ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆ యాంకర్ ఇంకా సంధించాల్సిన చాలా ప్రశ్నలు సంధించలేదని చెప్పాలి. ప్రధాని చెప్పిన జవాబుల్లోనూ ఇంకా విస్తృతి వుంటే బాగుండేది. ప్రధానమంత్రి చెప్పిన మాటలు, చేసిన వ్యాఖ్యలను సమీక్ష చేసుకుంటే,కొన్ని వాస్తవానికి దగ్గరగానూ,కొన్ని దూరంగానూ ఉన్నాయి.సుమారు 139కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలోనూ, మరణాల సంఖ్యను అదుపులో ఉంచడంలోనూ, పరీక్షలు జరపడంలోనూ మంచి ఫలితాలే వచ్చాయి. ముందుజాగ్రత్త చర్యలు, హెచ్చరికలు చేపట్టకుండా, ఉన్నపళంగా లాక్ డౌన్ విధించడం వల్ల ఎన్నో అనర్ధాలు సంభవించాయి. ముఖ్యంగా వలసకార్మికులు పడిన కష్టాలు,పోగొట్టుకున్న ప్రాణాలు, కోల్పోయిన ఉపాధి వర్ణనాతీతం. లాక్ డౌన్ వల్ల ఆరోగ్యపరంగా కొంత రక్షణ పొందాం. సమాంతరంగా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇంత ఘోరమైన ఆర్ధిక పరిస్థితులు ఎప్పుడూ ఎదుర్కోలేదు.గతంలో ఆర్ధిక మాంద్యం వచ్చిన దశ కంటే, నేటి దశ చాలా ఘోరమైనదిగా విశ్లేషకులు భావించారు. అన్ లాక్ ప్రారంభమైనప్పటి నుంచీ కొంత ప్రగతి నమోదవుతూ వచ్చింది.ఆ సమయంలో నిర్మాణం,ఉత్పత్తి రంగాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆర్ధిక లావాదేవీలు చాలా మందకొడిగా సాగాయి. డిమాండ్-సప్లై మధ్య ఉన్న బంధం ఆరోగ్యకరంగా సాగలేదు. కరోనా ప్రభావంతో మిగిలిన దేశాల్లో వచ్చిన ఆర్ధిక కష్టాల ప్రభావం మన దేశంపైనా పడింది. దెబ్బతిన్న దేశాల్లో అమెరికా,చైనా వంటి పెద్ద దేశాలు సైతం ఉన్నాయి. అమెరికా బాగా దెబ్బతింది. చైనాకు -భారత్ కు మధ్య ఉన్న వాణిజ్య, వ్యాపార బంధాలు చాలా వరకూ తెగిపోయాయి. ఈ ప్రభావం మన ఉత్పత్తి రంగం, తద్వారా మన ఆర్ధిక రంగంపై పడింది.ఫార్మా మొదలు అనేక తయారీల్లో మనం చైనాపైనే ఆధారపడ్డాం.అదే విధంగా "మేక్ ఇన్ ఇండియా" ను ఆచరణలో ఆశించిన స్థాయిలో సాధించలేదు. కాబట్టి, ఈ పరిణామాల వల్ల మూల్యం చెల్లించుకోవాల్సివచ్చింది. అంతటి గడ్డు పరిస్థితుల్లోనూ మన దేశాన్ని కాపాడింది వ్యవసాయ రంగం. అది ఎంతో కొంత పచ్చగా ఉండడం వల్ల, కొంత ఆర్ధిక రక్షణ జరిగింది. యత్ర నార్యంతు పూజ్యతే... అన్నట్లుగా, ఎక్కడైతే వ్యవసాయ రంగం బాగుంటుందో, ఆ క్షేత్రం సుభిక్షంగా ఉంటుంది. వ్యవసాయ రంగంపై పాలకులకు ఇంకా శ్రద్ధాభక్తులు పెరగాలి. వ్యవసాయం కోసం ఉపయోగించుకోకుండా ఉన్న భూమి ఇంకా చాలా ఉంది. దాన్ని గుర్తించి,వ్యవసాయాన్ని విస్తరించాలి.కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్ రైతులు మళ్ళీ ఆందోళనకు దిగారు. సార్వత్రిక ఎన్నికల వేళయ్యింది. చర్చలు జరిపి శుభం కార్డు వెయ్యాలి.ఆహార రక్షణపై (ఫుడ్ సెక్యూరిటీ) పైనా దృష్టి పెట్టాలి.స్వామినాథన్ వంటి నిపుణులు చేసిన సూచనలు ఆచరణలో అంతంతమాత్రంగానే ఉన్నాయి. రాష్ట్రాలకు రావాల్సిన జి ఎస్ టి బకాయిలపై కేంద్రం చెప్పేవి మాటల గారడీ మాత్రమేనని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రుణాల వసతి కల్పించినా, వాడుకునే పరిస్థితి రాష్ట్రాలకు ఏమాత్రం ఉందన్నది సందేహమే. థామస్ రాబర్ట్ మాల్థస్ అనే ఆర్ధిక పండితుడు ఎప్పుడో 200ఏళ్ళ క్రితం చెప్పిన మాటలను దేశాధినేతలు పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది.జనాభా పెరుగుదల సంఖ్య ఆధారంగా, ప్రతి 25సంవత్సరాలకు ఒకసారి ప్రపంచంలో అనేక మార్పులు వస్తాయని,వాటికి అనుగుణంగా మనం సిద్ధమై ఉండాలని ఆయన హెచ్చరించారు. ప్రకృతి వైపరీత్యాలు, ఆర్ధిక మాంద్యాలు, కరోనా వైరస్ వంటి ముప్పులు, అనారోగ్యాలు ఎన్నో వస్తూ వుంటాయని,వీటిని గుర్తెరిగి, మనం నడచుకోవాలని ఆయన సూచించాడు.ముందు జాగ్రత్త చర్యలు పాటించక పోవడం వల్ల, ఆర్ధికంగా,మౌలికంగా సంసిద్ధమై ఉండక పోవడం వల్ల, ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు కుదేలైపోతున్నాం. మాల్థస్ మహనీయుడి మాటలు ఇప్పటికీ ప్రత్యక్షర, ప్రత్యక్ష సత్యాలుగా నిలుస్తున్నాయి. భారతదేశాన్ని పునర్నిర్మించాలనే సత్ సంకల్పం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉండడం ఎంతో అభినందనీయం,పూజనీయం. ఈ 2024కల్లా 5ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థను నిర్మించాలన్నది ప్రధాని పెట్టుకున్న మహదాశయం. ప్రపంచ ఆర్ధిక పరిణామాలను గమనిస్తే,2024కల్లా 3 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థకు భారత్ చేరుకుంటే? అది గొప్ప ప్రగతి సందర్భమని ఆర్ధిక శాస్త్రవేత్తలు గతంలో అభిప్రాయపడ్డారు. నేడు దానిని సాధించాం. ప్రధాని సంకల్పిస్తున్నట్లుగా 5ట్రిలియన్ల వ్యవస్థ నిర్మాణం కావడానికి ఇంకా సమయం పడుతుంది.ప్రస్తుతం 3.7 ట్రిలియన్స్ స్థితిలో వున్నాం. 5 ట్రిలియన్స్ కు చేరుకోవాలంటే? మరో నాలుగైదేళ్లు పడుతుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రచయిత : మా శర్మ -
Vision 2047: 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ప్రణాళిక!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ 2047 నాటికి దాదాపు 30 ట్రిలియన్ డాలర్ల (29.2 ట్రిలియన్ డాలర్లు) ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడానికి తగిన విజన్ ప్లాన్ సిద్ధమవుతున్నట్లు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం వెల్లడించారు. రూపకల్పనలో ఉన్న ఈ విజన్ డాక్యుమెంట్– 2047 భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవసరమైన సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులను సంస్కరణలను నిర్దేశిస్తుందని ఆయన అన్నారు. ఈ ముసాయిదా విజన్ డిసెంబర్ 2023 నాటికి సిద్ధమవుతుందని, వచ్చే మూడు నెలల్లో విజన్ దేశ ప్రజల ముందుకు వస్తుందని వెల్లడించారు. దిగువ మధ్య ఆదాయ స్థితి నుంచి దేశ పురోగతి విజన్ 2047 ప్రధానంగా నిర్దేశించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మే 2023లో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తూ, 2047 నాటికి దేశాన్ని వికసించిన భారత్‌గా (అభివృద్ధి చెందిన దేశంగా) మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచి్చన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియను డిసెంబర్ 2021లో క్యాబినెట్ సెక్రటరీ ప్రారంభించారు. థీమాటిక్, సెక్టోరల్ విజన్లను (రంగాల వారీగా) సిద్ధం చేసే బాధ్యతలను 10 సెక్టోరల్ గ్రూప్స్ ఆఫ్ సెక్రటరీలకు అప్పగించడం జరిగింది. పరిశ్రమ ఛాంబర్లు, ఎగుమతి ప్రోత్సాహక మండలి, విశ్లేషణా నిపుణులు, పరిశోధనా సంస్థలతో పలు దఫాల్లో మేధోమథనం, సంబంధిత సంప్రదింపులు జరిగాయి. అభివృద్ధి చెందిన భారత్ ః2047 కోసం 10 రంగాల దార్శినికత విభాగాలను ఏకీకృతం చేసేందుకు 2023లో నీతి ఆయోగ్ బాధ్యతలు చేపట్టింది. రాష్ట్రాలు కూడా తమ విజన్ డాక్యుమెంట్లను అభివృద్ధి చేస్తున్నాయని నీతి ఆయోగ్ సీఈవో తెలిపారు. అభివృద్ధి చెందిన దేశం అంటే... ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98, 374) అంచనా. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. -
భారత్.. మూడో అతిపెద్ద ఎకానమీ!
న్యూఢిల్లీ: భారత్ 2030 నాటికి జపాన్ను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ పేర్కొంది. అప్పటికి భారత్ స్థూల దేశీయోత్పత్తి 7.3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. ఇదే జరిగితే ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో చైనా తర్వాత భారత్ ఎకానమీ రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా సైతం ఆవిర్భవిస్తుంది. పటిష్ట ఆర్థిక వ్యవస్థతో ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీ వృద్ధి రేటును భారత్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. రానున్న దశాబ్ద కాలంలో కూడా ఇదే ధోరణి కొనసాగే వీలుంది. 2024 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతం నుంచి 6.3 శాతం శ్రేణిలో భారత్ ఎకానమీ వృద్ధి సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఆయా అంశాలకు సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ తాజా నివేదిక ఏమి చెబుతోందంటే.. 2023, 2024ల్లో ఎకానమీ వృద్ధి రేటు పటిష్టంగా ఉంటుంది. దేశీయంగా బలమైన వినియోగం దీనికి దోహదపడే అంశం. గత దశాబ్ద కాలంలో భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహం వేగవంతమైంది. భారత ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన దీర్ఘకాలిక వృద్ధి దృక్పథం కొనసాగుతోంది. యువత అధికంగా ఉండడం, వేగంగా పెరుగుతున్న పట్టణ గృహ ఆదాయాలు దేశ పురోగతికి దోహదపడే అంశాలు. మధ్య తరగతి ప్రజల సంఖ్య దేశంలో పెరుగుతుండడం మరో సానుకూల అంశం. సేవా రంగం సహా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ వినియోగ మార్కెట్, పారిశ్రామి క, తయారీ, మౌలిక రంగాలు దేశ పురోగతికి బాటలు వేస్తున్నాయి. ఆయా సానుకూలతలు బహుళజాతి కంపెనీలకు విస్తృతస్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి భారత్ గమ్యస్థానంగా మార్చుతోంది. ప్రస్తుతం దేశంలో పురోగమిస్తున్న డిజిటలైజేషన్ ఈ–కామర్స్ వృద్ధిని వేగవంతం చేస్తుంది. రాబోయే దశాబ్దంలో రిటైల్ వినియోగదారుల మార్కెట్ ధోరణుల మార్పునకు ఆయా అంశాలు దోహదపడతాయి. ఈ పరిణామాలు టెక్నాలజీ, ఈ–కామర్స్‌లో ప్రముఖ ప్రపంచ బహుళజాతి కంపెనీలను భారత మార్కెట్‌కు ఆకర్షిస్తాయి. 2030 నాటికి 110 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. 2020లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య దాదాపు 50 కోట్లకు ఇది రెట్టింపు. ఈ–కామర్స్ వేగవంతమైన వృద్ధి, 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీకి వినియోగదారులు అధిక సంఖ్యలో మారడం వంటి అంశాలు ఆన్లైన్ ద్వారా సేవలను విస్తృతం చేసే యూనికార్న్ సంస్థల పురోగతికి దోహదపడతాయి. భారత్‌లో చోటుచేసుకుంటున్న పలు సానుకూల ఆర్థిక పరిణామాలు ఆటో, ఎల క్ట్రానిక్స్, కెమికల్స్ వంటి తయారీ పరిశ్రమలతో పాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి సేవా రంగాల పురోగతికి దోహదపడతాయి. పెట్టుబడులకు సంబంధించి బహుళజాతి కంపెనీలకు అత్యంత ముఖ్యమైన దీర్ఘకాలిక వృద్ధి మార్కెట్లలో ఒకటిగా దేశం మారుతుంది. భారత్ పురోగతి బాట పటిష్టం: ఆర్థికశాఖ భారత్ 2024 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలోనే వేగవంతమైన ఎకానమీ హోదాను కొనసాగిస్తుందని ఆర్థిక మంత్రిత్వశాఖ సెపె్టంబర్ నెలవారీ సమీక్షా నివేదిక స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం దిగిరావడంసహా భారత్ ఆర్థిక ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. పశ్చిమాసియా సవాళ్లు, పరిణామాలు అంతర్జాతీయ క్రూడ్ ధరలపై ప్రభావం చూ పుతాయని అభిప్రాయపడింది. అమెరికా స్టాక్ మార్కె ట్లు బలహీన ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోందని, ఇది పూర్తి వాస్తవ రూపం దాల్చితే మిగిలిన మార్కెట్లపైనా ఈ ప్రభావం పడవచ్చని వివరించింది. ప్రస్తుతం అయిదో స్థానంలో.. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. 3.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో భారత్ ఐదవ స్థానంలో నిలుస్తోంది. 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. -
2035 నాటికి ట్రిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ రంగం 2035 నాటికి ఎగుమతి ఆధారిత ట్రిలియన్ డాలర్ పరిశ్రమగా ఎదిగే అవకాశం ఉందని ఆర్థర్ డి లిటిల్ నివేదిక పేర్కొంది. తయారీ, ఆవిష్కరణలు, సాంకేతికత తోడుగా పరిశ్రమ ఈ స్థాయికి చేరుకుంటుందని తెలిపింది. ‘భారత వాహన పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్లకు డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తికి ఆకర్షణీయ ప్రపంచ కేంద్రంగా మారవచ్చు. దీనిని సాధించడానికి ఈ రంగంలోని కంపెనీలు ప్రపంచ తయారీకి అనుగుణంగా తమ సామర్థ్యాలను విశ్వసనీయ, పోటీతత్వంగా మెరుగుపర్చుకోవాలి. జోనల్ ఆర్కిటెక్చర్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి కొత్త సాంకేతికతలకు అనుగుణంగా పరిష్కారాలను అందించడం ద్వారా ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్ పరిశోధన, అభివృద్ధిలో భారత శక్తి సామర్థ్యాలు వృద్ధి చెందుతాయి. నిధులతో కూడిన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థతో భారతదేశం వాహన రంగంలో నాయకత్వ స్థానంలో ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉంది’ అని వివరించింది. నాయకత్వ స్థానంగా..: దేశీ వాహన రంగంలో పెరుగుతున్న ఆవిష్కరణల వేగాన్ని, మారుతున్న సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించినట్లయితే భారతదేశాన్ని ప్రపంచ ఆటోమోటివ్ రంగంలో నాయకత్వ స్థానంగా మార్చవచ్చని నివేదిక తెలిపింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ పరిశోధన, అభివృద్ధి, సాఫ్ట్వేర్ మార్కెట్ 2030 నాటికి మూడు రెట్లు వృద్ధి చెంది 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. భారతదేశం ప్రపంచ సాఫ్ట్వేర్ హబ్‌గా, ఆఫ్‌షోర్ గమ్యస్థానంగా తన స్థానాన్ని ఉపయోగించుకోవచ్చు. భారత వాహన పరిశ్రమ నిజమైన సామర్థ్యాన్ని సది్వనియోగం చేసుకోవడానికి ప్రభుత్వంతో సహా ముడిపడి ఉన్న భాగస్వాముల మధ్య బలమైన చర్చలు, సమిష్టి చర్యలు అవసరం’ అని నివేదిక వివరించింది. -
సంపదకు సరికొత్త నిర్వచనం.. వారెన్ బఫెట్! ఆస్తుల్లో కొత్త మైలురాయి..
ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ ( Warren Buffett ) కు చెందిన ప్రముఖ ఇన్వెస్టర్ కంపెనీ బెర్క్‌షైర్ హతావే ( Berkshire Hathaway ) ఒక ట్రిలియన్ డాలర్ల (రూ. 82 లక్షల కోట్లకుపైగా) ఆస్తులను ఆర్జించి చారిత్రక మైలురాయిని సాధించింది. సంపద సృష్టికి సరికొత్త నిర్వచనం ఇచ్చింది. ఇటీవల విడుదల చేసిన కంపెనీ రెండవ త్రైమాసిక డేటా ప్రకారం, బెర్క్‌షైర్ హతావే జూన్ చివరి నాటికి 1.04 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. వీటిలో దాని స్టాక్ పోర్ట్‌ఫోలియో ద్వారానే అత్యధిక సంపద ఉంది. ఇది త్రైమాసికం చివరి నాటికి 353 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉంది. ఇందులో 178 బిలియన్ డాలర్లు ఒక్క యాపిల్ సంస్థలోనే ఉన్నాయి. 33 వేల రెట్లు పెంచిన బఫెట్ ట్రిలియన్ మైలురాయి దాటి ఆకట్టుకున్న బెర్క్‌షైర్ హతావే ఆస్తులు వారెన్ బఫెట్‌కు ముందు 1964లో 30 మిలియన్ డాలర్లు. ఈ మొత్తం 30 సంవత్సరాలలో 700 రెట్లు పెరిగి 1994లో దాదాపు 21 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అప్పటి నుంచి బెర్క్‌షైర్ ఆస్తులు మరో 48 రెట్లు పెరిగాయి. మొత్తంగా వారెన్ బఫెట్ సీఈవో ఉన్న సమయంలో కంపెనీ ఆస్తులను 33,000 రెట్లు పెంచారు. యాపిల్ కంటే మూడింతలు ఇటీవలి త్రైమాసికం ముగింపులో యాపిల్ కంపెనీ 335 బిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. ఇందులో 167 బిలియన డాలర్లు నగదు, సెక్యూరిటీలు, ఇతర రూపాల్లో ఉన్నాయి. అమెజాన్ 463 బిలియన్ డాలర్ల ఆస్తులను క్లెయిమ్ చేయగా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, మెటా 200 నుంచి 400 బిలియన్ డాలర్ల వరకు ఆస్తులను నివేదించాయి. ఇక బెర్క్షైర్తో పోల్చదగిన మార్కెట్ విలువ కలిగిన టెస్లా జూన్ చివరి నాటికి కేవలం 91 బిలియన్ డాలర్ల ఆస్తులను మాత్రమే కలిగి ఉంది. 768 బిలియన్ డాలర్ల బెర్క్‌షైర్ కంటే అధికంగా దాదాపు 1.2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వ్యాల్యూ కలిగిన ఎన్విడియా, తాజా లెక్కల ప్రకారం 44 బిలియన్ డాలర్ల ఆస్తులను మాత్రమే కలిగి ఉంది. -
స్టార్టప్‌లలో లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అంకుర సంస్థల వ్యవస్థలోకి 2030 నాటికల్లా వార్షిక పెట్టుబడుల పరిమాణం 1 లక్ష కోట్ల డాలర్లకు చేరేలా కృషి చేయాలని స్టార్టప్20 ఎంగేజ్మెంట్ గ్రూప్ నిర్దేశించుకుంది. ఇందుకోసం జీ20 దేశాధినేతలతో భేటీ కానుంది. ప్రస్తుతం స్టార్టప్ వ్యవస్థలోకి వార్షిక పెట్టుబడు లు 700 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. స్టార్టప్20 ఇండియా చెయిర్ చింతన్ వైష్ణవ్ ఈ విషయాలు తెలిపారు. పెట్టుబడుల తోడ్పాటుతో స్టార్టప్‌లు అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధికి చోదకాలుగా నిలవగలవని ఆయన చెప్పారు. అంకుర సంస్థలకు అంతర్జాతీయంగా ప్రామాణికమైన నిర్వచనాన్ని రూపొందిస్తే వాటికి పెట్టుబడులు, నిపుణుల లభ్యత మరింతగా పెరగగలదని పేర్కొన్నారు. జీ20కి అధ్యక్షత వహిస్తున్న భారత్.. జూలై 3–4న గురుగ్రామ్‌లో ’స్టార్టప్20 శిఖర్’ సదస్సు నిర్వహించనుంది. ఇందులో జీ20 సభ్యదేశాలకు చెందిన 700 పైగా అంకుర సంస్థలు పాల్గోనున్నాయి. -
రిలయన్స్ రిటైల్ రుణ పరిమితి పెంపు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఆర్ఐఎల్ గ్రూప్ కంపెనీ రిలయన్స్ రిటైల్.. రుణ సమీకరణ పరిమితిని రెట్టింపునకు పెంచేందుకు వాటాదారుల అనుమతిని కోరనుంది. వెరసి రూ. లక్ష కోట్ల రుణ పరిమితి ప్రతిపాదనను ఈ నెల 30న నిర్వహించనున్న వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో వాటాదారుల ముందు ఉంచనుంది. ప్రస్తుతం కంపెనీ రుణ సమీకరణ పరిమితి రూ. 50,000 కోట్లుగా ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో వాటాదారులు ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2022 మే 5న సమావేశమైన కంపెనీ బోర్డు రుణ సమీకరణ పరిమితిని రూ. లక్ష కోట్లకు పెంచేందుకు ప్రతిపాదించింది. తద్వారా బిజినెస్ అవసరాలకు అనుగుణంగా కంపెనీ సమయానుగుణ రుణ సమీకరణకు వీలు చిక్కనున్నట్లు ఏజీఎం నోటీసులో పేర్కొంది. 2022 మార్చి 31కల్లా రిలయన్స్ రిటైల్ స్థూల రుణ భారం రూ. 40,756 కోట్లుగా నమోదైంది. గత నెలలో జరిగిన ఆర్ఐఎల్ ఏజీఎంలో రిలయన్స్ రిటైల్ ఎఫ్ఎంసీజీ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు వెల్లడించిన నేపథ్యంలో తాజా ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఏర్పడింది. గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో రిటైల్ బిజినెస్‌పై ఆర్ఐఎల్ రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. -
Azadi Ka Amrit Mahotsav: అప్పుడే.. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వచ్చే ఐదేళ్లపాటు స్థిరంగా ఏడాదికి తొమ్మిది శాతం వృద్ధి చెందితేనే 2028–29 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సోమవారం పేర్కొన్నారు. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో దువ్వూరి చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు... ► ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్దేశించుకున్న ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలను సాకారం చేసుకోడానికి భారత్‌కు ఎనిమిది కీలక సవాళ్లు ఉన్నాయి. ఇందులో మొదటిది వచ్చే ఐదేళ్లలో భారత్ వరుసగా 9 శాతం చొప్పున వృద్ధిని సాధించాలి. తరువాతి అంశాల్లో కొన్ని పెట్టుబడులు పెరగాలి. ఉత్పత్పాదక మెరుగుపడాలి. విద్య, వైద్య రంగాలు పురోగమించాలి. భారీ ఉపాధి కల్పనలు జరగాలి. వ్యవసాయం మరింత తోడ్పాటును అందించాలి. ఎకానమీ ఫండమెంటల్స్ పటిష్టంగా కొనసాగుతూ ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి వంటి స్థూల ఆర్థిక అంశాలు స్థిరంగా ఉండాలి. పలు రంగాల్లో ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి. పాలనా వ్యవస్థ మెరుగుపడాలి. ► రాష్ట్రాలు ఇచ్చే రాయితీలపై మోడీ చర్చను ప్రారంభించారు. అనవసర సబ్సిడీల పరిస్థితికి ఏ ఒక్కరూ కారణం కాదు. అన్ని రాజకీయ పార్టీలూ ఇందుకు బాధ్యత వహించాలి. ► దేశానికి మిగులు బడ్జెట్లు లేవని, ఈ పరిస్థితుల్లో దేశానికి ఆర్థిక పరమైన భద్రతా వలయం తప్పనిసరిగా అవసరమని, కేంద్రం, రాష్ట్రాలు గుర్తించాలి. ► అప్పు తెచ్చుకున్న డబ్బు నుండి ఎలాంటి ఉచితాలను ఇవ్వాలనే అంశాన్ని కేంద్ర, రాష్ట్రాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఇందుకు సంబంధించి ఎంపికలు జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తు తరాలపై అనవసరమైన అప్పుల భారం మోపకూడదు. ► రూపాయి తన సహజ స్థాయిని కనుగొనడం అవసరమే. ఈ విషయంలో సెంట్రల్ బ్యాంక్ జోక్యం పరిమితంగానే ఉండాలి. తీవ్ర ఒడిదుడుకులను నివారించేలా మాత్రమే ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి. డాలర్ మారకంలో మినహాయిస్తే, పలు కరెన్సీలకన్నా భారత్ మెరుగైన స్థితిలో ఉంది. పలు దేశాల మారకంలో బలపడింది. -
యాపిల్ పెను సంచలనం
Apple first company to cross $3 trillion market cap milestone: కార్పొరేట్ రంగంలో యాపిల్ కంపెనీ పెను సంచనలం సృష్టించింది. ఏకంగా 3 ట్రిలియన్ డాలర్ల(3 X రూ.75లక్షల కోట్లుపైనే) వాల్యూ మార్క్‌ను అందుకున్న తొలి కంపెనీగా అవతరించింది. సోమవారం (జనవరి 3, 2022)న మధ్యాహ్నాం మార్కెట్లో షేర్ల ధరల పెరుగుదలతో ఈ ఘనత సాధించింది ఈ అమెరికన్ మల్టీనేషనల్ టెక్ దిగ్గజం. స్టీవ్ జాబ్స్ 2007లో ఫస్ట్ యాపిల్ ఐఫోన్‌ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి విలువతో పోలిస్తే.. ఇప్పుడు యాపిల్ షేర్లు 5,800 శాతం రెట్లు పెరిగాయి ఇప్పుడు. కరోనా టైంలోనూ ఈ కార్పొరేట్ జెయింట్ హవాకు అడ్డుకట్ట పడకపోవడం విశేషం. 2020 మొదట్లో 200 శాతం పెరిగాయి షేర్ల ధరలు. మొత్తంగా ఇప్పుడు మూడు ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌ను దాటేసింది. స్టీవ్ జాబ్స్ 1976లో ఓ కంప్యూటర్ కంపెనీగా మొదలైన యాపిల్ కంపెనీ.. ఇన్కార్పోరేటెడ్గా(విలీన కంపెనీగా) హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, మీడియా సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే. 2 ట్రిలియన్ మార్కెట్‌ను అందుకున్న కేవలం పదిహేడు నెలలకే.. అది చిప్ కొరత లాంటి అసాధారణ సమస్యను ఎదుర్కొంటూనే 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ మార్క్‌ను టచ్ చేయగలగడం మరో విశేషం. యాపిల్ తొలి ఆఫీస్ నా జీవితంలో ఈ మార్క్‌ను కంపెనీ సాధిస్తుందని ఊహించలేదు.. కానీ, రాబోయే ఐదు పదేళ్లలో యాపిల్ ఊపు ఎలా ఉండబోతుందో ఈ గణాంకాలే చెప్తున్నాయి అంటున్నారు కంపెనీలో 2.75 మిలియన్ షేర్లు ఉన్న ప్యాట్రిక్ బర్టోన్(ఈయన మెయిన్ స్టే విన్స్లో లార్జ్ క్యాప్ గ్రోత్ ఫండ్‌కి కో-ఫోర్ట్‌ఫోలియో మేనేజర్). యాపిల్ కంపెనీ 2018లో 1 ట్రిలియన్ డాలర్ మార్క్ అందుకుంది. ఆగష్టు 2020లో 2 ట్రిలియన్ డాలర్ మార్క్ అందుకుంది. ఈ క్రమంలో మరో టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంది యాపిల్. మొత్తంగా 2 ట్రిలియన్ డాలర్ మార్క్ దాటిన తొలి కంపెనీ మాత్రం సౌదీ ఆరామ్కో(సౌదీ అరేబియన్ ఆయిల్ కంపెనీ). ప్రస్తుతం యాపిల్ మొదటి స్థానంలో ఉండగా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్(గూగుల్), సౌదీ ఆరామ్కో, అమెజాన్‌లో తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాయి. చదవండి: యాపిల్+మేక్ ఇన్ ఇండియా= 50 బిలియన్ డాలర్లు!! -
‘5 ట్రిలియన్ ఎకానమీ.. అబ్బో కష్టమే’
భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న తీరుపై ఆర్థిక వేత్త, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ సీ రంగరాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడంలో సరైన నిర్ణయాలు తీసుకోకుంటే మరో ఆర్థిక ముప్పు తప్పదని హెచ్చరించారు. ఇక్ఫాయ్లో జరిగిన ఓ సదస్సులో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో కరోనా సంక్షోభం తలెత్తడానికి ముందు వరకు భారత ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగానే ఉందన్నారు. 2019లో 2.3 ట్రిలియన్ డాలర్లతో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండేందని, అప్పుడు ఆర్థిక వృద్ధి రేటు 9 శాతంతో కొనసాగిందని గుర్తు చేసుకున్నారు . అదే స్పీడు మరో ఐదేళ్లు కొనసాగి ఉంటే 2025 నాటికి ఇండియా ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుని ఉండేది అని రంగరాజన్ అన్నారు. పరిష్కారం అయ్యేవి భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుని ఉంటే దేశంలో నెలకొన్ని ఎన్నో సామాజిక రుగ్మతలకు పరిష్కారం లభించేంది. అట్టడుగు వర్గాలకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యేవన్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల అనుకున్న లక్ష్యాన్ని ఇప్పుడు సాధించడం కష్టమేననంటూ ఆయన అభిప్రాయపడ్డారు. కీలకం కరోనా మొదటి వేవ్ ప్రజల ఆరోగ్యం మీదకంటే దేశ ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బ తీసిందని, సెకండ్ వేవ్ ఆర్థిక వ్యవస్థ కంటే ప్రజల ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపిందని రంగరాజన్ అన్నారు. మొత్తంగా కరోనా వల్ల రోజువారి కూలీల జీవితం దుర్భరంగా మారిందన్నారు. ప్రస్తుతం వారికి ఉపాధి దొరకడం, జీవించడం కష్టంగా మారిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు తేరుకోవాలి మన ఆర్థిక సమస్యలు తీరాలంటే ఇప్పుడున్న వృద్ధి రేటు సరిపోదని, కచ్చితంగా పెంచాల్సిందేనని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్నారు. దాన్ని కాచుకుంటూ ఎకానమినీ బలోపేతం చేయాలన్నారు. అది జరగాలంటే ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తూనే దానికి సమాంతరంగా వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగు కావాలని, అక్కడ పెట్టుబడులు పెరగాలని ఆయన సూచించారు. చదవండి : ఆర్బీఐ భారీ ఊరట.. ప్రస్తుతానికి యథాతథ స్థితి! మానిటరీ పాలసీ కమిటీ కీలక నిర్ణయాలివే! -
TCS: మార్కెట్ క్యాపిటలైజేషన్లో రికార్డ్ !
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సరికొత్త ఎత్తులకు చేరుకుంది. స్టాక్మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతుండటంతో టీసీఎస్ షేర్ల ధరల్లో మంచి పెరుగదల నమోదైంది. దీంతో ఇండియాలో మార్కెట్ క్యాపిటలైజేషన్లో రెండో అతి పెద్ద కంపెనీగా టీసీఎస్ అవతరించింది. టీసీఎస్ విలువ ఎంత బుధవారం స్టాక్ మార్కెట్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్లు 2.3 శాతం పెరిగాయి. దీంతో షేర్ వాల్యూ రూ.3,694.25కి చేరుకుంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రికార్డు స్థాయిలో 13.65 ట్రిలియన్లకు చేరుకుంది. షేర్ల విలువ మరికొద్దిగా పెరిగితే ఏకంగా 14 ట్రిలియన్లకు కంపెనీ విలువ చేరుతుంది. ఇండియా తరఫున రిలయన్స్ ఇండస్ట్రీస్ 14.51 ట్రిలియన్ల విలువతో మొదటి స్థానంలో ఉంది. ట్రిలియన్ క్లబ్లో ఉన్న కంపెనీలు ఎన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్లో వంద బిలియన్ డాలర్ల విలువ దాటిన కంపెనీలు ఇండియా తరఫున నాలుగే ఉన్నాయి. అందులో మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, రెండో స్థానంలో టీసీఎస్, మూడో స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో బుల్ జోరు కారణంగా మంగళవారం ఇన్ఫోసిస్ విలువ సైతం 100 బిలియన్ డాలర్లు దాటింది. చదవండి : Mi బ్రాండ్ పేరు మారుతోంది ? కొత్తగా నేమ్ ఇదే ? -
రూ.75 లక్షల కోట్లకు ప్రాపర్టీ మార్కెట్
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల (రూ.75 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుంటుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖా కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న డిమాండ్‌కు తోడు, గడిచిన ఏడేళ్లలో చేపట్టిన ఎన్నో సంస్కరణలు (రెరా తదితర) రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి దోహదపడతాయన్నారు. ఈ రంగంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య కూడా 2019 నాటికి ఉన్న 5.5 కోట్ల నుంచి 2030 నాటికి 7 కోట్లకు పెరుగుతుందన్నారు. రియల్టీ రంగంపై సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. నమూనా అద్దెచట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని రాష్ట్రాలను కోరినట్టు మిశ్రా చెప్పారు. ఈ చట్టానికి కేంద్ర కేబినెట్ గత నెలలోనే ఆమోదం తెలియజేసింది. కరోనా రెండు విడతల్లోనూ రియల్ఎస్టేట్ పరిశ్రమపై గట్టి ప్రభావం పడిందన్న ఆయన.. డిమాండ్ తిరిగి కోలుకున్నట్టు చెప్పారు. 2021–22 మొదటి మూడు నెలల్లో (ఈ ఏడాది ఏప్రిల్–జూన్) రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే పెరిగినట్టుగా పలు నివేదికలను ప్రస్తావించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం కీలకమైనదనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు వివరించారు. పట్టణాల్లోని జనాభా ప్రస్తుతమున్న 46 కోట్ల నుంచి 2051 నాటికి 88 కోట్లకు పెరుగుతుందన్నారు. కనుక రియల్ ఎస్టేట్ పరిశ్రమ భారీగా వృద్ధి చెందేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అందుబాటులోకి 1,222 ఆక్సిజన్ ప్లాంట్లు ప్రధాన మంత్రి –కేర్స్ నిధి కింద మంజూరు చేసిన 1,222 ప్రెషర్ స్వింగ్ అడ్జార్ప్షన్ (పీఎస్ఏ) ఆక్సిజన్ ప్లాంట్లు ఆగస్ట్ 15 నాటికి పనిచేయడం మొదలుపెడతాయని మిశ్రా తెలిపారు. కరోనా కారణంగా ఏర్పడిన అవసరాలను భారత్ స్వీయం గా తీర్చుకోవడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఔషధాలను సరఫరా చేసినట్టు చెప్పారు. -
ఐదేళ్లలో రెట్టింపు కానున్న రిటైల్ రుణాలు
ముంబై: ఫైనాన్స్ సంస్థల రుణ పుస్తకం విలువ 2019 మార్చి నాటికి రూ.48 లక్షల కోట్లుగా ఉండగా, ఇది వచ్చే ఐదేళ్ల కాలంలో 2024 నాటికి రూ.96 లక్షల కోట్లకు వృద్ధి చెందుతుందని ఐసీఐసీఐ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ప్రైవేటు వినియోగం (ఇల్లు, కారు, కన్జ్యూమర్ డ్యురబుల్స్, క్రెడిట్ కార్డులు) కారణంగా రుణ మార్కెట్ భారీగా వృద్ధి చెందనుందని అంచనా వేసింది. వినియోగదారుల్లో రుణాలు తీసుకునే ధోరణి పెరుగుతుండడం, అదే సమయంలో వినియోగదారుల డేటా లభ్యత పెరగడం, డేటా అనలైటిక్స్ వినియోగం అన్నవి చౌక గృహ రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాల వృద్ధికి దారితీయనున్నట్టు ఈ సంస్థ వివరించింది. -
5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
న్యూఢిల్లీ: 2024 నాటికి దేశాన్ని 5 లక్షల కోట్ల డాలర్ల(సుమారు రూ.35 కోట్ల కోట్లు) విలువైన ఆర్థిక వ్యవస్థగా మార్చడం సాధించగల లక్ష్యమేనని ప్రధాని మోదీ అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రాలు స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)ని జిల్లా స్థాయి నుంచే పెంచేందుకు తమ శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించాలన్నారు. శనివారం ఆయన నీతి ఆయోగ్ ఐదో పాలక మండలి సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో తలెత్తిన కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పేదరికం, నిరుద్యోగం, కరువు, వరదలు, కాలుష్యం, అవినీతి, హింస తదితర సమస్యలపై సమష్టి పోరాటం సాగించాలని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని పిలుపునిచ్చారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక వ్యవస్థ రెట్టింపు కావాలి ‘2019 మార్చి చివరికి దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2.75 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2024 కల్లా దీనిని 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి మార్చడం కష్టమైనప్పటికీ సాధించగలిగిన లక్ష్యమే. జీడీపీని జిల్లా స్థాయి నుంచే పెంచేందుకు రాష్ట్రాలు తమ శక్తియుక్తులను ఉపయోగించాలి. దీంతోపాటు దేశీయ ఎగుమతులు భారీగా పెరగాల్సి ఉంది’అని మోదీ అన్నారు. ‘సాధికారిత, సులభ జీవనం ప్రతి భారతీయుడికి అందుబాటులోకి తేవాలి. స్వల్ప, దీర్ఘ కాలిక లక్ష్యాలను అధిగమించేందుకు ఉమ్మడిగా ముందుకు సాగాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉమ్మడిగా చేపట్టాల్సిన స్వచ్ఛ భారత్ అభియాన్, పీఎం ఆవాస్ యోజన ఇందుకు ఉదాహరణ’అని తెలిపారు. ‘మహాత్మాగాంధీ 150వ వర్థంతికి లక్ష్యంగా పెట్టుకున్న వాటిని అక్టోబర్ 2వ తేదీకి సాధించాలి, 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను 2022 కల్లా అధిగమించేందు కృషి జరగాలి’ అని కోరారు. పర్ డ్రాప్, మోర్ క్రాప్ ‘దేశంలోని పలు ప్రాంతాల్లో కరువు వంటి పరిస్థితులున్నందున వీటిని ఎదుర్కొనేందుకు ప్రతి నీటి బొట్టుకు మరింత ఫలసాయం (పర్ డ్రాప్, మోర్ క్రాప్) విధానాన్ని అభివృద్ధి చేయాలి. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకోసం చేపలపెంపకం, పశుపోషణ, ఉద్యానపంటలు, పూలు, కూరగాయల సాగు రైతులు చేపట్టేలా ప్రోత్సహించాలి. పీఎం–కిసాన్ వంటి రైతు పథకాలు సకాలంలో ఉద్దేశించిన రైతులకు అందాలి’అని సూచించారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ పెట్టుబడులు, రవాణా సౌకర్యాలు, మార్కెట్ సదుపాయం కల్పించేందుకు కృషి జరగాలని ప్రధాని అన్నారు. ఆహారధాన్యాల ఉత్పత్తి కంటే ఫుడ్ ప్రాసెసింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ నినాదం సాధనలో నీతి ఆయోగ్ పాత్ర ఎంతో కీలకమన్నారు. అభివృద్ధి లక్షిత(అస్పిరేషనల్) 115 జిల్లాల్లో ఇంకా కొన్ని రంగాల్లో వెనుకబాటును అధిగమించేందుకు గుడ్ గవర్నెన్స్‌పై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రులను కోరారు. హాజరుకాని ముగ్గురు సీఎంలు కరువు పరిస్థితులు, వ్యవసాయ సంక్షోభం, వాన నీటి సంరక్షణ, ఖరీఫ్ పంటల సన్నద్ధత, అభివృద్ధి లక్షిత జిల్లాల పథకం, వ్యవసాయరంగంలో మార్పులు, వామపక్ష తీవ్రవాదం వంటి ఐదు ప్రధానాంశాలపై చర్చించేందుకు ఏర్పాటైన ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్థిక అధికారాలు లేని నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాబోనంటూ ఇటీవల ప్రధానికి లేఖ రాసిన బెంగాల్ సీఎం మమత బెనర్జీ రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం పనుల్లో బిజీగా ఉన్నందున తెలంగాణ సీఎం కేసీఆర్ రాలేదు. ఆరోగ్య సమస్యలతో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ రాలేదు. కాంగ్రెస్ సీఎంలకు మన్మోహన్ నిర్దేశం నీతి ఆయోగ్ సమావేశాల సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశాలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్, రాజస్తాన్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి సీఎంలు కమల్ నాథ్, అశోక్ గెహ్లోత్, కుమారస్వామి, భూపేశ్ బఘేల్, నారాయణ స్వామి హాజరయ్యారు. -
మరో మైలురాయి దిశగా టెక్ దిగ్గజం
టెక్నాలజీ దిగ్గజం ఆపిల్.. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలకు షాక్ ఇవ్వనుంది. ప్రపంచంలోనే మొదటి ట్రిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించడానికి శరవేగంగా దూసుకుపోతోంది. స్టాక్‌మార్కెట్ వాల్యూయేషన్ పరంగా రేసులో ముందు వరుసలో పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో ట్రిలియన్ డాలర్లు, అంతకంటే పైన స్థిరపడనుందన్న ఎనలిస్టుల అంచనాలను త్వరలోనే బీట్ చేస్తుందని భావిస్తున్నారు. ది గార్డియన్ ప్రకారం, ఆర్థిక వ్యాఖ్యాతలు, పెట్టుబడిదారులు ఆపిల్ సంస్థ ఒక ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటేయనుంది. 2017లో ఆపిల్ షేరు పుంజుకున్న నేపథ్యంలో 2018లో స్టాక్ మార్కెట్ విలువ ట్రిలియన్ లేదా అంతకు మించి ఆవిష్కరించనుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఆపిల్ మంగళవారం మార్కెట్ విలువ 869 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆపిల్ షేర్ ధరలు గతేడాది 47 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఐఫోన్లతో స్మార్ట్‌ఫోన్ రంగంలో దూసుకుపోతున్న ట్రిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించాలంటే ఆపిల్ షేరు ఇంకా 15 శాతం పుంజుకోవాల్సి ఉంది. కాగా ఈ రేసులో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, టెన్సెంట్ కంపెనీలు ఆపిల్‌కు గట్టి పోటీగా ఉన్నాయి. -
వచ్చే ఏడేళ్లలో.. 3 ట్రిలియన్ డాలర్లకు మొబైల్ పేమెంట్స్
- బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అంచనా న్యూఢిల్లీ: దేశంలో మొబైళ్ల ద్వారా జరిగే చెల్లింపులు (మొబైల్ పేమెంట్స్) వచ్చే ఏడేళ్లలో 200 రెట్ల వృద్ధితో 3 ట్రిలియన్ డాలర్లకు చేరతాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అభిప్రాయపడింది. ప్రస్తుతం మొబైల్ బ్యాంకింగ్ విలువ 16 బిలియన్ డాలర్లుగా ఉందని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో జరిగిన మొత్తం చెల్లింపులలో 0.1 శాతంగా ఉన్న మొబైల్ పేమెంట్స్ వాటా కూడా 10 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలిపింది.