టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సరికొత్త ఎత్తులకు చేరుకుంది. స్టాక్‌మార్కెట్‌లో బుల్ జోరు కొనసాగుతుండటంతో టీసీఎస్ షేర్ల ధరల్లో మంచి పెరుగదల నమోదైంది. దీంతో ఇండియాలో మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రెండో అతి పెద్ద కంపెనీగా టీసీఎస్ అవతరించింది.
టీసీఎస్ విలువ ఎంత
బుధవారం స్టాక్ మార్కెట్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్లు 2.3 శాతం పెరిగాయి. దీంతో షేర్ వాల్యూ రూ.3,694.25కి చేరుకుంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రికార్డు స్థాయిలో 13.65 ట్రిలియన్లకు చేరుకుంది. షేర్ల విలువ మరికొద్దిగా పెరిగితే ఏకంగా 14 ట్రిలియన్లకు కంపెనీ విలువ చేరుతుంది. ఇండియా తరఫున రిలయన్స్ ఇండస్ట్రీస్ 14.51 ట్రిలియన్ల విలువతో మొదటి స్థానంలో ఉంది.
ట్రిలియన్ క్లబ్‌లో ఉన్న కంపెనీలు ఎన్ని
మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో వంద బిలియన్ డాలర్ల విలువ దాటిన కంపెనీలు ఇండియా తరఫున నాలుగే ఉన్నాయి. అందులో మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, రెండో స్థానంలో టీసీఎస్, మూడో స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీలు ఉన్నాయి. షేర్ మార్కెట్‌లో బుల్ జోరు కారణంగా మంగళవారం ఇన్ఫోసిస్ విలువ సైతం 100 బిలియన్ డాలర్లు దాటింది.
Comments
Please login to add a commentAdd a comment