Zomato On A Bumpy Ride: గత ఏడాది స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టిన జొమాటో షేర్ ధర ఇప్పుడు భారీగా పడిపోతుంది. జొమాటోలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడుదారులందరూ ఇప్పుడు లబోదిబో అంటున్నారు. బిఎస్ఈలో 9 శాతం పడిపోయి రూ.114.00కు పడిపోతుంది. ఈ కంపెనీ స్టాక్ ధర 52 వారాల గరిష్టం నుంచి 30 శాతానికి పైగా దిగజారింది. గత ఏడాది జీవనకాల గరిష్ట స్థాయి రూ.160.30కి చేరిన షేర్ ధర, నిన్న(జనవరి 23) అత్యంత కనిష్ట స్థాయి రూ.114కి పడిపోయింది. కేవలం ఈ ఏడాదిలోనే ఈ కంపెనీ షేర్ ధర 20 శాతానికి పైగా పడిపోవడం విశేషం.
"జొమాటో కంపెనీ అనేక విధాలుగా స్విగ్గీ నుంచి కఠినమైన పోటీని ఎదుర్కొంటోంది. ప్రధానంగా మెట్రో నగరాల్లోని రెస్టారెంట్ నెట్ వర్క్, స్విగ్గీ నుంచి ఈ పోటీ ఉంది" అని వైస్ ప్రెసిడెంట్ & రీసెర్చ్ ఆఫ్ షేర్ ఇండియా డాక్టర్ రవి సింగ్ తెలిపారు. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లోనే సుమారు రూ.10 వేల కోట్లకు నష్టపోయినట్లు తెలుస్తుంది. అలాగే, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్క్ కూడా రూ.1 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు సెప్టెంబర్ క్వార్టర్‌లో నష్టాలు మరింత తీవ్రమయ్యాయి. రూ.435 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టాలు రూ.230 కోట్లుగానే ఉన్నాయి. ఆదాయం రూ.426 కోట్ల నుంచి రూ.1,024 కోట్లకు పెరిగింది. తన నిర్వహణలోని ఫిస్టో కంపెనీని క్యూర్‌ఫిట్‌కు 50 మిలియన్ డాలర్లకు విక్రయించనున్నట్టు ప్రకటించింది.
(చదవండి: బుక్ చేసిన నాలుగేళ్లకు డెలివరీ ప్రచారం.. టయోటా క్లారిటీ!)
Comments
Please login to add a commentAdd a comment