అత్యంత విలువైన భారత బ్రాండ్ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 22వేలకోట్ల రూపాయల విలువైన షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించనుంది.
దాంతో తీవ్ర మార్కెట్ అనిశ్చితి మధ్య సోమవారం మార్కెట్‌లో టీసీఎస్ షేర్ విలువ స్వల్పంగా పెరిగి 52 వారాల గరిష్టానికి చేరింది. గడిచిన ఆరేళ్లలో కంపెనీ ఐదోసారి బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలిస్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. లిస్టెడ్ కంపెనీ తన నికర విలువలో 25శాతం వరకు షేర్లను తిరిగి కొనుగోలు చేయవచ్చు. దాని ప్రకారం జూన్ 30 చివరి నాటికి టీసీఎస్ రూ.22,620 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగలదు.
ఇది 2017 నుంచి కంపెనీ బైబ్యాక్ చేసిన షేర్లకంటే ఎక్కువ. ఫిబ్రవరి 2017, 2018, 2020లో వరుసగా రూ.16000కోట్లు, 2022లో రూ.18వేల కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. అయితే ఈ విధానం కంపెనీని ఆర్థికంగా ఎన్నోవిధాలుగా ప్రభావితం చేస్తుంది. జూన్ 30నాటికి కంపెనీ బ్యాలెన్స్‌షీట్‌లో రూ.15,622 కోట్లు క్యాష్ రూపంలో అందుబాటులో ఉందని తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment