IT stocks
-
నిఫ్టీ కొత్త రికార్డ్
ముంబై: ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో శుక్రవారం నిఫ్టీ కొత్త రికార్డు సృష్టించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ స్టాకులు రాణిండంతో ఇంట్రాడేలో 429 పాయింట్లు ఎగసి 22,127 స్థాయి వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల రికవరీ నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న స్టాక్ సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇంధన, మెటల్, సరీ్వసెస్, యుటిలిటీ, ఐటీ, విద్యుత్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రథమార్థంలో 2% ర్యాలీ చేశాయి. నిఫ్టీ ఆల్‌టైం హై(22,127)ని నమోదు చేయగా.., సెన్సెక్స్ 1444 పాయింట్లు దూసుకెళ్లి 73,089 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే మిడ్‌సెషన్ నుంచి ఆయిల్‌అండ్‌గ్యాస్, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా సెన్సెక్స్ 440 పాయింట్లు లాభపడి 72,086 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 156 పాయింట్లు పెరిగి 21,854 వద్ద నిలిచింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.80%, 0.50% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.71 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,463 కోట్ల షేర్లు కొన్నారు. నాస్డాక్లో ఐటీ షేర్ల ర్యాలీ ప్రభావం గురువారం రాత్రి అమెరికా మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభంతో ముగిశాయి. దీంతో శుక్రవారం ఆసియా, యూరప్ స్టాక్ సూచీలు 0.5–1% మేర పెరిగాయి. ► ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(73,089) నుంచి ఏకంగా 1004 పాయింట్లు, నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయి(22,127) నుంచి 273 పాయింట్లు నష్టపోయాయి. ఇక ఈ బడ్జెట్ వారంలో సెన్సెక్స్ 1,385 పాయింట్లు, నిఫ్టీ 502 పాయింట్లు చొప్పున ఆర్జించాయి. ► సెన్సెక్స్ 441 పాయింట్లు లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.3.34 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్టం రూ.382 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ► కేంద్రం బడ్జెట్లో పర్యావరణ అనుకూల ఇంధనాలకు ప్రాధాన్యత నివ్వడం, అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 80 డాలర్ల దిగువకు చేరుకోవడం ఇంధన షేర్లకు కలిసొ చి్చంది. బీపీసీఎల్ 10%, ఐఓసీ 8%, హిందుస్థాన్ పెట్రోలియం 5%, ఓఎన్జీసీ 4%, కోల్ ఇండియా 3% లాభపడ్డాయి. ► ఇంధన షేర్లలో భాగంగా రిలయన్స్ షేరు 2% పెరిగి రూ.2915 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 3.33% ర్యాలీ చేసి రూ.2950 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్ విలువ రూ. 41,860 కోట్లు పెరిగి రూ.19.72 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ► పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లు, టాపప్ వంటి పలు సర్వీసులను నిలిపివేయాలంటూ ఆర్బీఐ ఆదేశించిన నేపథ్యంలో వరుసగా రెండోరోజూ పేటీఎం షేరు 20% లోయర్ సర్క్యూట్ తాకింది. బీఎస్ఈలో శుక్రవారం 20% పతనమై రూ.487 వద్ద ముగిసింది. -
22 వేలకోట్ల రూపాయలతో టీసీఎస్ బైబ్యాక్!
అత్యంత విలువైన భారత బ్రాండ్ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 22వేలకోట్ల రూపాయల విలువైన షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించనుంది. దాంతో తీవ్ర మార్కెట్ అనిశ్చితి మధ్య సోమవారం మార్కెట్లో టీసీఎస్ షేర్ విలువ స్వల్పంగా పెరిగి 52 వారాల గరిష్టానికి చేరింది. గడిచిన ఆరేళ్లలో కంపెనీ ఐదోసారి బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలిస్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. లిస్టెడ్ కంపెనీ తన నికర విలువలో 25శాతం వరకు షేర్లను తిరిగి కొనుగోలు చేయవచ్చు. దాని ప్రకారం జూన్ 30 చివరి నాటికి టీసీఎస్ రూ.22,620 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగలదు. ఇది 2017 నుంచి కంపెనీ బైబ్యాక్ చేసిన షేర్లకంటే ఎక్కువ. ఫిబ్రవరి 2017, 2018, 2020లో వరుసగా రూ.16000కోట్లు, 2022లో రూ.18వేల కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. అయితే ఈ విధానం కంపెనీని ఆర్థికంగా ఎన్నోవిధాలుగా ప్రభావితం చేస్తుంది. జూన్ 30నాటికి కంపెనీ బ్యాలెన్స్షీట్లో రూ.15,622 కోట్లు క్యాష్ రూపంలో అందుబాటులో ఉందని తెలుస్తుంది. -
స్వల్ప లాభాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 56 పాయింట్ల లాభంతో 53,215 వద్ద.. నిఫ్టీ 23 పాయింట్లు లాభపడి 15,947 వద్ద కొనసాగుతున్నాయి.ప్రస్తుతం ఐటీసీ,ఏసియన్ పెయింట్స్, రిలయన్స్, సన్ ఫార్మా, ఎయిర్టెల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఐటీ కంపెనీలు క్యూ 1 ఫలితాలను ప్రకటిస్తుండడంతో టెక్ లాభాల బాట పట్టాయి. బ్యాంకింగ్, ఆటో మొబైల్ స్టాక్ సైతం లాభాల బాట పట్టాయి. -
సెన్సెక్స్‌కు లాభాలు.. నిఫ్టీకి నష్టాలు..!
ముంబై: చివరి అరగంటలో బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో శుక్రవారం సూచీలు మిశ్రమంగా ముగిశాయి. ఇంట్రాడేలో 544 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 13 పాయింట్ల స్వల్ప లాభంతో 51,544 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు స్థాయి సూచీకి ఆల్‌టైం హై విశేషం. అలాగే ట్రేడింగ్‌లో 162 పాయింట్ల రేంజ్లో కదలాడిన నిఫ్టీ ఇండెక్స్ 10 పాయింట్ల పరిమిత నష్టంతో 15,163 వద్ద నిలిచింది. బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ, రియల్టీ రంగ షేర్లు లాభపడ్డాయి. ఫార్మా, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆటో, మీడియా రంగాల షేర్లు నష్టపోయాయి. ‘‘డిసెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి, జనవరి ద్రవ్యోల్బణ గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. మరోవైపు మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కావడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ ప్రతికూలాంశాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు’’ అని స్టాక్ మార్కెట్ నిపుణులు తెలిపారు. ఈ వారంలో సెన్సెక్స్, 812 పాయింట్లను ఆర్జించింది. నిఫ్టీ 239 పాయింట్లు పెరిగింది. ఉదయం సెషన్లో లాభాలు మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ఉదయం సూచీలు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఇటీవల ఆకర్షణీయమైన క్యూ3 ఆర్థిక గణాంకాలను ప్రకటిస్తున్న కంపెనీల షేర్లు రాణించాయి. దేశీయ ఈక్విటీల్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం తిరిగి ప్రారంభం కావడం ఇన్వెస్టర్లకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. దీంతో అన్ని రంగాలకు చెందిన మిడ్‌క్యాప్ షేర్లు జోరుగా ర్యాలీ చేశాయి. ఒక దశలో సెన్సెక్స్ 273 పాయింట్లు లాభపడి 51,804 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 70 పాయింట్లు పెరిగి 15,243 వద్ద ఇంట్రాడే హైని అందుకుంది. మిడ్ సెషన్లో అనూహ్య అమ్మకాలు అంతా సజావుగా సాగుతున్న తరుణంలో మిడ్‌సెషన్‌లో బ్రిటన్ ఎకానమీపై ప్రతికూల వార్తలు వెలువ డటంతో యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభం మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బ తీసింది. ఫలి తంగా సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం నుంచి 544 పా యింట్లు, నిఫ్టీ 162 పాయింట్లను నష్టపోయాయి. -
కార్పోరేట్ ఫలితాలను పట్టించుకోనక్కర్లేదు
ప్రస్తుత పరిస్థితుల్లో కార్పోరేట్ ఫలితాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మోతీలాల్ ఓస్వాల్ ఫండ్ మేనేజర్ సిద్ధార్థ్ బోత్రా తెలిపారు. తొలి త్రైమాసికానికి ప్రత్యేక నేపథ్యం ఉందని కావున కంపెనీల ఫలితాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ‘‘ఏప్రిల్-జూన్ వ్యవధిలో ప్రతి కంపెనీ కనీసం నెలరోజులకు తగ్గకుండా లాక్డౌన్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో త్రైమాసిక ఫలితాలను పరిగణనలోకి తీసుకోవడం అవివేకం అవుతుంది. అయితే ఈ సందర్భంలోనూ కొన్ని కంపెనీలు మార్కెట్ వర్గాల అంచనాలకు మించి ఫలితాలను ప్రకటించి ఆశ్చర్యపరిచాయి’’ అని బోత్రా చెప్పుకొచ్చారు. ఐటీ, ఫార్మా సెక్టార్‌పై సానుకూలం: ఐటీ సెక్టార్‌పై తాము సానుకూలంగా ఉన్నట్లు బోత్రా తెలిపారు. రానున్న రోజుల్లో ఈ షేర్లు రాణించే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు ఫలితాలను వెల్లడించిన ఐటీ కంపెనీలు ఫలితాలు బాగున్నాయని, ఫలితాల ప్రకటన సందర్భంగా యాజమాన్య వ్యాఖ్యలు, అవుట్‌లుక్‌లు ఐటీ రంగం షేర్లను మరింత ఆకర్షణీయం చేశాయని బోత్రా తెలిపారు. అలాగే గత రెండేళ్ల నుంచి ఫార్మా షేర్లపై తాము సానుకూలంగానే ఉన్నామని తెలిపారు. ఫార్మా రంగంలో తమకు పెద్ద పొజిషన్లు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికీ తమ దృష్టి దేశీయ ఫార్మా కంపెనీల షేర్లపై ఉందని, ఈ సెక్టార్ నుండి డాక్టర్ రెడ్డీస్ షేరును సిఫార్సు చేస్తామని బోత్రా తెలిపారు. రూరల్ రికవరీ భేష్: దేశీయ ఆర్థిక వ్యవస్థనంతటికీ అవలోకనం చేస్తే..., వ్యవసాయ లేదా రూరల్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. అది ప్రభుత్వ ప్రకటించిన ఉద్దీపన చర్యలతో కావచ్చు.మెరుగైన వర్షపాతం నమోదు కావచ్చు రూరల్ వ్యవస్థ సవ్యంగా ఉంది. వలస కూలీలు కూడా తమ స్వస్థలాలైన గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఫలితంగా అక్కడ వినిమయ వ్యయాలు పెరుగుతున్నాయి. ఈ అంశాలన్నీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహాయం చేస్తున్నాయి. -
జోరుగా ఐటీ షేర్ల ర్యాలీ
మార్కెట్ ప్రారంభంలోనే ఐటీ రంగ షేర్లు అదరగొడుతున్నాయి. అన్ని రంగాలకు షేర్లలోకెల్లా ఐటీ రంగ షేర్లు అత్యధిక లాభాలను ఆర్జిస్తున్నాయి. ఫలితంగా ఎన్ఎస్ఈలో ఐటీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 3శాతానికి పైగా లాభపడింది. ఐటీ షేర్లలో అత్యధికంగా విప్రో షేరు 15శాతం లాభపడింది. అంచనాలకు మించి ఆర్థిక ఫలితాలను విడుదల చేయడం ఇందుకు కారణమైంది. ఇన్ఫోసిస్ షేరు 3శాతం ర్యాలీ చేసింది. నేడు మార్కెట్ ముగింపు తర్వాత క్యూ1 ఫలితాలను ప్రకటించనుంది. ఫలితాల అశించిన స్థాయిలో ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇదే ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా 3.50శాతం, ఎన్ఐఐటీ టెక్, నౌకరీడాట్‌కామ్, హెచ్‌సీఎల్‌టెక్, ఎల్‌అండ్‌టీఐ షేర్లు 3శాతం నుంచి 2శాతం పెరిగాయి. ఎమ్ఫసీస్, టీసీఎస్ షేర్లు 1.50శాతం నుంచి 1శాతం లాభపడ్డాయి. మరోవైపు ఒక్క మైండ్ ట్రీ షేరు మాత్రం అరశాతం నష్టాన్ని చవిచూసింది. -
సూచీలకు అండగా ఐటీ షేర్ల ర్యాలీ
పరిమిత శ్రేణి మార్కెట్లో మంగళవారం ఐటీ షేర్లు రాణిస్తున్నాయి. ఐటీ షేర్ల ర్యాలీ సూచీల పతనాన్ని అడ్డుకుంటుంది. డాలర్ మారకంలో రూపాయి బలహీనత ఇందుకు కారణవుతోంది. ఎన్ఎస్ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2శాతానికి పైగా లాభపడి 15801 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. పారెక్స్ మార్కెట్లో నేడు రూపాయి విలువ నిన్నటి ముగింపు(74.64)తో పోలిస్తే ఒక దశలో 18పైసలు బలహీపడింది. రూపాయి బలహీనతో డాలర్ మారకంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ కంపెనీలకు కలిసొచ్చే అంశమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కరోనా సంక్షోభం తర్వాత ఐటీ కంపెనీలు భారీగా కాంట్రాక్టులు దక్కించుకోవచ్చనే ఐటీ నిపుణుల అంచనాలు ఈరంగ షేర్లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఫలితంగా నేడు మార్కెట్ ప్రారంభంలోనే ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఉదయం 10గంటలకు ఇండెక్స్ మునుపటి ముగింపు(15464.95)తో పోలిస్తే 2శాతం లాభంతో 15,787 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ రంగానికి చెందిన ఎన్ఐఐటీ టెక్ షేరు 8.50శాతం పెరిగింది. ఇన్ఫోసిస్ 3శాతం లాభపడింది. నౌకరీ, మైండ్ ట్రీ, విప్రో, టెక్ మహీంద్రా షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఎల్అండ్టీ ఇండియా, ఎంఫసీస్ షేర్లు 1శాతం నుంచి అరశాతం లాభపడ్డాయి. -
చివరి నిమిషాల్లో అమ్మకాల తాకిడి
ముంబై : చివరి నిమిషాల ట్రేడింగ్‌లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో దలాల్ స్ట్రీట్ ఒడిదుడుకులకు లోనైంది. ప్రారంభం నుంచి ఆర్జించిన లాభాలను చివర్లో కోల్పోయింది. 100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ చివరికి ఫ్లాట్‌గా సెన్సెక్స్ 24.57 పాయింట్ల లాభంలో 31,795 వద్ద క్లోజైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ తన కీలకమైన మార్కు 9900ని నిలుపుకుని, 6.85 పాయింట్ల లాభంలో 9,904 వద్ద ముగిసింది. చివరి నిమిషాల్లో అమ్మకాలు నెలకొన్నప్పటికీ, వరుసగా మూడో రోజూ మార్కెట్లు లాభాల్లో ముగియడం గమనార్హం. ఈ పతనం బ్యాంకు, ఆటో, ఫార్మాస్యూటికల్స్, ఎఫ్ఎంసీజీ రంగాల స్టాక్స్‌లో నెలకొంది. ఐటీతో పాటు మిగతా రంగాల షేర్లు లాభాలను ఆర్జించాయి. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ శనివారం షేరు బైబ్యాక్‌పై ప్రకటన చేయనున్న నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో దూసుకుపోయాయి. ఉత్తర కొరియా, అమెరికాల మధ్య ఆందోళనకర పరిస్థితులు చల్లబడటంతో ఆసియన్ షేర్లూ పైకి ఎగిశాయి. రెండు సూచీల్లోనూ ఇన్ఫోసిస్, కోల్ ఇండియాలు టాప్ గెయినర్లుగా నిలవగా.. సిప్లా, కొటక్ మహింద్రా బ్యాంకు, ఏసీసీ నష్టాలు గడించాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు బలహీనపడి 64.14గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 189 రూపాయలు లాభపడి 29,141గా నమోదయ్యాయి. -
కొంప ముంచిన ఇన్ఫీ సీవోవో వ్యాఖ్యలు
ముంబై: ఇన్ఫోసిస్ సంచలన వ్యాఖ్యలతో మార్కెట్లో ఐటీ సెక్టార్ లో తీవ్ర అమ్మకాల వెల్లువ కొనసాగింది. ఇన్ఫీ టాప్ ఎగ్జిక్యూటివ్ చేసిన కమెంట్లు ఐటీ షేర్ల కొంపముంచాయి. ఇన్పీ సీవోవో ప్రవీణ్ రావు తమ ఖాతాదారుల ఐటీ వ్యయాలను తగ్గనున్నాయన్న వ్యాఖ్యలతో మార్కెట్లో ఐటీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ముఖ్యంగా నిన్నటి మార్కెట్ లో భారీ పుంజుకున్న ఐటీ దిగ్గజ షేర్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు తమ క్లయింట్స్ ఐటీ వ్యయాలను చూస్తున్నారంటూ మీడియాతో వ్యాఖ్యానించారు. తమ అంతర్జాతీయ ఖాతాదారులు బిల్లింగ్ రేటును దాదాపు 50శాతం తగ్గించాలని చూస్తున్నారన్నారు. ఇది 150 బిలియన్ డాలర్ల దేశీయ పరిశ్రమ ఆదాయంపై ప్రభావం చూపించనుందని చెప్పారు. దీంతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో దాదాపు అన్ని ఐటీ షేర్లలో భారీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. ఐటీ మేజర్లు ఇన్ఫీ, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ సహా ఇతర టెక్ షేర్లు భారీగా నష్టపోయాయి. అయితే అలాంటిదేమీ లేదని ఇన్ఫీ యాజమాన్యం వివరణ ఇచ్చినా ఫలితం లేకపోయింది. మిడ్‌సెషన్ తరువాత ప్రధానంగా ఆర్బీఐ పాలసీ ప్రకటన అనంతరం కొద్దిగా కోలుకున్నప్పటికీ నష్టాల్లోనే ముగిశాయి. అటు సీవోవో ప్రవీణ్‌రావు కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ప్రైస్‌కట్ గురించి తాను చెప్పలేదని, తప్పుగా అర్థం చేసుకున్నారని యుబి ప్రవీణ్ రావు వివరణ ఇచ్చారు. -
స్వల్పలాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై : దేశీయ బెంచ్ మార్కు సూచీలు గురువారం స్వల్పలాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 39.78 పాయింట్ల లాభంలో 28329.70వద్ద, నిఫ్టీ 9.35 పాయింట్ల లాభంలో 8778.40 వద్ద క్లోజ్ అయ్యాయి. టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహింద్రా, ఐటీసీ, మహింద్రా అండ్ మహింద్రా, భారతీ ఇన్ఫ్రాటెల్ 1-2 శాతం ర్యాలీ జరిపాయి. టాటా స్టీల్, సిప్లా, పీఎన్బీ, ఎల్ అండ్ టీ 1-3.5 శాతం నష్టాల పాలయ్యాయి. ఈ ఏడాది చివరి వరకు బుల్ కేసు సినారియోతో సెన్సెక్స్ 39వేల మార్కును టచ్ చేస్తుందని గ్లోబల్ బ్రేకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయం వ్యక్తంచేసింది. బేర్ కేసులో అయితే 24వేలుగా ఉంటుందని పేర్కొంది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ నేటి ట్రేడింగ్‌లో 0.18 పైసలు లాభపడి 67.01 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 31 రూపాయల లాభంతో 29,361గా ఉంది. -
ఫ్లాట్‌గా ట్రేడవుతున్న మార్కెట్లు
-
ఫ్లాట్‌గా ట్రేడవుతున్న మార్కెట్లు
ఫెడరల్ రిజర్వు ఫండ్ రేట్ల పెంపుతో తీవ్ర ఒడిదుడుకుల్లో నడిచి నష్టాల్లో ముగిసిన నిన్నటి స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో కోలుకున్నాయి. ఓ మోస్తారు లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రారంభంలో 65.17 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ క్రమంగా కొంత కిందకు జారుకుని ప్రస్తుతం 17.33 లాభంలో 26,536వద్ద నడుస్తోంది. నిఫ్టీ సైతం లాభనష్టాల ఊగిసలాటలో 8,152 వద్ద ట్రేడ్ అవుతోంది. టాటా మోటార్స్ నిఫ్టీలో టాప్ గెయినర్‌గా లాభాలు పండిస్తోంది. ఆ కంపెనీ షేరు 1.93 శాతం పెరిగి, రూ.472 వద్ద ట్రేడ్ అవుతోంది. టాటా మోటార్స్ అనంతరం టాటా మోటార్స్ డీవీర్, భారతీ ఇన్ఫ్రాటెల్, జీ కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయి. మరోవైపు అరబిందో ఫార్మా 3.4 శాతం క్షీణించి నిఫ్టీలో టాప్ లూజర్‌గా ఉంది. సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, మహింద్రా అండ్ మహింద్రా, ఆల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్ నష్టాల్లో నడుస్తున్నాయి. అన్ని రంగాల్లో ఐటీ, ఆటో రంగాలు స్టాక్స్ మార్కెట్లో లాభాలు పండిస్తున్నాయని విశ్లేషకులు చెప్పారు. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఆటో సబ్-ఇండెక్స్‌లు చెరో 0.4 శాతం చొప్పున ఎగిశాయి. -
ఐటీ షేర్ల దెబ్బకి మార్కెట్లు...
హెచ్1బీ వీసాలపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలకు ఐటీ షేర్లు బేజారన్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో ఐటీ దిగ్గజ కంపెనీలు కుప్పకూలాయి. ఐటీ కంపెనీ షేర్ల పతనంతో సోమవారం మార్కెట్లూ బలహీనంగానే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్ల నష్టంలో 26,600 వద్ద, నిఫ్టీ 51.35 పాయింట్ల నష్టంలో 8,210 వద్ద కొనసాగుతోంది. వీసా దుర్వినియోగాలకు సంబంధించి వచ్చిన అన్ని రకాల అభియోగాలపై తాను అధికారం చేపట్టిన అనంతరం విచారణ జరిపిస్తానని ట్రంప్ వెల్లడించారు. దీంతో ట్రంప్ పాలనలో భారతీయులు సహా విదేశీయుల కార్మిక వీసాలకు సంబంధించి కఠినమైన పరిశీలనను కంపెనీలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుందని ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐటీ దిగ్గజ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోల్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఐటీ కంపెనీల షేర్లతో పాటు యాక్సిస్ బ్యాంకు, ఏషియన్ పేయింట్స్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీలు సెన్సెక్స్‌లో నష్టాల్లోకి దిగజారాయి. దీంతో మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు క్రూడ్ ఉత్పత్తిలో కోతకు సంబంధించి ఒపెక్, నాన్ ఒపెక్ దేశాల మధ్య మేజర్ ఒప్పందం కుదరడంతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా ఎగిశాయి. ఎనర్జీ స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ టాప్ నిఫ్టీ గెయినర్‌గా లాభాలు పండిస్తోంది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.05 బలహీనంగా 67.41 వద్ద ట్రేడ్ అవుతోంది. -
లాభాల్లో ఐటీ జోరు
ముంబై: వరుస నష్టాలకు చెక్ పెట్టిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి. అటు నిన్న మొన్నటి వరకు నేల చూపులు చూసిన ఐటీ సెక్టార్ జోష్ గా ఉంది. కీలక మద్దతు స్థాయిలకు పైన స్థిరంగా కదులుతున్న మార్కెట్లలో మదుపర్లు ఐటీ రంగంలో కొనుగోళ్లకు దిగారు. దీంతో ఎన్ఎస్ఈలో ఈ రంగం ఏకంగా 4.4 శాతానికిపైగా లాభపడుతోంది. ఐటీ దిగ్గజ కంపెనీలు ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర షేర్లు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్ట వృద్ధిని అందుకోనున్న అంచనాలు ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్లకు కారణమవుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. డాలరుతో మారకంలో రూపాయి చరిత్రాత్మక కనిష్టాన్ని తాకడం, డాలర్ 14 నెలల గరిష్టాన్ని తాకడం ప్రభావితం చేసిందని చెబుతున్నారు. ఇన్ఫోసిస్ 5.41 శాతం. టీసీఎస్ 4.46 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 5.2 శాతం, టెక్ మహీంద్రా4.71 శాతం, కేపీఐటీ టెక్నాలజీస్ 4.27 శాతం చొప్పున దూసుకెళ్లాయి. ఈ బాటలో మైండ్ ట్రీ, ఒరాకిల్ , విప్రో, టాటా ఎలక్సీ సైతం 3.7-2 శాతం లాభాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. కాగా ఆరంభంలోనే లాభాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు అదే జోరును కొనసాగిస్తున్నాయి. 26,119 259 పాయింట్లలాభంతో సెన్సెక్స్ వద్ద, నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 8,059 వద్ద పాజిటివ్ గా ఉన్నాయి. అటు రూపాయి కూడా నిన్నటి నష్టాలనుంచి కోలుకుని 68.46 వద్ద, ఎంసీఎక్స్ మార్కెట్ లో బంగారం ధరలు పది గ్రా. 308 రూపాయల నష్టంతో రూ. 28,438 వద్ద కొనసాగుతున్నాయి. -
భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల క్షీణతతో దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్224 పాయింట్ల నష్టంతో 27,835 దగ్గర నిఫ్టీ 58 పాయింట్ల నష్టంతో 8,592 వద్ద ముగిశాయి. ప్రారంభంనుంచి ఓలటైల్ గా ఉన్న మార్కెట్ లో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందు కోవడంతో నష్టాల బాట పట్టాయి. ఐటీ, మెటల్ రంగాల్లో అమ్మకాలు మార్కెట్ ను నష్టాల్లోకి నెట్టాయి. బీఎస్ఈ లో దాదాపు పదిహేనువందల స్టాక్స్ నెగిటివ్ లో ఉండగా, మరోవెయ్యికి పైగా లాభాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈలో ఎఫ్ఎంసీజీ మినహా మిగిలిన అన్ని రంగాలూ నష్టపోయాయి. ప్రధానంగా ఐటీ, మెటల్స్, పీఎస్‌యూ బ్యాంకింగ్ సెక్టార్లు నష్టపోయాయి. ఇన్ఫోసిస్, హెచ్ డీ ఎఫ్ సీ భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. దీంతో సాంకేతికంగా కీలకమైన సెన్సెక్స్ 28వేలు, నిప్టీ 86 వందలకు దిగువన ముగిశాయి. దీనికితోడు ఆగస్ట్ సిరీస్ డెరివేటివ్స్ ముగింపు తో మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అటు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 0.07 పైసల నష్టంతో 67.03 దగ్గర ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో 10 గ్రా.పుత్తడి 31 వేలకు దిగువకు చేరింది. రూ. 81 నష్టంతో రూ. 30,0965 దగ్గర ఉంది. -
తీవ్ర ఒడిదుడుకుల మధ్య ముగిసిన మార్కెట్లు
ముంబై: ఫ్లాట్ గా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా తీవ్ర ఊగిసలాటల మధ్య కదలాడాయి. చివరికి భారీ ఒడిదుడుకుల మధ్య సెన్సెక్స్ 59 పాయింట్ల నష్టంతో 28,005 దగ్గర, నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 8,624 వద్ద ముగిశాయి. స్వల్ప నష్టాలతో మొదలైన మార్కెట్లు వెంటనే నామమాత్ర లాభాల్లోకి అనంతరం 100 పాయింట్లకు పైగా లాభపడింది. కానీ ముగింపులో అమ్మకాల ఒత్తిడితో సూచీలన్నీ నష్టాల బాటపట్టాయి. మెటల్స్, ఆటో రంగాలు టాప్ లో ఉండగా ఐటీ రంగంలో వరుసగా మూడో రోజు కూడా అమ్మకాల జోరు కొనసాగింది. పవర్ సెక్టార్ అమ్మకాలు వెల్లువెత్తాయి. నిఫ్టీ దిగ్గజాలలో హీరోమోటో, యాక్సిస్, భారతీ, గ్రాసిమ్, టాటా స్టీల్ లాభపడగా, టీసీఎస్ సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, సిప్లా, కొటక్ బ్యాంక్ క్షీణించాయి. అయితే 8300 -8400 లెవల్స్ కు కరెక్షన్ వచ్చే అవకాశం ఉందని, అయితే ఇన్వెస్టర్లు నిఫ్టీలో అమ్మకాల వైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ నిపుణుడు జై బాలా సూచించారు. అటు ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి బలహీనంగా ఉంది. పది గ్రాముల పసిడి రూ. 132 ల నష్టంతో 31,335 వద్ద ఉంది. -
ఐటీ రంగాన్ని ముంచేసిన బ్రెగ్జిట్
ముంబై: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ఐటి షేర్లను తీవ్ర నష్టాల్టోకి నెట్టేసింది. డాలర్ కు వ్యతిరేకంగా బ్రిటిష్ పౌండ్ విలువ భారీగా పతనంకావడంతో శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఐటి ఇండెక్స్ 4 శాతానికి పైగా నష్టపోయింది. అయితే ఈ ప్రభావం స్వల్ప కాలం మాత్రమేని ఐటి నిపుణులు వ్యాఖ్యానించారు. టెక్ మహీంద్రా దాదాపు 7 శాతం, హెచ్ సీఎల్ టెక్ ఎక్కువ 6 శాతం క్షీణించగా, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో 3 నుంచి 6 శాతం మేర పతనమయ్యాయి. అలాగే యూకే నుంచి టీసీఎస్ 13 శాతం, హెచ్ సీఎల్ టెక్ 14 శాతం భారీ ఆదాయాన్ని పొందుతుండగా, ఇన్ఫోసిస్ , విప్రో లు కూడా దాదాపు 7 నుంచి11 శాతం ఆదాయాన్ని పౌండ్లలో పొందుతున్నాయని విశ్లేషకులు చెప్పారు. బ్రెగ్జిట్ నిర్ణయం మూలంగా పౌండ్ విలువ 31 సంవత్సరాల కనిష్ఠానికి కూలిపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుందని తెలిపారు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఈయూ) వైదొలగుతున్న ప్రభావం ఐటి పరిశ్రమ పై స్వల్పకాలికమేనని పరిశ్రమ పెద్దలు అభిప్రాయ పడ్డారు. ఈ అనిశ్చిత వాతావరణంలో భారీ హెచ్చుతగ్గులు, ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు. బ్రెగ్జిట్ ప్రభావంతో మారకపు అనిశ్చితి కారణంగా ప్రతికూల ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు. కాగా బ్రిటన్ గురువారం జరిగిన ఒక చరిత్రాత్మక ప్రజాభిప్రాయ సేకరణలో 43 సంవత్సరాల తర్వాత ఈయూని వీడింది. ఈ పరిణామాల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: గురువారం నాటి దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆర్బీయై ప్రకటనతో జోరుమీదున్న మార్కెట్లు గురువారం కూడా తమ జోరును కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 228 పాయింట్ల లాభంతో 26,383 దగ్గర, నిఫ్టీ 49 పాయింట్ల లాభంతో 7,997 దగ్గర ట్రేడవుతున్నాయి. ఒకవైపు గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్, మరోవైపు ఐటి షేర్లలోలాభాలు మార్కెట్ లీడ్ చేస్తున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ ఎనిమిది వేల మార్కు ను టచ్ చేయడం సెంటిమెంట్‌ను బలపరుస్తోందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. అటు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయ లాభాల్లో కొనసాగుతోంది. 9 పైసలు లాభపడి 65.49 దగ్గర ట్రేడవుతోంది. -
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమై భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 250 పాయింట్లు పతనమై 26,802 వద్ద ముగిసింది. ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభంకాగానే సెన్సెక్స్185 పాయింట్లు క్షీణించి 27 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఆ తర్వాత మరింత పతనమైంది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 63 పాయింట్ల క్షీణించి 8,042 వద్ద ముగిసింది. మెటల్, ఎఫ్ఎమ్ జీసీ, పవర్ కేపిటల్ గూడ్స్, ఐటీ షేర్లు నష్టాలు బాట పట్టడంతో మార్కెట్ అధోముఖంగా పయనించింది. -
27 వేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభంకాగానే బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 185 పాయింట్లు పతనమయి 27 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. 26,875 పాయింట్లకు పతనమైంది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 70 పాయింట్లు క్షీణించి 8,100 పాయింట్లకు దిగువన కదలాడుతోంది. మెటల్, ఎఫ్ఎమ్ జీసీ, పవర్ కేపిటల్ గూడ్స్, ఐటీ షేర్లు నష్టాలు బాట పట్టడంతో మార్కెట్ అధోముఖంగా పయనిస్తోంది. టాటా స్టీల్, సెసా స్టెరలైట్, హిందాల్కో వాటాలు బాగా నష్టపోయాయి. -
విదేశీ అంశాల దెబ్బ
అంతర్జాతీయ అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. క్యూ2 జీడీపీ క్షీణించడం ద్వారా ఇటలీ మాంద్యంలోకి జారుకోగా, జర్మనీ తయారీ రంగం బలహీనపడింది. మరోవైపు ఉక్రెయిన్-రష్యాల మధ్య ఆందోళనలు మళ్లీ పెరగడంతో ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టపోయాయి. వెరసి దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడ్డారు. తొలి నుంచీ నష్టాలలో కదిలిన సెన్సెక్స్ మిడ్ సెషన్ నుంచీ మరింత బలహీనపడింది. చివరి గంటలో పెరిగిన అమ్మకాలతో 243 పాయింట్లు నష్టపోయింది. 25,665 వద్ద ముగిసింది. దీంతో గత రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ రెండు రోజుల్లో 427 పాయింట్లు పుంజుకున్న సంగతి తెలిసిందే. ఇక నిఫ్టీ కూడా 75 పాయింట్లు పతనమై 7,672 వద్ద నిలిచింది. విదేశీ అంశాలకుతోడు డాలరుతో మారకంలో రూపాయి 5 నెలల కనిష్టానికి పడటం కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని నిపుణులు పేర్కొన్నారు. రూపాయి 65 పైసలు కోల్పోయి 61.50కు చేరింది. ఇన్ఫోసిస్ అండ మిగులు నిధులతో షేర్ల బైబ్యాక్ చేపట్టాలని కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు కోరిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ మరో 2% ఎగసింది. ఈ బాటలో భెల్, ఎంఅండ్ఎం కూడా నిలిచాయి. -
మరో 149 పాయింట్లు డౌన్
వరుసగా రెండో రోజూ మార్కెట్లు నష్టపోయాయి. గత నెల రోజుల్లోలేని విధంగా సెన్సెక్స్ 149 పాయింట్లు క్షీణించి 22,359 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 42 పాయింట్లు తగ్గి 6,694 వద్ద స్థిరపడింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపడుతుండటంతో సెంటిమెంట్ బలహీనపడుతున్నదని నిపుణులు తెలిపారు. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 42, నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోవడంతో పది రోజుల మార్కెట్ ర్యాలీకి తొలిసారి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. శుక్రవారం ట్రేడింగ్‌లో దేశీ సంస్థల భారీ అమ్మకాలు కూడా మార్కెట్లను పడగొట్టాయి. ఎఫ్ఐఐలు రూ. 232 కోట్లు ఇన్వెస్ట్‌చేసినప్పటికీ, దేశీ ఫండ్స్ రూ. 1,125 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. అంతర్గత సమస్యల కారణంగానే దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) పేర్కొనడం కూడా ఇన్వెస్టర్ల అమ్మకాలకు కారణమైనట్లు నిపుణులు తెలిపారు. కాగా, సెన్సెక్స్ గరిష్టంగా 22,522, కనిష్టంగా 22,339 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. హెచ్‌డీఐఎల్ హైజంప్ బీఎస్ఈలో ప్రధానంగా ఆటో, ఐటీ రంగాలు 1% డీలాపడగా, రియల్టీ ఇండెక్స్ 3.4% ఎగసింది. మార్కెట్లకు విరుద్ధమైన రీతిలో రియల్టీ షేర్లలో హెచ్‌డీఐఎల్ 16%పైగా దూసుకెళ్లగా, కోల్టేపాటిల్, ఇండియాబుల్స్, యూనిటెక్, డీబీ, ప్రెస్జీజ్, డీఎల్ఎఫ్, అనంత్‌రాజ్ 10-2.5% మధ్య జంప్‌చేయడం విశేషం. ఆ ఐదు మినహా సెన్సెక్స్-30లో ఐదు షేర్లు మినహా మిగిలినవన్నీ నీర సించడం గమనార్హం. సిప్లా 2% పుంజుకోగా, టాటా స్టీల్, ఎస్బీఐ, హిందాల్కో, కోల్ ఇండియా 0.5% స్థాయిలో బలపడ్డాయి. అయితే మరోవైపు భెల్, ఎన్టీపీసీ, భారతీ, టాటా మోటార్స్, గెయిల్, విప్రో, టీసీఎస్, సన్ ఫార్మా, ఎల్ అండ్ టీ తదితర దిగ్గజాలు 2-1% మధ్య నష్టపోవడంతో మార్కెట్లు నీరసించాయి. కాగా, మిడ్ క్యాప్స్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి కొనసాగింది. దీంతో ట్రేడైన షేర్లలో 1,648 లాభపడితే, కేవలం 1,135 నష్టపోయాయి. చిన్న షేర్లలో వీనస్ రెమిడీస్ 20% దూసుకెళ్లగా, ఎంఎంటీసీ, సుజ్లాన్, బీఈఎంఎల్, బజాజ్ హిందుస్తాన్, ఎల్డర్ ఫార్మా, యూఫ్లెక్స్, ఎస్టీసీ తదితరాలు 11-8% మధ్య జంప్‌చేశాయి. ఈటీఎఫ్ లిస్టింగ్ జోరు ప్రభుత్వ సంస్థల వాటాలతో కూర్చిన సీపీఎస్ఈ ఈటీఎఫ్ లిస్టింగ్ తొలిరోజు జోరు చూపింది. ఇష్యూ ధర రూ. 17.45కాగా, 11% ఎగసి రూ. 19.40 వద్ద ముగిసింది. 8 కోట్ల షేర్లకుపైగా లావాదేవీలు జరిగాయి. ఓఎన్జీసీ, గెయిల్, కోల్ ఇండియా, ఆర్ఈసీ, కంటెయినర్ కార్పొరేషన్ తదితర పది పీఎస్‌యూ షేర్లతో ఈటీఎఫ్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. -
ఒడిదుడుకుల మధ్య లాభాలు
వారాంతం రోజున ఒడిదుడుకుల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు పెరిగి 20,758 వద్ద ముగియగా, నిఫ్టీ 3 పాయింట్లు మాత్రమే జమ చేసుకుని 6,171 వద్ద స్థిరపడింది. క్యూ3లో పనితీరుతోపాటు, ప్రోత్సాహకర ఆదాయ అంచనాలను ప్రకటించిన ఇన్ఫోసిస్ సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. దీంతో ఒక దశలో సెన్సెక్స్ 258 పాయింట్లు ఎగసి 20,971ను తాకింది. అయితే డిసెంబర్ నెల ఎగుమతుల గణాంకాలు నిరుత్సాహపరచడంతో మిడ్ సెషన్లో అమ్మకాలు మొదలయ్యాయి. వెరసి సెన్సెక్స్ లాభాలు అడుగంటాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ 2.8-1.7% మధ్య పుంజుకోవడంతో ఐటీ ఇండెక్స్ 2% పురోగమించింది. ఐటీసీ 2.2% ఎగసింది. కాగా, ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ 2.7-1.6% మధ్య నష్టపోవడంతో బ్యాంకెక్స్ 1.5% డీలాపడింది. ఎఫ్ఐఐలు రూ. 68 కోట్లు, దేశీయ ఫండ్స్ రూ. 82 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌చేశాయి. నిఫ్టీ ఫ్యూచర్లో బుల్ ఆఫ్‌లోడింగ్.: నిఫ్టీ ఫ్యూచర్లో బుల్స్ వారి లాంగ్ పొజిషన్లను క్రమేపీ ఆఫ్‌లోడ్ చేస్తున్నట్లు డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. ఫలితంగా ఈ నెల ప్రారంభం నుంచి నిఫ్టీ ఫ్యూచర్ నుంచి ఇప్పటివరకూ 28 లక్షల షేర్లు కట్ అయ్యాయి. నెలారంభంలో 1.98 కోట్ల షేర్లవరకూ వున్న ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) తాజాగా 1.70 కోట్ల షేర్లకు పడిపోయింది. లాంగ్ ఆఫ్‌లోడింగ్‌ను సూచిస్తూ స్పాట్‌తో పోలిస్తే నిఫ్టీ ప్రీమియం 57 పాయింట్ల నుంచి 7 పాయింట్లకు పడిపోయింది. శుక్రవారంనాటి ట్రేడింగ్‌లో ఈ ప్రక్రియ మరింత స్పష్టంగా కనపడింది. ఇన్ఫోసిస్ ఫలితాల సందర్భంగా స్పాట్ నిఫ్టీ 6,239 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగినపుడు 20 పాయింట్లు వున్న ప్రీమియం కాస్తా ముగింపు సమయంలో 7 పాయింట్లకు తగ్గిపోయింది. ఐటీ, ఆయిల్, బ్యాంకింగ్ స్టాక్ ఫ్యూచర్లతో సహా ప్రధాన స్టాక్ ఫ్యూచర్ల ప్రీమియంలు పడిపోవడంతో సహజంగానే నిఫ్టీ ప్రీమియం కూడా తగ్గింది. పీఎస్‌యూ షేర్లు కోల్ ఇండియా, బీహెచ్ఈఎల్లు త్వరలో డివిడెండు ప్రకటించే అవకాశం వున్నందున, స్పాట్ ధరతో పోలిస్తే ఆ ఫ్యూచర్లు రూ. 14, రూ. 4 చొప్పున డిస్కౌంట్‌తో ట్రేడ్‌కావడం నిఫ్టీ ప్రీమియం క్రాష్‌కు కారణం. -
రియల్టీ, మెటల్ ర్యాలీ
అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా వున్నా, దేశీయ స్టాక్ సూచీలు సోమవారం స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ట్రేడింగ్ తొలిదశలో 21,207 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన సెన్సెక్స్ చివరకు 21 పాయింట్ల లాభంతో 21.101 పాయింట్ల వద్ద ముగిసింది. 6,317-6,266 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 6,284 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. కొద్ది రోజుల నుంచి స్తబ్దుగా వున్న రియల్టీ, మెటల్ షేర్లు మాత్రం జోరుగా పెరిగాయి. డీఎల్ఎఫ్, జేపీ అసోసియేట్స్ 3-5.5% మధ్య ర్యాలీ జరపగా, టాటా స్టీల్, జిందాల్ స్టీల్, హిందాల్కో 3-5% మధ్య ఎగిసాయి. బ్యాంకింగ్ షేర్లు ఐసీఐసీఐ, యాక్సిస్, పీఎన్బీ 1-2% మధ్య పెరగ్గా, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ 2% క్షీణించింది. ఎఫ్ఐఐలు రూ. 135 కోట్ల పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 38 కోట్ల నికర కొనుగోళ్లు జరిపాయి. నిఫ్టీలో లాంగ్ రోలోవర్స్ : డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో జనవరి నెలకు సోమవారం నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టుల లాంగ్ రోలోవర్స్ జోరుగా జరిగినట్లు తాజా డేటా వెల్లడిస్తున్నది. జనవరి నెలకు ఇన్వెస్టర్ల బుల్లిష్ ధోరణిని సూచిస్తూ జనవరి నిఫ్టీ ఫ్యూచర్ ప్రీమియం స్పాట్ ధరతో పోలిస్తే 76 పాయింట్లకు పెరిగిపోయింది. స్పాట్ నిఫ్టీ 6,284 వద్ద ముగియగా, జనవరి నిఫ్టీ ఫ్యూచర్ 6,360 వద్ద క్లోజయ్యింది. డెరివేటివ్ సిరీస్ ముగింపు మరో రెండు రోజులుందనగా, మరుసటి నెల ఫ్యూచర్ ప్రీమియం ఇంత భారీ స్థాయిలో పెరగడం అరుదు. అలాగే జనవరి నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టుల ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో తాజాగా 52.48 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. దాంతో మొత్తం ఓఐ 1.32 కోట్ల షేర్లకు చేరింది. డిసెంబర్ సిరీస్ ప్రారంభానికి రెండు రోజుల ముందు...అంటే నవంబర్ 26న డిసెంబర్ నిఫ్టీ ప్రీమియం 59 పాయింట్లే వుంది. ఆ రోజున నిఫ్టీ ఓఐ 1.14 కోట్ల షేర్లే. డిసెంబర్ సిరీస్ ముగింపు దగ్గరపడుతున్నా, ఈ నెల ఫ్యూచర్ ప్రీమియం కూడా స్వల్పంగా 17 పాయింట్ల నుంచి 18 పాయింట్లకు (6,302) పెరిగింది. డిసెంబర్ నిఫ్టీ 6,300 స్ట్రయిక్ కాల్ ఆప్షన్ నుంచి 4.76 లక్షల షేర్లు (7.34 శాతం) కట్‌కాగా, ఇదే స్ట్రయిక్ పుట్ ఆప్షన్లో 7.60 లక్షల షేర్లు (19.18 శాతం) యాడ్ అయ్యాయి. సూచీ లేదా షేరు మరింత పెరగవచ్చన్న అంచనాలతో కొనుగోలుచేసే ఫ్యూచర్ కాంట్రాక్టును లాంగ్ పొజిషన్గా వ్యవహరిస్తారు.