మార్కెట్ ప్రారంభంలోనే ఐటీ రంగ షేర్లు అదరగొడుతున్నాయి. అన్ని రంగాలకు షేర్లలోకెల్లా ఐటీ రంగ షేర్లు అత్యధిక లాభాలను ఆర్జిస్తున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ఐటీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 3శాతానికి పైగా లాభపడింది. ఐటీ షేర్లలో అత్యధికంగా విప్రో షేరు 15శాతం లాభపడింది. అంచనాలకు మించి ఆర్థిక ఫలితాలను విడుదల చేయడం ఇందుకు కారణమైంది. ఇన్ఫోసిస్ షేరు 3శాతం ర్యాలీ చేసింది. నేడు మార్కెట్ ముగింపు తర్వాత క్యూ1 ఫలితాలను ప్రకటించనుంది. ఫలితాల అశించిన స్థాయిలో ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇదే ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా 3.50శాతం, ఎన్‌ఐఐటీ టెక్, నౌకరీడాట్‌కామ్, హెచ్‌సీఎల్‌టెక్, ఎల్‌అండ్‌టీఐ షేర్లు 3శాతం నుంచి 2శాతం పెరిగాయి. ఎమ్‌ఫసీస్, టీసీఎస్ షేర్లు 1.50శాతం నుంచి 1శాతం లాభపడ్డాయి. మరోవైపు ఒక్క మైండ్ ట్రీ షేరు మాత్రం అరశాతం నష్టాన్ని చవిచూసింది.
Comments
Please login to add a commentAdd a comment