Q1 earnings
-
అదానీ పవర్‌కు లాభాలే లాభాలు
న్యూఢిల్లీ: అదానీ పవర్ మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికి రూ.5,242 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,645 కోట్లతో పోలిస్తే 13 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.13,307 కోట్లతో పోలిస్తే 19 శాతం క్షీణించి రూ.10,795 కోట్లకు పరిమితమైంది. లాభం వృద్ధి చెందడానికి రుణ వ్యయాలు తగ్గడం, సబ్సిడరీల విలీనం కలిసొచ్చినట్టు అదానీ పవర్ లిమిటెడ్ తెలిపింది. మొత్తం వ్యయాలు మార్చి త్రైమాసికంలో 30 శాతానికి పైగా పెరిగి రూ.9,897 కోట్లకు పెరిగింది. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్ నికర లాభం 118 శాతం పెరిగి రూ.10727 కోట్లకు చేరుకుంది. ఆదాయం రూ.14,312 కోట్లుగా నమోదైంది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.4,912 కోట్లు, ఆదాయం రూ.13,789 కోట్ల చొప్పున ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో 52 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ను చేరుకుంది. అదానీ పవర్‌కు 14,410 మెగావాట్ల స్థాపిత థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం ఉంది. -
జోరుగా ఐటీ షేర్ల ర్యాలీ
మార్కెట్ ప్రారంభంలోనే ఐటీ రంగ షేర్లు అదరగొడుతున్నాయి. అన్ని రంగాలకు షేర్లలోకెల్లా ఐటీ రంగ షేర్లు అత్యధిక లాభాలను ఆర్జిస్తున్నాయి. ఫలితంగా ఎన్ఎస్ఈలో ఐటీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 3శాతానికి పైగా లాభపడింది. ఐటీ షేర్లలో అత్యధికంగా విప్రో షేరు 15శాతం లాభపడింది. అంచనాలకు మించి ఆర్థిక ఫలితాలను విడుదల చేయడం ఇందుకు కారణమైంది. ఇన్ఫోసిస్ షేరు 3శాతం ర్యాలీ చేసింది. నేడు మార్కెట్ ముగింపు తర్వాత క్యూ1 ఫలితాలను ప్రకటించనుంది. ఫలితాల అశించిన స్థాయిలో ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇదే ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా 3.50శాతం, ఎన్ఐఐటీ టెక్, నౌకరీడాట్‌కామ్, హెచ్‌సీఎల్‌టెక్, ఎల్‌అండ్‌టీఐ షేర్లు 3శాతం నుంచి 2శాతం పెరిగాయి. ఎమ్ఫసీస్, టీసీఎస్ షేర్లు 1.50శాతం నుంచి 1శాతం లాభపడ్డాయి. మరోవైపు ఒక్క మైండ్ ట్రీ షేరు మాత్రం అరశాతం నష్టాన్ని చవిచూసింది. -
అంచనాలు మిస్ చేసిన మారుతి
ముంబై: ఆటో మేజర్ మారుతి సుజుకి క్యూ1 ఫలితాల్లో అంచనాలను కొద్దిలో మిస్ అయింది. గురువారం ప్రకటించిన జూన్ త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలు 4.4 శాతం ఎగిసి రూ.1556 కోట్లను నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.1,486 కోట్టుగా సాధించగా, 1669కోట్లు ఆర్జిస్తుందని అంచనా వేశారు. జీఎస్టీ ఎఫెక్ట్, డీలర్లకు చెల్లించిన పరిహారం ఫలితాలను ప్రభావితం చేసినట్టు ఎనలిస్టులు భావిస్తున్నారు. లాభాల్లో అంచనాలను మిస్ చేసిన ఆదాయంలో మాత్రం అంచనాలను అధిగమించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే ఆదాయం 16.4శాతం ఎగిసి రూ. 19, 777కోట్లు గా ఉంది. 17, 449కోట్లగా ఉంటుందని ఎనలిస్టుల అంచనా. ఎబిటా మార్జిన్లు 13.3శాతంతో రూ. 2331 కోట్లుగా ఉన్నాయి. ఇతర ఆదాయాలు రూ.682 కోట్లుగా ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ ఇది రూ. 488 గా ఉంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై : స్వల్పలాభాలతో ప్రారంభమైన గురువారం నాటి స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే నాటికి నష్టాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 205.37 పాయింట్ల నష్టంతో 27,710 వద్ద, నిఫ్టీ 55.75 పాయింట్ల నష్టంతో 8,510 దగ్గర ముగిసింది. అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, ఏషియన్ పేయింట్స్, విప్రో టాప్ గెయినర్లుగా లాభాలు పండించగా.. యాక్సిస్ బ్యాంకు, బీహెచ్ఈఎల్, ఐసీఐసీఐ, ఎస్ బీఐ, ఎమ్ అడ్ ఎమ్ టాప్ లూజర్లుగా నష్టాల్లో గడించాయి. కంపెనీలు ప్రకటిస్తున్న నిరాశజనకమైన తొలి త్రైమాసిక ఫలితాలు, బ్యాంకు స్టాక్స్ లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి, స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదుచేశాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్యాంకు నిఫ్టీ దాదాపు 1.5శాతం మేర నష్టపోయింది. యాక్సిస్ బ్యాంకు, ఎస్ బీఐలు 3-4శాతం మేర నష్టపోయాయి. మరోవైపు జూన్ క్వార్టర్ ఫలితాల ప్రకటన అనంతరం హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కూడా 1శాతం మేర నష్టపోయింది. లాభాల్లో అదరగొట్టినప్పటికీ, బ్యాంకుకు ఉన్న మొండిబకాయిల బెడదతో షేర్లు పతనమయ్యాయి. కాగా, మార్కెట్ వాల్యుయేషన్ లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీలు నేటి మార్నింగ్ ట్రేడింగ్ లో ఆల్ టైమ్ గరిష్టస్థాయికి చేరింది. రూ.107 లక్షల కోట్లగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ నమోదైంది. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 67.19గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో భారీగా నష్టోయిన పుత్తడి కొంత కోలుకొని, రూ.97 లాభంతో రూ.30,834గా నమోదైంది.