ముంబై: ఆటో మేజర్ మారుతి సుజుకి క్యూ1 ఫలితాల్లో అంచనాలను కొద్దిలో మిస్ అయింది. గురువారం ప్రకటించిన జూన్ త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలు 4.4 శాతం ఎగిసి రూ.1556 కోట్లను నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ.1,486 కోట్టుగా సాధించగా, 1669కోట్లు ఆర్జిస్తుందని అంచనా వేశారు. జీఎస్‌టీ ఎఫెక్ట్, డీలర్లకు చెల్లించిన పరిహారం ఫలితాలను ప్రభావితం చేసినట్టు ఎనలిస్టులు భావిస్తున్నారు.
లాభాల్లో అంచనాలను మిస్ చేసిన ఆదాయంలో మాత్రం అంచనాలను అధిగమించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే ఆదాయం 16.4శాతం ఎగిసి రూ. 19, 777కోట్లు గా ఉంది. 17, 449కోట్లగా ఉంటుందని ఎనలిస్టుల అంచనా. ఎబిటా మార్జిన్లు 13.3శాతంతో రూ. 2331 కోట్లుగా ఉన్నాయి. ఇతర ఆదాయాలు రూ.682 కోట్లుగా ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ ఇది రూ. 488 గా ఉంది.
అంచనాలు మిస్ చేసిన మారుతి
Published Thu, Jul 27 2017 1:50 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 PM
Advertisement