మారుతీ సుజుకీ (Maruti Suzuki) కొత్త ఏడాది జనవరిలో మొత్తం 2,12,251 వాహనాలు విక్రయించింది. గడిచిన ఏడాది ఇదే జనవరి అమ్మకాలు 1,99,364 యూనిట్లతో పోలిస్తే ఇవి 6% అధికం. ఇందులో దేశీయ ప్రయాణికుల వాహన అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 1,66,802 యూనిట్ల నుంచి 1,73,599 యూనిట్లకు చేరాయి.
విదేశాలకు ఎగుమతులు 23,921 యూనిట్లకు 27,100 యూనిట్లకు ఎగిశాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహన విక్రయాలు 3% తగ్గి 57,115 వాహనాలకు చేరాయి. ఇందులో దేశీయంగా 54,003 వాహన అమ్మకాలు జరగ్గా.., విదేశాలకు ఎగుమతులు 11,600 యూనిట్లుగా ఉన్నాయి. కాగా 2024 జనవరిలో 67,615 యూనిట్ల విక్రయాలు అమ్ముడయ్యాయి.
టాటా మోటార్స్ అమ్మకాలు 86,125 యూనిట్ల నుంచి 80,304 యూనిట్లకు పరిమితమయ్యాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాలు 24,609 నుంచి 19% పెరిగి 29,371కు చేరాయి. మహీంద్రాఅండ్‌మహీంద్రా విక్రయాలు 16% పెరిగి 85,432 యూనిట్లకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment