ఫ్లాట్గా ట్రేడవుతున్న మార్కెట్లు
Published Fri, Dec 16 2016 10:01 AM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM
ఫెడరల్ రిజర్వు ఫండ్ రేట్ల పెంపుతో తీవ్ర ఒడిదుడుకుల్లో నడిచి నష్టాల్లో ముగిసిన నిన్నటి స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో కోలుకున్నాయి. ఓ మోస్తారు లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రారంభంలో 65.17 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ క్రమంగా కొంత కిందకు జారుకుని ప్రస్తుతం 17.33 లాభంలో 26,536వద్ద నడుస్తోంది. నిఫ్టీ సైతం లాభనష్టాల ఊగిసలాటలో 8,152 వద్ద ట్రేడ్ అవుతోంది. టాటా మోటార్స్ నిఫ్టీలో టాప్ గెయినర్గా లాభాలు పండిస్తోంది. ఆ కంపెనీ షేరు 1.93 శాతం పెరిగి, రూ.472 వద్ద ట్రేడ్ అవుతోంది.
టాటా మోటార్స్ అనంతరం టాటా మోటార్స్ డీవీర్, భారతీ ఇన్ఫ్రాటెల్, జీ కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయి. మరోవైపు అరబిందో ఫార్మా 3.4 శాతం క్షీణించి నిఫ్టీలో టాప్ లూజర్గా ఉంది. సన్ఫార్మా, హెచ్సీఎల్ టెక్, మహింద్రా అండ్ మహింద్రా, ఆల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్ నష్టాల్లో నడుస్తున్నాయి. అన్ని రంగాల్లో ఐటీ, ఆటో రంగాలు స్టాక్స్ మార్కెట్లో లాభాలు పండిస్తున్నాయని విశ్లేషకులు చెప్పారు. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఆటో సబ్-ఇండెక్స్లు చెరో 0.4 శాతం చొప్పున ఎగిశాయి.
Advertisement
Advertisement