లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
ముంబై: గురువారం నాటి దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆర్బీయై ప్రకటనతో జోరుమీదున్న మార్కెట్లు గురువారం కూడా తమ జోరును కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 228 పాయింట్ల లాభంతో 26,383 దగ్గర, నిఫ్టీ 49 పాయింట్ల లాభంతో 7,997 దగ్గర ట్రేడవుతున్నాయి. ఒకవైపు గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్, మరోవైపు ఐటి షేర్లలోలాభాలు మార్కెట్ లీడ్ చేస్తున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ ఎనిమిది వేల మార్కు ను టచ్ చేయడం సెంటిమెంట్ను బలపరుస్తోందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.
అటు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయ లాభాల్లో కొనసాగుతోంది. 9 పైసలు లాభపడి 65.49 దగ్గర ట్రేడవుతోంది.