27 వేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభంకాగానే బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 185 పాయింట్లు పతనమయి 27 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. 26,875 పాయింట్లకు పతనమైంది.
ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 70 పాయింట్లు క్షీణించి 8,100 పాయింట్లకు దిగువన కదలాడుతోంది. మెటల్, ఎఫ్ఎమ్ జీసీ, పవర్ కేపిటల్ గూడ్స్, ఐటీ షేర్లు నష్టాలు బాట పట్టడంతో మార్కెట్ అధోముఖంగా పయనిస్తోంది. టాటా స్టీల్, సెసా స్టెరలైట్, హిందాల్కో వాటాలు బాగా నష్టపోయాయి.