ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల క్షీణతతో దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్224 పాయింట్ల నష్టంతో 27,835 దగ్గర నిఫ్టీ 58 పాయింట్ల నష్టంతో 8,592 వద్ద ముగిశాయి. ప్రారంభంనుంచి ఓలటైల్ గా ఉన్న మార్కెట్ లో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందు కోవడంతో నష్టాల బాట పట్టాయి. ఐటీ, మెటల్ రంగాల్లో అమ్మకాలు మార్కెట్ ను నష్టాల్లోకి నెట్టాయి. బీఎస్ఈ లో దాదాపు పదిహేనువందల స్టాక్స్ నెగిటివ్ లో ఉండగా, మరోవెయ్యికి పైగా లాభాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ మినహా మిగిలిన అన్ని రంగాలూ నష్టపోయాయి. ప్రధానంగా ఐటీ, మెటల్స్, పీఎస్‌యూ బ్యాంకింగ్ సెక్టార్లు నష్టపోయాయి. ఇన్ఫోసిస్, హెచ్ డీ ఎఫ్ సీ భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. దీంతో సాంకేతికంగా కీలకమైన సెన్సెక్స్ 28వేలు, నిప్టీ 86 వందలకు దిగువన ముగిశాయి. దీనికితోడు ఆగస్ట్ సిరీస్ డెరివేటివ్స్ ముగింపు తో మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.
అటు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 0.07 పైసల నష్టంతో 67.03 దగ్గర ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో 10 గ్రా.పుత్తడి 31 వేలకు దిగువకు చేరింది. రూ. 81 నష్టంతో రూ. 30,0965 దగ్గర ఉంది.