సాక్షి, ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం ఆరంభంలోనే ఏకంగా 1000 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 300 పాయింట్లను కోల్పోయి నెలరోజుల కనిష్ట స్థాయిని తాకింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలు భారీ పతనానికి కారణమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 941 పాయింట్లు కోల్పోయి 30161 వద్ద, నిఫ్టీ 268 పాయింట్లు కోల్పోయి 8868 వద్ద కొనసాగుతోంది. తద్వారా సెన్సెక్స్ 30750 స్థాయిని కోల్పోగా, నిఫ్టీ కీలకమైన 9 వేల దిగువకు పడిపోయింది.
కరోనా వైరస్ సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీపై అసంతృప్తికి తోడు, మే 31 వరకు లాక్‌డౌన్ పొడగింపు, అమెరికా చైనాల మద్య ట్రేడ్ వార్ ఉద్రిక్తతలు సెంటిమెంట్‌ను బలహీనపరుస్తాయని ఎనలిస్టులు చెబుతున్నారు. లాక్‌డౌన్ పొడగింపుతో, ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభానికి మరికొంత సమయం పడుతుందనే నిరాశ ఏర్పడిందనీ, ప్రభుత్వం వివిధ చర్యలు ప్రకటించినప్పటికీ, అమలు ముఖ్యమని అరిహంత్ క్యాపిటల్, డైరెక్టర్ అనితా గాంధీ వ్యాఖ్యానించారు.
మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, జీ లిమిటెడ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, జీ ఎంటర్‌టైన్‌మెంట్, బజాజ్ ఫైనాన్స్ భారీగా నష్టపోతుండగా మరోవైపు ఐటీసీ, వేదాంత, ఇన్ఫోసిస్, ఇన్ఫ్రాటెల్, సిప్లా షేర్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment