Selloff
-
మార్కెట్ల పతనం- బ్యాంకులు బేర్
ముంబై, సాక్షి: దీపావళి జోష్‌ను కొనసాగిస్తూ రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లకు చివరికి బ్రేక్ పడింది. మిడ్‌సెషన్ నుంచీ ప్రధానంగా అమ్మకాలు వెల్తువెత్తడంతో మార్కెట్లు పతనమయ్యాయి. వెరసి సెన్సెక్స్ 580 పాయింట్లు కోల్పోయి 43,600 వద్ద ముగిసింది. నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయి 12,772 వద్ద నిలిచింది. ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన మార్కెట్లు తదుపరి కొంతమేర కోలుకున్నాయి. అయితే అమెరికన్ మార్కెట్ల బాటలో యూరోపియన్ మార్కెట్లు సైతం తాజాగా 1 శాతం స్థాయిలో క్షీణించడంతో సెంటిమెంటు బలహీనపడింది. సెకండ్ వేవ్‌లో భాగంగా కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లలో తిరిగి లాక్‌డవున్ అందోళనలు తలెత్తినట్లు నిపుణులు తెలియజేశారు. దీనికితోడు దేశీ మార్కెట్లలో నిరవధిక ర్యాలీ కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం ప్రభావం చూపినట్లు వివరించారు. చదవండి: (రికార్డుల ర్యాలీకి బ్రేక్.. నష్టాలతో షురూ) బ్యాంక్స్ బోర్లా ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ అత్యధికంగా 3 శాతం నీరసించింది. రియల్టీ, ఐటీ, మెటల్, ఆటో సైతం 1.4-0.7 శాతం మధ్య డీలాపడ్డాయి. అయితే ఎఫ్ఎంసీజీ, మీడియా 0.4 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐషర్, హెచ్డీఎఫ్సీ లైఫ్ 5-3 శాతం మధ్య పతనమయ్యాయి. ఇతర బ్లూచిప్స్‌లో పవర్‌గ్రిడ్, ఐటీసీ, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, టాటా స్టీల్, టైటన్, బ్రిటానియా, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 2.6-0.5 శాతం మధ్య బలపడ్డాయి. ఫైనాన్స్ వీక్ డెరివేటివ్ కౌంటర్లలో ఫెడరల్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, నౌకరీ, బీవోబీ, ఎల్అండ్టీ ఫైనాన్స్, డీఎల్ఎఫ్, పీఎన్బీ, ఐసీఐసీఐ ప్రు, పేజ్ 5.5-2.6 శాతం మధ్య వెనకడుగు వేశాయి. కాగా.. మరోవైపు టాటా కెమ్, బీఈఎల్, బాటా, బాష్, వేదాంతా, కమిన్స్, జిందాల్ స్టీల్, భెల్, ఎంఆర్ఎఫ్, నాల్కో 8-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.7 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1,433 నష్టపోగా.. 1,324 లాభాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,072 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,790 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 4,905 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 3,829 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
నష్టాలతో షురూ- అన్ని రంగాలూ వీక్
ప్రపంచ మార్కెట్ల పతనం నేపథ్యంలో దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 271 పాయింట్లు క్షీణించి 39,651కు చేరింది. నిఫ్టీ 93 పాయింట్లు కోల్పోయి 11,637 వద్ద ట్రేడవుతోంది. అమెరికాసహా బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలలో తిరిగి కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో బుధవారం అమెరికన్, యూరోపియన్ మార్కెట్లు 2.6-4 శాతం మధ్య పతనమయ్యాయి. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు నీరసంగా కదులుతున్నాయి. దీనికితోడు నేడు అక్టోబర్ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల ముగింపు కారణంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దిగ్గజాలు డీలా ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 1.5-0.7 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టైటన్, ఎల్అండ్టీ, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ 5-1 శాతం మధ్య క్షీణించాయి. బ్లూచిప్స్‌లో కేవలం అల్ట్రాటెక్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్, టీసీఎస్ 1-0.3 శాతం మధ్య బలపడ్డాయి. డెరివేటివ్స్ తీరిలా ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఐబీ హౌసింగ్, ఎల్ఐసీ హౌసింగ్, పిరమల్, భెల్ 3.2-2.3 శాతం మధ్య నష్టపోయాయి. అయితే మరోవైపు పిడిలైట్, టొరంట్ పవర్, ఆర్బీఎల్ బ్యాంక్, కాల్గేట్, వేదాంతా, ఐజీఎల్, నౌకరీ 1.7-0.4 శాతం మధ్య పుంజుకున్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5-1 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,165 నష్టపోగా.. 454 మాత్రమే లాభాలతో ట్రేడవుతున్నాయి. -
అమ్మకాల సునామీ -కుప్పకూలిన సెన్సెక్స్
ప్రపంచ మార్కెట్ల పతనంతో దేశీ స్టాక్ మార్కెట్లకు సైతం షాక్ తగిలింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో సెన్సెక్స్ 1,115 పాయింట్లు పడిపోయింది. ఫలితంగా 37,000 పాయింట్ల మార్క్‌ను సైతం కోల్పోయి 36,553 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 326 పాయింట్లు పతనమై 10,806 వద్ద నిలిచింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 11,000 పాయింట్ల స్థాయికి నీళ్లొదులుకుంది. వెరసి మార్కెట్లు ఇంట్రాడే కనిష్టాల సమీపంలో ముగియడం గమనార్హం! ఏం జరిగిందంటే? కోవిడ్-19 కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడుతున్నదని, దీంతో ప్రభుత్వం మరింత అధికంగా ఆర్థిక మద్దతును అందించవలసి ఉన్నదని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తాజాగా స్పష్టం చేశారు. అయితే వైట్‌హౌస్ ప్రభుత్వం ప్రతిపాదించిన సహాయక ప్యాకేజీపై కాంగ్రెస్‌లో డెమక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య సయోధ్య కుదరకపోవడంతో సెంటిమెంటుకు దెబ్బ తగిలింది. మరోపక్క సెకండ్ వేవ్‌లో భాగంగా కోవిడ్-19 చెలరేగుతుండటంతో పలు యూరోపియన్ దేశాలు తాజాగా లాక్‌డవున్‌లకు తెరతీశాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత మాంద్యంలోకి నెట్టివేయవచ్చన్న అంచనాలు పెరిగాయి. ఇటీవల పాలసీ సమీక్షను చేపట్టిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను నామమాత్ర స్థాయిలో కొనసాగించేందుకు కట్టుబడుతున్నట్లు ప్రకటించినప్పటికీ మరో ప్యాకేజీపై ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం గమనార్హం! ఇలాంటి పలు ప్రతికూల అంశాలతోపాటు.. కొద్ది నెలలుగా ర్యాలీ బాటలో సాగుతున్న యూఎస్ టెక్నాలజీ కౌంటర్లలో ఇటీవల భారీ అమ్మకాలు నమోదవుతుండటం.. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలకు దారితీసినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశీయంగా చైనాతో సైనిక వివాదాలు సైతం ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. అన్నిటా నష్టాలే ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ నష్టపోగా.. మెటల్, మీడియా, ఐటీ, బ్యాంకింగ్, ఆటో, ఫార్మా, రియల్టీ 4-3 శాతం మధ్య క్షీణించాయంటే అమ్మకాల తీవ్రతనుఅర్ధం చేసుకోవచ్చు. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ఫ్రాటెల్(3 శాతం), జీ(1 శాతం), హెచ్‌యూఎల్(0.25 శాతం) మాత్రమే లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఇండస్ఇండ్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, టీసీఎస్, యూపీఎల్, టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, ఐవోసీ, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్, ఎస్బీఐ, కోల్ ఇండియా, సిప్లా, యాక్సిస్ 7.5-4 శాతం మధ్య పతనమయ్యాయి. ఫైనాన్స్ వీక్ డెరివేటివ్ కౌంటర్లలో ఐబీ హౌసింగ్, అశోక్ లేలాండ్, ఇండిగో, శ్రీరామ్ ట్రాన్స్, జిందాల్ స్టీల్, కెనరా బ్యాంక్, ఎల్ఐసీ హౌసింగ్, ఆర్బీఎల్, టాటా పవర్, ఎన్ఎండీసీ, ఫెడరల్ బ్యాంక్, అంబుజా, సెయిల్, ఎల్అండ్టీ ఫైనాన్స్, నాల్కో, మదర్సన్, భెల్ 9-5 శాతం మధ్య కుప్పకూలాయి. కాగా.. అపోలో హాస్పిటల్స్ 7.3 శాతం జంప్‌చేయగా.. గోద్రెజ్ సీపీ, కాల్గేట్, వేదాంతా, మారికో, చోళమండలం మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 3-0.5 శాతం మధ్య బలపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2.2 శాతం స్థాయిలో నీరసించాయి. ట్రేడైన షేర్లలో 2,026 నష్టపోగా.. 624 మాత్రమే లాభాలతో నిలిచాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,912 కోట్లకు మించి అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,629 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2,073 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 879 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 540 కోట్లు, డీఐఐలు రూ. 518 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
500 పాయింట్లు డౌన్- అన్ని రంగాలూ వీక్
ప్రపంచ మార్కెట్ల పతనంతో దేశీ స్టాక్ మార్కెట్లకు సైతం షాక్ తగిలింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 500 పాయింట్లు పడిపోయింది, నిఫ్టీ సైతం 150 పాయింట్లు కోల్పోయింది. కోవిడ్-19 కట్టడికాకపోవడం, ఆర్థిక వ్యవస్థల రికవరీపై సందేహాలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 540 పాయింట్లు కోల్పోయి 37,128కు చేరగా.. నిఫ్టీ 165 పాయింట్లు దిగజారి 10,967 వద్ద ట్రేడవుతోంది. నాలుగు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ మంగళవారం యూఎస్ మార్కెట్లు లాభపడినప్పటికీ తిరిగి బుధవారం పతనంకావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. నష్టాలలో ఎన్ఎస్ఈలో అన్ని ప్రధాన రంగాలూ 1-3 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ఫ్రాటెల్(1.8 శాతం), ఎన్టీపీసీ(0.25 శాతం) మాత్రమే లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో హిందాల్కో, హెచ్‌సీఎల్ టెక్, యూపీఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఎస్బీఐ, యాక్సిస్, సిప్లా, ఐవోసీ, ఎయిర్టెల్, మారుతీ, జీ 4-2 శాతం మధ్య డీలా పడ్డాయి. ఎఫ్‌అండ్‌వో లో డెరివేటివ్ కౌంటర్లలో అశోక్ లేలాండ్, ఇండిగో, శ్రీరామ్ ట్రాన్స్, సన్ టీవీ, సెయిల్, ఐడియా, మదర్సన్, ఐజీఎల్, బాష్, డీఎల్ఎఫ్, కెనరా బ్యాంక్, నాల్కో, గ్లెన్‌మార్క్, అపోలో టైర్, భారత్ ఫోర్జ్ 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. వేదాంతా, టాటా కెమికల్స్, అపోలో హాస్పిటల్స్, నౌకరీ మాత్రమే అదికూడా 1.2-0.25 శాతం మధ్య బలపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.6 శాతం మధ్య నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,387 నష్టపోగా.. 263 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. -
బ్లాక్ మండే- 812 పాయింట్లు డౌన్
ఉన్నట్టుండి అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీ స్టాక్ మార్కెట్లకు షాక్ తగిలింది. వెరసి గత ఆరు నెలల్లోలేని విధంగా మార్కెట్లు బోర్లా పడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,000 స్థాయిని సైతం కోల్పోయింది. చివరికి 812 పాయింట్లు పడిపోయి 38,034 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 255 పాయింట్లు పతనమై 11,250 వద్ద నిలిచింది. తొలుత అటూఇటుగా మొదలైన మార్కెట్లలో మిడ్‌సెషన్ నుంచీ ఒక్కసారిగా అమ్మకాలు పెరిగాయి. ఫలితంగా 38,991 పాయింట్ల గరిష్టం నుంచి సెన్సెక్స్ ఒక దశలో 37,946 వరకూ జారింది. ఇక నిఫ్టీ 11,535- 11,219 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. వెరసి ఇంట్రాడే కనిష్టాల సమీపంలోనే మార్కెట్లు స్థిరపడటం గమనార్హం! వ్యవసాయ బిల్లుపై రాజ్యసభలో కేంద్రానికి ఎదురవుతున్న సవాళ్లు, చైనాతో సరిహద్దు వివాదాలు, యూరోపియన్ దేశాలలో మళ్లీ తలెత్తుతున్న కోవిడ్-19 కేసులు తదితర ప్రతికూలతలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు పలు గ్లోబల్ బ్యాంకులలో అవకతవకలు జరిగాయంటూ వెలువడిన ఆరోపణలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు తెలియజేశారు. బేర్.. బేర్ ఎన్ఎస్ఈలో ఐటీ 0.7 శాతం నీరసించగా.. మిగిలిన అన్ని రంగాలూ 6-2.5 శాతం మధ్య పతనమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో టీసీఎస్, ఇన్ఫోసిస్, కొటక్ బ్యాంక్ మాత్రమే అదికూడా 0.8-0.25 శాతం మధ్య బలపడ్డాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఇతర బ్లూచిప్స్‌లో ఇండస్ఇండ్, టాటా మోటార్స్, హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎయిర్టెల్, ఇన్ఫ్రాటెల్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ, సిప్లా, మారుతీ, యాక్సిస్, గెయిల్, నెస్లే, జీ, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, గ్రాసిమ్, బ్రిటానియా, ఐవోసీ, ఎస్బీఐ, టైటన్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా 8.6-3.7 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నేలచూపులోనే డెరివేటివ్ విభాగంలో ఐబీ హౌసింగ్, జిందాల్ స్టీల్, బీఈఎల్, పీవీఆర్, బంధన్ బ్యాంక్, ఐడియా, టాటా కన్జూమర్, సెయిల్, ఆర్బీఎల్ బ్యాంక్, పిరమల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, డీఎల్ఎఫ్, అశోక్ లేలాండ్, గ్లెన్‌మార్క్, పీఎన్బీ, బాలకృష్ష, బయోకాన్ 13-6.5 శాతం మధ్య కుప్పకూలాయి. నిఫ్టీ దిగ్గజాలను మినహాయిస్తే.. లాభపడ్డ కౌంటర్లు లేకపోవడం గమనార్హం! బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 3.7 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 2,165 నష్టపోగా.. కేవలం 594 లాభాలతో ముగిశాయి. స్వల్ప కొనుగోళ్లు.. నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 205 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 101 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 250 కోట్లు, డీఐఐలు రూ. 1,068 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 265 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 212 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
కుప్పకూలిన మార్కెట్లు : 9 వేల దిగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం ఆరంభంలోనే ఏకంగా 1000 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 300 పాయింట్లను కోల్పోయి నెలరోజుల కనిష్ట స్థాయిని తాకింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలు భారీ పతనానికి కారణమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 941 పాయింట్లు కోల్పోయి 30161 వద్ద, నిఫ్టీ 268 పాయింట్లు కోల్పోయి 8868 వద్ద కొనసాగుతోంది. తద్వారా సెన్సెక్స్ 30750 స్థాయిని కోల్పోగా, నిఫ్టీ కీలకమైన 9 వేల దిగువకు పడిపోయింది. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీపై అసంతృప్తికి తోడు, మే 31 వరకు లాక్డౌన్ పొడగింపు, అమెరికా చైనాల మద్య ట్రేడ్ వార్ ఉద్రిక్తతలు సెంటిమెంట్‌ను బలహీనపరుస్తాయని ఎనలిస్టులు చెబుతున్నారు. లాక్డౌన్ పొడగింపుతో, ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభానికి మరికొంత సమయం పడుతుందనే నిరాశ ఏర్పడిందనీ, ప్రభుత్వం వివిధ చర్యలు ప్రకటించినప్పటికీ, అమలు ముఖ్యమని అరిహంత్ క్యాపిటల్, డైరెక్టర్ అనితా గాంధీ వ్యాఖ్యానించారు. మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, జీ లిమిటెడ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, జీ ఎంటర్టైన్మెంట్, బజాజ్ ఫైనాన్స్ భారీగా నష్టపోతుండగా మరోవైపు ఐటీసీ, వేదాంత, ఇన్ఫోసిస్, ఇన్ఫ్రాటెల్, సిప్లా షేర్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేసింది. ఆరంభ బలహీనత మిడ్‌సెషన్ తరువాత మరింత అమ్మకాలకు దారి తీసింది. అలాగే ఆఖరి గంటలో ఇన్వెస్లర్ల అమ్మకారు జోరు కొనసాగింది. సెన్సెక్స్ ఏకంగా 575 పాయింట్లు కుప్పకూలింది. తద్వారా సెన్సెక్స్ 36వేల దిగువకు చేరింది. నిఫ్టీ 169 పాయింట్లు నష్టపోయి 10673 వద్ద 10700 స్థాయిని కోల్పోయింది. మరోవైపు ఈ దీపావళి తమకు బ్రహ్మాండంగా ఉంటుందన్న హెచ్డీఎఫ్సీ ఎండీ ఆదిత్య పురి వ్యాఖ్యలతో హెచ్డీఎఫ్సీ భారీగా పుంజుకుంది. దీంతో సెన్సెక్స్ 470, నిఫ్టీ 136 పాయింట్ల బలహీనంగా ముగిసాయి. దాదాపు అన్ని రంగాలు నష్టపోయాయి. అంచనాలకు అనుగుణంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును పావు శాతం తగ్గించిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలహీనపడిందని నిపుణులు తెలిపారు. యస్‌బ్యాంకు, టాటాస్టీల్, ఇండస్ ఇండ్‌బ్యాకు, ఐసీఐసీఐ, వేదాంతా, ఎంఅండ్ ఎం, ఓఎన్జీసీ, మారుతి సుజుకి, రిలయన్స్, ఎస్బీఐ, హీరో మోటోకార్ప్, టీసీఎస్, బజాజ్ ఆటో టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. టాటామోటార్స్, భారతి ఎ యిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ఏషియన్ పెయింట్స్ లాభపడ్డాయి. వోడాఫోన్ జోరు: జులై మాసంలో తాజా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గణాంకాల ప్రకారం టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ దేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా నిలవడంతో వోడాఫోన్ ఇండియా కౌంటర్ ఏకంగా 16శాతం ఎగిసింది 38 కోట్ల మంది సభ్యులతో వొడాఫోన్ ఐడియా, 33.98 కోట్లతో రిలయన్స్ జియో, 32.85 కోట్ల మంది వినియోగదారులతో ఎయిర్టెల్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. అటు ఫెడ్ రేట్ కట్ నిర్ణయంతో డాలరు మారకంలో రూపాయి కూడా బలహీనంగా ఉంది. 24 పైసలు నష్టపోయి 71.36 వద్ద ఉంది. -
అమ్మకాల ఒత్తిడి, 8,100 కిందికి నిఫ్టీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సంకేతాలు , చమురు ధరల పతనం, ప్రభుత్వ డిమానిటేజేషన్ పై పార్లమెంట్ లో ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో లాభనష్టాల మధ్య మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు గురి అయ్యాయి. ఒక దశలో 138 పాయింట్లకు పైగా కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 71 పాయింట్ల నష్టంతో 26,240 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 8079 వద్ద ముగిశాయి. మరోవైపు వరుసగా నాలుగవ సెషన్లో కూడా అమ్మకాలు జోరు కొనసాగడంతో నిఫ్టీ 8100 స్థాయికి కిందికి పడిపోయింది. దీంతోపాటు అయిదునెలల కనిష్టానికి దిగజారింది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ లోని నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేసింది. మిడ్ సెషన్ నుంచీ పెరిగిన అమ్మకాలతో హెచ్చుతగ్గుల మధ్య ఊగిసలాడుతూ చివరికి నష్టాలనే నమోదు చేశాయి. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు లాభపడగా, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ , పవర్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ షేర్లలో అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. ప్రారంభంనుంచీ మీడియా , ఐటీ రంగం నష్టాల్లోనే కొనసాగింది. కోల్ ఇండియా అంబుజా, భారతీ, ఏసీసీ, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, విప్రో, ఐషర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నష్టపోగా టాటా మోటార్స్, హిందాల్కో, బీవోబీ, సిప్లా, గెయిల్, లుపిన్, యాక్సిస్, సన్ ఫార్మా లాభపడ్డాయి. అటు డాలర్ తో పోలిస్తే 13 పైసలు నష్టపోయి 67.82 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. రూ. 53 నష్టంతో రూ.29,330 వద్ద ఉంది. -
బ్యాంకింగ్ దెబ్బతో మార్కెట్లు ఢమాల్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఆరంభంనుంచి నష్టాల్లో కొనసాగిన సెన్సెక్స్ చివరికి 265పాయింట్ల నష్టంతో 26,826 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో 8609 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో మిడ్ సెషన్ నుంచి పెరిగిన భారీ అమ్మకాలతో దేశీ స్టాక్ మార్కెట్లు ఒక దశలో 332 పాయింట్లకు పైగా పతనమయ్యాయి. నష్టాల్లో ఉన్న మార్కెట్లకు యూరప్ బలహీన సంకేతాలతో మరింత కుదేలైంది. అన్ని రంగాలూ నష్టపోగా, బ్యాంకింగ్ సెక్టార్ లోని అమ్మకాలు మార్కెట్‌ను ప్రభావితం చేసాయి. దీనికితోడు మెటల్స్, ఫార్మా, ఐటీ ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో రంగాలు కూడా క్షీణించాయి. ఫలితాల ప్రకటనతో యాక్సిస్ 8.3 శాతం కుప్పకూలగా, టాటా సంచలనంతో వరుసగా రెండో రోజు కూడా టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా పవర్, టీసీఎస్ లకు నష్టాలు తప్పలేదు. ఇదేబాటలో ఎస్ బీఐ, ఐసీఐసీఐ, ఇన్ఫ్రాటెల్, అరబిందో,లుపిన్, సిప్లా అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, హెచ్‌సీఎల్ టెక్ నష్టపోయాయి. మరోవైపు ఐడియా , కొటక్ బ్యాంక్, భారతీ, హీరో మోటో, మారుతీ, హెచ్‌యూఎల్ లాభపడ్డాయి. అటు రూపాయి స్వల్ప లాభంతో మొదలైన 0.01 పైసల నష్టంతో 66.83 వద్ద ఉంది. పసిడి కూడా రూ. 8 నష్టంతో పది గ్రా. రూ.29,934 వద్ద ఉంది. -
భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల క్షీణతతో దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్224 పాయింట్ల నష్టంతో 27,835 దగ్గర నిఫ్టీ 58 పాయింట్ల నష్టంతో 8,592 వద్ద ముగిశాయి. ప్రారంభంనుంచి ఓలటైల్ గా ఉన్న మార్కెట్ లో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందు కోవడంతో నష్టాల బాట పట్టాయి. ఐటీ, మెటల్ రంగాల్లో అమ్మకాలు మార్కెట్ ను నష్టాల్లోకి నెట్టాయి. బీఎస్ఈ లో దాదాపు పదిహేనువందల స్టాక్స్ నెగిటివ్ లో ఉండగా, మరోవెయ్యికి పైగా లాభాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈలో ఎఫ్ఎంసీజీ మినహా మిగిలిన అన్ని రంగాలూ నష్టపోయాయి. ప్రధానంగా ఐటీ, మెటల్స్, పీఎస్‌యూ బ్యాంకింగ్ సెక్టార్లు నష్టపోయాయి. ఇన్ఫోసిస్, హెచ్ డీ ఎఫ్ సీ భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. దీంతో సాంకేతికంగా కీలకమైన సెన్సెక్స్ 28వేలు, నిప్టీ 86 వందలకు దిగువన ముగిశాయి. దీనికితోడు ఆగస్ట్ సిరీస్ డెరివేటివ్స్ ముగింపు తో మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అటు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 0.07 పైసల నష్టంతో 67.03 దగ్గర ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో 10 గ్రా.పుత్తడి 31 వేలకు దిగువకు చేరింది. రూ. 81 నష్టంతో రూ. 30,0965 దగ్గర ఉంది.