సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేసింది. ఆరంభ బలహీనత మిడ్‌సెషన్ తరువాత మరింత అమ్మకాలకు దారి తీసింది. అలాగే ఆఖరి గంటలో ఇన్వెస్లర్ల అమ్మకారు జోరు కొనసాగింది. సెన్సెక్స్ ఏకంగా 575 పాయింట్లు కుప్పకూలింది. తద్వారా సెన్సెక్స్ 36వేల దిగువకు చేరింది. నిఫ్టీ 169 పాయింట్లు నష్టపోయి 10673 వద్ద 10700 స్థాయిని కోల్పోయింది. మరోవైపు ఈ దీపావళి తమకు బ్రహ్మాండంగా ఉంటుందన్న హెచ్‌డీఎఫ్‌సీ ఎండీ ఆదిత్య పురి వ్యాఖ్యలతో హెచ్‌డీఎఫ్‌సీ భారీగా పుంజుకుంది. దీంతో సెన్సెక్స్ 470, నిఫ్టీ 136 పాయింట్ల బలహీనంగా ముగిసాయి. దాదాపు అన్ని రంగాలు నష్టపోయాయి.
అంచనాలకు అనుగుణంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును పావు శాతం తగ్గించిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలహీనపడిందని నిపుణులు తెలిపారు. యస్‌బ్యాంకు, టాటాస్టీల్, ఇండస్ ఇండ్‌బ్యాకు, ఐసీఐసీఐ, వేదాంతా, ఎంఅండ్ ఎం, ఓఎన్‌జీసీ, మారుతి సుజుకి, రిలయన్స్, ఎస్‌బీఐ, హీరో మోటోకార్ప్, టీసీఎస్, బజాజ్ ఆటో టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. టాటామోటార్స్, భారతి ఎ యిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ఏషియన్ పెయింట్స్ లాభపడ్డాయి.
వోడాఫోన్ జోరు: జులై మాసంలో తాజా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గణాంకాల ప్రకారం టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ దేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా నిలవడంతో వోడాఫోన్ ఇండియా కౌంటర్ ఏకంగా 16శాతం ఎగిసింది 38 కోట్ల మంది సభ్యులతో వొడాఫోన్ ఐడియా, 33.98 కోట్లతో రిలయన్స్ జియో, 32.85 కోట్ల మంది వినియోగదారులతో ఎయిర్‌టెల్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
అటు ఫెడ్ రేట్ కట్ నిర్ణయంతో డాలరు మారకంలో రూపాయి కూడా బలహీనంగా ఉంది. 24 పైసలు నష్టపోయి 71.36 వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment