ప్రపంచ మార్కెట్ల పతనంతో దేశీ స్టాక్ మార్కెట్లకు సైతం షాక్ తగిలింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 500 పాయింట్లు పడిపోయింది, నిఫ్టీ సైతం 150 పాయింట్లు కోల్పోయింది. కోవిడ్-19 కట్టడికాకపోవడం, ఆర్థిక వ్యవస్థల రికవరీపై సందేహాలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 540 పాయింట్లు కోల్పోయి 37,128కు చేరగా.. నిఫ్టీ 165 పాయింట్లు దిగజారి 10,967 వద్ద ట్రేడవుతోంది. నాలుగు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ మంగళవారం యూఎస్ మార్కెట్లు లాభపడినప్పటికీ తిరిగి బుధవారం పతనంకావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
నష్టాలలో
ఎన్‌ఎస్‌ఈలో అన్ని ప్రధాన రంగాలూ 1-3 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్(1.8 శాతం), ఎన్‌టీపీసీ(0.25 శాతం) మాత్రమే లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో హిందాల్కో, హెచ్‌సీఎల్ టెక్, యూపీఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఎస్‌బీఐ, యాక్సిస్, సిప్లా, ఐవోసీ, ఎయిర్‌టెల్, మారుతీ, జీ 4-2 శాతం మధ్య డీలా పడ్డాయి.
ఎఫ్‌అండ్‌వో లో
డెరివేటివ్ కౌంటర్లలో అశోక్ లేలాండ్, ఇండిగో, శ్రీరామ్ ట్రాన్స్, సన్ టీవీ, సెయిల్, ఐడియా, మదర్‌సన్, ఐజీఎల్, బాష్, డీఎల్‌ఎఫ్, కెనరా బ్యాంక్, నాల్కో, గ్లెన్‌మార్క్, అపోలో టైర్, భారత్ ఫోర్జ్ 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. వేదాంతా, టాటా కెమికల్స్, అపోలో హాస్పిటల్స్, నౌకరీ మాత్రమే అదికూడా 1.2-0.25 శాతం మధ్య బలపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.6 శాతం మధ్య నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,387 నష్టపోగా.. 263 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment