ప్రస్తుత పరిస్థితుల్లో కార్పోరేట్ ఫలితాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మోతీలాల్ ఓస్వాల్ ఫండ్ మేనేజర్ సిద్ధార్థ్ బోత్రా తెలిపారు. తొలి త్రైమాసికానికి ప్రత్యేక నేపథ్యం ఉందని కావున కంపెనీల ఫలితాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ‘‘ఏప్రిల్-జూన్ వ్యవధిలో ప్రతి కంపెనీ కనీసం నెలరోజులకు తగ్గకుండా లాక్‌డౌన్‌లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో త్రైమాసిక ఫలితాలను పరిగణనలోకి తీసుకోవడం అవివేకం అవుతుంది. అయితే ఈ సందర్భంలోనూ కొన్ని కంపెనీలు మార్కెట్ వర్గాల అంచనాలకు మించి ఫలితాలను ప్రకటించి ఆశ్చర్యపరిచాయి’’ అని బోత్రా చెప్పుకొచ్చారు.
ఐటీ, ఫార్మా సెక్టార్‌పై సానుకూలం:
ఐటీ సెక్టార్‌పై తాము సానుకూలంగా ఉన్నట్లు బోత్రా తెలిపారు. రానున్న రోజుల్లో ఈ షేర్లు రాణించే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు ఫలితాలను వెల్లడించిన ఐటీ కంపెనీలు ఫలితాలు బాగున్నాయని, ఫలితాల ప్రకటన సందర్భంగా యాజమాన్య వ్యాఖ్యలు, అవుట్‌లుక్‌లు ఐటీ రంగం షేర్లను మరింత ఆకర్షణీయం చేశాయని బోత్రా తెలిపారు. అలాగే గత రెండేళ్ల నుంచి ఫార్మా షేర్లపై తాము సానుకూలంగానే ఉన్నామని తెలిపారు. ఫార్మా రంగంలో తమకు పెద్ద పొజిషన్లు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికీ తమ దృష్టి దేశీయ ఫార్మా కంపెనీల షేర్లపై ఉందని, ఈ సెక్టార్ నుండి డాక్టర్ రెడ్డీస్ షేరును సిఫార్సు చేస్తామని బోత్రా తెలిపారు.
రూరల్ రికవరీ భేష్:
దేశీయ ఆర్థిక వ్యవస్థనంతటికీ అవలోకనం చేస్తే..., వ్యవసాయ లేదా రూరల్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. అది ప్రభుత్వ ప్రకటించిన ఉద్దీపన చర్యలతో కావచ్చు.మెరుగైన వర్షపాతం నమోదు కావచ్చు రూరల్ వ్యవస్థ సవ్యంగా ఉంది. వలస కూలీలు కూడా తమ స్వస్థలాలైన గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఫలితంగా అక్కడ వినిమయ వ్యయాలు పెరుగుతున్నాయి. ఈ అంశాలన్నీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహాయం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment