కొంప ముంచిన ఇన్ఫీ సీవోవో వ్యాఖ్యలు | IT stocks fall after Infosys COO Pravin Rao's comment on IT spend by clients | Sakshi
Sakshi News home page

కొంప ముంచిన ఇన్ఫీ సీవోవో వ్యాఖ్యలు

Jun 7 2017 5:03 PM | Updated on Jul 11 2019 8:55 PM

కొంప ముంచిన ఇన్ఫీ సీవోవో వ్యాఖ్యలు - Sakshi

కొంప ముంచిన ఇన్ఫీ సీవోవో వ్యాఖ్యలు

ఇన్ఫోసిస్‌ సంచలన వ్యాఖ్యలతో మార్కెట్లో ఐటీ సెక్టార్ లో తీవ్ర అమ్మకాల వెల్లువ కొనసాగింది.

ముంబై: ఇన్ఫోసిస్‌ సంచలన వ్యాఖ్యలతో మార్కెట్లో ఐటీ సెక్టార్ లో  తీవ్ర అమ్మకాల  వెల్లువ కొనసాగింది. ఇన్ఫీ టాప్ ఎగ్జిక్యూటివ్‌ చేసిన  కమెంట్లు ఐటీ  షేర్ల కొంపముంచాయి. ఇన్పీ సీవోవో ప్రవీణ్‌ రావు తమ ఖాతాదారుల ఐటీ వ్యయాలను తగ్గనున్నాయన్న వ్యాఖ్యలతో మార్కెట్లో ఐటీ  షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.  ముఖ్యంగా నిన్నటి మార్కెట్‌ లో భారీ పుంజుకున్న ఐటీ దిగ్గజ  షేర్లు  భారీ పతనాన్ని నమోదు చేశాయి.  

ఇన్ఫోసిస్‌ సీవోవో ప్రవీణ్‌ రావు తమ క్లయింట్స్‌ ఐటీ  వ్యయాలను చూస్తున్నారంటూ  మీడియాతో  వ్యాఖ్యానించారు. తమ అంతర్జాతీయ ఖాతాదారులు  బిల్లింగ్‌ రేటును దాదాపు 50శాతం తగ్గించాలని  చూస్తున్నారన్నారు. ఇది 150 బిలియన్ డాలర్ల  దేశీయ  పరిశ్రమ ఆదాయంపై ప్రభావం చూపించనుందని చెప్పారు.  దీంతో  ఇన్వెస్టర్లలో  భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో  దాదాపు అన్ని  ఐటీ షేర్లలో  భారీ సెల్లింగ్‌ ప్రెజర్‌ కనిపించింది.  ఐటీ మేజర్లు ఇన్ఫీ, టీసీఎస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ సహా ఇతర టెక్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. అయితే అలాంటిదేమీ లేదని ఇన్ఫీ యాజమాన్యం   వివరణ ఇచ్చినా ఫలితం లేకపోయింది.  మిడ్‌సెషన్‌ తరువాత  ప్రధానంగా ఆర్‌బీఐ పాలసీ ప్రకటన అనంతరం కొద్దిగా కోలుకున్నప్పటికీ నష్టాల్లోనే ముగిశాయి.

అటు సీవోవో ప్రవీణ్‌రావు కూడా ఈ వ్యవహారంపై స్పందించారు.  ప్రైస్‌కట్‌ గురించి తాను చెప్పలేదని,  తప్పుగా అర్థం  చేసుకున్నారని యుబి ప్రవీణ్ రావు వివరణ ఇచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement