ముంబై: ఫైనాన్స్ సంస్థల రుణ పుస్తకం విలువ 2019 మార్చి నాటికి రూ.48 లక్షల కోట్లుగా ఉండగా, ఇది వచ్చే ఐదేళ్ల కాలంలో 2024 నాటికి రూ.96 లక్షల కోట్లకు వృద్ధి చెందుతుందని ఐసీఐసీఐ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ప్రైవేటు వినియోగం (ఇల్లు, కారు, కన్జ్యూమర్ డ్యురబుల్స్, క్రెడిట్ కార్డులు) కారణంగా రుణ మార్కెట్ భారీగా వృద్ధి చెందనుందని అంచనా వేసింది. వినియోగదారుల్లో రుణాలు తీసుకునే ధోరణి పెరుగుతుండడం, అదే సమయంలో వినియోగదారుల డేటా లభ్యత పెరగడం, డేటా అనలైటిక్స్ వినియోగం అన్నవి చౌక గృహ రుణాలు, ఎంఎస్‌ఎంఈ రుణాల వృద్ధికి దారితీయనున్నట్టు ఈ సంస్థ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment