retail loans
-
Loans: రుణ పడొద్దు!
సొంత కారు, అందమైన భవంతి, ఇంట్లో అన్ని రకాల సాధనాలు (మెషీన్లు).. ఎందులోనూ రాజీపడేది లేదన్నట్టుగా ఉంది నేటి యువతరం ధోరణి. ముందు పొదుపు, తర్వాతే ఖర్చు.. గతంలో మన పెద్దలు అనుసరించిన ధోరణి. ముందు ఖర్చు.. మిగిలితేనే పొదుపు అన్నట్టుగా ఉంది నేటి తీరు. ఏ అవసరం వచ్చినా ‘తగ్గేదే లే’ అన్న ధోరణి కనిపిస్తోంది. కొనుగోళ్ల నుంచి వైద్య చికిత్సల వరకు అన్నింటికీ రుణబాట పడుతున్నారు. తీర్చే సామర్థ్యం ఉంటేనే రుణం తీసుకోవాలి. ప్రాధాన్యత లేని వాటికి సైతం రుణాలను ఆశ్రయిస్తే తీర్చే విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. కారణం ఏదైనా సకాలంలో రుణం వాయిదా చెల్లించలేకపోతే, ఎదుర్కోవాల్సిన పరిణామాలు చాలానే ఉంటాయి. చివరికి ఉద్యోగ అన్వేషణకు సైతం దూరం కావాల్సి రావచ్చు. గతంలో బ్యాంకుల రుణ వృద్ధిలో కార్పొరేట్ రుణాలదే పైచేయిగా ఉండేది. మొదటిసారి 2020 (కరోనా విపత్తు కాలంలో) నవంబర్‌లో బ్యాంకుల రుణాల్లో కార్పొరేట్లను కాదని రిటైల్ రుణాలు ముందుకు వచ్చేశాయి. అప్పటి నుంచి 2023 నవంబర్ 17 నాటికి చూస్తే రిటైల్ రుణాలు 79 శాతం పెరగ్గా.. కార్పొరేట్ రుణాల్లో వృద్ధి 28 శాతానికి పరిమితమైంది. 2023లో రెండో త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లోనూ రిటైల్ రుణాల్లో వృద్ధి 15 శాతంగా నమోదైంది. రిటైల్ రుణాల్లో కన్జ్యూమర్ ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం తీసుకునేవి (విలువ పరంగా) 20 శాతం పెరిగాయి. ద్విచక్ర వాహన రుణాలు 18 శాతం వృద్ధి చెందాయి. వ్యక్తిగత అవసరాల కోసం తీసుకునే రుణాలు 12 శాతం పెరిగాయి. ఆటో రుణాలు 13 శాతం పెరిగితే, ఇంటి రుణాలు విలువ పరంగా మైనస్ 6 శాతంగా ఉన్నాయి. వినియోగ రుణాలు ఎక్కువగా ఉంటున్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, అదే సమయంలో రుణ ఎగవేతల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ రుణాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంది. 2023 జూలై నాటికి క్రెడిట్ కార్డ్ రుణాలు రూ.2.13 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏడాది క్రితం కంటే 31 శాతం పెరిగాయి. రిటైల్ రుణాలన్నీ కూడా అన్సెక్యూర్డ్. రుణ గ్రహీత చేతులు ఎత్తేస్తే అది బ్యాంకింగ్ వ్యవస్థపై భారాన్ని మోపుతుంది. అందుకే రిజర్వ్ బ్యాంక్ వ్యక్తిగత, అన్ సెక్యూర్డ్, క్రెడిట్ కార్డ్ రుణాలకు రిస్క్ వెయిటేజీ పెంచుతూ, వీటికి బ్యాంకులు మరిన్ని నిధులను పక్కన పెట్టేలా గత నవంబర్‌లో ఆదేశాలు తీసుకొచి్చంది. క్రెడిట్ స్కోర్‌కు విఘాతం తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించలేకపోయినా, రుణాన్ని ఎగవేసినా అది క్రెడిట్ స్కోర్‌ను గణనీయంగా తగ్గించేస్తుంది. కరోనా అనంతరం రిటైల్ రుణాలు తీసుకోవడం గణనీయంగా పెరిగిపోగా, అదే సమయంలో అంతకుముందు తీసుకున్న రుణాలకు సంబంధించి ఎగవేతలు కూడా పెద్ద మొత్తంలోనే నమోదయ్యాయి. దీంతో బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు పెద్ద మొత్తాల్లో కేటాయింపులు చేయాల్సి వచి్చంది. ఈ పరిణామాలతో చాలా మంది రుణ గ్రహీతల క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడింది. నేడు ప్రతి రుణానికి సంబంధించి చెల్లింపుల చరిత్రతో క్రెడిట్ బ్యూరోలు రికార్డులను నిర్వహిస్తున్నాయి. రుణం సకాలంలో చెల్లించకపోయినా, ఎగ్గొట్టినా, సెటిల్మెంట్ చేసుకున్నా, రుణం కావాలంటూ విచారణలు చేసినా, అవన్నీ సంబంధిత వ్యక్తి పేరిట రికార్డుగా నమోదవుతాయి. వీటి ఆధారంగానే క్రెడిట్ బ్యూరోలు స్కోర్‌ను కేటాయిస్తుంటాయి. 750, అంతకుమించి క్రెడిట్ స్కోర్ ఉంటే అది మెరుగైనది. రుణం సులభంగా వస్తుంది. మెరుగైన రేటుకు వస్తుంది. 750కంటే తక్కువ ఉంటే రుణం పొందడం కష్టమవుతుంది. ఒకవేళ రుణం లభించినా, అది అధిక వడ్డీ రేటుపై తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ రుణ వాయిదాలను సకాలంలో చెల్లించాలి. నేడు దాదాపు అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు క్రెడిట్ స్కోర్ ఆధారంగానే అన్సెక్యూర్డ్ రుణాలు మంజూరు చేస్తున్నాయి. తదుపరి పరిణామాలు.. బకాయి చెల్లించాలంటూ రుణగ్రహీతను రుణం ఇచి్చన సంస్థలు కోరతాయి. గడువు తీరిన 30 రోజులకూ చెల్లింపులు చేయకపోతే అప్పుడు ఆయా రుణగ్రహీతల సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు పంపిస్తుంటాయి. 30–60 రోజుల పాటు చెల్లింపులు చేయకపోతే అది క్రెడిట్ స్కోరును దెబ్బతీస్తుంది. ఇక రుణ వాయిదా 60 రోజులు దాటినా చెల్లించలేని వారి క్రెడిట్ స్కోర్ మరింత తగ్గిపోతుంది. తక్కువ క్రెడిట్ స్కోర్ వల్ల భవిష్యత్తులో రుణానికి ద్వారాలు మూసుకుపోతాయి. అత్యవసరంలో రుణం కావాల్సి వస్తే నిరాకరణ ఎదురుకావచ్చు. డిజిటల్‌గా రుణాలు ఇచ్చే సంస్థలు కనీసం ఒక్క రోజు ఆలస్యం చేసినా,ఎగవేతదారుల జాబితాలో చేరాల్సి వస్తోంది. 650–750 మధ్య స్కోర్ ఉన్న వారికి గృహ రుణం కావాలంటే, మెరుగైన స్కోర్ ఉన్న వారితో పోలిస్తే 2 శాతం అధిక రేటు చెల్లించాల్సి వస్తుంది. రూ.50 లక్షల రుణం 20 ఏళ్ల కాలవ్యవధికి కావాలంటే, తక్కువ స్కోర్ కారణంగా వడ్డీ రూపంలో అదనంగా రూ.12 లక్షల వరకు భారాన్ని మోయాల్సి రావచ్చు. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య ఈ రేటు వ్యత్యాసం మారుతుంది. రుణం ఎగ్గొట్టడం సివిల్ నేరం కిందకు వస్తుంది. రుణ గ్రహీత ఇచి్చన చెక్కుల ద్వారా వసూలు చేసుకునే చర్యలను ఆరి్థక సంస్థలు ప్రారంభిస్తాయి. గడువు ముగిసిన 90 రోజుల్లోపు కూడా రుణ గ్రహీత చెల్లించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, నోటీసు వస్తుంది. 180 రోజులు (ఆరు నెలలు) ముగిసినా ఎలాంటి ఫలితం లేకపోతే అప్పుడు నెగోషియబుల్ ఇనుస్ట్రుమెంట్ యాక్ట్, 1881లోని సెక్షన్ 138 కింద రుణం ఇచి్చన సంస్థ కేసు దాఖలు చేస్తుంది. చెల్లించే సామర్థ్యం ఉన్నా, చెల్లించకపోతే ఉద్దేశపూర్వక ఎగవేతదారు అనే ముద్ర పడుతుంది. సరైన కారణంతో రుణం చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు రుణం ఇచి్చన సంస్థతో చర్చలు నిర్వహించి పరిష్కారానికి, పరస్పర అంగీకారానికి రావచ్చు. హోమ్‌లోన్ లేదా ప్రాపర్టీ లోన్ లేదా బంగారంపై రుణం వంటి సెక్యూర్డ్ రుణాల్లో రుణ గ్రహీత చెల్లింపుల్లో చేతులు ఎత్తేస్తే.. తనఖాగా ఉంచిన ఆస్తులను బ్యాంకులు వేలం వేస్తుంటాయి. అలాగే, ఆటోమొబైల్ రుణాల్లోనూ వాహనాన్ని జప్తు చేసి, చెల్లింపులకు తగినంత వ్యవధి ఇస్తాయి. అప్పటికీ చెల్లించకపోతే వాహనాన్ని వేలం వేసి రుణంలో సర్దుబాటు చేసుకుంటాయి. బ్యాంక్ జాబ్ కష్టమే! బలహీన క్రెడిట్ స్కోర్ ఉందంటూ ఉద్యోగ దరఖాస్తు తిరస్కరించే అధికారం బ్యాంకుల బోర్డులకు ఉంటుంది. బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి కనీసం 650 క్రెడిట్ స్కోర్ ఉండాలన్న నిబంధనను ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) విధించింది. బా«ధ్యతాయుత ఆరి్థక నడవడిక ఉండాలన్నది దీని వెనుక ఉద్దేశం. ఎంతో విలువైన లావాదేవీల వ్యవహారాల బాధ్యతలను బ్యాంకుల ఉద్యోగులు చూస్తుంటారు. అందుకే ఈ నిబంధన ప్రవేశపెట్టారు. అందుకే బ్యాంకు ఉద్యోగాలకు ప్రయతి్నంచే వారు మెరుగైన స్కోర్ కోసం ముందు నుంచే తగిన జాగ్రత్త చర్యలను పాటించడం మంచిది. కొన్ని బహుళజాతి సంస్థలు కూడా ఉద్యోగం కోరుతున్న వారి క్రెడిట్ స్కోర్‌ను పరిశీలిస్తుంటాయి. 2022 మార్చిలో ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కోసం జారీ చేసిన ప్రకటనలో.. బ్యాంక్‌లు/ఎన్‌బీఎఫ్‌సీల నుంచి తీసుకున్న ఏ రుణం చెల్లింపుల్లో అయినా విఫలం అయినట్టయితే, క్రెడిట్ కార్డ్ బకాయిలు సకాలంలో చెల్లింపులు చేయకపోతే అటువంటి వారు నియామకానికి అర్హులు కాదని స్పష్టంగా పేర్కొంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో ఉద్యోగార్థుల క్రెడిట్ రిపోర్ట్‌లను పరిశీలించడం సర్వసాధారణమని.. దీనివల్ల ఆర్థికంగా ఎంత బాధ్యతాయుతంగా ఉంటారనేది తెలుస్తుందని డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ ఫైబ్ హెచ్ఆర్ హెడ్ మోనికా మిశ్రా తెలిపారు. ఇది సంస్థలో మోసాలు, చోరీల అవకాశాలను తెలియజేస్తుందన్నారు. ఆర్థిక అంశాల నిర్వహణలో బాధ్యతారహితంగా ఉండే వ్యక్తి, కంపెనీ ఆరి్థక వ్యవహారాల నిర్వహణకు సరైన వ్యక్తి కాదని మిశ్రా వివరించారు. ఏ రుణంలో ప్రతికూలతలు ఎలా..? రుణం కోసం రుణం... తీసుకున్న రుణాన్ని చెల్లించలేని పరిస్థితుల్లో మరో రుణం తీసుకుని చెల్లించే ఆలోచనలు సరికాదు. ముందు తీసుకున్న రుణంపై అధిక వడ్డీ రేటు ఉండి, చాలా తక్కువ రేటుకే మరో సంస్థ రుణం ఇవ్వడానికి ముందుకు వస్తే అప్పుడు ఆలోచించొచ్చు. తక్కువ రేటుపై రుణం తీసుకుని అధిక రేటుతో కూడిన రుణాన్ని తీర్చివేయవచ్చు. వ్యక్తిగత రుణాలపై 14–15 శాతం మేర వడ్డీ రేటు ఉంటే, మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి 12 శాతానికే లభిస్తుంది. అలాంటప్పుడు పరిశీలించొచ్చు. అంతేకానీ, చెల్లింపుల సమస్య నుంచి బయటపడేందుకు మరో రుణాన్ని ఆశ్రయిస్తే సమస్యను పెంచుకున్నట్టు అవుతుంది. అలాగే, క్రెడిట్ కార్డ్‌పై 3–4 రూపాయల వడ్డీ పడుతుంది. వ్యక్తిగత రుణాన్ని తీసుకుని క్రెడిట్ కార్డ్ రుణాన్ని తీర్చివేయవచ్చు. రుణ గ్రహీత ముందున్న మార్గం రుణం తీసుకుని, చెల్లింపులు సకాలంలో చేయకపోయినా.. రుణం ఇచ్చిన సంస్థలు గౌరవప్రదంగా, పారదర్శకంగానే వ్యవహరించాలి కానీ, వేధించడం, బెదిరించడం చేయకూడదని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్‌శెట్టి తెలిపారు. రుణం 90 రోజులకు మించి చెల్లింపులు లేకపోతే, అప్పటికీ చెల్లించేందుకు 60 రోజుల నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. సెక్యూర్డ్ రుణం చెల్లించనప్పుడు, తనఖాలో ఉంచిన ఆస్తులు లేదా వాహనాలను విక్రయించగా, వచ్చే మొత్తం నుంచి రుణం మినహాయించుచుని మిగిలినది తిరిగి రుణ గ్రహీతకు ఇచ్చేయాల్సి ఉంటుంది. రుణం చెల్లించలేనప్పుడు మారటోరియం లేదా వన్‌టైమ్ పరిష్కారం కోసం డిమాండ్ చేయవచ్చు. రుణం చెల్లించలేకపోవడం వెనుక సహేతుక కారణాలు ఉంటే బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ సంస్థను సంప్రదించాలి. చెల్లించడానికి మరింత సమయం ఇవ్వాలని కోరొచ్చు. మీరు చెప్పిన కారణాల్లో వాస్తవికత ఉందని బ్యాంక్/ఎన్బీఎఫ్సీ భావిస్తే రుణ చెల్లింపులపై స్వల్పకాలం పాటు మారటోరియం (విరామం) కలి్పస్తాయి. లేదంటే రుణ కాల వ్యవధిని పెంచి, ఈఎంఐ మొత్తాన్ని తగ్గిస్తాయి. క్రెడిట్ కార్డు రుణం క్రెడిట్ కార్డ్ బిల్లు మొత్తం చెల్లించలేని సందర్భాల్లో, మినిమం డ్యూ (బిల్లులో నిరీ్ణత శాతం) చెల్లించినా సరిపోతుంది. ఈ మినిమం డ్యూని కూడా చెల్లించనట్టయితే ఆరు నెలలు వేచి చూసిన తర్వాత డిఫాల్ట్‌గా ఖరారు చేస్తారు. డిపాజిట్‌ను సెక్యూరిటీగా ఉంచి క్రెడిట్ కార్డు తీసుకుంటే, బకాయి పడిన సందర్భంలో డిపాజిట్‌ను రద్ధు చేసి రుణం కింద సర్దుబాటు చేసుకుంటారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పొందిన క్రెడిట్‌కార్డు అయితే, బకాయి వసూలు బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగిస్తాయి క్రెడిట్ కార్డు కంపెనీలు. రుణ గ్రహీత నుంచి రుణాన్ని రప్పించే ప్రయత్నాలను ఏజెన్సీలు చేస్తాయి. అప్పటికీ ఫలితం లేకపోతే కోర్టులో కేసు దాఖలవుతుంది. బ్యాంక్‌లు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు బ్లాక్ లిస్ట్‌ను నిర్వహిస్తుంటాయి. చెల్లింపులు చేయని వారిని బ్లాక్ లిస్ట్‌లో చేరుస్తాయి. విద్యా రుణం విద్యా రుణం ఈఎంఐ చెల్లింపులు సాధారణంగా కోర్సు ముగిసి, ఉద్యోగంలో చేరిన నాటి నుంచి మొదలవుతాయి. కానీ, కొన్ని కారణాల వల్ల కోర్స్‌లో సకాలంలో ఉత్తీర్ణులు కాకపోతే ఉద్యోగం రాదు. కోర్సు పూర్తి చేసినా కానీ వెంటనే అందరికీ ఉపాధి లభిస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. లేదంటే ఉద్యోగం వచి్చనప్పటికీ, అది కోల్పోయి ఖాళీగా ఉండాల్సి వచి్చన సందర్భాల్లో రుణ ఈఎంఐ చెల్లించలేకపోతే, తదుపరి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెంటనే ఉద్యోగం లభించకపోయినా, వచ్చిన ఉద్యోగం కోల్పోయినా బ్యాంకులను సంప్రదించి, పూర్తి వివరాలు తెలియజేయాలి. మరింత గడువు కోరాలి. లేదంటే బ్యాంక్‌లు నిర్ణీత కాలం పాటు వేచి చూసి మిగిలిన రుణాల మాదిరే నోటీసు జారీ ద్వారా తదుపరి చర్యలు ప్రారంభిస్తాయి. విద్యా రుణానికి సంబంధించి డిఫాల్టర్‌గా మారితే భవిష్యత్‌లో ఎన్నో రుణాలకు అవరోధంగా మారొచ్చు. రూ.4–10 లక్షల వరకు విద్యా రుణాలకు బ్యాంక్‌లు ఎలాంటి సెక్యూరిటీని కోరవు. అంతకుమించితే మరో వ్యక్తిని గ్యారంటర్‌గా, లేదా ప్రాపరీ్టని తనఖాగా ఉంచాలని కోరతాయి. సకాలంలో చెల్లించలేకపోతే గ్యారంటర్ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. వ్యక్తిగత రుణం వ్యక్తిగత రుణం వాయిదా గడువు ముగిసిన 30 రోజుల వరకు చెల్లించకపోతే డిఫాల్ట్‌గా పరిణిస్తాయి. ఇదే విషయాన్ని క్రెడిట్ బ్యూరోలకు తెలియజేస్తాయి. ఇలా వరుసగా మూడు వాయిదాల్లో విఫలమైతే అప్పుడు రుణంపై అదనపు వడ్డీ రేటును (పీనల్ ఇంటరెస్ట్) వడ్డిస్తాయి. 30 నుంచి 60 రోజుల్లోపు రుణ వాయిదాను వడ్డీ, అన్ని చార్జీలతో చెల్లిస్తే క్రెడిట్ స్కోర్‌పై స్వల్ప ప్రభావమే పడుతుంది. 90 రోజులకు కూడా చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్‌పై ఎక్కువ ప్రభావం పడుతుంది. 180 రోజుల తర్వాత కూడా చెల్లింపులు రాకపోతే అప్పుడు రుణ గ్రహీతపై కేసులు దాఖలవుతాయి. వినియోగ రుణం కన్జ్యూమర్ ఉత్పత్తుల కోసం తీసుకునే రుణాలు, వాహన రుణాలు అయినా గడువులోపు చెల్లించకపోతే ఒకటి రెండుసార్లు నోటీసును జారీ చేస్తాయి. 30 రోజుల్లోగా చెల్లించకపోతే అప్పుడు ముందుగా సమర్పించిన చెక్కులను నగదుగా మార్చుకునే చర్యలు మొదలు పెడతాయి. చెక్కులు బౌన్స్ అయితే కోర్టులో కేసు దాఖలు చేస్తాయి. వాహనం లేదా ఉత్పత్తిని స్వా«దీనం చేసుకుంటాయి. వడ్డీసహా రుణ మొత్తాన్ని చెల్లించి సమస్య నుంచి బయటపడవచ్చు. గృహ రుణం ఇంటిపై పొందే మార్ట్గేజ్ రుణం చెల్లించకపోతే ఇంటిని కోల్పోవాల్సి వస్తుంది. గడువు ముగిసిన తర్వాత 30 రోజుల్లోపు చెల్లింపులు లేకపోతే దాన్ని డిఫాల్ట్ (బకాయిపడినట్టు)గా పరిగణిస్తారు. వరుసగా మూడు ఈఎంఐలు కూడా చెల్లించకపోతే, అప్పుడు బకాయిలను 60 రోజుల్లోగా సెటిల్ చేసుకోవాలంటే లీగల్ నోటీసు పంపిస్తాయి. ఆ గడువులోపు స్పందించకపోతే, సర్ఫేసీ చట్టం కింద ఇంటి జప్తు ప్రక్రియను మొదలు పెడతాయి. ఆ తర్వాత కూడా కొల్లేటరల్ (తాకట్టు) విలువ, వేలం తేదీ తదితర వివరాలతో ఒక నోటీసు పంపిస్తాయి. అప్పుడు స్పందించినా, బ్యాంక్‌లు పరిష్కారానికి అవకాశం ఇస్తాయి. చివరి ఆప్షన్‌గా ఇంటిని వేలం నిర్వహిస్తాయి. దీనివల్ల ఇంటిని కోల్పోవడంతోపాటు, క్రెడిట్ రిపోర్ట్‌లో కొన్నేళ్లపాటు దీని ప్రభావం కనిపిస్తుంది. -
రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: రాష్ట్ర లీడ్ బ్యాంక్‌గా రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నితేష్ రంజన్ చెప్పారు. రిటైల్ రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. వడ్డీరేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నా రిటైల్ రుణాలకు డిమాండ్ బాగుందని చెప్పారు. విజయవాడలో జరుగుతున్న రెండు రోజుల మెగా రిటైల్ ఎక్స్పోను ఆయన శుక్రవారం ప్రారంభించి పలువురికి రుణం మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నితేష్ రంజన్ ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. ప్రశ్న: స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీలో లీడ్ బ్యాంకర్‌గా ఉన్న యూనియన్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో ఏ విధంగా భాగస్వామ్యం అవుతోంది? జవాబు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త వ్యాపార విస్తరణలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషిస్తోంది. లీడ్ బ్యాంకర్‌గా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను నిర్దేశించిన వారికి సక్రమంగా అందించడానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. రాష్ట్రంలో రిటైల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ పండుగల సీజన్ కోసం సత్వరం రుణాలను మంజూరు చేసేలా విజయవాడలో మెగా రిటైల్ లోన్ ఎక్స్పో నిర్వహిస్తున్నాం. 25 మంది బిల్డర్లు, 12 మంది వాహన డీలర్లు, 7 ఎడ్యుకేషన్కన్సల్టెన్సీలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చాం. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా టైలర్ మేడ్ రుణ పథకాలను ఆఫర్ చేసి, అక్కడిక్కడే తక్షణం రుణాలు మంజూరు చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేశాం. ప్రశ్న: ప్రస్తుతం వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. రుణ మార్కెట్‌పై వడ్డీ రేట్ల పెరుగుదల ప్రతికూల ప్రభావం చూపుతుందా? జవాబు: వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్న మాట వాస్తవమే. కానీ దీనికి భిన్నంగా దేశవ్యాప్తంగా రిటైల్ రుణాలకు భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ఆటో, ఎడ్యుకేషన్, హోమ్ లోన్స్ వంటి రుణాలకు డిమాండ్ బాగుంది. గతేడాది యూనియన్ బ్యాంక్ రిటైల్ రుణాలు 17.19 శాతం పెరిగి రూ.1,60,595 కోట్లకు చేరాయి. ఈ ఏడాది కూడా రిటైల్ రుణాల్లో 10 నుంచి 12 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. ప్రశ్న: వడ్డీ రేట్లు ఎప్పటి నుంచి తగ్గుతాయి? జవాబు: ప్రస్తుతం ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటంతో వడ్డీ రేట్లు గరిష్టస్థాయిలో ఉన్నాయి. మరో రెండు మూడు త్రైమాసికాల వరకు వడ్డీ రేట్లు గరిష్టస్థాయిలో కొనసాగుతాయని అంచనా వేస్తున్నాం. ఆ తర్వాత నుంచి క్రమేపీ తగ్గే అవకాశం ఉంది. ప్రశ్న: ఇతర బ్యాంకుల పోటీని తట్టుకోవడానికి యూనియన్ బ్యాంక్ ఏమైనా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిందా? జవాబు: ప్రస్తుతం అన్ని బ్యాంకులకంటే తక్కువ రేటుకే రుణాలు అందిస్తున్నాం. అంతేకాకుండా పండుగుల సీజన్ దృష్టిలో పెట్టుకొనిఅన్ని రిటైల్ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేశాం. విదేశాల్లో విద్య కోసం రుణాలు తీసుకునే వారికి రూ.40 లక్షల వరకు ఎటువంటి తనఖా అవసరం లేకుండా రుణాలిస్తున్నాం. ఆన్లైన్, యాప్‌ల ద్వారా క్షణాల్లో రుణాలు మంజూరు చేస్తున్నాం. ప్రశ్న: దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రుణాల మార్కెట్‌పై ఎటువంటి ప్రభావం చూపుతాయి? జవాబు: ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా అటువంటి వాతావరణం కనిపించడం లేదు. రుణాల మార్కెట్‌పై ఎటువంటి ప్రభావం లేదు. ఇప్పటికే పండుగుల సీజన్ మొదలైంది. ఇది నాలుగో త్రైమాసికం వరకు కొనసాగుతుంది. అప్పటివరకు ఇదే విధమైన డిమాండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. -
34 లక్షల మందికి ఇంటి రుణాలు
న్యూఢిల్లీ: బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు 2022లో దేశవ్యాప్తంగా 34 లక్షల మందికి ఇంటి రుణాలను మంజూరు చేశాయి. వీటి విలువ రూ.9 లక్షల కోట్లు. రిటైల్ రుణాలపై ఈక్విఫ్యాక్స్, ఆండ్రోమీడియా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రూ.25 లక్షల లోపు ఇంటి లోన్ అందుకున్నవారి సంఖ్య గతేడాది ఏకంగా 67 శాతం ఉండడం గమనార్హం. రూ.75 లక్షలు–రూ.1 కోటి వరకు తీసుకున్న లోన్లు 36 శాతం అధికం అయ్యాయి. 2021తో పోలిస్తే హోమ్ లోన్స్ 2022లో 18 శాతం ఎగశాయి. అలాగే ఈ రుణాలు అందుకున్నవారి సంఖ్య 17 శాతం పెరిగింది. 2021 డిసెంబర్ నుంచి 2022 డిసెంబర్ వరకు మొత్తం గృహ రుణాలు 16 శాతం అధికం అయ్యాయి. వ్యక్తిగత రుణాల్లో 57 శాతం వృద్ధి నమోదైంది. రిటైల్ రుణ మార్కెట్ విలువ 2022 డిసెంబర్ నాటికి రూ.100 లక్షల కోట్లకు చేరింది. 54 కోట్ల యాక్టివ్ లోన్లు ఉన్నాయి. గతేడాది చివరినాటికి గృహోపకరణాల కోసం రుణాలు అందుకున్న యాక్టివ్ కస్టమర్ల సంఖ్య 6.5 కోట్లు. 2021తో పోలిస్తే ఇది 48 శాతం అధికం. హోమ్ లోన్స్ విభాగంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఆరోగ్యకర వృద్ధిని నమోదు చేశాయి. వినియోగం పెరగడం, సులువుగా లభ్యత, రుణదాతల మధ్య పోటీ వ్యక్తిగత రుణ విభాగం డిమాండ్‌కు కారణం. ఇటీవల ఆర్బీఐ పాలసీ రేటు పెంపుదల ఉన్నప్పటికీ గృహ రుణ రేట్ల మాదిరిగా వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు పెరుగుదలను చూడలేదు. -
మెరుగ్గానే రిటైల్ రుణ వసూళ్లు
ముంబై:ఇటీవలి కాలంలో పెరిగిపోయిన వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం ప్రభావం సెక్యూరిటైజ్డ్ రిటైల్ రుణాల చెల్లింపులపై లేదని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. తాను రేటింగ్ ఇచ్చే సెక్యూరిటైజ్డ్ రుణాలకు సంబంధించి నెలవారీ వసూళ్ల రేషియో ఏ మాత్రం ప్రభావితం కాలేదని పేర్కొంది. రిటైల్ రుణ గ్రహీతలకు సంబంధించి చెల్లింపుల ట్రాక్ రికార్డు బలంగా ఉందని, ఆర్థిక కార్యకలాపాల్లో పురోగతి ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు వివరించింది. ఆర్బీఐ ఈ ఏడాది మే నుంచి మూడు విడతలుగా 1.4 శాతం మేర రెపో రేటను పెంచడం తెలిసిందే. దీంతో డిపాజిట్లు, రుణాలపై రేట్లు పెరిగేందుకు దారితీసింది. మార్ట్గేజ్ ఆధారిత సెక్యూరిటైజేషన్ రుణాల వసూళ్లు పుంజుకున్నట్టు వివరించింది. ఇక వాణిజ్య వాహన రుణాల వసూళ్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో 105 శాతంగా ఉంటే, అవి జూన్ చివరికి 98 శాతానికి తగ్గినట్టు క్రిసిల్ తెలిపింది. చమురుపై పన్ను, సుంకాలు మోస్తరు స్థాయికి రావడంతో అది అంతమంగా వినియోగదారుడికి ఊరటనిచ్చినట్టు పేర్కొంది. ‘‘ద్విచక్ర వాహన రుణాల వసూళ్లు స్థిరంగా ఉన్నాయి. నెలవారీ కలెక్షన్ల రేషియో గత కొన్ని నెలలుగా 98–99 శాతంగా కొనసాగుతోంది. ఎంఎస్ఎంఈ రుణాల వసూళ్లు 97 శాతం నుంచి 95 శాతానికి తగ్గాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. -
రిటైల్ రుణాలు.. రయ్రయ్!
గతంలో ఎన్నడూ ఎరుగని విధంగా కొద్ది నెలలనుంచీ దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఇటీవల పలు బ్యాంకింగ్ దిగ్గజాలు కార్పొరేట్ విభాగానికి బదులుగా రిటైల్ రుణాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలో రిటైల్ రుణ విభాగం పైచేయి సాధించనున్నట్లు అంచనాలు నెలకొన్నాయి. వెరసి కార్పొరేట్ రుణాలను మించి అగ్రస్థానానికి చేరే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముంబై: దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం(2020–21).. కీలక మార్పులకు వేదిక కానుంది. కొన్ని నెలలుగా గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు తదితరాలపట్ల బ్యాంకులు అత్యంత ఆసక్తి చూపుతున్నాయి. దీంతో కార్పొరేట్ రంగ డెట్‌ను వ్యక్తిగత రుణ విభాగం అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 18వరకూ) బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తం(అవుట్‌స్టాండింగ్) పారిశ్రామిక, కార్పొరేట్ రుణాలు 1.2 శాతం తగ్గి రూ. 27.6 లక్షల కోట్లకు చేరాయి. ఇదే సమయంలో వ్యక్తిగత రుణాలు 9.5 శాతం జంప్‌చేసి రూ. 26.6 లక్షల కోట్లను తాకాయి. ఇక సర్వీసుల రంగ రుణాలు 25.8 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వెరసి దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో వ్యక్తిగత రుణ విభాగం సర్వీసుల రంగ రుణాలను మించి రెండో ర్యాంకుకు చేరింది. వెనకడుగులో..: పారిశ్రామిక, కార్పొరేట్ రుణ విభాగాలలో 2014–15 మొదలు రికవరీ కనిపించడంలేదని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు వ్యక్తిగత రుణ విభాగంపై ప్రత్యేక దృష్టిని సారించినట్లు తెలియజేశాయి. ఫలితంగా గృహ, ఆటో రుణాలు, క్రెడిట్ కార్డులు వృద్ధి బాటలో సాగుతున్నట్లు నార్నోలియా సెక్యూరిటీస్ సీఐవో శైలేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం పారిశ్రామిక, కార్పొరేట్ లోన్‌బుక్ నీరసిస్తూ వస్తోంది. తాజా రుణ మంజూరీకంటే చెల్లింపులు పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత 9 నెలల్లో పారిశ్రామిక రుణాలు 5 శాతం క్షీణించగా.. సర్వీసుల రంగ రుణాలు 0.6 శాతం మందగించాయి. అయితే వ్యక్తిగత రుణాలు 4.3 శాతం పుంజుకున్నాయి. వ్యవసాయ రుణాలైతే 7.6 శాతం ఎగశాయి. దీంతో సమీప కాలంలో రిటైల్ లోన్ పోర్ట్‌ఫోలియో దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో అతిపెద్ద విభాగంగా ఆవిర్భవించే వీలున్నట్లు పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఐఐపీ వీక్... కొంతకాలంగా తయారీ, పారిశ్రామిక రంగాలలో క్షీణత కొనసాగుతుండటంతో ఇండస్ట్రియల్ క్రెడిట్ వెనకడుగు వేస్తున్నట్లు బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా తయారీ రంగం నీరసిస్తుండటంతో కొత్త పెట్టుబడి ప్రణాళికలు కరువైనట్లు తెలియజేశారు. దీంతో కార్పొరేట్ క్రెడిట్‌కు డిమాండ్ తగ్గినట్లు ఈక్వినామిక్స్ రీసెర్చ్ వ్యవస్థాపక ఎండీ జి.చొక్కలింగం వివరించారు. సాధారణంగా సామర్థ్య విస్తరణ, కొత్త ప్రాజెక్టులు, ప్లాంట్ల ఏర్పాటు తదితరాల కారణంగా కార్పొరేట్ రుణాలకు డిమాండ్ పుట్టుకొస్తుందని తెలియజేశారు. కారణాలివీ... ఇటీవల వడ్డీ రేట్లు తగ్గడం, టెక్నాలజీ ఆధారిత (ఆన్లైన్) రుణ మంజూరీ పెరగడం వంటి అంశాలు రిటైల్ విభాగంలో రుణ వృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ విభాగంలో క్రెడిట్ కార్డులు, ఇతర వ్యక్తిగత అన్సెక్యూర్డ్ రుణాలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. అయితే మొత్తం వ్యక్తిగత పోర్ట్‌ఫోలియోలో చూస్తే సెక్యూర్డ్ విభాగంలోని గృహ రుణాలు, ఆటో రంగ రుణాలు నెమ్మదిస్తున్నాయి. వ్యక్తిగత పోర్ట్‌ఫోలియోలో ఆర్బీఐ గణాంకాల ప్రకారం గృహ, వాహన రుణాలు, క్రెడిట్ కార్డులు మూడు పెద్ద విభాగాలుగా ఆవిర్భవించాయి. హౌసింగ్ వాటా 52.3 శాతంకాగా.. గత ఐదేళ్లలో క్రెడిట్ కార్డులు తదితర రుణాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా క్రెడిట్ కార్డుల రుణాల వాటా 4.1 శాతానికి చేరడం గమనార్హం! -
రుణ గ్రహీతల్లో... మూడోవంతు మహిళలే
ముంబై: మహిళలు రుణాలను ఆశ్రయించే పరిస్థితి పెరుగుతోంది. రిటైల్ రుణాలు తీసుకుంటున్న వారిలో మహిళల శాతం 2020 సెప్టెంబర్ నాటికి 28 శాతానికి చేరినట్టు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ సంస్థ వెల్లడించింది. రుణాలు తీసుకుంటున్న మహిళల శాతం 2014 నుంచి 21 శాతం మేర పెరిగినట్టు వివరించింది. 2014 నాటికి రుణాలు తీసుకునే మహిళలు 23 శాతంగానే ఉన్నారని పేర్కొంది. కానీ ఇదే కాలంలో రుణాలను ఆశ్రయించిన పురుషులు 16 శాతమే పెరిగారని.. మొత్తం మీద పురుషులతో పోలిస్తే మహిళలే ఈ కాలంలో ఎక్కువగా రుణ బాట పట్టారని.. రుణ మార్కెట్లో మహిళా రుణ గ్రహీతల సంఖ్య 4.7 కోట్లకు చేరుకుందని సిబిల్ నివేదిక తెలియజేసింది. ‘‘రిటైల్ రుణాల్లో రూ.15.1 లక్షల కోట్లు నేడు మహిళలు తీసుకున్నవే. గత ఆరేళ్ల కాలంలో వార్షికంగా 12 శాతం చొప్పున పెరిగింది’’ అని వివరించింది. ‘‘కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగడానికి తోడు, ఆర్థిక అవకాశాలను సొంతం చేసుకునే దిశగా ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన చర్యలు ఈ వృద్ధికి దోహదపడ్డాయి’’ అని సిబిల్ సీవోవో హర్షలా చందోర్కర్ తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో మహిళలు ఇళ్ల కొనుగోలుపై స్టాంప్ డ్యూటీ చార్జీలు తక్కువగా ఉండడం, మహిళలకు ప్రోత్సాహకంగా కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణాలను ఆఫర్ చేస్తుండడం కూడా దీనికి తోడ్పడినట్టు చెప్పారు. -
రిటైల్ రుణ గ్రహీతలకు కష్ట కాలమే!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల రిటైల్ కస్టమర్లకు ప్రత్యేకించి దిగువ ఆదాయ రుణ గ్రహీతలకు కష్టాలు కొనసాగుతాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలు రుణ వ్యయాలు అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని తెలిపింది. మూడీస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ శ్రీకాంత్ వడ్లమాని తెలిపిన ముఖ్యాంశాలు చూస్తే... కరోనా ప్రారంభ దశలో ఊహించినదానికన్నా మెరుగ్గా ప్రస్తుత బ్యాంకింగ్ రుణ నాణ్యత ఉంది. ప్రత్యేకించి కార్పొరేట్ రుణాల విషయంలో బ్యాంకింగ్ బాగుంది. మొండిబకాయిలకు సంబంధించి తగినకేటాయింపులు జరపడం దీనికి ఒక కారణం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మొండిబకాయిలు తగ్గుతున్నాయి. మహమ్మారి కరోనా ప్రేరిత సవాళ్ల వల్ల మధ్య, చిన్న తరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) రుణ గ్రహీతలు ఇబ్బందులు పడ్డారు. ఎకనమీ రికవరీ దశలోనూ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విభాగానికి సంబంధించి రుణ నాణ్యతలో సవాళ్లు తలెత్తకుండా ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన చర్యలు తగిన ఫలితాన్ని ఇచ్చాయి. ప్రైవేటు రంగ బ్యాంకులతో పోల్చితే ప్రైవేటు రంగం బ్యాంకింగ్ రుణ నాణ్యత బాగుంటుంది. అయితే కేంద్రం నుంచి తాజా మూలధన కల్పన కొంత ఊరటనిచ్చే అంశం. 2021 చివరి ఆరు నెలల కాలంలో బ్యాంకింగ్ యేతర ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) రుణ నాణ్యత మరింత దెబ్బతినవచ్చు. 2022లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే వీలుంది. ఆటో, చిన్న వ్యాపారాల్లో ఒడిదుడుకులు దీనికి కారణంగా మారే వీలుంది. తగిన స్థాయిలో వృద్ధి, ద్రవ్యలోటు అంచనాలు వృద్ధి, ద్రవ్యలోటు అంచనాల విషయంలో 2021-22 బడ్జెట్ వాస్తవికతకు అద్దం పడుతోందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన ఫిబ్రవరి 1 బడ్జెట్ ప్రసంగంలో 2021-22లో ప్రభుత్వ ఆదాయ– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును 6.8 శాతానికి కట్టడి చేస్తామని పేర్కొంటూ, వృద్ధికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ద్రవ్యపరమైన బలహీన పరిస్థితి భారత్‌కు 2021కు ‘క్రెడిట్’ సవాళ్లను విసురుతుందనీ మూడీస్ పేర్కొంది. ద్రవ్యలోటును బడ్జెట్ ప్రతిపాదనలకన్నా తక్కువగా ఉంచాల్సిన అవసరాన్ని మూడీస్ సూచించింది. అలాగే భారత్ రుణ భారాన్నీ మూడీస్ ప్రస్తావించింది. ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలన్నింటినీ తీసుకోవాలి. వ్యత్యాసం– ద్రవ్యలోటు అంచనాలను 9.5 శాతానికి (2020-21 స్థూల దేశీయోత్పిత్తి-జీడీపీలో) సవరిస్తున్నట్లు బడ్జెట్ పేర్కొంది. 2020-21 బడ్జెట్ ప్రకారం 3.5 శాతం వద్ద (రూ. రూ.7.96 లక్షల కోట్లు) కట్టడి చేయాలన్నది లక్ష్యం. ఇక రానున్న ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 6.8 శాతానికి కట్టడి చేయాలన్నది బడ్జెట్ లక్ష్యమని వివరించింది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళతామని ఆర్థికమంత్రి భరోసాను ఇచ్చారు. 2019-20లో ద్రవ్యలోటు 4.6 శాతం. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021-22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023-24 నాటికి 5 శాతానికి, 2024-25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. జీడీపీలో రుణ నిష్పత్తి 90 శాతానికి దాటిపోయే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది. 2019లో ప్రభుత్వ రుణ–జీడీపీ నిష్పత్తి 72 శాతంగా ఉంది. రేటింగ్ విషయంలో ఈ అంశం చాలా కీలకమైనది. వృద్ధి అంచనాలు 13.7 శాతానికి పెంపు భారత్ ఎకానమీ 2021–22లో 13.7 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్షీణత ఏడు శాతానికి పరిమితం అవుతుందని విశ్లేషించింది. ఈ మేరకు నవంబర్ అంచనాలను గణనీయంగా మెరుగుపరచింది. అప్పట్లో 2021–22 ఆర్థిక సంవత్సరం వృద్ధిని 10.8 శాతంగా అంచనావేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్షీణతను 10.6 శాతంగా పేర్కొంది. సాధారణ పరిస్థితులు నెలకొనడం, వ్యాక్సినేషన్ వేగవంతంతో మార్కెట్లో విశ్వాసం మెరుగుపడ్డం తన క్రితం అంచనాల తాజా సవరణకు కారణమని మూడీస్ వివరించింది. సంస్కరణల అమలు ఇప్పటికీ భారత్‌కు సవాళ్లు విసురుతున్న అంశమేనని తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే విషయంలో ఇంకా అస్పష్టత ఉందని విశ్లేషించింది. -
ఐదేళ్లలో రెట్టింపు కానున్న రిటైల్ రుణాలు
ముంబై: ఫైనాన్స్ సంస్థల రుణ పుస్తకం విలువ 2019 మార్చి నాటికి రూ.48 లక్షల కోట్లుగా ఉండగా, ఇది వచ్చే ఐదేళ్ల కాలంలో 2024 నాటికి రూ.96 లక్షల కోట్లకు వృద్ధి చెందుతుందని ఐసీఐసీఐ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ప్రైవేటు వినియోగం (ఇల్లు, కారు, కన్జ్యూమర్ డ్యురబుల్స్, క్రెడిట్ కార్డులు) కారణంగా రుణ మార్కెట్ భారీగా వృద్ధి చెందనుందని అంచనా వేసింది. వినియోగదారుల్లో రుణాలు తీసుకునే ధోరణి పెరుగుతుండడం, అదే సమయంలో వినియోగదారుల డేటా లభ్యత పెరగడం, డేటా అనలైటిక్స్ వినియోగం అన్నవి చౌక గృహ రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాల వృద్ధికి దారితీయనున్నట్టు ఈ సంస్థ వివరించింది. -
ఈ ఏడాది రిటైల్ లోన్లు 30 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.12,500 కోట్ల రిటైల్ లోన్లు మంజూరు చేయాలని ఐసీఐసీఐ బ్యాంకు లక్ష్యం విధించుకుంది. 2017–18తో పోలిస్తే ఇది 30 శాతం అధికమని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుప్ బాగ్చి తెలిపారు. బ్యాంకు ప్రతినిధులు సుజిత్ గంగూలీ, సిద్ధార్థ మిశ్రా, కౌశిక్ దత్తా, ప్రశాంత్ సింగ్, శాంతనూ సమద్దర్తో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘2018–19లో గృహ రుణాలు 25 శాతం వృద్ధి చెంది రూ.4,000 కోట్లు నమోదు కానున్నాయి. కంజ్యూమర్ లోన్లు 30 శాతం పెరిగి రూ.5,500 కోట్లను తాకనున్నాయి. ఈ వృద్ధిని చేరుకునేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తాం. అందుబాటు గృహ విభాగంపై ఫోకస్ చేస్తాం. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడతాం. మొత్తం రుణాల్లో రిటైల్ వాటా అత్యధికంగా 60 శాతం ఉంది’ అని తెలిపారు. డిజిటల్ వైపు కస్టమర్లు.. : లావాదేవీల కోసం కస్టమర్లు బ్యాంకుల రాక గణనీయంగా తగ్గిందని అనుప్ తెలిపారు. డిజిటల్ లావాదేవీలకే వినియోగదార్లు మొగ్గుచూపుతున్నారని చెప్పారు. ‘నగదు తీసుకోవడానికి మాత్రమే ఏటీఎం కేంద్రాలకు వినియోగదార్లు వెళ్తున్నారు. ఇతర లావాదేవీలన్నీ ఆన్లైన్లో పూర్తి చేస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంకు మొత్తం లావాదేవీల్లో డిజిటల్ వాటా ఏకంగా 85 శాతం ఉంది. అయితే కస్టమర్లు ఆన్‌లైన్‌కు మళ్లుతున్నప్పటికీ బ్యాంకు శాఖల విస్తరణ కొనసాగుతుంది. శాఖల ఏర్పాటుతో వ్యాపారం వృద్ధి చెందుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం సంస్థకు 340 శాఖలు ఉన్నాయి. ఇందులో 50 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కొలువుదీరాయి. క్రెడిట్ ప్రాసెసింగ్ కేంద్రాలను మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’ అని వివరించారు. -
రిటైల్ రుణాల్లో బోలెడన్ని అవకాశాలు
ముంబై: దాదాపు దశాబ్దకాలంగా బ్యాంకులు రిటైల్ రుణాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నప్పటికీ.. ఈ విభాగంలో పూర్తి స్థాయిలో విస్తరించలేకపోతున్నాయి. రుణాలు పొందేం దుకు అర్హత ఉన్న వారిలో కేవలం మూడో వంతు మందినే చేరగలిగాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్ యూనియన్ సిబిల్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం రుణార్హత ఉన్న వినియోగదారులు 22 కోట్ల మందికి పైగా ఉండగా, ఇందులో కేవలం మూడో వంతు మంది... అంటే 7.2 కోట్ల మంది మాత్రమే ఏదో ఒక బ్యాంకు నుంచో, ఇతర ఆర్థిక సంస్థల నుంచో రుణాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వయస్సుపరంగా, ఆదాయాలపరంగా రుణార్హత ఉన్న 15 కోట్ల మంది పైగా వినియోగదారులను చేరేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు పుష్కలంగా వ్యాపార అవకాశాలున్నాయని సిబిల్ తెలిపింది. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, వినియోగవస్తువులకు రుణాలు తదితర సాధనాల ద్వారా ఈ విభాగంలో విస్తరించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు అవకాశాలు ఉన్నాయని సిబిల్ తెలిపింది. -
లోను కావాలా గురూ..!
న్యూఢిల్లీ: కార్పొరేట్లకు భారీగా రుణాలిచ్చి అవి వసూలు కాక సమస్యలను ఎదుర్కొంటున్న బ్యాంకులు ఇప్పుడు సామాన్యుల వెంట పడ్డాయి. బ్యాంకుల కొత్త వ్యాపారంలో సింహభాగం రిటైల్ రుణాలే ఉంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 16 నాటికి చూస్తే పెరిగిన బ్యాంకుల వ్యాపారంలో 96 శాతం వ్యక్తిగత రుణాలు (పర్సనల్ లోన్స్) కావడం గమనార్హం. 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకుల రుణాల వ్యాపారంలో 41.5 శాతం వ్యక్తిగత రుణాలేనని ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కార్పొరేట్ రుణాలు ఇప్పుడు ఎన్పీఏలుగా మారినట్టే... భవిష్యత్తులో రిటైల్ రుణాల నుంచి ఇదే మాదిరి రిస్క్ ఉండొచ్చని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విశ్వనాథన్ తాజాగా హెచ్చరించడం ఇందుకేనేమో. పారిశ్రామిక డిమాండ్ తగ్గినందున కార్పొరేట్ రంగం నుంచి తాజా పెట్టుబడులు లేని పరిస్థితికి ఇది అద్దం పడుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గణాంకాలు ఇవి... 2017 ఏప్రిల్ నుంచి 2018 ఫిబ్రవరి 16 వరకు పదిన్నర నెలల కాలంలో బ్యాంకుల నాన్ ఫుడ్ రుణాలు (ఆహారోత్పత్తి కోసం కాకుండా ఇచ్చేవి) రూ.2.44 లక్షల కోట్లుగా ఉంటే ఇందులో రూ.2.34 లక్షల కోట్లు వ్యక్తిగత రుణాలే. ఈ ప్రకారం చూస్తే 2017–18 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత రుణాల వ్యాపారంలో వృద్ధి 17.6 శాతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కాలంలో పరిశ్రమలకు ఇచ్చే రుణాలు రూ.5.28 లక్షల కోట్ల మేర తగ్గగా, వ్యవసాయం, అనుబంధ రంగాల రుణాల్లో రూ.2.44 లక్షల కోట్ల మేర వృద్ధి నెలకొంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో నాన్ ఫుడ్ రుణాలు రూ.5.48 లక్షల కోట్లు కాగా, అందులో రూ.2.61 లక్షల కోట్లు వ్యక్తిగత రుణాలే ఉండడం గమనార్హం. ‘పర్సనల్ లోన్స్’ అంటే వినియోగ ఉత్పత్తుల కొనుగోలుకు ఇచ్చేవి, వాహన రుణాలు, విద్యా రుణాలు, క్రెడిట్ కార్డు, ఎఫ్డీలు, షేర్లపై ఇచ్చే రుణాలు అన్నీ. విశ్లేషకులు ఏమంటున్నారు? ‘‘ఇదేమీ ఆశ్చర్యపరిచే విషయం కాదు. కార్పొరేట్లు రుణాలు తీసుకోవడం దాదాపుగా ఆపేశాయి. దీంతో బ్యాంకులకు ఇప్పుడు వృద్ధికి అవకాశం ఉన్న ఏకైక విభాగం రిటైల్ రుణాలే. ఇదే పరిస్థితి మరికొన్ని త్రైమాసికాల పాటు కొనసాగుతుంది. ఎందుకంటే పారిశ్రామిక రుణాలకు తగిన డిమాండ్ లేదిప్పుడు. సేవల రంగం వృద్ధి కారణంగా వ్యక్తులు రుణాలు తీసుకుంటూనే ఉన్నారు’’ అని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ ధనుంజయ్ సిన్హా తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి గణాంకాలు బయటకు వస్తే రిటైల్ రుణాల వాటా తగ్గొచ్చని ఈక్వినామిక్స్ ఎండీ జి.చొక్కలింగం పేర్కొన్నారు. చారిత్రకంగా చూస్తే ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో (జనవరి–మార్చి) పారిశ్రామిక, ఇనిస్టిట్యూషనల్ రుణాల్లో పెరుగుదల ఉన్నట్టు తెలుస్తోందన్నారు. కొంత కాలానికి తయారీరంగంలో సామర్థ్యం వినియోగం పుంజుకుంటే తాజా పెట్టుబడులకు మళ్లీ పరిస్థితులు అనుకూలిస్తాయని ఇండియా రేటింగ్స్ పబ్లిక్ ఫైనాన్స్ హెడ్ దేవేంద్ర పంత్ అభిప్రాయపడ్డారు. మరికొందరు నిపుణులు మాత్రం గృహస్తుల రుణాలు పెరిగిపోతున్నాయని, వారి వ్యక్తిగత ఆదాయంలో వృద్ధి 5–6 శాతం కంటే తీసుకునే వ్యక్తిగత రుణాల్లో వృద్ధి 18–20 శాతం ఉంటోందని చెబుతున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగితే బ్యాంకులకు ఈ రుణాలు సమస్యగా మారొచ్చని హెచ్చరిస్తున్నారు. -
పావు శాతం రేట్ల కోత చాన్స్!
ద్రవ్యోల్బణం దిగొస్తుంది... * రిటైల్ రుణాలవైపు బ్యాంకుల మొగ్గు... * ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ముంబై: బ్యాంకులు త్వరలో పావు శాతం మేర వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం దిగిరానున్న నేపథ్యంలో రేట్ల కోతకు ఆస్కారం లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మరోపక్క, దేశీ బ్యాంకింగ్ రంగం మొండిబకాయిల(ఎన్పీఏ) సమస్య నుంచి కోలుకోవడం అనేది ఆర్థిక వ్యవస్థ పనితీరుతో ముడిపడి ఉంటుందన్నారు. వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వార్తా ఏజెన్సీలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ అంశాలను ప్రస్తావించారు. ‘ఇటీవల రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలకు బేస్ ఎఫెక్ట్ ప్రధాన కారణం. అయితే, ఈ ప్రభావం మెల్లగా తొలగనుండటంతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టేందుకు వీలుంది. వెరసి బ్యాంకుల వడ్డీరేట్ల తగ్గుదలకు దోహదం చేయనుంది’ అని భట్టాచార్య తెలిపారు. ఆర్బీఐ గత ఏడాదికాలంగా కీలక పాలసీ రేటు(రెపో)ను 1.5 శాతం మేర తగ్గించినప్పటికీ.. రుణ రేటు తగ్గింపునకు సంబంధించి ఈ మొత్తం ప్రయోజనంలో దాదాపు సగాన్ని మాత్రమే బ్యాంకులు తమ కస్టమర్లకు బదలాయించిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం లక్ష్యం కష్టసాధ్యమే... ప్రభుత్వం నిర్దేశించిన 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం కష్టసాధ్యమైనదేనని ఎస్బీఐ చీఫ్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో గడిచిన 60 ఏళ్లలో దేశంలో ఆహార ద్రవ్యోల్బణం చాలా అరుదుగా మాత్రమే 6 శాతం దిగువకు వచ్చిందని, మరోపక్క, మనది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమేనన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. వచ్చే ఐదేళ్లపాటు వార్షిక ప్రాతిపదికన ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని 4 శాతం(2 శాతం అటూఇటుగా)గా ప్రభుత్వం నిర్దేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఆర్బీఐ లక్ష్యం 5 శాతంగా ఉంది. మొండిబకాయిలపై..: ఇప్పటివరకూ పోగుపడిన మొండిబకాయిలను(ఎన్పీఏ) తగ్గించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని.. అయితే, కొత్తగా ఎన్పీఏలు జతవుతూనే ఉంటాయని కూడా ఆమె పేర్కొన్నారు. ‘రానున్న కాలంలో దాదాపు రూ.40 వేల కోట్ల ఎన్పీఏలకు ఆస్కారం ఉందని మేం ఇప్పటికే అంచనా వేశాం. ఇందులో 8,000-9,000 కోట్ల విలువైన రుణాలు ఇప్పటికే ఈ జాబితాలో చేరాయి. ఈ సమస్యనుంచి పూర్తిగా గట్టెక్కాలంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో పుంజుకోవాల్సి ఉంటుంది. ఇందుకు దీర్ఘకాలమే పట్టొచ్చు. అయితే, ఐదేళ్లలోపే ఎకానమీ మళ్లీ పరుగులు తీస్తుందని భావిస్తున్నా’ అని ఎస్బీఐ చీఫ్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ రుణాలు భారం.. కార్పొరేట్ రుణాలకు సంబంధించి ఆర్బీఐ తాజా ప్రతిపాదనలతో బ్యాంకులు రిటైల్ రుణాలవైపు అధికంగా మొగ్గుచూపే అవకాశం ఉందని భట్టాచార్య పేర్కొన్నారు. రిటైల్ రుణ విభాగంలో ఎలాంటి సమస్యలూ(బబుల్) లేవని స్పష్టంచేశారు. పెద్దస్థాయి కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే రుణం నిర్ధిష్ట పరిమితిదాటితే బ్యాంకులు తప్పకుండా అదనపు కేటాయింపులు(ప్రొవిజనింగ్) చేయాలని ఆర్బీఐ గత నెలలో విడుదల చేసిన ముసాయిదా నిబంధనల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్పీఏలు 14.5 శాతానికి ఎగబాకి ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో ఆర్బీఐ తాజా నిబంధనలకు తెరతీసింది. ‘ఈ నిబంధనల కారణంగా రుణగ్రహీతలతో పాటు బ్యాంకులకు కూడా భారం పెరుగుతుంది. ఆర్బీఐ చర్యలతో బ్యాంకులు రిటైల్ రుణాలవైపు అధికంగా దృష్టిపెట్టేందుకు ఆస్కారం ఉంది. ఇక మా రిటైల్ రుణ విభాగం గతేడాది 20 శాతం మేర వృద్ధి చెందింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనూ ఇదేస్థాయి వృద్ధి నమోదైంది. మొండిబకాయిల పెరుగుదల సంకేతాలేవీ లేవు. మరోపక్క, దేశ జీడీపీతో పోలిస్తే బ్యాంకుల మొత్తం రిటైల్ రుణాలు 10 శాతం కంటే తక్కువే. ఇతర వర్ధమాన దేశాలతోపోలిస్తే ఇదే అత్యంత కనిష్టం. ఈ నేపథ్యంలో రానున్నకాలంలో ఈ విభాగంలో భారీ రుణ వృద్ధికి అవకాశాలు ఉన్నాయి’ అని ఎస్బీఐ చీఫ్ వ్యాఖ్యానించారు. -
రిటైల్ రుణాలు బబుల్ కాదు: ఎస్ బీఐ
ముంబై: రిటైల్ రుణాలు పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న బబుల్లా ఉన్నాయనడం సరికాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ అరుంధతి భట్టాచార్య వ్యాఖ్యానించారు. రిటైల్ రుణాలు పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న బబుల్లాగా ఉన్నాయంటూ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించి రోజులు గడవకముందే అరుంధతి ఆయనతో విభేదించటం గమనార్హం. వినియోగదారుల రుణాలకు సంంధించి బబుల్ లాంటి పరిస్థితులు లేవన్నారు. డిజిటల్ సాధనాల తోడ్పాటుతో ఉత్తమమైన ప్రమాణాలను కొనసాగించినంత కాలం వినియోగదారుల రుణాల విభాగానికేమీ ఢోకా లేదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రిటైల్ రంగంలో జరగాల్సింది ఎంతో ఉందని, సాధించాల్సింది మరెంతో ఉందని చెప్పారు. జీడీపీలో రిటైల్ రుణాలు మన దేశంలో చాలా తక్కువ స్థాయిలో (10 శాతం కంటే తక్కువగానే) ఉన్నాయని, మలేషియాలో 30-35 శాతంగా ఉండగా, వృద్ధి చెందిన దేశాల్లో ఇంకా అధికంగా ఉన్నాయని తెలియజేశారు. ఇక్కడ జరిగిన ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సమావేశంలో ఆమె మాట్లాడారు. మన దేశంలో యువత అధికంగా ఉందని, వారి ఆశయాల కోసం మరిన్ని రుణాలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. -
బ్యాంకులు మరిన్ని వస్తే మంచిదే..
యస్ బ్యాంక్ సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్ ప్రళయ్ మండల్ ♦ పోటీ పెరిగితే బ్యాంకింగ్ పరిధీ పెరుగుతుంది ♦ రిటైల్ రుణాలు మరింత పెంచుకుంటాం ♦ త్వరలో క్రెడిట్ కార్డు తెస్తున్నాం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చే దిశగా దేశీయంగా మరిన్ని బ్యాంకుల రాక ఆహ్వానించతగ్గ పరిణామమే అంటున్నారు యస్ బ్యాంక్ సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్ (రిటైల్, బిజినెస్ బ్యాంకింగ్ విభాగం) ప్రళయ్ మండల్. వీటి వల్ల పోటీ పెరిగినా బ్యాంకింగ్ వ్యవస్థ కూడా విస్తరించి అవకాశాలూ పెరుగుతాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారాయన. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ఆన్-ట్యాప్ బ్యాంకింగ్ లెసైన్సుల ప్రతిపాదనపై... వివిధ కారణాల రీత్యా గత కొన్నాళ్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకుల విస్తరణ మందగించింది. ఇక విదేశీ బ్యాంకుల మార్కెట్ కూడా తగ్గుతోంది. గతంలో ఆరు శాతం పైగా ఉన్నది ప్రస్తుతం నాలుగు శాతం స్థాయిలో ఉంది. అంతర్జాతీయ పరిణామాలు, స్వదేశాల్లో సమస్యలు, నియంత్రణపరమైన అంశాలు మొదలైన వాటి ప్రభావంతో పలు విదేశీ బ్యాంకులు వైదొలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా మరిన్ని బ్యాంకులు రావాల్సిన అవసరం ఉందనడంలో సందేహం లేదు. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఇవి తోడ్పడగలవు. ఇక పోటీ అంటారా.. చాలా మటుకు బ్యాంకులు నిలదొక్కుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టేస్తుంది. అలాగే తమ విశిష్టతను చాటుకునేలా ప్రత్యేక విభాగాలను గుర్తించి, ఎదిగేందుకు సమయం పడుతుంది. ఈ క్రమంలో కొన్ని బ్యాంకులు నిలబడతాయి. మరికొన్ని విజయం సాధించలేకపోవచ్చు. పేమెంట్, చిన్న బ్యాంకుల నుంచి పోటీ.. కొత్తగా పలు పేమెంట్ బ్యాంకులు, చిన్న బ్యాంకులు వస్తున్నాయి. ఇవి విభిన్న వర్గాల కోసం ఉద్దేశించినవి. ఎక్కువగా నగదు లావాదేవీలు జరిపే వారిని బ్యాంకింగ్ పరిధిలోకి తెచ్చేందుకు పేమెంట్ బ్యాంకులు ఉపయోగపడతాయి. వీటి రాకతో మొబైల్ పేమెంట్స్ తదితర చెల్లింపుల విధానాలు అభివృద్ధి చెందుతాయి.అయితే, పరిమితమైన సేవలు అందించే చెల్లింపుల బ్యాంకులు మిగతా కార్యకలాపాల కోసం మళ్లీ ప్రధాన బ్యాంకుల తోడ్పాటు తీసుకోవాల్సి ఉంటోంది. పేమెంట్ బ్యాంకుల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చే వారి సంఖ్య విస్తరిస్తుంది. వాణిజ్య బ్యాంకులకు వీటి నుంచి ఎక్కువ సమస్యా ఉండబోదు. కానీ దాదాపు పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందించే చిన్న బ్యాంకుల నుంచి కొంత పోటీ ఉండొచ్చు. అయితే, వీటి పరిధి కూడా కొంత వరకే పరిమితం అవుతుంది కనుక, పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవల కోసం ఖాతాదారులు మళ్లీ ప్రధాన బ్యాంకులవైపే మళ్లవచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చే వారి సంఖ్య విస్తరిస్తుంది. చిన్న బ్యాంకుల పరిధిని దృష్టిలో పెట్టుకుంటే ఇవి ఎక్కువగా ఇతరత్రా స్థానిక, ప్రాంతీయ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మొదలైన వాటికి ఎక్కువగా పోటీ ఇవ్వొచ్చు. డిజిటైజేషన్ తర్వాత బ్యాంకింగ్ వ్యయాలు పెరిగిపోవడంపై... చార్జీలు ఎప్పుడూ ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఖాతాదారుల సౌకర్యార్థం ఏటీఎంలు, నెట్ బ్యాంకింగ్ వంటి మరిన్ని బ్యాంకింగ్ మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. చిన్న వ్యాపారస్తులు మొదలైన వారి కోసం బంచ్ నోట్ యాక్సెప్టర్స్ వంటివి కూడా తెచ్చాం. ఇలాంటి వాటి వల్ల ప్రతీ బ్యాంకింగ్ లావాదేవీకి పనులు మానుకుని, లేదా సెలవు పెట్టుకుని మరీ బ్యాంకులకి వెళ్లాల్సిన సమస్య తగ్గింది. ఖాతాదారులకు ప్రయోజనకరంగా ఉంటున్న ఈ తరహా సాధనాల ద్వారా జరిపే లావాదేవీలపై నామమాత్రపు చార్జీలే ఉంటున్నాయి. ఎన్‌పీఎల కట్టడిపై.. మా వ్యాపారంలో 65 శాతం కార్పొరేట్, 35 శాతం రిటైల్ వాటా ఉంటోంది. మా నికర ఎన్పీఏలు సుమారు 0.29 శాతం మేర ఉన్నాయి. కార్పొరేట్‌తో పోలిస్తే అధిక మార్జిన్లు ఉండే రిటైల్, ఎస్ఎంఈల రుణాల్లో ఎన్పీఏలు కొంత అధికంగా ఉంటాయి. కార్పొరేట్ల రుణాల విషయానికొస్తే... ప్రతి అంశాన్ని ఆయా రంగాల్లో నిపుణులైన టీమ్‌లు నిశితంగా అధ్యయనం చేస్తాయి. మా దగ్గర ఇలాంటి ఏడెనిమిది నాలెడ్జ్ విభాగాలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం సమస్యాత్మక రంగాలకు రుణాలిచ్చిన కన్సార్షియంలలో మా బ్యాంకు పరిమాణం దృష్ట్యా మేం భాగం కాలేదు. దీంతో కన్సార్షియంలపరమైన ఒత్తిళ్లేమీ లేవు. ఆయా రంగాల్లో మొండి బకాయిల ప్రభావాలు మాపై పెద్దగా లేవు. ఒత్తిడిలో ఉన్న సంస్థలకు ఆర్థిక తోడ్పాటునిచ్చినా బ్రిడ్జి ఫైనాన్సింగ్ మొదలైన వాటి రూపంలోనే ఉంటోంది కనుక ఎన్పీఏలపరమైన సమస్య పెద్దగా లేదు. విస్తరణ ప్రణాళికలు.. దశాబ్దం పైగా విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తున్న మా బ్యాంకుకు ప్రస్తుతం దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో 1.3 శాతం మేర మార్కెట్ వాటా ఉంది. దీన్ని 2020 నాటికి 2.5 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నాం. అప్పటికల్లా కార్పొరేట్, రిటైల్ విభాగాలను చెరి యాభై శాతం వాటాల స్థాయికి తెచ్చుకోవాలనుకుంటున్నాం. ప్రస్తుతం 900 పైచిలుకు శాఖలు, 1,200 పైగా ఏటీఎంలు ఉన్నాయి. శాఖల సంఖ్యను ఏటా 25 శాతం పెంచుకుంటున్నాం. 2020 నాటికల్లా 2,500 శాఖలకు చేరాలని నిర్దేశించుకున్నాం. తెలంగాణలో 14, ఆంధ్రప్రదేశ్‌లో 11 శాఖలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చెరి అయిదు శాఖలను ప్రారంభిస్తున్నాం. ఏపీలోని చిత్తూరు, ఒంగోలు, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో కొత్తవి వస్తున్నాయి. ఈ త్రైమాసికంలో క్రెడిట్ కార్డు కూడా ప్రవేశపెట్టబోతున్నాం. ఫైనాన్షియల్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థలకు తోడ్పాటు అందించే దిశగా ఇటీవలే తెలంగాణలో టీ-హబ్‌తో చేతులు కలిపాం. -
ఐసీఐసీఐ లాభం రయ్..
క్యూ2లో రూ. 3,419 కోట్లు; 12 శాతం అప్ * ఆదాయం 13.5 శాతం వృద్ధి; రూ.25,137 కోట్లు * రిటైల్ రుణాలు, విదేశీ మార్జిన్ల ఆసరా.. * మరింత పెరిగిన మొండిబకాయిలు... * ఐసీఐసీఐ లాంబార్డ్‌లో మరో 9% వాటా విక్రయానికి ఓకే ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంక్.. అంచనాలను మించిన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2015-16, క్యూ2)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన(అనుబంధ సంస్థలతో కలిపి) రూ.3,419 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.3,065 కోట్లతో పోలిస్తే 12% వృద్ధి నమోదైంది. ప్రధానంగా రిటైల్ రుణాలు పుంజుకోవడం, విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మార్జిన్లు మెరుగుపడటం లాభాల జోరుకు దోహదం చేసింది. అయితే, మొండిబకాయిలు మాత్రం మరింత పెరగడం గమనార్హం. ఇక మొత్తం ఆదాయం క్యూ2లో 13.5 శాతం వృద్ధితో రూ.22,150 కోట్ల నుంచి రూ.25,138 కోట్లకు దూసుకెళ్లింది. స్టాండెలోన్‌గానూ జోష్... బ్యాంకింగ్ బిజినెస్(సాండెలోన్) ప్రాతిపదికన కూడా ఐసీఐసీఐ ఆకర్షణీయమైన పనితీరును నమోదుచేసింది. సెప్టెంబర్ క్వార్టర్లో నికర లాభం 12% ఎగసి రూ.3,030 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,709 కోట్లుగా ఉంది. ఇక మొత్తం ఆదాయం రూ.14,889 కోట్ల నుంచి రూ.16,106 కోట్లకు పెరిగింది. 8.2% వృద్ధి నమోదైంది. నికర వడ్డీ ఆదాయం 13% వృద్ధితో రూ.4,657 కోట్ల నుంచి రూ.5,251 కోట్లకు ఎగసింది. వడ్డీయేతర ఆదాయం కూడా 10% ఎగసి రూ.3,007 కోట్లకు చేరింది. గతేడాది క్యూ2లో ఈ మొత్తం రూ.2,738 కోట్లు. విదేశీ కార్యకలాపాలపై మార్జిన్లు 1.58 శాతం నుంచి 2 శాతానికి పెరిగాయి. బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) క్యూ2లో 0.1 శాతం పెరిగి 3.52 శాతానికి చేరాయి. మొండిబకాయిల సెగ... బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) క్యూ2లో 3.77 శాతానికి(రూ.15,858 కోట్లు) ఎగబాకాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 3.12 శాతంగా(రూ.11.547 కోట్లు), ఈ ఏడాది క్యూ1లో 3.68 శాతంగా ఉన్నాయి. ఇక నికర ఎన్పీఏలు సైతం 1.09 శాతం(రూ.3,942 కోట్లు) నుంచి 1.65 శాతానికి(రూ.6,759 కోట్లు) పేరుకుపోయాయి. ఈ ఏడాది క్యూ1లో నికర ఎన్పీఏలు 1.58 శాతంగా నమోదయ్యాయి. జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో మొండిబకాయిలకు ప్రొవిజన్స్ రూపంలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.942 కోట్ల మొత్తాన్ని కేటాయించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.850 కోట్లు. ఇక క్యూ2లో కొత్తగా రూ.2,242 కోట్లు మొండిబకాయిలుగా మారాయి. పునర్వవస్థీకరణ రుణాల్లో రూ.931 కోట్ల ఎన్పీఏలు కూడా ఇందులో కలిసి ఉన్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం రుణ వృద్ధి 17 శాతంగా నమోదైంది. మొత్తం రుణాల్లో రిటైల్ విభాగ రుణాలు 40 శాతం నుంచి 44 శాతానికి పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర బీఎస్ఈలో శుక్రవారం 2 శాతం లాభపడి రూ.277 వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ మార్జిన్లను ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగించగలమన్న నమ్మకం ఉంది. ఆర్బీఐ పాలసీ రేట్ల తగ్గింపునకు అనుగుణంగా ఖాతాదారులకు రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బదలాయిస్తున్నాం. డిమాండ్ మందగమనం కారణంగానే కార్పొరేట్ రుణాల్లో వృద్ధి 7%కే పరిమితమైంది. పూర్తి ఏడాదికి బ్యాంక్ మొత్తం రుణ వృద్ధి 18-20 శాతం స్థాయిలో ఉండొచ్చు. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ ఫెయిర్‌ఫాక్స్ చేతికి ఐసీఐసీఐ లాంబార్డ్‌లో మరో 9% వాటా సాధారణ బీమా అనుబంధ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్‌లో మరో 9 శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు విక్రయించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ డెరైక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.1,550 కోట్లు. దీంతో ఐసీఐసీఐ లాంబార్డ్‌లో ఫెయిర్‌ఫాక్స్ వాటా 35 శాతానికి చేరనుంది. ప్రవాస భారతీయుడైన ప్రేమ్ వత్స నేతృత్వంలోని ఫెయిర్‌ఫాక్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు జాయింట్ వెంచర్‌గా దీన్ని ఏర్పాటు చేశాయి. దేశీ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)ల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో తాజా ఒప్పందం చోటుచేసుకుంది. ఈ డీల్ ప్రకారం ఐసీఐసీఐ లాంబార్డ్ కంపెనీ విలువ రూ.17,225 కోట్లుగా లెక్కతేలినట్లు ఐసీఐసీఐ తెలిపింది. ఈ అనుబంధ సంస్థ ఐపీఓకు సంబంధించి తక్షణ ప్రణాళికలేవీ లేవని ఐసీఐసీఐ చీఫ్ చందాకొచర్ స్పష్టం చేశారు. -
కొత్తగా 500 శాఖల ఏర్పాటు
దేశీ విస్తరణపై దృష్టి 15% వ్యాపారాభివృద్ధి లక్ష్యం ఏడాది చివర్లో ఎఫ్‌పీఓ కార్పొరేషన్ బ్యాంక్ సీఎండీ ఎస్.ఆర్.బన్సల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్పొరేషన్ బ్యాంక్ వ్యవసాయ, ఎమ్ఎస్ఎంఈ, రిటైల్ రుణాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మూడు రంగాల్లో ఈ ఏడాది 30 శాతంపైగా వృద్ధిని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కార్పొరేషన్ బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.ఆర్.బన్సల్ తెలిపారు. రెండు రోజుల నగర పర్యటన సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వ్యాపారంలో 15 శాతానికిపైగా వృద్ధిని నమోదు చేయగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. గత ఏడాది కార్పొరేషన్ వ్యాపార పరిమాణం రూ.3.30 లక్షల కోట్లు దాటింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 500 శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం శాఖల సంఖ్యను 2,500కి పెంచుకోనున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో కొత్తగా 50 శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దుబాయ్, హాంకాంగ్‌లో ఉన్న రిప్రజెంటేటివ్ ఆఫీసులను పూర్తి శాఖలుగా మార్చడంతో పాటు మరో రెండు దేశాల్లో కొత్త శాఖలను ఏర్పాటు చేయడానికి వారం రోజుల్లో ఆర్బీఐని కలుస్తున్నట్లు బన్సల్ వివరించారు. ప్రస్తుతం వ్యాపార విస్తరణకు నిధులు అవసరం లేదని, మార్కెట్ పరిస్థితులు బాగుంటే ఏడాది చివర్లో మరోసారి పబ్లిక్ ఇష్యూకి వచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. -
పండుగ ఆఫర్లతో జాగ్రత్త !
రిటైల్ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ పథకాలను ప్రకటించడంతో రెట్టించిన ఉత్సాహంతో రిటైల్ సంస్థలు కూడా ఆఫర్లిస్తున్నాయి. అయితే బ్యాంకులు చౌకగా రుణాలు ఇస్తున్నాయని, కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నాయని షాపింగ్ చేస్తే మీ క్రెడిట్ హిస్టరీకే ప్రమాదం తప్పకపోవచ్చు. అందుకే పండుగల వేళ షాపింగ్‌లో పాటించాల్సిన ముఖ్యమైన కొన్ని అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.. ఏటా దసరా షాపింగ్ చేసే అలవాటున్న కమలేష్ ఈ ఏడాది కూడా పిల్లల దుస్తుల కోసం హైదరాబాద్‌లోని ఒక షాపింగ్‌మాల్‌కి వెళ్లాడు. ఈ లోగా ఆ షాప్‌లో వస్తున్న అనౌన్స్మెంట్ అతన్ని చక్కగా ఆకర్షించింది. ‘మా షాపులో రూ.2,000 కొనుగోలు చేస్తే రూ.1,000 గిఫ్ట్ కూపన్ ఉచితం’ అనేది ఆ ప్రకటన సారాంశం. అంటే రెండు వేలు పెట్టి కొంటే వెయ్యి రూపాయలు తిరిగి వచ్చేస్తాయి కదా అని అవసరం లేకున్నా రెండు వేలు బిల్లు చేశాడు. బిల్లు పే చేసిన తర్వాత కింద ఎగ్జిట్ గేట్ వద్ద కూపన్ వసూలు చేసుకోమన్నారు. అక్కడ తీసుకుంటే కాని అసలు సంగతి బోధపడలేదు. వరుసగా నాలుగు నెలలు మా షాపులో రూ.2,000కు తక్కువ కాకుండా కొనుగోలు చేస్తే నెలకు రూ.250 చొప్పున ఈ కూపన్లు వినియోగించుకోవచ్చని చెప్పారు. అంటే అయిదు నెలలు పాటు గ్యారంటీగా రూ.10,000 షాపింగ్ చేసే విధంగా ఆ సంస్థ మనతో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే వచ్చిన డిస్కౌంట్ 10 శాతమే. అంతే కాకుండా రెండువేలు అని షాపింగ్‌కి వెళితే అంతకంటే ఎక్కువే చేస్తాం. ఆ విధంగా చూస్తే డిస్కౌంట్ ఇంకా తగ్గిపోతుంది. భారీ షాపింగ్‌తో జాగ్రత్త... ఇప్పుడున్న పాత టీవీ స్థానంలో కొత్త టీవీ మార్చుకోవాలనుకున్నా, ఇంట్లోని ఫర్నిచర్, ఐఫోన్లు వంటి ఖరీదైన వస్తువులు కొనాలన్నా చక్కటి ప్లానింగ్ అవసరం. బ్యాంకులు 0% వడ్డీ రుణాలపై ఆర్బీఐ నిషేధం విధించినప్పటికీ ఎన్బీఎఫ్సీలు, క్రెడిట్ కార్డు సంస్థలు వీటిని ఇంకా ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు మహేష్ రూ.40,000 పెట్టి ఐ-ఫోన్‌ను 0% వడ్డీమీద కొన్నాడు అనుకుందాం. డౌన్ పేమెంట్‌గా రూ.4,000 చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని 6 నెలల్లో రూ,6,000 సమాన వాయిదాల్లో చెల్లిస్తే సరిపోతుంది. కాని తీరా తన క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ చూస్తే ఈఎంఐ రూ.6,833గా ఉంది. ప్రాసెసింగ్ ఫీజులు, సర్వీసు ట్యాక్సు కింద అదనంగా రూ.833 అంటే 6 నెలల్లో రూ.5,000 అదనంగా చెల్లించాల్సి వచ్చింది. కాబట్టి ఇలాంటి స్కీంలో అంతర్గతంగా ఏమైనా నిబంధనలున్నాయా అని ఒకటికి రెండుసార్లు అడగాలి. డిఫాల్టు కావద్దు.. చౌకగా రుణం వస్తోంది కదా లేక రూపాయి డౌన్ పేమెంట్‌తోనే వస్తువు వచ్చేస్తోంది కాదా అని కొనొద్దు. ఒక వస్తువును కొనే ముందు అది మనకు ఎంత వరకు అవసరం, రుణంతో కొన్న తర్వాత దాన్ని క్రమం తప్పకుండా తీర్చే ఆర్థిక శక్తి ఉందా లేదా అన్న విషయం పరిశీలించండి. ఇలా వాయిదాల పద్థతిలో తీసుకొని ఒక నెల వాయిదా కట్టకపోయినా అది మీ క్రెడిట్ హిస్టరీపై నెగటివ్ ప్రభావం చూపుతుంది. ఆఫర్లతో జాగ్రత్త: చాలా రిటైల్ సంస్థలు ఈ పండుగల సీజన్లో 10% నుంచి 70% వరకు డిస్కౌంట్ అని ప్రకటిస్తాయి. తీరా బిల్లింగ్ దగ్గరికి వెళ్లే సరికి దీనిపైన కేవలం 10%, లేదా 15% డిస్కౌంటే ఉందని, 70% డిస్కౌంట్ కేవలం ఆ ఒక్క వస్తువు మీద ఉందంటాడు. అప్పటికే షాపింగ్ చేసి అలసి ఉండటంతో ఇక మార్చే ఓపిక లేక షాపింగ్ పూర్తి చేస్తారు. ముఖ్యంగా అప్టు 50% అని డిస్కౌంట్ ఉన్నచోట ఎంచుకునే వస్తువుపై ఎంత డిస్కౌంట్ ఉందో ముందే అడిగి తెలుసుకోండి. సాధారణంగా చాలా షాపులు అమ్ముడు కాని బాగా ఓల్డ్ స్టాక్ మీద మాత్రమే గరిష్ట డిస్కౌంట్‌ను ప్రకటిస్తాయి. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం