ముంబై: దాదాపు దశాబ్దకాలంగా బ్యాంకులు రిటైల్ రుణాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నప్పటికీ.. ఈ విభాగంలో పూర్తి స్థాయిలో విస్తరించలేకపోతున్నాయి. రుణాలు పొందేం దుకు అర్హత ఉన్న వారిలో కేవలం మూడో వంతు మందినే చేరగలిగాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్ యూనియన్ సిబిల్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం రుణార్హత ఉన్న వినియోగదారులు 22 కోట్ల మందికి పైగా ఉండగా, ఇందులో కేవలం మూడో వంతు మంది... అంటే 7.2 కోట్ల మంది మాత్రమే ఏదో ఒక బ్యాంకు నుంచో, ఇతర ఆర్థిక సంస్థల నుంచో రుణాలు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో వయస్సుపరంగా, ఆదాయాలపరంగా రుణార్హత ఉన్న 15 కోట్ల మంది పైగా వినియోగదారులను చేరేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు పుష్కలంగా వ్యాపార అవకాశాలున్నాయని సిబిల్ తెలిపింది. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, వినియోగవస్తువులకు రుణాలు తదితర సాధనాల ద్వారా ఈ విభాగంలో విస్తరించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు అవకాశాలు ఉన్నాయని సిబిల్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment