Apple Trillion Dollar Company: Apple Crosses Three Trillion Market Cap Creates History - Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ ప్రపంచంలో యాపిల్‌ పెను సంచలనం.. తొలి 3 ట్రిలియన్‌ డాలర్ల కంపెనీ ఘనత

Published Tue, Jan 4 2022 7:55 AM | Last Updated on Tue, Jan 4 2022 9:00 AM

Apple Crosses Three Trillion Market Cap Creates History - Sakshi

Apple first company to cross $3 trillion market cap milestone: కార్పొరేట్‌ రంగంలో యాపిల్‌ కంపెనీ పెను సంచనలం సృష్టించింది. ఏకంగా 3 ట్రిలియన్‌ డాలర్ల(3 X రూ.75లక్షల కోట్లుపైనే) వాల్యూ మార్క్‌ను అందుకున్న తొలి కంపెనీగా అవతరించింది. సోమవారం (జనవరి 3, 2022)న మధ్యాహ్నాం మార్కెట్‌లో షేర్ల ధరల పెరుగుదలతో ఈ ఘనత సాధించింది ఈ అమెరికన్‌ మల్టీనేషనల్‌ టెక్‌ దిగ్గజం. 


స్టీవ్‌ జాబ్స్‌ 2007లో ఫస్ట్‌ యాపిల్‌ ఐఫోన్‌ను లాంఛ్‌ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి విలువతో పోలిస్తే.. ఇప్పుడు యాపిల్‌ షేర్లు 5,800 శాతం రెట్లు పెరిగాయి ఇప్పుడు. కరోనా టైంలోనూ ఈ కార్పొరేట్‌ జెయింట్‌ హవాకు అడ్డుకట్ట పడకపోవడం విశేషం. 2020 మొదట్లో 200 శాతం పెరిగాయి షేర్ల ధరలు. మొత్తంగా ఇప్పుడు మూడు ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ను దాటేసింది.


స్టీవ్‌ జాబ్స్‌

1976లో ఓ కంప్యూటర్‌ కంపెనీగా మొదలైన యాపిల్‌ కంపెనీ.. ఇన్‌కార్పోరేటెడ్‌గా(విలీన కంపెనీగా) హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, మీడియా సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే. 2 ట్రిలియన్‌ మార్కెట్‌ను అందుకున్న కేవలం పదిహేడు నెలలకే.. అది చిప్‌ కొరత లాంటి అసాధారణ సమస్యను ఎదుర్కొంటూనే 3 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ మార్క్‌ను టచ్‌ చేయగలగడం మరో విశేషం.


యాపిల్‌ తొలి ఆఫీస్‌

నా జీవితంలో ఈ మార్క్‌ను కంపెనీ సాధిస్తుందని ఊహించలేదు.. కానీ,  రాబోయే ఐదు పదేళ్లలో యాపిల్‌  ఊపు ఎలా ఉండబోతుందో ఈ గణాంకాలే చెప్తున్నాయి అంటున్నారు కంపెనీలో 2.75 మిలియన్‌ షేర్లు ఉన్న ప్యాట్రిక్‌ బర్టోన్‌(ఈయన మెయిన్‌ స్టే విన్‌స్లో లార్జ్‌ క్యాప్‌ గ్రోత్‌ ఫండ్‌కి కో-ఫోర్ట్‌ఫోలియో మేనేజర్‌). 

యాపిల్‌ కంపెనీ 2018లో 1 ట్రిలియన్‌ డాలర్‌ మార్క్‌ అందుకుంది. ఆగష్టు 2020లో 2 ట్రిలియన్‌ డాలర్‌ మార్క్‌ అందుకుంది. ఈ క్రమంలో మరో టెక్‌ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంది యాపిల్‌.  మొత్తంగా 2 ట్రిలియన్‌ డాలర్‌ మార్క్‌ దాటిన తొలి కంపెనీ మాత్రం సౌదీ ఆరామ్‌కో(సౌదీ అరేబియన్‌ ఆయిల్‌ కంపెనీ). ప్రస్తుతం యాపిల్‌ మొదటి స్థానంలో ఉండగా, మైక్రోసాఫ్ట్‌, ఆల్ఫాబెట్‌(గూగుల్‌), సౌదీ ఆరామ్‌కో, అమెజాన్‌లో తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాయి.

చదవండి: యాపిల్‌+మేక్‌ ఇన్‌ ఇండియా= 50 బిలియన్‌ డాలర్లు!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement