Microsoft company
-
ప్చ్.. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కథ ముగిసింది
ఇంటర్నెట్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కథ ముగిసింది. దాదాపు ఇరవై ఏడేళ్ల తర్వాత ఎక్స్‌ప్లోరర్ సేవల్ని ఆపేస్తోంది మైక్రోసాఫ్ట్ కంపెనీ. జూన్ 15న ఈ యాప్ సేవల్ని పూర్తిగా నిలిపివేయనున్నట్లు సమాచారం. ►ఇంటర్నెట్ వాడకం వచ్చిన కొత్తలో బ్రౌజర్ల సంఖ్య తక్కువగా ఉండేది. ఆ టైంలో.. 1995 ఆగష్టులో విండోస్ 95 ప్యాకేజీ ద్వారా మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు.. దానిని ఫ్రీగా అందించింది. ► తాజాగా.. జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ పనిచేయకుండా పోతుంది అని ఒక ప్రకటన వెలువడింది. ► 2003లో ఇంటర్నెట్ బ్రౌజర్లలో 95 శాతం వాడకం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్దే. కానీ.. ► ఆ తర్వాతి కాలంలో ఇతర బ్రౌజర్ల పోటీతత్వం నడుమ ఆ పొజిషన్‌ను కాపాడుకోలేకపోయింది ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్. ► బ్రౌజర్ మార్కెట్లో స్మూత్ పర్ఫార్మెన్స్, ఇంటర్నెట్ స్పీడ్ ఇలా రకరకాల కారణాలతో పోటీతత్వంలోనూ ఎక్స్‌ప్లోరర్ వెనుకబడిపోయింది. పైగా వేగంగా అప్డేట్ లేకుండా సాదాసీదా బ్రౌజర్‌గా మిగిలిపోయింది. ► వీటికి తోడు హ్యాకింగ్ ముప్పుతో ఈ బ్రౌజర్‌ను ఉపయోగించేవాళ్లు గణనీయంగా తగ్గిపోయారు. దీంతో.. డెస్క్‌టాప్, ల్యాప్‌ట్యాప్‌లలో జస్ట్ ఒక డీఫాల్ట్ బ్రౌజర్‌గా మిగిలిపోయింది ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్. ► 2016 నుంచి మైక్రోసాప్ట్ కొత్త బ్రౌజర్ ఫీచర్‌ను డెవలప్మెంట్ చేయడం ఆపేసింది. ఈ టెక్ దిగ్గజం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను దశలవారీగా నిలిపివేయాలని నిర్ణయించుకోవడం అదే మొదటిసారి కూడా. ► ఎక్స్‌ఫ్లోరర్ స్థానే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కొత్త విండోస్ ఫీచర్ అప్ డేట్స్ తో అందుబాటులో ఉంటోంది. ఇది ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్ కంటే సురక్షితమైన బ్రౌజింగ్ అని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ప్రోగ్రామర్ మేనేజర్ సీన్ లిండర్సే చెప్తున్నారు. ► ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్ ‘నైంటీస్, 2000వ’ దశకంలో ఎంతో మంది ఇంటర్నెట్ యూజర్లతో అనుబంధం పెనవేసుకుపోయింది. అందుకే విషయం తెలియగానే.. చాలామంది ఎమోషనల్ అవుతున్నారు. Internet Explorer is shutting down in three days. I haven't used IE in a decades but it was the browser I had used for the majority if my childhood. Whether you loved or hated Internet Explorer, it'll be the end if an era 💛 — Caesár (@CnaVD) June 11, 2022 ProductHunt: After 27 years of service, Microsoft is going to retire Internet Explorer for good on June 15th. pic.twitter.com/EEpvrx34FQ — ProductGram (@ProductGrams) June 12, 2022 -
యాపిల్ పెను సంచలనం
Apple first company to cross $3 trillion market cap milestone: కార్పొరేట్ రంగంలో యాపిల్ కంపెనీ పెను సంచనలం సృష్టించింది. ఏకంగా 3 ట్రిలియన్ డాలర్ల(3 X రూ.75లక్షల కోట్లుపైనే) వాల్యూ మార్క్‌ను అందుకున్న తొలి కంపెనీగా అవతరించింది. సోమవారం (జనవరి 3, 2022)న మధ్యాహ్నాం మార్కెట్లో షేర్ల ధరల పెరుగుదలతో ఈ ఘనత సాధించింది ఈ అమెరికన్ మల్టీనేషనల్ టెక్ దిగ్గజం. స్టీవ్ జాబ్స్ 2007లో ఫస్ట్ యాపిల్ ఐఫోన్‌ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి విలువతో పోలిస్తే.. ఇప్పుడు యాపిల్ షేర్లు 5,800 శాతం రెట్లు పెరిగాయి ఇప్పుడు. కరోనా టైంలోనూ ఈ కార్పొరేట్ జెయింట్ హవాకు అడ్డుకట్ట పడకపోవడం విశేషం. 2020 మొదట్లో 200 శాతం పెరిగాయి షేర్ల ధరలు. మొత్తంగా ఇప్పుడు మూడు ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌ను దాటేసింది. స్టీవ్ జాబ్స్ 1976లో ఓ కంప్యూటర్ కంపెనీగా మొదలైన యాపిల్ కంపెనీ.. ఇన్కార్పోరేటెడ్గా(విలీన కంపెనీగా) హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, మీడియా సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే. 2 ట్రిలియన్ మార్కెట్‌ను అందుకున్న కేవలం పదిహేడు నెలలకే.. అది చిప్ కొరత లాంటి అసాధారణ సమస్యను ఎదుర్కొంటూనే 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ మార్క్‌ను టచ్ చేయగలగడం మరో విశేషం. యాపిల్ తొలి ఆఫీస్ నా జీవితంలో ఈ మార్క్‌ను కంపెనీ సాధిస్తుందని ఊహించలేదు.. కానీ, రాబోయే ఐదు పదేళ్లలో యాపిల్ ఊపు ఎలా ఉండబోతుందో ఈ గణాంకాలే చెప్తున్నాయి అంటున్నారు కంపెనీలో 2.75 మిలియన్ షేర్లు ఉన్న ప్యాట్రిక్ బర్టోన్(ఈయన మెయిన్ స్టే విన్స్లో లార్జ్ క్యాప్ గ్రోత్ ఫండ్‌కి కో-ఫోర్ట్‌ఫోలియో మేనేజర్). యాపిల్ కంపెనీ 2018లో 1 ట్రిలియన్ డాలర్ మార్క్ అందుకుంది. ఆగష్టు 2020లో 2 ట్రిలియన్ డాలర్ మార్క్ అందుకుంది. ఈ క్రమంలో మరో టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంది యాపిల్. మొత్తంగా 2 ట్రిలియన్ డాలర్ మార్క్ దాటిన తొలి కంపెనీ మాత్రం సౌదీ ఆరామ్కో(సౌదీ అరేబియన్ ఆయిల్ కంపెనీ). ప్రస్తుతం యాపిల్ మొదటి స్థానంలో ఉండగా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్(గూగుల్), సౌదీ ఆరామ్కో, అమెజాన్‌లో తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాయి. చదవండి: యాపిల్+మేక్ ఇన్ ఇండియా= 50 బిలియన్ డాలర్లు!! -
1.62 లక్షల మంది విద్యార్థులకు మైక్రో‘సాఫ్ట్’ స్కిల్స్
సాక్షి, అమరావతి: డిగ్రీ విద్యార్ధుల సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగావకాశాలు మెరుగుపరచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రపంచంలో అగ్రశ్రేణి సంస్థగా ఉన్న మైక్రోసాఫ్ట్ ద్వారా రాష్ట్రంలో 1.62 లక్షల మంది విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యాలపై శిక్షణ ఇప్పించేందుకు సన్నద్ధమైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ప్రత్యేక చొరవ చూపి ఈమేరకు ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌తో ఎంవోయూ కుదుర్చుకోగా గడువు తేదీని వచ్చే ఏడాది డిసెంబర్ చివరి వరకు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఒప్పందం ప్రకారం గడువు ఈ ఏడాది డిసెంబర్ ఆఖరుతో ముగుస్తున్నప్పటికీ కరోనాతో విద్యాసంస్థలు దీర్ఘకాలం మూతపడటం, విద్యార్థులు నెలల తరబడి కాలేజీలకు దూరం కావడంతో ఒప్పందం గడువును పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 300 కాలేజీల పరిధిలో చదువుతున్న విద్యార్ధులు, నిరుద్యోగ యువతకు మైక్రోసాఫ్ట్ వివిధ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30.79 కోట్లను వెచ్చిస్తోంది. ఆన్లైన్ ద్వారా అత్యంత నాణ్యమైన కొత్త కరిక్యులమ్ ద్వారా మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుంది. బ్రాండ్ వాల్యూ ఉన్న మైక్రోసాఫ్ట్ అందించే ఈ కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా కంపెనీల గుర్తింపు ఉన్నందున విద్యార్ధులకు ఎంతో మేలు జరగనుంది. శిక్షణ ప్రాజెక్టు అమలు కోసం పర్యవేక్షణ, మూల్యాంకన కమిటీని ప్రభుత్వం నియమించింది. 40 కోర్సులలో శిక్షణ మైక్రోసాఫ్ట్ సంస్థ అధునాతన సాఫ్ట్వేర్ అంశాలపై విద్యార్ధులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రత్యేక డొమైన్ ద్వారా 40 సర్టిఫికేషన్ కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఉంటుంది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సంస్థ రూ.7,500 (100 యూఎస్ డాలర్లు) విలువ గల ‘అజూర్‌పాస్’ను ప్రతి విద్యార్థికి సమకూర్చనుంది. దీని ద్వారా 1.62 లక్షల మంది విద్యార్థులు క్లౌడ్ టెక్నాలజీ ద్వారా శిక్షణాంశాలను సులభంగా పొందగలుగుతారు. సర్టిఫికేషన్ కోర్సులతో పాటు అదనంగా ‘లింకిడ్ ఇన్ లెర్నింగ్’ ద్వారా బిజినెస్, క్రియేటివిటీ, టెక్నికల్ విభాగాలకు సంబంధించిన 8,600 కోర్సులు విద్యార్ధులు నేర్చుకునేందుకు అందుబాటులోకి వస్తాయి. అజూర్ ల్యాబ్స్ ద్వారా విద్యార్ధులకు యాప్‌ల అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్‌డేటా లాంటి 25 ఫ్రీ అజూర్ సర్వీసులు అందుతాయి. శిక్షణ కార్యక్రమాలకు మైక్రోసాఫ్ట్ లెర్న్ (ఎంఎస్ లెర్న్) ముఖ్యమైన ప్లాట్‌ఫాంగా ఉంటుంది. సెల్ఫ్‌పేస్‌డ్, డిజిటల్ లెర్నింగ్ వనరుల ద్వారా విద్యార్ధులు నూతన సాంకేతిక అంశాలపై శిక్షణ పొందుతారు. పరిశ్రమలకు అవసరమైన సర్టిఫికేషన్ కోర్సులు ముఖ్యంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుంది. ప్రాజెక్టు పర్యవేక్షణకు ఉన్నత కమిటీ 1.62 లక్షల మంది విద్యార్ధులకు మైక్రోసాఫ్ట్ ద్వారా సర్టిఫికేషన్ కోర్సుల ప్రాజెక్టు అమలు, పురోగతి పరిశీలనకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి ఛైర్మన్‌గా, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి సభ్యుడిగా, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా మరో నలుగురితో కమిటీ ఏర్పాటైంది. మైక్రోసాఫ్ట్‌తో ఉన్నత విద్యామండలి ఒప్పందం గడువు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుండగా కరోనా వల్ల ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగినందున 2022 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. శిక్షణలో భాగంగా మైక్రోసాఫ్ట్ గుర్తించిన సంస్థల ద్వారా మాక్ టెస్టులు, పరీక్షలు ఇతర కార్యక్రమాలు చేపడతారు. విద్యార్ధులకు మైక్రోసాఫ్ట్ అందించే సర్టిఫికెట్లను డిజి లాకర్లో భద్రపరుస్తారు. ఎంతో ప్రయోజనకరం విద్యార్ధులకు సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యాల శిక్షణపై మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేషన్ విభాగం డైరెక్టర్ ప్రతిపాదనలు అందించిన అనంతరం ప్రభుత్వం సంబంధిత నిపుణుల అభిప్రాయాలను సేకరించింది. మైక్రోసాఫ్ట్ ప్రతిపాదనలతో రాష్ట్ర విద్యార్ధులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి వివిధ యూనివర్సిటీలు, కాలేజీల ద్వారా స్టేక్హోల్డర్ల నుంచి కూడా అభిప్రాయాలను తీసుకుంది. మైక్రోసాఫ్ట్ శిక్షణతో పలు రకాలుగా మేలు జరుగుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొన్నారు. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో నిర్వహించిన సమావేశానికి మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఓమ్‌జివాన్ గుప్తా తదితరులు హాజరై ప్రతిపాదనలను వివరించారు. అకడమిక్ ప్రోగ్రామ్స్‌లో మైక్రోసాఫ్ట్ శిక్షణ కార్యక్రమాలను చేర్చడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని, సర్టిఫికేషన్ కోర్సులతో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని వీసీలు పేర్కొన్నారు. -
విద్యార్థులకు నైపుణ్య శిక్షణ
సాక్షి, అమరావతి: విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రతిష్టాత్మక ఐటీ దిగ్గజ సంస్థ.. మైక్రోసాఫ్ట్ రాష్ట్రంలో 1,62,000 మంది ఉన్నత విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంత భారీ స్థాయిలో మైక్రోసాఫ్ట్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి కావడంగమనార్హం. శుక్రవారం వర్చువల్ విధానంలో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మైక్రోసాఫ్ట్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ అహ్మద్ మజ్‌హరి, ఆ సంస్థ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి, ఆ సంస్థ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఒమిజ్వాన్ గుప్తా, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి డాక్టర్ హరికృష్ణ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్య కో–ఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపు, తదితరులు పాల్గొన్నారు. సీఎం సంస్కరణలే ప్రధాన కారణం.. గుజరాత్ వంటి రాష్ట్రాలు పోటీ పడుతున్నా.. తొలుత ఈ కార్యక్రమం ప్రారంభించడానికి మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలే ప్రధాన కారణమని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో విద్యార్థులకు కోర్సు పూర్తి చేసిన వెంటనే చక్కటి ఉపాధి పొందే అవకాశం లభిస్తుందన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు 42 రకాల కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడం వల్ల వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత మహేశ్వరి మాట్లాడుతూ.. ఏపీతో కలిసి పనిచేయడానికి తాము ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నామని చెప్పారు. దేశంలో డిజిటల్ ఎకానమీలో ప్రతి ఒక్కరూ విజయం సాధించడానికి ఈ డిజిటల్ స్కిల్లింగ్ పునాదిలా పనిచేస్తుందన్నారు. ఏపీ యువతలో నైపుణ్యాలకు పదునుపెట్టి.. వారు మంచి ఉద్యోగావకాశాలు పొందడానికి తాము కంకణబద్ధులై ఉన్నామన్నారు. ఈ సందర్భంగా తమకు సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొనాల్సి ఉన్నప్పటికీ ఆయనకి కరోనా పాజిటివ్ రావడంతో పాల్గొనలేదు. వెంటనే ఉద్యోగం పొందే వీలు.. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి మైక్రోసాఫ్ట్ ఇచ్చే సర్టిఫికెట్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా సంబంధిత కోర్సుకు సంబంధించిన రంగాల్లో వెంటనే ఉద్యోగం పొందే వీలు కలుగుతుంది. ఈ కోర్సులు పూర్తి చేసిన వారిలో 70 శాతం మందికి తక్షణంఉద్యోగం లభించే అవకాశాలుంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ కోర్సులు పూర్తి చేసినవారికి లింక్డ్ఇన్ లెర్నింగ్ అందించే 8,600 కోర్సుల్లో శిక్షణ తీసుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఒప్పందంలో భాగంగా ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి మైక్రోసాఫ్ట్ 100 అమెరికన్ డాలర్ల గిఫ్ట్ వోచర్ ఇవ్వనుంది. దీని ద్వారా మైక్రోసాఫ్ట్ అందించే ఇతర కోర్సులను నేర్చుకోవడం ద్వారా మరిన్ని నైపుణ్యాలు పెంచుకోవచ్చు. 42 కోర్సుల్లో శిక్షణ, సర్టిఫికెట్ ఈ ఒప్పందం ద్వారా మైక్రోసాఫ్ట్ రాష్ట్రంలో 300కుపైగా కాలేజీల్లోని విద్యార్థులు, నైపుణ్య శిక్షణ కేంద్రాల్లోని 1,62,000 మందికి 42 కోర్సుల్లో శిక్షణ ఇవ్వనుంది. మైక్రోసాఫ్ట్ లెర్నింగ్ కింద ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 వంటి 42 రకాల సాంకేతిక నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది. ఇందులో కొన్ని కోర్సుల సమయం 40 గంటలు, కొన్ని కోర్సుల నిడివి 160 గంటల వరకు ఉంటుంది. -
తెలంగాణకు మైక్రోసాఫ్ట్ భారీ సహాయం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న పోరుకు మద్దతు పలుకుతూ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సంస్థ తమ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ద్వారా రూ.3.8 కోట్ల విలువ చేసే వైద్య పరికరాలను అందజేసింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసిన సంస్థ ప్రతి నిధులు వైద్య పరికరాలను అందజేశారు. తాము అందజేసిన 14 అత్యాధునిక కోవిడ్ 19 పరీక్ష యంత్రాల ద్వారా రోజుకు 3,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ ఎండీ రాజీవ్ కుమార్ తెలిపారు. కోవిడ్‌పై పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మైక్రోసాఫ్ట్ విరాళం ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
ఆకర్షణీయంగా ఆన్లైన్ క్లాస్‌లు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ తరగతులను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రఖ్యాత ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన ‘టీమ్స్’ అప్లికేషన్‌కు మరిన్ని హంగులు జోడించింది. ‘టీమ్స్ ఫర్ ఎడ్యుకేషన్’ పేరుతో తాను సొంతంగా అభివృద్ధి చేసిన, ఇతరుల అప్లికేషన్లను కూడా చేర్చింది. ఇతర ఆన్లైన్ మీటింగ్ అప్లికేషన్ల మాదిరిగా కాకుండా..విద్యార్థులు అప్లికేషన్ ఆన్ చేసి తమ పనుల్లో ఉండిపోకుండా చూస్తుంది. అంతేకాదు..అవసరమైనప్పుడు నేరుగా ప్రశ్నలు వేసేందుకు అవకాశం కల్పిస్తుంది కూడా. ఈ మార్పులు చేర్పులు చేసేందుకు తాము విస్తృతమైన కసరత్తు చేశామని, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలతో సంప్రదింపులు జరిపిన తరువాత తమ దృష్టికి వచి్చన లోటుపాట్లను సవరించామని మైక్రోసాఫ్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఆన్లైన్ క్లాస్లేనా? కరోనా కారణంగా ఇటీవలి కాలంలో ఆన్లైన్ తరగతులకు డిమాండ్ బాగా పెరిగిన విషయం తెలిసిందే. జూమ్ వంటి అప్లికేషన్లపై పలు అభ్యంతరాలు వినిపిస్తున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ ఒక ప్రత్యామ్నాయాన్ని అందుబాటులోకి తీసుకొచి్చంది. ఈ విద్యా సంవత్సరం తరగతులు మొత్తం ఆన్లైన్ ద్వారానే నడుస్తాయని తాము సర్వే చేసిన వారిలో 61 శాతం మంది భావిస్తున్నారని, అలాగే ఒకవేళ పాఠశాలకు వెళ్లే పరిస్థితి మళ్లీ వచి్చనా.. తరగతి గదిలో టెక్నాలజీ పాత్ర చాలా ఎక్కువ అవుతుందని 87 శాతం మంది చెప్పారని మైక్రోసాఫ్ట్ తెలిపింది. న్యూఢిల్లీలోని ద బ్రిటిష్ స్కూల్‌తోపాటు పలు ఇతర పాఠశాలలు ఇప్పటికే టీమ్స్ అప్లికేషన్‌ను వాడటం మొదలుపెట్టాయని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 15 కోట్ల మంది విద్యకు సంబంధించి మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన అప్లికేషన్లను ఉపయోగిస్తున్నారని తెలిపింది. ఆన్లైన్లో తరగతి గదుల్లో విద్యార్థుల దృష్టి మరలకుండా, వారిలో ఆసక్తి తగ్గకుండా చూసేందుకు టీమ్స్ అప్లికేషన్లో ఉపాధ్యాయులకు పలు సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామని వివరించింది. ఇవీ మార్పులు.. ► కంప్యూటర్ తెరపై ఏకకాలంలో 49 మందిని ప్రత్యక్షంగా చూసేందుకు అవకాశం. విద్యార్థులందరినీ ఒకే స్క్రీన్‌పై చూసేందుకు ఉపాధ్యాయులకు వీలు ఏర్పడుతుంది. ► ఒక తరగతి గదిలోని విద్యార్థులను వేర్వేరు బృందాలుగా విడగొట్టి చిన్న చి న్న టాస్్కలు ఇచ్చేందుకు అవకాశం. దీ న్ని వర్చువల్ బ్రేక్అవుట్ అని పిలుస్తున్నారు. ► తరగతి ఆఖరులో క్విజ్లు నిర్వహించేందుకు, విద్యార్థులు స్వయంగా ప్రెజెంటేషన్లు తయారు చేసేందుకు ‘స్వే’సాఫ్ట్వేర్, మల్టీమీడియా కంటెంట్ తయారీకి ‘బన్సీ’, చిత్రాలు గీసేందుకు ‘పెయింట్ 3డీ’ వంటివి అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు ఈ కంటెంట్‌ను ఇతరులతో పంచుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. విద్యార్థులు అందరూ నింపి తిప్పి పంపాల్సిన దస్తావేజుల కోసం మైక్రోసాఫ్ట్ ఫామ్స్ ఉపయోగపడుతుంది. ► సందేహాలు వస్తే విద్యార్థులు డిజిటల్ రూపంలో చేతులెత్తి టీచర్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా తరగతి అటెండెన్స్ దానంతట అదే నమోదు అవుతుంది. ఏయే విద్యార్థులు చురుకుగా ఉన్నారు? ప్రశ్నలు వేశారు? ఇచ్చిన అసైన్మెంట్స్ ఎందరు, ఎంత కాలంలో పూర్తి చేశారు? వంటి సమాచారాన్ని సేకరిం చడమే కాకుండా.. దాన్ని విశ్లేషించడమూ సాధ్యమవుతుంది. ► కహూట్, ప్రెజీ, జీవో1, నియర్‌పాడ్, పియాజ్జా, గ్యాగల్, కాన్వాస్ వంటి వినూత్నమైన సాఫ్ట్వేర్ అప్లికేషన్ల జోడింపు. చదవడం, రాయడంలో సమస్యలు ఎదుర్కొనే డిస్లెక్సియా పిల్లల కోసం ఇమ్మర్సివ్ రీడర్ ను సిద్ధం చేసిన మైక్రోసాఫ్ట్ దాన్నిప్పు డు ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌లోకి చేర్చింది. ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో వారి మాతృభాషలోనే మాట్లాడేందుకు మైక్రోసాఫ్ట్ ట్రాన్స్‌లేటర్ ఉపయోగపడుతుందని తెలిపింది. -
మళ్లీ నోకియా మొబైల్స్ వస్తున్నాయ్!
మైక్రోసాఫ్ట్ నుంచి హెచ్ఎండీ గ్లోబల్‌కు బ్రాండ్ హెల్సింకి/న్యూఢిల్లీ: మళ్లీ నోకియా బ్రాండ్లు ఫోన్లు, ట్యాబ్‌లు మార్కెట్లోకి రానున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ నోకియా బ్రాండ్ హక్కులను హెచ్ఎండీ గ్లోబల్‌కు ఫాక్స్‌కాన్ కంపెనీలకు 35 కోట్ల డాలర్లకు విక్రయించింది. మరోవైపు కొత్తగా ఏర్పాటు చేసిన హెచ్ఎండీ గ్లోబల్ లిమిటెడ్‌కు నోకియా బ్రాండ్ ఎక్స్‌క్లూజివ్ గ్లోబల్ లెసైన్స్‌ను పదేళ్లపాటు ఇచ్చామని నోకియా పేర్కొంది. దీంతో హెచ్ఎండీ గ్లోబల్, ఈ సంస్థ తైవాన్ భాగస్వామి ఎఫ్ఐహెచ్ మొబైల్ ఆఫ్ ఫాక్స్‌కాన్ టెక్నాలజీలు ఇక నోకియా బ్రాండ్ మొబైళ్లను విక్రయిస్తాయి. 1998-2011 మధ్య కాలంలో మొబైల్ ఫోన్ల రంగంలో నోకియా కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. కానీ ఆ తర్వాత శామ్సంగ్ కంపెనీ స్మార్ట్ఫోన్లతో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. 2014లో తన హ్యాండ్సెట్ వ్యాపారాన్ని నోకియా కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు విక్రయించింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఫీచర్ ఫోన్లకు మాత్రం నోకియా బ్రాండ్‌ను వాడి లూమియా బ్రాండ్ కింద స్మార్ట్ఫోన్లను విక్రయించింది. మైక్రోసాఫ్ట్‌తో కుదుర్చుకున్న బ్రాండ్ లెసైన్సింగ్ ఒప్పందం ఈ ఏడాది మధ్యకల్లా ముగియనున్నదని అంచనా. -
మైక్రోసాఫ్ట్ లూమియా 430 ఫోన్ @ రూ.5,299
ముంబై: మైక్రోసాఫ్ట్ సంస్థ లూమియా 430 డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్ఫోన్ధర రూ.5,299 అని కంపెనీ పేర్కొంది. 4 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్క్రీన్ ఉన్న ఈ ఫోన్‌ను విండోస్ 10కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ డివెసైస్ డెరైక్టర్ (వెస్ట్) అనంత్ మిట్టల్ చెప్పారు. ఈ ఫోన్లో 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమెరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, వీజీఏ సెకండరీ కెమెరా వంటి ఫీచర్లున్నాయని వివరించారు. -
నోకియా లూమియా డ్యుయల్ సిమ్
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ కంపెనీ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్, లుమియా 630ను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నది. మోటో జి, హెచ్‌టీసీ డిజైర్, శామ్సంగ్ గెలాక్సీ డ్యుయోస్లకు గట్టి పోటీనిచ్చేలా ఈ ఫోన్‌ను రంగంలోకి తేవాలని మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు చేస్తోం ది. ఈ లూమియా 630 మోడల్లో సింగిల్ సిమ్ వేరియంట్ ధర రూ.9,500, డ్యుయల్ సిమ్ వేరియంట్ ధర రూ.10,100 ఉండవచ్చు. విండోస్ 8.1 ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్లో 4.5 అంగుళాల డిస్ప్లే, 5 మెగా పిక్సెల్ ఆటో ఫోకస్ కెమెరా, 8 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ప్రత్యేకతలుంటాయని సమాచారం. నోకియా హ్యాండ్సెట్ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. భారత డ్యుయల్ సిమ్ మార్కెట్‌పై కన్నేసిన మైక్రోసాఫ్ట్ ఇప్పటి నుంచే దూకుడుగా వ్యవహరిస్తోంది. భారత్, చైనా వంటి వృద్ధి చెందుతున్న మార్కెట్లలో డ్యుయల్ సిమ్ మార్కెట్ కీలకమని మైక్రోసాఫ్ట్ డివెసైస్ గ్రూప్ ఈవీపీ స్టీఫెన్ ఇలోప్ వ్యాఖ్యానించారు. 2016 కల్లా ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల డ్యుయల్-సిమ్ స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతాయన్న అంచనాలను వెల్లడించారు. -
విండోస్ ఎక్స్పీ కథ కంచికి!
మీరు మీ పీసీలో విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారా? వచ్చే వారం.. కచ్చితంగా చెప్పాలంటే ఏప్రిల్ 8వ తేదీ తరువాత మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటారా? మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఇస్తున్న సపోర్ట్‌ను ఆ రోజు నుంచి నిలిపివేస్తోంది కాబట్టి. అయితే నాకేంటి? అనుకుంటూంటే... ప్రపంచంలోని మొత్తం కంప్యూటర్లలో మూడొంతులు విండోస్ ఎక్స్‌పీని వాడుతున్నాయి. హ్యాకర్లు దీనిపై దాడులకు తెగబడకుండా ఉండేందుకు మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు లోటుపాట్లను గుర్తించి సెక్యూరిటీ ప్యాచ్‌లను పంపిస్తూంటుంది. వచ్చే వారం నుంచి ఈ ప్యాచ్‌లు రావన్నమాట. విండోస్ ఎక్స్‌పీతోపాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2003కి సంబంధించిన అప్డేట్స్ కూడా అందవు. దీంతో ఏ క్షణంలోనైనా హ్యాకర్లు ఎక్స్‌పీపై దాడులు చేయవచ్చునన్నమాట. వీటి వల్ల వ్యక్తిగతంగా పెద్దగా నష్టం ఉండకపోవచ్చుగానీ... దేశంలోని దాదాపు లక్ష ఏటీఎంల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీటిల్లో ఎక్కువశాతం ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌నే వాడుతున్నారు. అయితే కొన్ని బ్యాంకింగ్ సంస్థలు తమదైన సపోర్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం ఎక్స్పీ స్థానంలో లీనక్స్ ఆధారిత ‘భారత్ ఆపరేటింగ్ సిస్టమ్ సొల్యూషన్స్’ (బాస్)ను వాడేందుకు సిద్ధమవుతోంది. వ్యక్తిగత వినియోగదారులు వీలైతే విండోస్ 7 లేదా 8కు మారిపోవడం మేలు అన్నది నిపుణుల సూచన. -
విశ్లేషణం: మనసున్న మేథావి
అతనేం పెద్దగా చదువుకోలేదు... కానీ గొప్పగా ఆలోచించాడు. ‘కిటికీల’తో సాంకేతిక సామ్రాజ్యాధిపతిగా నిలిచాడు. ప్రపంచంలో ఎవరూ సంపాదించలేనంత ధనాన్ని ఆర్జించాడు. సంపాదించడమే కాదు పంచడమూ తెలుసంటూ వేలకోట్ల రూపాయలు విరాళాలుగా ఇస్తున్నాడు. తానో హృదయమున్న మేధావినని నిరూపించుకున్నాడు. ఆయనే... మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్. మాటలు, చేతులు కలిసి జంటగా... గేట్స్ కాస్తంత తల పెకైత్తి, కాలు మీద కాలువేసుకుని ధారాళంగా, స్వేచ్ఛగా మాట్లాడతారు. ఇవన్నీ ఆయన మంచి భావనలున్న విజువల్ పర్సన్ అనీ, ఆత్మవిశ్వాసం మెండుగా ఉందనీ చెప్తాయి. ఆయన తన ఫీలింగ్స్‌ను ఎంతో కొంత నిగ్రహించుకుంటాడని పెదవులు దాటని నవ్వు చెప్తుంది. నిజాయితీగా మాట్లాడతాడని ఓపెన్‌గా చాచిన చేతులు వివరిస్తాయి. అయితే ఈ చేతుల కదలికలు సందర్భాన్ని బట్టి మారిపోతూంటాయి. అప్పుడప్పుడూ అథారిటేటివ్‌గా హస్తాలను కిందకు కూడా ఉంచుతాడు. ఎవరు మాట్లాడుతున్నా ఆయన శ్రద్ధగా వింటారు. కళ్లజోడు సవరించుకుంటున్నారంటే తానేదో చెప్పబోతున్నాడన్నమాట. అంతేకాదు గేట్స్ చేతులు కూడా మాటలతో జతకలిసి జంటగా కదులుతాయి. అంటే ఆయన మనసులో ఉన్నదే నిజాయితీగా చెప్తున్నాడని అర్థం. ఆలోచనాజీవి... బిల్‌గేట్స్ చిన్నప్పటినుంచీ ఆలోచనా జీవి. ఆరేళ్ల వయసులో గేట్స్‌ను తల్లి ఏం చేస్తున్నావ్? అని అడిగితే.. ఆలోచిస్తున్నాను అని చెప్పాడట. ఆవిడకు అర్థంకాక ‘ఏంటీ.. ఆలోచిస్తున్నావా?’ అని అడిగితే... ‘అవును, ఆలోచిస్తున్నాను, నువ్వెప్పుడైనా ఆ ప్రయత్నం చేశావా?’ అని అడిగాడట. బాల్యంనుంచే గేట్స్ ఆలోచించడానికి అత్యంత ప్రాధాన్యమిచ్చాడు కనుకనే నూనూగు మీసాల వయసులోనే విండోస్ సాఫ్ట్‌వేర్‌ను సృష్టించి, మైక్రోసాఫ్ట్ కంపెనీ స్థాపించి సాఫ్ట్వేర్ కింగ్‌గా నిలిచాడు. ఆలోచనలు మెరుపువేగంలో వినూత్నంగా, లక్ష్యం దిశగా సాగిపోవడమే అందుకు కారణం. ఆయన పుస్తకాల్లో ఒకదానికి ‘బిజినెస్ ఎట్ స్పీడ్ ఆఫ్ థాట్’ అని పెట్టడం కూడా కాకతాళీయమేమీ కాదు. బిల్గేట్స్ది ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్. తన తెలివితేటలు, ఆత్మవిశ్వాసం, కార్యసాధన, చురుకైన ఆలోచనాధోరణితో సహచరులను, అనుచరులను ప్రభావితం చేస్తాడు. తన విజన్‌ను అందరితోనూ పంచుకుంటాడు, అందరూ దానిలో భాగస్వాములై దాన్ని సఫలం చేయాలనుకుంటాడు. తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడంకోసం ఎన్ని గంటలైనా శ్రమిస్తాడు, దేనికైనా సిద్ధమవుతాడు. ఈ క్రమంలో తన ఉద్యోగులను అదిలించడంలో, విమర్శించడంలో ఏ మాత్రం వెనుకాడడు. అలాగే పోటీ సంస్థలను అధిగమించేందుకు కూడా. అయితే ఫౌండేషన్ స్థాపించాక ఆయన నాయకత్వ ధోరణిలో కొంత మార్పు వచ్చిందని చెప్పవచ్చు. ఫౌండేషన్ అకౌంట్లను భాగస్వాములందరికీ అందుబాటులో ఉంచడమే అందుకు ఉదాహరణ. మనసున్న మారాజు... బిల్‌గేట్స్ తెలివైనవాడు, మేధావి మాత్రమే కాదు... మనసున్న మారాజు కూడా. కాబట్టే ప్రపంచంలో పేదరికంతో, జబ్బుల బారిన పడి మరణిస్తున్న పిల్లలను చూసి చలించాడు. ఫౌండేషన్‌ను స్థాపించి అనేక దేశాల్లో బాలలకు వ్యాక్సిన్ అందిస్తున్నాడు. డబ్బు సంపాదించడం చాలామందికి తెలుసు, కానీ సంపాదించిన డబ్బును విరాళంగా ఇవ్వాలంటే గొప్ప మనసుండాలి. ఆ మంచి మనసు, స్పందించే హృదయం గేట్స్ సొంతం. సమాజంలో ప్రజలందరూ మెరుగైన జీవనాన్ని పొందినప్పుడే తన వ్యాపార విస్తరణ మరింతగా జరుగుతుందన్న స్వార్థం అందులో లేకపోలేదు. అయినా అది మంచి స్వార్థమే. కంప్యూటర్ రంగంలో విస్తృత పరిజ్ఞానం, విజన్, చిత్తశుద్ధి, పట్టుదల, పవర్, కరిష్మా గేట్స్ బలాలు కాగా... ఆధిప్యత ధోరణి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడం, లక్ష్యాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఆయన బలహీనతలు. - విశేష్, సైకాలజిస్ట్