Aramco
-
చమురు వినియోగంపై ఈవీల ప్రభావం ఎంత..?
భారతదేశానికి ఎంతోకాలంగా ముడి చమురు సరఫరా చేస్తున్న సౌదీ అరామ్కో దేశంలో మరింత పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ టు కెమికల్స్ వ్యాపారంలో 20% వాటా కోసం 15 బిలియన్ డాలర్ల బిడ్ వేసి విఫలమైన సంగతి తెలిసిందే. తాజాగా పెట్రోకెమికల్స్ బిజినెస్‌లో ఆసక్తి కనబరుస్తున్నట్లు చెబుతుంది. విద్యుత్ వాహనాలు పెరుగుతున్నా ప్రపంచంలో చమురు వినియోగం తగ్గదని చెబుతుంది. దాంతో ఇండియాలో మరింత వ్యాపారానికి ఆస్కారం ఉన్నట్లు సౌదీ అరామ్కోలో స్ట్రాటజీ అండ్ మార్కెట్ అనాలిసిస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫహద్ అల్ ధుబైబ్ ఓ మీడియాతో తెలిపారు. భారతదేశంలో జనాభా పెరుగుదలతోపాటు పారిశ్రామికీకరణ ప్రణాళికలు అధికమవుతున్నాయిని ధుబైబ్ అన్నారు. ‘గత రెండు దశాబ్దాలుగా భారత్ ఎంతో అభివృద్ధి చెందింది. 2050 వరకు దాదాపు 100 కోట్ల మంది ప్రజలు అధికంగా ఇంధనాన్ని వినియోగించనున్నారు. చమురుతోపాటు రానున్న రోజుల్లో పెట్రోకెమికల్స్‌లోనూ గణనీయమైన వృద్ధికి అవకాశం ఉంది. భారత్‌లో హైడ్రోకార్బన్లు, అవసరమైన రసాయనాలు, పదార్థాలను శుద్ధి చేయడంలో పెట్టుబడులు పెట్టేందుకు అరామ్కో పరిశీలిస్తుంది. భారతదేశానికి అరామ్కో ప్రధాన ఎల్పీజీ సరఫరాదారుగా ఉంది’ అని చెప్పారు. ఇదీ చదవండి: క్రూడాయిల్‌పై పన్ను పెంపు.. ఎంతో తెలుసా.. ‘ఇప్పటికీ చాలామంది బయోమాస్ లేదా కలపను వినియోగించి వంట చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డేటా ప్రకారం ఏటా ఇంట్లో పొగవల్ల ఏర్పడే కాలుష్యం కారణంగా దాదాపు 4 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ఇవి తగ్గాలంటే ప్రతి ఇంట్లో ఎల్పీజీ వినియోగించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తూ రెన్యువెబుల్ ఎనర్జీకి అయ్యే ఖర్చులను తగ్గించేందుకు కృషి చేయాలని అరామ్కో యోచిస్తోంది’ అని ధుబైబ్ తెలిపారు. -
యాపిల్‌కి షాక్! నంబర్ వన్ స్థానం గాయబ్!!
మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఇప్పటి వరకు వరల్డ్ నంబర్ వన్‌గా ఉన్న యాపిల్‌కి షాక్ తగిలింది. ప్రపంచ నంబర్ వన్ హోదాను కోల్పోయింది. యాపిల్ని వెనక్కి నెట్టి సౌది అరేబియాకు చెందిన సౌదీ అరామ్కో సంస్థ మొదటి స్థానం ఆక్రమించింది. బుధవారం ఈ రెండు కంపెనీల షేర్ల ధరల్లో వచ్చిన హెచ్చు తగ్గులే ఈ మార్పుకి కారణం. మ్యార్కెట్ క్యాపిటలైజేషన్లో మూడు ట్రిలియన్ డాలర్ల విలువని అందుకోవడం ద్వారా యాపిల్ ప్రపంచంలోనే నంబర్ వన్‌గా మారింది. అయితే ఇటీవల కాలంలో యాపిల్ షేర్ ధరకు కోత పడుతోంది. బుధవారం ఒక్కరోజే షేరు వ్యాల్యూ 5.2 శాతం పడిపోయింది. దీంతో ఒక్కో షేరు ధర 146.50 డాలర్లుగా ఉండగా మార్కెట్ క్యాపిటల్ 2.37 ట్రిలియన్లకు పడిపోయింది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ముడి చమురు ధరలు ప్రపంచ వ్యాప్తంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ తరుణంలో ఆయిల్ ఉత్పత్తిదారైన సౌదీ అరామ్కో కంపెనీ షేర్ల విలువ గణనీయంగా పెరుగుతోంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీ షేర్లు 28 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఫలితంగా బుధవారం అరామ్కో మార్కెట్ క్యాపిటల్ 2.43 ట్రిలియన్ డాలర్లుగా నమోదు అయ్యింది. దీంతో యాపిల్‌ను వెనక్కి మార్కెట్ క్యాపిటలైజేషన్లో వరల్డ్ నంబర్ 1గా అధిగమించింది. ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటంతో ఎలక్ట్రానిక్స్ వంటి విలాస వస్తువులకు డిమాండ్ తగ్గిపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు యుద్ధం ఇప్పుడప్పుడే ఆగే పరిస్థితి లేకపోవడంతో ఆయిల్ ధరలు దిగి వచ్చే సూచనలు కనిపించడం లేదు. వెరసి యాపిల్ మార్కెట్ క్యాప్‌కు కోత పడగా సౌదీఅరామ్కో భారీగా లాభపడింది. చదవండి: వేసవి ప్రయాణానికి రెడీ -
యాపిల్ పెను సంచలనం
Apple first company to cross $3 trillion market cap milestone: కార్పొరేట్ రంగంలో యాపిల్ కంపెనీ పెను సంచనలం సృష్టించింది. ఏకంగా 3 ట్రిలియన్ డాలర్ల(3 X రూ.75లక్షల కోట్లుపైనే) వాల్యూ మార్క్‌ను అందుకున్న తొలి కంపెనీగా అవతరించింది. సోమవారం (జనవరి 3, 2022)న మధ్యాహ్నాం మార్కెట్లో షేర్ల ధరల పెరుగుదలతో ఈ ఘనత సాధించింది ఈ అమెరికన్ మల్టీనేషనల్ టెక్ దిగ్గజం. స్టీవ్ జాబ్స్ 2007లో ఫస్ట్ యాపిల్ ఐఫోన్‌ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి విలువతో పోలిస్తే.. ఇప్పుడు యాపిల్ షేర్లు 5,800 శాతం రెట్లు పెరిగాయి ఇప్పుడు. కరోనా టైంలోనూ ఈ కార్పొరేట్ జెయింట్ హవాకు అడ్డుకట్ట పడకపోవడం విశేషం. 2020 మొదట్లో 200 శాతం పెరిగాయి షేర్ల ధరలు. మొత్తంగా ఇప్పుడు మూడు ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌ను దాటేసింది. స్టీవ్ జాబ్స్ 1976లో ఓ కంప్యూటర్ కంపెనీగా మొదలైన యాపిల్ కంపెనీ.. ఇన్కార్పోరేటెడ్గా(విలీన కంపెనీగా) హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, మీడియా సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే. 2 ట్రిలియన్ మార్కెట్‌ను అందుకున్న కేవలం పదిహేడు నెలలకే.. అది చిప్ కొరత లాంటి అసాధారణ సమస్యను ఎదుర్కొంటూనే 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ మార్క్‌ను టచ్ చేయగలగడం మరో విశేషం. యాపిల్ తొలి ఆఫీస్ నా జీవితంలో ఈ మార్క్‌ను కంపెనీ సాధిస్తుందని ఊహించలేదు.. కానీ, రాబోయే ఐదు పదేళ్లలో యాపిల్ ఊపు ఎలా ఉండబోతుందో ఈ గణాంకాలే చెప్తున్నాయి అంటున్నారు కంపెనీలో 2.75 మిలియన్ షేర్లు ఉన్న ప్యాట్రిక్ బర్టోన్(ఈయన మెయిన్ స్టే విన్స్లో లార్జ్ క్యాప్ గ్రోత్ ఫండ్‌కి కో-ఫోర్ట్‌ఫోలియో మేనేజర్). యాపిల్ కంపెనీ 2018లో 1 ట్రిలియన్ డాలర్ మార్క్ అందుకుంది. ఆగష్టు 2020లో 2 ట్రిలియన్ డాలర్ మార్క్ అందుకుంది. ఈ క్రమంలో మరో టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంది యాపిల్. మొత్తంగా 2 ట్రిలియన్ డాలర్ మార్క్ దాటిన తొలి కంపెనీ మాత్రం సౌదీ ఆరామ్కో(సౌదీ అరేబియన్ ఆయిల్ కంపెనీ). ప్రస్తుతం యాపిల్ మొదటి స్థానంలో ఉండగా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్(గూగుల్), సౌదీ ఆరామ్కో, అమెజాన్‌లో తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాయి. చదవండి: యాపిల్+మేక్ ఇన్ ఇండియా= 50 బిలియన్ డాలర్లు!! -
రిలయన్స్‌తో డీల్ క్యాన్సల్..! భారత్‌ను వదులుకునే ప్రసక్తే లేదు...!
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన పెట్రో కెమికల్ వ్యాపారంలో సౌదీ ఆరామ్కో ప్రతిపాదిత పెట్టుబడుల డీల్‌పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. రిలయన్స్ ఓ2సీ(ఆయిల్ టూ కెమికల్స్)లో భాగంగా ఆరామ్కోతో చేసుకున్న 15 బిలియన్ డాలర్ల ఒప్పందం పూర్తిగా రద్దైనట్లుగా కన్పిస్తోంది.ఇక ప్రైవేట్ రంగంలో పెట్టుబడుల విషయంలో సౌదీ ఆరామ్కో తమకు ప్రాధాన్య భాగస్వామిగా కొనసాగుతుందని రిలయన్స్ (ఆర్ఐఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: వారు వెంటనే రాజీనామా చేయండి: ఎలన్ మస్క్ ఆర్డర్స్ భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఎప్పుడూ సిద్దమే..! రిలయన్స్‌తో భారీ ఒప్పందం నిలిచిపోవడంతో సౌదీ ఆరామ్కో కంపెనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారత్‌లో పలు రంగాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఆరామ్కో వదులుకోదని కంపెనీ వెల్లడించింది. లాంగ్‌టర్మ్ పిరియడ్స్‌లో భారత్ అద్బుతమైన వృద్దిను అందిస్తోందని ఆరామ్కో అభిప్రాయపడింది. అనువైన రంగాల్లో కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ ఎప్పుడు సిద్దంగా ఉంటుందని ఆరామ్కో పేర్కొంది. చదవండి: రిలయన్స్, సౌదీ ఆరామ్కో డీల్ రద్దు -
మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్ ఈ వారంలోనూ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రిలయన్స్–సౌదీ ఆరామ్కో ఒప్పందానికి బ్రేక్ పడింది. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణ భయాలు ఈక్విటీ మార్కెట్లను భయపెడుతున్నాయి. అంతర్జాతీయంగా కోవిడ్ కేసులు తిరిగి పెరుగుతున్నాయి. నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ గురువారం(ఈ నెల 25న) ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. ఈ అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగిన గతవారంలో సూచీలు దాదాపు రెండుశాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 1051 పాయింట్లు, నిఫ్టీ 338 పాయింట్లను కోల్పోయాయి. కార్పొరేట్ల సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెప్పించినప్పటికీ.., అధిక వ్యాల్యూయేషన్ల కారణంగా మార్కెట్లో కన్సాలిడేషన్(స్థిరీకరణ)కొనసాగుతుంది. ప్రస్తుతం నిఫ్టీ 17,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది. అమ్మకాలు జరిగితే 17,500 వద్ద మరో మద్దతు స్థాయి ఉంది. దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేనందున రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలే సూచీలకు దిశానిర్దేశం చేయనున్నాయి’’ అని సామ్కో రీసెర్చ్ హెడ్ నిరాళీ షా తెలిపారు. ట్రేడింగ్‌పై వ్యవసాయ చట్టాల రద్దు ప్రభావమెంత..? కొద్ది నెలలుగా కేంద్రం ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య వివాదంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర శుక్రవారం మోదీ ప్రకటించారు. ‘‘వాస్తవానికి మూడు చట్టాలు వ్యాపార అనూకూలమైనవి. ఈ చట్టాలు అమల్లో లేనందున ట్రేడింగ్‌పై పెద్దగా ఉండకపోవచ్చు. అయితే కేంద్రం అనూహ్యంగా వెనక్కి తగ్గడం, మార్కెట్లో నెలకొన్న అస్థిరత పరిస్థితుల దృష్ట్యా చట్టాల రద్దు అంశం ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు’’ అని స్వస్తిక ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు రిలయన్స్, సౌదీ ఆరామ్కో డీల్ కు మంగళం రిలయన్స్ – సౌది ఆరాకో ఒప్పందానికి మరోసారి బ్రేక్ పడింది. సౌదీ అరామ్కోకు తన 20 శాతం వాటా విక్రయ ఒప్పందాన్ని మరోసారి మూల్యాంకనం చేయాలని నిర్ణయించుకున్నట్లు రిలయన్స్ ఎక్సే్చంజీలకు సమాచారం ఇచ్చింది. ఒప్పంద రద్దు ధీర్ఘకాలంలో రిలయన్స్ షేరుపై పెద్దగా ప్రభావాన్ని చూపకపోవచ్చని అయితే స్వల్పకాలం పాటు తీవ్ర ఒడిదుడుకులను లోనుకావచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. తన చమురు శుద్ధి, పెట్రో కెమికల్ వ్యాపారాల్లో 20 శాతా వాటాను విక్రయించి, 15 బిలియన్ డాలర్లను సమీకరించాలని రిలయన్స్ భావించిన సంగతి తెలిసిందే. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(ఈ నెల 25న) నిఫ్టీ సూచీకి చెందిన నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తన పొజిషన్లను స్క్వేయర్ ఆఫ్‌కు ఆసక్తి చూపుతుండటంతో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
సౌదీ ఆరామ్‌కోకి గుడ్‌బై చెప్పిన రిలయన్స్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన పెట్రోకెమికల్ (ఓ2సీ) వ్యాపారంలో సౌదీ ఆరామ్కో ప్రతిపాదిత పెట్టుబడుల డీల్ రద్దయింది. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకుని విలువను మరోసారి మదింపు చేయాలని ఇరు సంస్థలు నిర్ణయించుకున్నాయి. ప్రైవేట్ రంగంలో పెట్టుబడుల విషయంలో సౌదీ ఆరామ్కో తమకు ప్రాధాన్య భాగస్వామిగా కొనసాగుతుందని రిలయన్స్ (ఆర్ఐఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. 2019 ఆగస్టులో రిలయన్స్ తమ ఓ2సీ వ్యాపారం విలువను 75 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. దీన్ని ప్రత్యేక విభాగంగా కూడా విడగొట్టాలని భావించింది. నిర్దిష్ట ప్రతిపాదనల ప్రకారం ఓ2సీ విభాగంలో సౌదీ ఆరామ్కో సంస్థకు 15 బిలియన్ డాలర్లకు 20 శాతం వాటాలు విక్రయించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందుకు ముందుగా 2020 మార్చి డెడ్‌లైన్‌గా పెట్టుకుంది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఆఖరు నాటికి పూర్తి కాగలదని ప్రకటించింది. అయితే, ఈలోగా పర్యావరణ హిత ఇంధనాల ఉత్పత్తి దిశగా కంపెనీ కొత్తగా భారీ ప్రణాళికలు ప్రారంభించడం, క్రమంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు, ఓ2సీని ప్రత్యేక విభాగంగా విడగొట్టే ప్రతిపాదనను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి రిలయన్స్ వెనక్కి తీసుకుంది. ఈ అంశాల నేపథ్యంలో తాజాగా రిలయన్స్ ఓ2సీ విభాగంలో సౌదీ ఆరామ్కో పెట్టుబడుల ప్రతిపాదన రద్దు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రిలయన్స్ బ్రాండ్స్‌తో వెస్ట్ ఎల్మ్ జట్టు.. ఫర్నిచర్, హోమ్ డెకరేషన్ ఉత్పత్తుల సంస్థ వెస్ట్ ఎల్మ్ తాజాగా భారత మార్కెట్లో ప్రవేశించింది. ఇందుకోసం రిలయన్స్ బ్రాండ్స్‌తో చేతులు కలిపింది. జియో వరల్డ్ డ్రైవ్‌లో తొలి స్టోర్‌ను అక్టోబర్‌లో ప్రారంభించగా, గత వారం రెండో స్టోర్‌ను గుర్గావ్లో ఆరంభించింది. అటు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ ఆశీష్ షాతో కూడా జట్టు కట్టింది. రిలయన్స్ బ్రాండ్స్ ఇప్పటికే దాదాపు 35 అంతర్జాతీయ బ్రాండ్స్‌ను దేశీ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు చెందిన ఎంఎం స్టైల్స్‌లో 40 శాతం వాటాలు కొనుగోలు చేసింది. -
రియలన్స్ ఇండస్ట్రీస్, ఆరామ్కో డీల్.. రీ ఎవాల్యుయేట్
రియలన్స్ ఇండస్ట్రీస్, సౌదీ ఆరామ్కో కంపెనీల మధ్య గతంలో కుదిరిన వ్యాపార ఒప్పందంలో తిరిగి కదలిక వచ్చింది. 2019 ఆగస్టులో ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే కరోనా కారణంగా ఆ తర్వాత ఈ ఒప్పంద విషయంలో మళ్లీ ఎటువంటి పురోగతి లేదు. కాగా సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని ఇటీవల రిలయన్స్ నిర్ణయించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏకంగా నాలుగు గిగా ఫ్యాక్టరీలో నెలకొల్పబోతుంది. ఈ నేపథ్యంలో తమ పెట్రోకెమికల్, ఆయిల్ రిఫైనరీలో 20 శాతం వాటాల విక్రయానికి సౌదీ అరామ్కోతో డీల్‌ను తిరిగి మదింపు చేయాలని నిర్ణయించినట్టు రిలయన్స్ ఇండస్ర్టీస్ ప్రకటించింది. రూ.1,.13 లక్షల కోట్ల విలువ గల ఈ డీల్ ఇప్పటికి రెండు సార్లు పట్టాలకెక్కడంలో విఫలమైంది. అయితే కొత్త ఇంధన రంగాల్లోకి ప్రవేశించాలన్న రిలయన్స్ ఆకాంక్షకు అనుగుణంగా ఆ డీల్‌ను పునఃపరిశీలించాలని నిర్ణయించినట్టు ఉభయ సంస్థలు తాజాగా ప్రకటించాయి. -
ఆర్ఐఎల్ బోర్డులో అరామ్కో చైర్మన్
న్యూఢిల్లీ: కంపెనీ బోర్డులో సౌదీ ఇంధన దిగ్గజం అరామ్కో గ్రూప్ చైర్మన్ యాసిర్ అల్రుమయాన్ను నియమించే ప్రతిపాదనకు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) వాటాదారులు తాజాగా ఆమోదముద్ర వేశారు. మూడేళ్ల కాలానికి యాసిర్ నియామకాన్ని సమర్దిస్తూ 98.03 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఆర్ఐఎల్ తాజాగా వెల్లడించింది. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా కేవలం 2 శాతానికిలోపే ఓట్ చేసినట్లు తెలియజేసింది. 1.96 శాతానికి సమానమైన 10.89 కోట్ల షేర్లు తీర్మానానికి వ్యతిరేకంగా నిలిచినట్లు వెల్లడించింది. కాగా.. యూఎస్ రీసెర్చ్ సలహా సంస్థ గ్లాస్ లెవీస్ సిఫారసు మేరకు ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు చేసేందుకు గత నెలలో కాలిఫోర్నియా స్టేట్ టీచర్స్ రిటైర్మెంట్ సిస్టమ్(కాల్‌ఎస్‌టీఆర్‌ఎస్) నిర్ణయించిన విషయం విదితమే. యాసిర్.. సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(పీఐఎఫ్)కు గవర్నర్ కావడంతో ఆర్ఐఎల్ వాటాదారుగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. ఇప్పటికే పీఐఎఫ్.. రిలయన్స్ రిటైల్‌లో రూ. 9,555 కోట్లు, జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ. 11,367 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసింది. కాగా.. ఆర్ఐఎల్కు చెందిన ఆయిల్ టు కెమికల్స్ బిజినెస్‌లో అరామ్కో 20 శాతం వాటాను కొనుగోలు చేసే ప్రణాళికల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకుతోడు, శుక్రవారం(నేడు) క్యూ2 ఫలితాల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు 3 శాతం క్షీణించి రూ. 2,623 వద్ద ముగిసింది. -
ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు..! ఆ కంపెనీకి మాత్రం కాసుల వర్షమే..!
2 Trillion Company Is Making A Fortune Out Of Soaring Oil Prices : ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు కన్పిస్తున్నాయి. ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నీ తాకుతున్నాయి.ఇంధన ధరలు సామాన్యులకు షాక్ ఇస్తూంటే సౌదీ కంపెనీకి మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. మైక్రోసాఫ్ట్, ఆపిల్ కంపెనీలకే పోటీగా... సౌదీ అరేబియా చమురు కంపెనీ ఆరామ్కో బుధవారం రోజున ట్రేడింగ్ సమయంలో సరికొత్త రికార్డులను నమోదుచేసింది. ఆరామ్కో కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలుగా నిలిచిన మైక్రోసాఫ్ట్, ఆపిల్ కంపెనీలకు పోటీగా ఆరామ్కో అడుగులు వేస్తోంది. ప్రపంచంలో అత్యధిక మార్కెట్ క్యాప్ కల్గిన మూడో కంపెనీగా ఆరామ్కో నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పెరగడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఏడు సంవత్సరాల్లో గరిష్టంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 82 డాలర్లకు పైగా పెరిగాయి. చదవండి: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1120కిమీ ప్రయాణం..! భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే.. ముడిచమురుకు భారీ డిమాండ్..! ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురుపై భారీ డిమాండ్ నెలకొంది. సౌదీ అరేబియా ప్రభుత్వం ఆరామ్‌కోలో అధిక వాటాలను కల్గి ఉంది. సౌదీ తడావుల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో బహిరంగంగా జాబితా చేయబడిన కంపెనీలో కేవలం 2% కంటే తక్కువ వాటాలను ఆరామ్కో కల్గిఉంది. 2019 చివరలో ఆరామ్‌కోలో కొంత భాగాన్ని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ స్టాక్ఎక్సేఛేంజ్లో లిస్ట్ చేసేలా చేశారు.ఆయిల్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి కూడా గణనీయమైన లాభాలను పొందుతున్నారు. చదవండి: నిన్న ప్రధానితో నేడు ఆర్థిక మంత్రితో ఝున్‌ఝున్‌వాలా భేటీ, నెక్ట్స్ స్టెప్ ఏంటీ ?