భారతదేశానికి ఎంతోకాలంగా ముడి చమురు సరఫరా చేస్తున్న సౌదీ అరామ్‌కో దేశంలో మరింత పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ టు కెమికల్స్ వ్యాపారంలో 20% వాటా కోసం 15 బిలియన్ డాలర్ల బిడ్ వేసి విఫలమైన సంగతి తెలిసిందే. తాజాగా పెట్రోకెమికల్స్ బిజినెస్‌లో ఆసక్తి కనబరుస్తున్నట్లు చెబుతుంది.
విద్యుత్ వాహనాలు పెరుగుతున్నా ప్రపంచంలో చమురు వినియోగం తగ్గదని చెబుతుంది. దాంతో ఇండియాలో మరింత వ్యాపారానికి ఆస్కారం ఉన్నట్లు సౌదీ అరామ్‌కోలో స్ట్రాటజీ అండ్ మార్కెట్ అనాలిసిస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫహద్ అల్ ధుబైబ్ ఓ మీడియాతో తెలిపారు.
భారతదేశంలో జనాభా పెరుగుదలతోపాటు పారిశ్రామికీకరణ ప్రణాళికలు అధికమవుతున్నాయిని ధుబైబ్ అన్నారు. ‘గత రెండు దశాబ్దాలుగా భారత్ ఎంతో అభివృద్ధి చెందింది. 2050 వరకు దాదాపు 100 కోట్ల మంది ప్రజలు అధికంగా ఇంధనాన్ని వినియోగించనున్నారు. చమురుతోపాటు రానున్న రోజుల్లో పెట్రోకెమికల్స్‌లోనూ గణనీయమైన వృద్ధికి అవకాశం ఉంది. భారత్‌లో హైడ్రోకార్బన్లు, అవసరమైన రసాయనాలు, పదార్థాలను శుద్ధి చేయడంలో పెట్టుబడులు పెట్టేందుకు అరామ్‌కో పరిశీలిస్తుంది. భారతదేశానికి అరామ్‌కో ప్రధాన ఎల్‌పీజీ సరఫరాదారుగా ఉంది’ అని చెప్పారు.
ఇదీ చదవండి: క్రూడాయిల్‌పై పన్ను పెంపు.. ఎంతో తెలుసా..
‘ఇప్పటికీ చాలామంది బయోమాస్ లేదా కలపను వినియోగించి వంట చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డేటా ప్రకారం ఏటా ఇంట్లో పొగవల్ల ఏర్పడే కాలుష్యం కారణంగా దాదాపు 4 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ఇవి తగ్గాలంటే ప్రతి ఇంట్లో ఎల్‌పీజీ వినియోగించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తూ రెన్యువెబుల్ ఎనర్జీకి అయ్యే ఖర్చులను తగ్గించేందుకు కృషి చేయాలని అరామ్‌కో యోచిస్తోంది’ అని ధుబైబ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment