ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని నియంత్రించేందుకు మిడిల్‌ఈస్ట్ దేశాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సోమవారం చమురు ధరలు 2% పైగా పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.33 అమెరికన్ డాలర్లు లేదా 2.5% తగ్గి బ్యారెల్ ధర 89.83 యూఎస్ డాలర్ల వద్ద స్థిరపడింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.59 డాలర్లు లేదా 2.9% తగ్గి బ్యారెల్ 85.49 యూఎస్ డాలర్లకు చేరింది.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి వల్ల చమురు సరఫరాపై తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చునని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రాంతీయంగా తరచూ అనేక అనిశ్చితులు ఎదుర్కొనే ఇజ్రాయెల్.. రోజుకి మూడు లక్షల బ్యారెల్ సామర్థ్యం ఉన్న రెండు చమురు శుద్ధి కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో చమురు ఉత్పత్తి, శుద్ధి, సరఫరాపై తక్షణం ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చునని అంచనా! అయితే, ఉద్రిక్తతలు మరింత ముదిరి, సంక్షోభం సుదీర్ఘంగా కొనసాగితే మాత్రం ముప్పు తప్పదని నిపుణులు అంటున్నారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని నియంత్రించేందుకు మిడిల్‌ఈస్ట్ దేశాలు చేస్తున్న ఫలిస్తే మాత్రం క్రూడ్ ధర మరింత తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ ప్రతినిధులు ఈ వారం ఇజ్రాయెల్‌ను సందర్శించనున్నారు.
ఇదిలా ఉండగా..పరిస్థితులను బట్టి చమురు ఉత్పత్తిని సర్దుబాటు చేస్తామని ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలైన బహ్రైన్, ఇరాక్, కువైట్, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా హామీ ఇచ్చాయి. దానివల్ల ప్రపంచ ఆయిల్ మార్కెట్‌లో చమురు ధరలు స్థిరంగా ఉండవచ్చనే వాదనలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment