మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఇప్పటి వరకు వరల్డ్ నంబర్ వన్‌గా ఉన్న యాపిల్‌కి షాక్ తగిలింది. ప్రపంచ నంబర్ వన్ హోదాను కోల్పోయింది. యాపిల్‌ని వెనక్కి నెట్టి సౌది అరేబియాకు చెందిన సౌదీ అరామ్‌కో సంస్థ మొదటి స్థానం ఆక్రమించింది. బుధవారం ఈ రెండు కంపెనీల షేర్ల ధరల్లో వచ్చిన హెచ్చు తగ్గులే ఈ మార్పుకి కారణం.
మ్యార్కెట్ క్యాపిటలైజేషన్‌లో మూడు ట్రిలియన్ డాలర్ల విలువని అందుకోవడం ద్వారా యాపిల్ ప్రపంచంలోనే నంబర్ వన్‌గా మారింది. అయితే ఇటీవల కాలంలో యాపిల్ షేర్ ధరకు కోత పడుతోంది. బుధవారం ఒక్కరోజే షేరు వ్యాల్యూ 5.2 శాతం పడిపోయింది. దీంతో ఒక్కో షేరు ధర 146.50 డాలర్లుగా ఉండగా మార్కెట్ క్యాపిటల్ 2.37 ట్రిలియన్లకు పడిపోయింది.
ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ముడి చమురు ధరలు ప్రపంచ వ్యాప్తంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ తరుణంలో ఆయిల్ ఉత్పత్తిదారైన సౌదీ అరామ్‌కో కంపెనీ షేర్ల విలువ గణనీయంగా పెరుగుతోంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీ షేర్లు 28 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఫలితంగా బుధవారం అరామ్‌కో మార్కెట్ క్యాపిటల్ 2.43 ట్రిలియన్ డాలర్లుగా నమోదు అయ్యింది. దీంతో యాపిల్‌ను వెనక్కి మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో వరల్డ్ నంబర్ 1గా అధిగమించింది.
ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటంతో ఎలక్ట్రానిక్స్ వంటి విలాస వస్తువులకు డిమాండ్ తగ్గిపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు యుద్ధం ఇప్పుడప్పుడే ఆగే పరిస్థితి లేకపోవడంతో ఆయిల్ ధరలు దిగి వచ్చే సూచనలు కనిపించడం లేదు. వెరసి యాపిల్ మార్కెట్ క్యాప్‌కు కోత పడగా సౌదీఅరామ్‌కో భారీగా లాభపడింది.
చదవండి: వేసవి ప్రయాణానికి రెడీ
Comments
Please login to add a commentAdd a comment