పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన పెట్రో కెమికల్ వ్యాపారంలో సౌదీ ఆరామ్‌కో ప్రతిపాదిత పెట్టుబడుల డీల్‌పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. రిలయన్స్ ఓ2సీ(ఆయిల్ టూ కెమికల్స్)లో భాగంగా ఆరామ్‌కోతో చేసుకున్న 15 బిలియన్ డాలర్ల ఒప్పందం పూర్తిగా రద్దైనట్లుగా కన్పిస్తోంది.ఇక ప్రైవేట్ రంగంలో పెట్టుబడుల విషయంలో సౌదీ ఆరామ్‌కో తమకు ప్రాధాన్య భాగస్వామిగా కొనసాగుతుందని రిలయన్స్ (ఆర్‌ఐఎల్) ఒక ప్రకటనలో తెలిపింది.
చదవండి: వారు వెంటనే రాజీనామా చేయండి: ఎలన్ మస్క్ ఆర్డర్స్
భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఎప్పుడూ సిద్దమే..!
రిలయన్స్‌తో భారీ ఒప్పందం నిలిచిపోవడంతో సౌదీ ఆరామ్‌కో కంపెనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారత్‌లో పలు రంగాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఆరామ్‌కో వదులుకోదని కంపెనీ వెల్లడించింది. లాంగ్‌టర్మ్ పిరియడ్స్‌లో భారత్ అద్బుతమైన వృద్దిను అందిస్తోందని ఆరామ్‌కో అభిప్రాయపడింది. అనువైన రంగాల్లో కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ ఎప్పుడు సిద్దంగా ఉంటుందని ఆరామ్‌కో పేర్కొంది.
చదవండి: రిలయన్స్, సౌదీ ఆరామ్‌కో డీల్ రద్దు
Comments
Please login to add a commentAdd a comment