న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అంకుర సంస్థల వ్యవస్థలోకి 2030 నాటికల్లా వార్షిక పెట్టుబడుల పరిమాణం 1 లక్ష కోట్ల డాలర్లకు చేరేలా కృషి చేయాలని స్టార్టప్20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ నిర్దేశించుకుంది. ఇందుకోసం జీ20 దేశాధినేతలతో భేటీ కానుంది. ప్రస్తుతం స్టార్టప్ వ్యవస్థలోకి వార్షిక పెట్టుబడు లు 700 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. స్టార్టప్20 ఇండియా చెయిర్ చింతన్ వైష్ణవ్ ఈ విషయాలు తెలిపారు.
పెట్టుబడుల తోడ్పాటుతో స్టార్టప్‌లు అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధికి చోదకాలుగా నిలవగలవని ఆయన చెప్పారు. అంకుర సంస్థలకు అంతర్జాతీయంగా ప్రామాణికమైన నిర్వచనాన్ని రూపొందిస్తే వాటికి పెట్టుబడులు, నిపుణుల లభ్యత మరింతగా పెరగగలదని పేర్కొన్నారు. జీ20కి అధ్యక్షత వహిస్తున్న భారత్.. జూలై 3–4న గురుగ్రామ్‌లో ’స్టార్టప్20 శిఖర్’ సదస్సు నిర్వహించనుంది. ఇందులో జీ20 సభ్యదేశాలకు చెందిన 700 పైగా అంకుర సంస్థలు పాల్గోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment