టెక్నాలజీ దిగ్గజం ఆపిల్.. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలకు షాక్ ఇవ్వనుంది. ప్రపంచంలోనే మొదటి ట్రిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించడానికి శరవేగంగా దూసుకుపోతోంది. స్టాక్‌మార్కెట్ వాల్యూయేషన్ పరంగా రేసులో ముందు వరుసలో పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో ట్రిలియన్ డాలర్లు, అంతకంటే పైన స్థిరపడనుందన్న ఎనలిస్టుల అంచనాలను త్వరలోనే బీట్ చేస్తుందని భావిస్తున్నారు.
ది గార్డియన్ ప్రకారం, ఆర్థిక వ్యాఖ్యాతలు, పెట్టుబడిదారులు ఆపిల్ సంస్థ ఒక ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటేయనుంది. 2017లో ఆపిల్ షేరు పుంజుకున్న నేపథ్యంలో 2018లో స్టాక్ మార్కెట్ విలువ ట్రిలియన్ లేదా అంతకు మించి ఆవిష్కరించనుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఆపిల్ మంగళవారం మార్కెట్ విలువ 869 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఆపిల్ షేర్ ధరలు గతేడాది 47 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఐఫోన్లతో స్మార్ట్‌ఫోన్ రంగంలో దూసుకుపోతున్న ట్రిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించాలంటే ఆపిల్ షేరు ఇంకా 15 శాతం పుంజుకోవాల్సి ఉంది. కాగా ఈ రేసులో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్, టెన్సెంట్ కంపెనీలు ఆపిల్‌కు గట్టి పోటీగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment