‘మూడేళ్లలో 70 లక్షల ఉద్యోగాలు’
సాక్షి,గుర్‌గ్రాం:భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మళ్లే క్రమంలో 2020 నాటికి దేశంలో 50 నుంచి 70 లక్షల ఉద్యోగాలు యువతకు అందుబాటులోకి వస్తాయని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ప్రజల సంక్షేమానికి, సంపద సృష్టికి సమ్మిళిత టెక్నాలజీ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. మెరుగైన ఆర్థిక వృద్ధి సాధనకి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. డిజిటల్ హర్యానా సదస్సులో మంత్రి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ డిజిటల్ దిశగా వేగంగా కదులుతున్నదన్నారు.
చిన్న నగరాల్లో సైతం బీపీఓ కంపెనీల ఏర్పాటును ప్రోత్సహిస్తూ కేంద్రం ప్రత్యేక పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. గ్రామాలు, పట్టణాలు డిజిటల్‌కు మరలేలా వ్యాపారవేత్తలు చొరవ చూపాలని కోరారు.