కాంగ్రెస్‌ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు: హరీష్‌రావు | BRS Harish Rao Satirical Comments On Congress Over Ruling, Check His Tweet Inside | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు: హరీష్‌రావు

Published Thu, Dec 26 2024 9:13 AM | Last Updated on Thu, Dec 26 2024 10:36 AM

BRS Harish Rao Satirical Comments On Congress

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ.. రాక్షస పాలన కొనసాగిస్తున్నారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్‌ రావు. ఇది ఇందిరమ్మ రాజ్యమా? లేక పోలీస్ రాజ్యమా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే రేవంత్‌ రెడ్డి దృష్టి పెట్టారని ఆరోపించారు.

మాజీ మంత్రి హరీష్‌ రావు ట్విట్టర్‌ వేదికగా..‘ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా?. అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులు. బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికం.

ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. సెలవు రోజుల్లో కావాలని మా నేతలను అరెస్ట్ చేస్తూ, సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారు. హోం మంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి పెట్టారు. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదు. సీఎం రేవంత్ రెడ్డి, మీ పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడే వారు మేము కాదని గుర్తుంచుకోండి. తెలంగాణ సమాజమే మీకు తగిన బుద్ధి చెబుతుంది అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement