అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్
గుర్గావ్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చొల్లేటి సహజశ్రీ రెండో రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకుంది. గురువారం ఇక్కడ ప్రారంభమైన గుర్గావ్ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆమె శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఆమె భారత్‌కే చెందిన నవ్య తాయల్‌పై గెలుపొందింది. రెండో రౌండ్ గేమ్‌లో అంతర్జాతీయ మాస్టర్ నారాయణన్ శ్రీనాథ్ (1.5)ను నిలువరించింది. చివరికి ఈ గేమ్ డ్రాగా ముగిసింది.
1.5 పాయింట్లతో సహజశ్రీ ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతోంది. రెండో రౌండ్ పోటీల్లో మిగతా ఏపీ క్రీడాకారుల్లో ఎస్. రవితేజ(2) ... రామలింగం కార్తీక్ (1)పై గెలుపొందగా, సీఆర్‌జీ కృష్ణ (1)... కుర్సనోవా ఫరీదా (ఉజ్బెకిస్థాన్)ను ఓడించాడు. కార్తీక్ (1)... కునాల్ మోడి (0)పై నెగ్గగా, దీప్తాంశ్ రెడ్డి (1)... అభినవ్ గోలా (2) చేతిలో కంగుతిన్నాడు. తులసీ రామ్‌కుమార్ (1)... సిద్ధాంత్‌నాత్ (0)పై గెలుపొందగా, మట్ట వినయ్ కుమార్ (1.5)... కేశ్ని బాసిన్ (0.5)పై విజయం సాధించాడు.