Qatar Open: రన్నరప్‌ బోపన్న–షపోవలోవ్‌ జోడీ  | Qatar Open: Bopanna Shapovalov Pair Lose In Doubles Final | Sakshi
Sakshi News home page

Qatar Open: రన్నరప్‌ బోపన్న–షపోవలోవ్‌ జోడీ

Published Sat, Feb 19 2022 11:57 AM | Last Updated on Sat, Feb 19 2022 12:07 PM

Qatar Open: Bopanna Shapovalov Pair Lose In Doubles Final - Sakshi

Qatar Open: ఖతర్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో రోహన్‌ బోపన్న (భారత్‌)–షపోవలోవ్‌ (కెనడా) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. దోహాలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్‌ జోడీ 6–7 (4/7), 1–6తో వెస్లీ కూలాఫ్‌ (నెదర్లాండ్స్‌)–నీల్‌ స్కప్‌స్కీ (బ్రిటన్‌) జంట చేతిలో ఓడిపోయింది.

75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–షపోవలోవ్‌ ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న–షపోవలోవ్‌ జోడీకి 29,240 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 21 లక్షల 80 వేలు) లభించింది. 

ఫైనల్లో సాకేత్‌ జంట
సాక్షి, హైదరాబాద్‌: బెంగళూరు ఓపెన్‌–2 ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని తన భాగస్వామి రామ్‌కుమార్‌ రామనాథన్‌తో కలిసి డబుల్స్‌ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బెంగళూరులో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సాకేత్‌–రామ్‌కుమార్‌ ద్వయం 6–1, 7–6 (7/3)తో కుకావుడ్‌ (ఫ్రాన్స్‌)–ఆండ్రూ హారిస్‌ (ఆ్రస్టేలియా) జోడీపై గెలిచింది. మరో సెమీఫైనల్లో విష్ణువర్ధన్‌–శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌) జంట 4–6, 6–4, 3–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో అర్జున్‌ ఖడే (భారత్‌)–ఎర్లెర్‌ (ఆస్ట్రియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. 

చదవండి: Ind Vs Wi 3rd T20: మూడో టీ20కి స్టార్‌ ప్లేయర్లు దూరం... మరో కీలక సిరీస్‌కు కూడా డౌటే.. ఎందుకంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement