Saket Myneni
-
రన్నరప్ అనిరుధ్ జోడీ; మూడో సీడ్‌పై సాకేత్ జోడీ విజయం
సాక్షి, హైదరాబాద్: స్ల్పిట్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ పురుషుల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. క్రొయేషియాలో జరిగిన ఈ టోర్నీలో అనిరుధ్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జోడీ ఫైనల్లో ఓడిపోయింది. 70 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో అనిరుధ్–విజయ్ సుందర్ ప్రశాంత్ 4–6, 4–6తో సాదియో డుంబియా–ఫాబ్లెన్ రెబూల్ (ఫ్రాన్స్) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. తొలి రౌండ్లో భారత జోడీ 6–2, 6–1తో అర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్)–కైచి ఉచిడా (జపాన్) జంటను ఓడించింది. క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో అనిరుధ్–విజయ్‌లకు తమ ప్రత్యర్థుల నుంచి వాకోవర్ లభించడంతో నేరుగా ఫైనల్ ఆడారు. అనిరుధ్–విజయ్‌లకు 2,450 యూరోల (రూ. 2 లక్షల 20 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మూడో సీడ్‌పై సాకేత్ జోడీ విజయం బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. జర్మనీలోని మ్యూనిక్‌లో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 6–3, 7–6 (7/4)తో మూడో సీడ్ నథానియల్ లామోన్స్–జాక్సన్ విత్రో (అమెరికా) జోడిని ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్, యూకీ జోడి ఆరు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
Qatar Open: రన్నరప్ బోపన్న–షపోవలోవ్ జోడీ
Qatar Open: ఖతర్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. దోహాలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్ జోడీ 6–7 (4/7), 1–6తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–షపోవలోవ్ ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న–షపోవలోవ్ జోడీకి 29,240 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 21 లక్షల 80 వేలు) లభించింది. ఫైనల్లో సాకేత్ జంట సాక్షి, హైదరాబాద్: బెంగళూరు ఓపెన్–2 ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని తన భాగస్వామి రామ్‌కుమార్ రామనాథన్‌తో కలిసి డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బెంగళూరులో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–1, 7–6 (7/3)తో కుకావుడ్ (ఫ్రాన్స్)–ఆండ్రూ హారిస్ (ఆ్రస్టేలియా) జోడీపై గెలిచింది. మరో సెమీఫైనల్లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 4–6, 6–4, 3–10తో ‘సూపర్ టైబ్రేక్’లో అర్జున్ ఖడే (భారత్)–ఎర్లెర్ (ఆస్ట్రియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. చదవండి: Ind Vs Wi 3rd T20: మూడో టీ20కి స్టార్ ప్లేయర్లు దూరం... మరో కీలక సిరీస్‌కు కూడా డౌటే.. ఎందుకంటే! -
సాకేత్, వినాయక్ ఓటమి
పుణే: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాకేత్ మైనేని, కాజా వినాయక్ శర్మతోపాటు హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ కథ ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సాకేత్ మైనేని 6–3, 5–7, 4–6తో ఎర్గిల్ కిర్కిన్ (టర్కీ) చేతిలో... వినాయక్ శర్మ 2–6, 1–6తో సెమ్ ఇల్కెల్ (టర్కీ) చేతిలో... అనిరుధ్ 3–6, 2–6తో రొబెర్టో ఒల్మెడో (స్పెయిన్) చేతిలో ఓడిపోయారు. భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్, సుమీత్ నాగల్, రామ్‌కుమార్ రామనాథన్, శశికుమార్ ముకుంద్ రెండో రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు. -
సాకేత్ జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చెంగ్డూ చాలెంజర్ టూర్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ టైటిల్ గెలిచాడు. ఫైనల్లో సాకేత్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 6–3, 0–6, 10–6తో జి సంగ్ నామ్–మిన్ యు సంగ్ (కొరియా) జంటపై నెగ్గింది. 62 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట 4 ఏస్‌లు సంధించి, 3 డబుల్స్ ఫాల్ట్‌లు చేసింది. ఈ విజయంతో సాకేత్ జోడీకి 7,750 డాలర్ల (రూ. 5 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీ, 110 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సాకేత్ ఓటమి
సాక్షి, హైదరాబాద్: సియోల్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని పోరాటం ముగిసింది. కొరియాలో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో సాకేత్ 4–6, 5–7తో వు తుంగ్ లిన్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ కేవలం ఒక్క ఏస్ మాత్రమే సంధించాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో భారత రెండో ర్యాంకర్ రామ్‌కుమార్ 4–6, 7–6 (7/5), 6–7 (6/8)తో లీ జె (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రామ్‌కుమార్ (భారత్)–బ్రెడెన్ ష్నెర్ (కెనడా) ద్వయం 6–3, 5–7, 10–6తో జీ సుంగ్ నామ్–మిన్ క్యు సాంగ్ (కొరియా) జోడీపై గెలిచి సెమీఫైనల్‌కు చేరింది. -
సాకేత్ పరాజయం
సాక్షి, హైదరాబాద్: కున్మింగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు, భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని పోరాటం ముగిసింది. చైనాలోని ఆనింగ్ నగరంలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సాకేత్ 2–6, 4–6తో భారత్‌కే చెందిన రెండో సీడ్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ చేతిలో ఓడిపోయాడు. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఐదు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఒక్కసారి కూడా బ్రేక్ చేయలేకపోయిన సాకేత్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) 6–4, 6–4తో యాన్ బాయ్ (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. -
పోరాడి ఓడిన సాకేత్
లండన్ : వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ విభాగంలో భారత పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన తెలుగు తేజం సాకేత్ మైనేని రెండో రౌండ్లో నిష్ర్కమించాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్లో సాకేత్ 6-7 (5/7), 6-3, 7-9తో కెన్నీ డి షెప్పర్ (ఫ్రాన్స్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ తొలి రౌండ్లోనే ఓడిన సంగతి తెలిసిందే. -
సెమీస్‌లో సాకేత్, యూకీ
సమర్ఖండ్ (ఉజ్బెకిస్తాన్) : ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత ఆటగాళ్లు యూకీ బాంబ్రీ, సాకేత్ మైనేని సెమీస్‌కు చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 6-4, 1-6, 6-1తో బ్రిటన్ ఆటగాడు బ్రిడెన్ క్లీన్‌పై నెగ్గాడు. యూకీ బాంబ్రి 6-4, 6-4తో ఆడ్రియన్ (స్పెయిన్)పై గెలిచాడు. -
క్వార్టర్స్‌లో సాకేత్, యూకీ
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్) : ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేనితోపాటు భారత అగ్రశ్రేణి ఆట గాడు యూకీ బాంబ్రీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సాకేత్ మైనేని 6-3, 6-2తో ల్యూక్ బామ్‌బ్రిడ్జి (బ్రిటన్)పై అలవోకగా గెలుపొందగా... ఏడో సీడ్ యూకీ 1-6, 7-5, 7-6 (7/1)తో లాస్లో జెరె (సెర్బియా)పై చెమటోడ్చి విజయం సాధించాడు. తొలి రౌండ్లో రెండో సీడ్ ఫారూఖ్ దస్తోవ్ (ఉజ్బెకిస్తాన్)పై సంచలన విజయం సాధించిన ల్యూక్ రెండో రౌండ్లో సాకేత్ ముందు తేలిపోయాడు. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ -దివిజ్ (భారత్) జోడీ 4-6, 6-7 (4/7)తో లాస్లో జెరె-పెజా (సెర్బియా) జంట చేతిలో ఓడింది. -
రన్నరప్‌గా సాకేత్ జోడి
చైనా ఏటీపీ చాలెంజర్ టోర్నీ షెన్జెన్ (చైనా): చైనా ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీ డబుల్స్‌లో ఏపీకి చెందిన సాకేత్ మైనేని జోడి రన్నరప్‌గా నిలిచింది. సాకేత్, దివిజ్ శరణ్ జంట (భారత్) శనివారం జరిగిన ఫైనల్లో 1-6, 6-3, 2-10 తేడాతో నాలుగో సీడ్ గెరో క్రెట్‌షెమర్, అలెగ్జాండర్ సాట్శెకో (జర్మనీ) జంట చేతిలో పరాజయం పాలైంది. ఐదు ఏస్‌లు సంధించిన సాకేత్ జోడి ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తొలి సెట్లో పరాజయం పాలైన తర్వాత, మెరుగైన ప్రదర్శనతో రెండో సెట్‌ను గెల్చుకున్నా... నిర్ణాయక టైబ్రేక్‌లో భారత ద్వయం చేతులెత్తేసింది. -
సాకేత్ సంచలనం
హాంకాంగ్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ హాంకాంగ్: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని సంచలనం సృష్టించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాకేత్ 7-6 (7/1), 1-6, 6-3తో ప్రపంచ 85వ ర్యాంకర్, టాప్ సీడ్ రిచర్డ్స్ బెరాన్కిస్ (లిథువేనియా)ను ఓడించాడు. మరో మ్యాచ్‌లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ (భారత్) 2-6, 6-4, 6-3తో యూకీ బాంబ్రీ (భారత్)పై గెలిచాడు. భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్, సనమ్ సింగ్ కూడా ఈ టోర్నీలో ఆడుతున్నారు. డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్ శరణ్ (భారత్)-యాన్ బాయ్ (చైనా) జంట 7-5, 6-1తో లియాంగ్ చి హువాంగ్ (చైనా)-యూచి సుగిటా (జపాన్) ద్వయంపై నెగ్గి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.