సాకేత్ సంచలనం
హాంకాంగ్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ
హాంకాంగ్: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని సంచలనం సృష్టించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సాకేత్ 7-6 (7/1), 1-6, 6-3తో ప్రపంచ 85వ ర్యాంకర్, టాప్ సీడ్ రిచర్డ్స్ బెరాన్‌కిస్ (లిథువేనియా)ను ఓడించాడు. మరో మ్యాచ్‌లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ (భారత్) 2-6, 6-4, 6-3తో యూకీ బాంబ్రీ (భారత్)పై గెలిచాడు.
భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్, సనమ్ సింగ్ కూడా ఈ టోర్నీలో ఆడుతున్నారు. డబుల్స్ తొలి రౌండ్‌లో దివిజ్ శరణ్ (భారత్)-యాన్ బాయ్ (చైనా) జంట 7-5, 6-1తో లియాంగ్ చి హువాంగ్ (చైనా)-యూచి సుగిటా (జపాన్) ద్వయంపై నెగ్గి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.