సాక్షి, హైదరాబాద్: స్ల్పిట్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ పురుషుల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. క్రొయేషియాలో జరిగిన ఈ టోర్నీలో అనిరుధ్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జోడీ ఫైనల్లో ఓడిపోయింది.
70 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో అనిరుధ్–విజయ్ సుందర్ ప్రశాంత్ 4–6, 4–6తో సాదియో డుంబియా–ఫాబ్లెన్ రెబూల్ (ఫ్రాన్స్) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. తొలి రౌండ్‌లో భారత జోడీ 6–2, 6–1తో అర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్)–కైచి ఉచిడా (జపాన్) జంటను ఓడించింది.
క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో అనిరుధ్–విజయ్‌లకు తమ ప్రత్యర్థుల నుంచి వాకోవర్ లభించడంతో నేరుగా ఫైనల్ ఆడారు. అనిరుధ్–విజయ్‌లకు 2,450 యూరోల (రూ. 2 లక్షల 20 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
మూడో సీడ్‌పై సాకేత్ జోడీ విజయం
బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. జర్మనీలోని మ్యూనిక్‌లో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాకేత్–యూకీ ద్వయం 6–3, 7–6 (7/4)తో మూడో సీడ్ నథానియల్ లామోన్స్–జాక్సన్ విత్రో (అమెరికా) జోడిని ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరింది.
93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్, యూకీ జోడి ఆరు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment