
మ్యూనిక్: బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–3తో రాబర్ట్ గాలోవే–ఇవాన్ కింగ్ (అమెరికా) జంటపై విజయం సాధించింది. 97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–ఒలివెట్టి జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment