యూకీ జోడీ సంచలనం  | Yuki Jodi Sensation | Sakshi
Sakshi News home page

యూకీ జోడీ సంచలనం 

Apr 18 2024 5:03 AM | Updated on Apr 18 2024 5:03 AM

Yuki Jodi Sensation - Sakshi

మ్యూనిక్‌: బీఎండబ్ల్యూ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్‌)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌) జోడీ సంచలనం సృష్టించింది. తొలి రౌండ్‌లో ఇండో–ఫ్రెంచ్‌ ద్వయం మూడో సీడ్‌ సాండర్‌ జిలె–జొరాన్‌ వ్లీజెన్‌ (బెల్జియం) జంటను బోల్తా కొట్టించి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.

95 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో యూకీ–ఒలివెట్టి జోడీ 4–6, 7–6 (7/5), 10–6తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో విజయాన్ని అందుకుంది. 11 ఏస్‌లతో అదరగొట్టిన యూకీ–ఒలివెట్టి నిర్ణాయక టైబ్రేక్‌లో పైచేయి సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో రాబర్ట్‌ గాలోవే–ఇవాన్‌ కింగ్‌ (అమెరికా)లతో యూకీ, ఒలివెట్టి తలపడతారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement