యూకీ బాంబ్రీ జోడీకి చేదు అనుభవం.. సెమీస్‌లోనే నిష్క్రమణ | Yuki Bhambri Robin Haase Pair Loses In Brisbane International Semifinal | Sakshi
Sakshi News home page

Yuki Bhambri: యూకీ బాంబ్రీ జోడీకి చేదు అనుభవం.. సెమీస్‌లోనే నిష్క్రమణ

Published Sat, Jan 6 2024 8:26 PM | Last Updated on Sat, Jan 6 2024 8:55 PM

Yuki Bhambri Robin Haase Pair Loses In Brisbane International Semifinal - Sakshi

Brisbane International Semifinals: బ్రిస్బేన్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్‌)–రాబిన్‌ హాస్‌ (నెదర్లాండ్స్‌) జోడీ ప్రయాణం ముగిసింది. శనివారం నాటి పురుషుల డబుల్స్‌ సెమీ ఫైనల్లో లాయిడ్‌ గ్లాస్‌పూల్‌(ఇంగ్లండ్‌)- జీన్‌ జులెన్‌ రోజర్‌(నెదర్లాండ్స్‌) ద్వయంలో చేతిలో ఈ జంట ఓటమి పాలైంది.

ఎనిమిదో సీడ్‌ యూకీ- రాబిన్‌ జోడీ... సెకండ్‌ సీడ్‌ అయిన ప్రత్యర్థి చేతిలో 3-6, 7-6, 9-11 పరాజయం చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. గంటా నలభై నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఏ దశలోనూ లాయిడ్‌- జీన్‌ జంటపై యూకీ- రాబిన్‌ పైచేయి సాధించలేకపోయారు. దీంతో.. సెమీస్‌లోనే వీరు ఇంటిబాట​ పట్టారు.

క్వార్టర్‌ ఫైనల్లో అలా గెలుపొంది
ఇదిలా ఉంటే.. శుక్రవారం జరిగిన  క్వార్టర్‌ ఫైనల్లో యూకీ –రాబిన్‌ ద్వయం 7–6 (7/5), 7–6 (7/5)తో నథానియల్‌ లామోన్స్‌–జేక్సన్‌ విత్రో (అమెరికా) జంటపై విజయం సాధించింది. 96 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను కాపాడుకున్నాయి.

ఈ క్రమంలో టైబ్రేక్‌లలో యూకీ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని అందుకుంది. తద్వారా సెమీస్‌లో ప్రవేశించింది. కాగా ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల యూకీ బాంబ్రీ.. గతేడాది మలోర్కా చాంపియన్‌షిప్స్‌ డబుల్స్‌ కాంపిటీషన్‌లో పాల్గొని తొలి ఏటీపీ టైటిల్‌ గెలిచాడు. సౌతాఫ్రికాకు చెందిన లాయిడ్‌ హ్యారిస్‌తో కలిసి విజేతగా నిలిచాడు.

చదవండి: Ind vs Afg: టీమిండియాతో సిరీస్‌కు అఫ్గన్‌ జట్టు ప్రకటన: ప్లేయర్‌గా రషీద్‌.. కెప్టెన్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement