ATP tournament
-
యూకీ బాంబ్రీ జోడీకి చేదు అనుభవం.. సెమీస్‌లోనే నిష్క్రమణ
Brisbane International Semifinals: బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జోడీ ప్రయాణం ముగిసింది. శనివారం నాటి పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్లో లాయిడ్ గ్లాస్‌పూల్(ఇంగ్లండ్)- జీన్ జులెన్ రోజర్(నెదర్లాండ్స్) ద్వయంలో చేతిలో ఈ జంట ఓటమి పాలైంది. ఎనిమిదో సీడ్ యూకీ- రాబిన్ జోడీ... సెకండ్ సీడ్ అయిన ప్రత్యర్థి చేతిలో 3-6, 7-6, 9-11 పరాజయం చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. గంటా నలభై నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఏ దశలోనూ లాయిడ్- జీన్ జంటపై యూకీ- రాబిన్ పైచేయి సాధించలేకపోయారు. దీంతో.. సెమీస్‌లోనే వీరు ఇంటిబాట పట్టారు. క్వార్టర్ ఫైనల్లో అలా గెలుపొంది ఇదిలా ఉంటే.. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ –రాబిన్ ద్వయం 7–6 (7/5), 7–6 (7/5)తో నథానియల్ లామోన్స్–జేక్సన్ విత్రో (అమెరికా) జంటపై విజయం సాధించింది. 96 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను కాపాడుకున్నాయి. ఈ క్రమంలో టైబ్రేక్‌లలో యూకీ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని అందుకుంది. తద్వారా సెమీస్‌లో ప్రవేశించింది. కాగా ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల యూకీ బాంబ్రీ.. గతేడాది మలోర్కా చాంపియన్‌షిప్స్ డబుల్స్ కాంపిటీషన్లో పాల్గొని తొలి ఏటీపీ టైటిల్ గెలిచాడు. సౌతాఫ్రికాకు చెందిన లాయిడ్ హ్యారిస్‌తో కలిసి విజేతగా నిలిచాడు. చదవండి: Ind vs Afg: టీమిండియాతో సిరీస్‌కు అఫ్గన్ జట్టు ప్రకటన: ప్లేయర్‌గా రషీద్.. కెప్టెన్? -
సంచలనం సృష్టించిన భారత టెన్నిస్ ఆటగాడు
రోమ్: ఏటీపీ రోమ్ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత ఆటగాడు సుమీత్ నగాల్ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ర్యాంకింగ్స్‌లో తనకంటే ఎంతో మెరుగైన స్థానిక ప్రత్యర్ధిని ఓడించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన ప్రపంచ 347వ ర్యాంకర్ నగాల్ 6–2, 6–4 స్కోరుతో ఇటలీ ప్లేయర్, ప్రపంచ 172వ ర్యాంకర్ ఫ్రాన్సెస్కో మాసరెలీపై విజయం సాధించాడు. 1 గంటా 24 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో నగాల్ ఒక్క ఏస్ కూడా కొట్టలేదు. అయితే తన చక్కటి సర్వీస్‌తో ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా లేకుండా చూసుకున్నాడు. ఇటలీ ఆటగాడు 3 ఏస్‌లు సంధించినా...6 డబుల్‌ఫాల్ట్‌లతో ఓటమిని ఆహ్వానించాడు. -
ఖతర్ ఓపెన్ విజేత బోపన్న జంట
దోహా (ఖతర్): భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ ప్లేయర్ రోహన్ బోపన్న కొత్త ఏడాదిని టైటిల్‌తో మొదలుపెట్టాడు. ఖతర్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో బోపన్న (భారత్)–వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్) ద్వయం విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో బోపన్న–కూలాఫ్ జంట 3–6, 6–2, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో ల్యూక్ బామ్‌బ్రిడ్జ్ (ఇంగ్లండ్)–శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో) జోడీని ఓడించింది. టైటిల్ నెగ్గిన బోపన్న జంటకు 76,870 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 54 లక్షల 50 వేలు)తోపాటు 250 ఏటీపీ ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. శుక్రవారమే జరిగిన సెమీఫైనల్లో బోపన్న–కూలాఫ్ జంట 7–5, 6–2తో రెండో సీడ్ హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)– స్కుగోర్ (క్రొయేషియా) జోడీపై గెలిచింది. ఓవరాల్‌గా 39 ఏళ్ల బోపన్నకు కెరీర్లో ఇది 19వ డబుల్స్ టైటిల్. తెలంగాణ జిమ్నాస్ట్ సురభికి మూడు పతకాలు గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ జిమ్నాస్ట్ సురభి ప్రసన్న మూడు పతకాలు సాధించింది. శుక్రవారం జరిగిన అండర్–17 బాలికల మూడు ఈవెంట్లలో సురభి రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించింది. ఆల్ అరౌండ్ వ్యక్తిగత విభాగంలో సురభి 39.85 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకోగా... టేబుల్ వాల్ట్, బ్యాలెన్సింగ్ బీమ్ ఈవెంట్స్‌లో ఆమె రెండో స్థానంలో నిలిచి రెండు రజత పతకాలను సొంతం చేసుకుంది. -
జీవన్ జంటకు టైటిల్
న్యూఢిల్లీ: గత వారమే చెంగ్డూ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్న భారత టెన్నిస్ ప్లేయర్ జీవన్ నెడున్‌జెళియన్ అదే జోరులో మరో ఏటీపీ టోర్నీలో చాంపియన్‌గా నిలిచాడు. తన కొత్త భాగస్వామి మార్సెలో అరెవలో (మెక్సికో)తో కలిసి మాంటెరీ ఏటీపీ చాలెంజర్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. ఈ సీజన్ చాలెంజర్ సర్క్యూట్లో జీవన్కిది నాలుగో టైటిల్. సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో జీవన్ నెడున్‌జెళియన్ (భారత్)– మార్సెలో అరెవలో (మెక్సికో) ద్వయం 6–1, 6–4తో లియాండర్ పేస్ (భారత్)– మిగెల్ ఏంజెల్ రయీస్ జంటపై గెలుపొందింది. -
చెంగ్డూ ఓపెన్ రన్నరప్ జీవన్ జంట
కెరీర్లో రెండో ఏటీపీ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ క్రీడాకారుడు జీవన్ నెడుంజెళియన్‌కు నిరాశ ఎదురైంది. ఆదివారం చైనాలో ముగిసిన చెంగ్డూ ఓపెన్‌లో జీవన్–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో జీవన్–ఆస్టిన్ ద్వయం 2–6, 4–6తో టాప్ సీడ్ ఇవాన్ డోడిగ్–మ్యాట్ పావిక్ (క్రొయేషియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. రన్నరప్ జీవన్–ఆస్టిన్ జంటకు 30,490 డాలర్ల (రూ. 22 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
రన్నరప్ రామ్‌కుమార్
న్యూపోర్ట్ (అమెరికా): రెండు దశాబ్దాలుగా భారత క్రీడాకారులను ఊరిస్తోన్న అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్ సింగిల్స్ టైటిల్ నిరీక్షణ ఇంకా కొనసాగనుంది. ఆదివారం ముగిసిన న్యూపోర్ట్ ఓపెన్ ‘హాఫ్ ఆఫ్ ఫేమ్’ ఏటీపీ–250 టోర్నమెంట్లో భారత ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ రన్నరప్‌గా నిలిచాడు. రెండు గంటలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 161వ ర్యాంకర్ రామ్‌కుమార్ 5–7, 6–3, 2–6తో ప్రపంచ 48వ ర్యాంకర్, మూడో సీడ్ స్టీవ్ జాన్సన్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. రామ్‌కుమార్ 10 ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. విజేతగా నిలిచిన స్టీవ్ జాన్సన్‌కు 99,375 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 68 లక్షల 29 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ రామ్‌కుమార్‌కు 52,340 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 35 లక్షల 97 వేలు)తోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. శనివారం జరిగిన సెమీఫైనల్లో చెన్నైకు చెందిన 23 ఏళ్ల రామ్‌కుమార్ 6–4, 7–5తో టిమ్ స్మిజెక్ (అమెరికా)పై గెలుపొంది తన కెరీర్లో తొలిసారి ఏటీపీ–250 టూర్ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించాడు. 2009లో చెన్నై ఓపెన్‌లో, 2011లో దక్షిణాఫ్రికా ఓపెన్‌లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఫైనల్‌కు చేరిన తర్వాత భారత్ నుంచి రామ్‌కుమార్ రూపంలో మరో ప్లేయర్ ఏటీపీ టూర్ టోర్నీలో టైటిల్ పోరుకు చేరడం ఇదే ప్రథమం. సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఆ రెండు టోర్నీల ఫైనల్స్‌లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. భారత్ తరఫున చివరిసారి ఏటీపీ టూర్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించిన ఆటగాడు లియాండర్ పేస్. 1998 న్యూపోర్ట్ ఓపెన్‌లో లియాండర్ పేస్ విజేతగా నిలిచాడు. ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో సుకోవా, స్టిక్ అంతర్జాతీయ టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో వింబుల్డన్ మాజీ సింగిల్స్ చాంపియన్ మైకేల్ స్టిక్ (జర్మనీ), 14 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గిన హెలెనా సుకోవా (చెక్ రిపబ్లిక్)లకు చోటు కల్పించారు. స్టిక్ 1991 వింబుల్డన్ టోర్నీలో బోరిస్ బెకర్ (జర్మనీ)పై వరుస సెట్లలో గెలిచాడు. 1994 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఆండ్రీ అగస్సీ (అమెరికా) చేతిలో... 1996 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో కఫెల్నికోవ్ (రష్యా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. 1997లో రిటైరయిన స్టిక్ కెరీర్ మొత్తంలో 18 సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. సుకోవా, మైకేల్ స్టిక్ -
మెయిన్ ‘డ్రా’కు యూకీ అర్హత
చెన్నై: భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో భారత మాజీ నంబర్‌వన్ యూకీ బాంబ్రీ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో యూకీ 6–3, 6–1తో నికొలస్ కికెర్ (అర్జెంటీనా)పై అలవోకగా గెలిచాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌తో యూకీ తలపడతాడు. మరో మ్యాచ్‌లో ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్ 6–7 (2/7), 2–6తో జోజెఫ్ కొవాలిక్ (స్లొవేకియా) చేతిలో ఓడిపోయి మెయిన్ ‘డ్రా’ బెర్త్ దక్కించుకోలేకపోయాడు.