
న్యూఢిల్లీ: గత వారమే చెంగ్డూ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్న భారత టెన్నిస్ ప్లేయర్ జీవన్ నెడున్‌జెళియన్ అదే జోరులో మరో ఏటీపీ టోర్నీలో చాంపియన్‌గా నిలిచాడు. తన కొత్త భాగస్వామి మార్సెలో అరెవలో (మెక్సికో)తో కలిసి మాంటెరీ ఏటీపీ చాలెంజర్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.
ఈ సీజన్ చాలెంజర్ సర్క్యూట్‌లో జీవన్‌కిది నాలుగో టైటిల్. సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో జీవన్ నెడున్‌జెళియన్ (భారత్)– మార్సెలో అరెవలో (మెక్సికో) ద్వయం 6–1, 6–4తో లియాండర్ పేస్ (భారత్)– మిగెల్ ఏంజెల్ రయీస్ జంటపై గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment