మెయిన్ ‘డ్రా’కు యూకీ అర్హత
చెన్నై: భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో భారత మాజీ నంబర్‌వన్ యూకీ బాంబ్రీ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో యూకీ 6–3, 6–1తో నికొలస్ కికెర్ (అర్జెంటీనా)పై అలవోకగా గెలిచాడు.
మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌తో యూకీ తలపడతాడు. మరో మ్యాచ్‌లో ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్ 6–7 (2/7), 2–6తో జోజెఫ్ కొవాలిక్ (స్లొవేకియా) చేతిలో ఓడిపోయి మెయిన్ ‘డ్రా’ బెర్త్ దక్కించుకోలేకపోయాడు.