Qualifier
-
సినెర్, స్వియాటెక్ అలవోకగా...
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో కొందరు సీడెడ్ ప్లేయర్లకు అనూహ్య పరాజయాలు ఎదురవుతుంటే... టాప్ స్టార్లు అలవోక విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... వీరికి దీటుగా యువ క్రీడాకారులు సైతం మేటి ఆటగాళ్లను ఢీకొట్టి మరీ మూడో రౌండ్‌ను దాటేశారు. క్వాలిఫయర్ లెర్నర్ టియెన్, 22 ఏళ్ల మిచెల్సన్ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లో ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.మెల్బోర్న్: పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ఇటలీ స్టార్ యానిక్ సినెర్...మహిళల విభాగంలో ఫ్రెంచ్ ఓపెన్ ‘హ్యాట్రిక్’ చాంపియన్, పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో స్వియాటెక్‌తో పాటు ఆరో సీడ్ ఎలినా రిబాకినా (కజకిస్తాన్), ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా), తొమ్మిదో సీడ్ డారియా కసత్కినా (రష్యా) ప్రిక్వార్టర్స్ చేరారు. వీరితో పాటు ఎనిమిదో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా), 13వ సీడ్ హోల్గర్ రూన్ (డెన్మార్క్) నాలుగో రౌండ్ చేరుకున్నారు. ఇరు విభాగాల్లో నాలుగో సీడ్ ప్లేయర్లు ఫ్రిట్జ్ (అమెరికా), పావొలిని (ఇటలీ)లకు మూడో రౌండ్లోనే చుక్కెదురైంది. భార్యభర్తలు స్వితోలినా (ఉక్రెయిన్), మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) చెప్పుకోదగిన విజయాలతో ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో ముందంజ వేశారు. స్వితోలినా గత సీజన్ రెండు గ్రాండ్‌స్లామ్‌ల రన్నరప్ పావొలినిని కంగుతినిపిస్తే, మోన్ఫిల్స్... గత యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్కు చెక్ పెట్టాడు. సినెర్ జోరు... డిఫెండింగ్ చాంపియన్, టాప్‌సీడ్ యానిక్ సినెర్ అలవోక విజయంతో ప్రిక్వార్టర్స్ చేరాడు. శనివారం పురుషుల సింగిల్స్‌లో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో అతను 6–3, 6–4, 6–2తో అమెరికాకు చెందిన 46వ ర్యాంకర్ మార్కొస్ గిరోన్‌ను వరుస సెట్లలో ఓడించాడు. గత సీజన్లో ఆసీస్, ఫ్రెంచ్ ఓపెన్లను గెలుచుకున్న 23 ఏళ్ల ఇటలీ టాప్‌స్టార్ ఈ సీజన్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. మరో మ్యాచ్‌లో గేల్ మోన్ఫిల్స్ ప్రిక్వార్టర్స్ చేరడం ద్వారా వన్నె తగ్గని వెటరన్ ప్లేయర్‌గా టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సరసన నిలిచాడు. మూడో రౌండ్లో 38 ఏళ్ల మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 3–6, 7–5, 7–6 (7/1), 6–4తో నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)కు షాకిచ్చాడు. 2020లో ఫెడరర్ 38 ఏళ్ల వయసులో తన ఆఖరి ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడి సెమీస్ చేరాడు. డి మినార్ (ఆసీస్) 5–7, 7–6 (7/3), 6–3, 6–3తో సెరుండొలొ (అర్జెంటీనా)పై, 13వ సీడ్ రూన్ (డెన్మార్క్) 6–7 (5/7), 6–3, 4–6, 6–4, 6–4తో కెక్మనోవిచ్ (సెర్బియా)పై గెలిచారు. సంచలన క్వాలిఫయర్ లెర్నర్ టియెన్ (అమెరికా) 7–6 (12/10), 6–3, 6–3తో ఫ్రాన్స్‌కు చెందిన మౌటెట్ను ఓడించాడు. అన్‌సీడెడ్ మిచెల్సన్ (అమెరికా) 6–3, 7–6 (7/5), 6–2తో 19వ సీడ్ కచనొవ్ (రష్యా)ను కంగుతినిపించాడు. స్వితోలినా ముందంజ మోన్ఫిల్స్ భార్య ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) తన భర్త నెగ్గిన కోర్టులోనే అనంతరం జరిగిన మ్యాచ్‌లో 2–6, 6–4, 6–0తో గత ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ (2024)ల రన్నరప్ జాస్మిన్ పావొలిని (ఇటలీ)ని కంగుతినిపించింది. రెండో సీడ్ స్వియాటెక్ 6–1, 6–0తో యూఎస్ ఓపెన్ (2021) మాజీ చాంపియన్, బ్రిటన్ ప్లేయర్ ఎమ్మా రాడుకానుపై అలవోక విజయం సాధించింది. 19వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–4, 6–4తో పదోసీడ్ సహచర ప్లేయర్ కొలిన్స్‌ను ఓడించింది. 6వ సీడ్ రిబాకినా 6–3, 6–4తో డయానా యా్రస్తెస్కా (ఉక్రెయిన్)పై, 8వ సీడ్ నవారో 6–4, 3–6, 6–4తో ఓన్స్ జాబెర్ (ట్యూనిíÙయా)పై, 9వ సీడ్ కసత్కినా (రష్యా) 7–5, 6–1తో పుతిన్‌త్సెవా (కజకిస్తాన్)పై గెలుపొందారు. బాలాజీ జోడీ అవుట్ ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ నుంచి భారత డబుల్స్ ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ నిష్క్రమించాడు. మెక్సికన్ భాగస్వామి మిగుల్ ఏంజిల్ రేయెస్ వారెలతో జోడీ కట్టిన భారత ఆటగాడు రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. పురుషుల డబుల్స్‌లో శనివారం జరిగిన పోరులో బాలాజీ–ఏంజిల్ రేయెస్ ద్వయం 6–7 (1/7), 6–4, 3–6తో పోర్చుగల్‌కు చెందిన న్యూనో బోర్జెస్–ఫ్రాన్సిస్కొ కాబ్రల్ జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. -
పురుషుల జట్టుకూ నిరాశ
అంటల్యా (టర్కీ): పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ ఆఖరి క్వాలిఫయర్ ఈవెంట్లో భారత పురుషుల జట్టు కూడా మహిళల టీమ్ బాటలోనే పయనించింది. భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. దాంతో పారిస్ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించాలంటే జట్టు ర్యాంకింగ్‌పైనే ఆధారపడి ఉంటుంది. ఈ టోర్నీలో టాప్–3లో నిలిచే జట్లకు నేరుగా ఒలింపిక్స్ అవకాశం దక్కేది. క్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ 2 భారత పురుషుల జట్టు 4–5 (57–56, 57–53, 55–56, 55–58), (26–26) స్కోరుతో మెక్సికో చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. తొలి రెండు సెట్లను గెలిచి ఆధిక్యంలో నిలిచిన భారత్ మూడో సెట్లో సమంగా నిలిచినా సెమీస్ చేరేది. కానీ ఒక పాయింట్ తేడాతో సెట్‌ను కోల్పోయిన జట్టు తర్వాతి సెట్‌ను కూడా మెక్సికోకు అప్పగించింది. అయితే షూటౌట్లో భారత్ మ్యాచ్ కోల్పోయింది. మెక్సికో ఆర్చర్లు ల„ ్యానికి అతి సమీపంగా బాణాలను సంధించి పైచేయి సాధించారు. -
KKR Vs SRH Photos: ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)
-
T20 WC: టి20 ప్రపంచకప్-2024కు అర్హత సాధించిన పసికూన
వచ్చే ఏడాది వెస్టిండీస్–అమెరికాలో జరిగే టి20 ప్రపంచకప్‌కు పపువా న్యూ గినియా అర్హత సాధించింది. ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి పపువా న్యూ గినియా జట్టు టి20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన జట్టుగా నిలిచింది. శుక్రవారం ఎమిని పార్క్ వేదికగా పిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పపువా న్యూ గినియా వంద పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. టోనీ యురా 61, ఆసద్ వాలా 59, చార్ల్స్ అమిని 53 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పిలిప్పీన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ డేనియల్ స్మిత్ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అర్ష్‌దీప్ శర్మ 22 పరుగులు చేశాడు. పపువా న్యూ గినియా బౌలర్లలో కబువా మోరియా రెండు వికెట్లు తీయగా.. జాన్ కరికో, హిరిహిరి ఒక వికెట్ పడగొట్టారు. ఇప్పటికే ఐర్లాండ్ అర్హత సాధించగా.. తాజాగా పపువా న్యూ గినియా కూడా అర్హత సాధించడంతో టి20 వరల్డ్‌కప్ అర్హతకు సంబంధించి మరో ఐదు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అందులో ఒకటి అమెరికా క్వాలిఫయర్ నుంచి.. మిగతా నాలుగు బెర్తుల్లో రెండు ఆసియా నుంచి.. మరో రెండు ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనున్నాయి. ICC Men’s #T20WorldCup 2024 bound ✈️🏆 Congratulations, Papua New Guinea! 🙌 pic.twitter.com/Y7jKSU6Hxq — ICC (@ICC) July 28, 2023 చదవండి: Ashes 2023: పాంటింగ్‌పై ద్రాక్ష పండ్లతో దాడి.. 'వాళ్లను ఊరికే వదలను' -
మూడు పరుగుల కోసం హైడ్రామా.. సూపర్ ఓవర్ ద్వారా ఫలితం
USA Dramatically Steal 2 Runs Force Tie Got Victory In Super Over.. టి20 మ్యాచ్‌లంటేనే జోష్‌కు పెట్టింది పేరు. ఆఖరి బంతి వరకు ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడుతుంది. అలాంటి మ్యాచ్‌ల్లో కొన్నిసార్లు హైడ్రామా నెలకొనడం చూస్తుంటాం. గెలవడం కోసం ఎంతదూరం అయినా వెళతారు అనడానికి కెనడా, అమెరికాల మధ్య జరిగిన మ్యాచ్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అమెరికాను అదృష్టం వరించి మ్యాచ్ టై కావడం.. ఆ తర్వాత సూపర్ ఓవర్లో కెనడాను ఓడించడం జరిగిపోయింది. ఇక విషయంలోకి వెళితే.. 2022 టి20 ప్రపంచకప్ అమెరికన్ రీజియన్ క్వాలిఫయర్ మ్యాచ్‌ల్లో భాగంగా కెనడా, అమెరికా మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా 20 ఓవర్లలో 142 పరుగులు చేసింది. అనంతరం అమెరికా ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్లో చివరి బంతికి మూడు పరుగులు అవసరం అయ్యాయి. కెనడా బౌలర్ జతిందర్ పాల్ బంతిని విసరగా స్ట్రైక్‌లో ఉన్న అలీఖాన్ మిస్ చేశాడు. అయితే ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రస్టీ థియోరన్ పరుగు కోసం పిలిచాడు. అతను క్రీజులోకి చేరేలోపే కీపర్ బంతిని అందుకొని వికెట్ల వైపు వేగంగా విసిరాడు. రస్టీ రనౌట్ అయ్యాడనే సంతోషంలో కెనడా ఆటగాళ్లు సంబరాలు షురూ చేశారు. అయితే ఇక్కడే రస్టీ తెలివిని ఉపయోగించి రనౌట్ కాదా అవునా అనేది అంపైర్లు ఇంకా నిర్థారించకపోవడంతో రస్టీ రెండో పరుగు కోసం పరిగెత్తాడు. అయితే నాన్‌స్ట్రైక్‌లో ఉన్న అలీఖాన్ మ్యాచ్ అయిపోయిందనుకొని పెవిలియన్ వైపు వెళుతున్నాడు. ఇంతలో రస్టీ పరుగు కోసం గట్టిగా అరవడంతో అలీఖాన్ వెంటనే పరుగు లఖించుకున్నాడు. అలా రెండో పరుగు పూర్తి చేసి మూడో పరుగుకోసం పరిగెత్తినప్పటికీ పూర్తిచేయలేకపోయాడు. అయితే మొదట రస్టీ రనౌట్ కాదని నిర్థారించిన అంపైర్లు రెండు పరుగులు లీగల్ అని డిక్లెర్ చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్లో అమెరికా 22 పరుగులు చేయగా.. కెనడా 14 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 📺 WATCH: One of the most dramatic finishes in the history of cricket as USA and Canada played out a match for the ages that went to a Super Over where #TeamUSA🇺🇸 prevailed 👀The final over highlights are a MUST WATCH⬇️#CANvUSA🇨🇦🇺🇸 #WeAreUSACricket🇺🇸 pic.twitter.com/UBqBNTtS7x — USA Cricket (@usacricket) November 11, 2021 -
DC vs KKR, Qualifier 2: చెన్నైని ఢీ కొట్టేదెవరు?
షార్జా: వరుసగా ఈ సీజన్లో కూడా ఫైనల్ చేరేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇదే ఆఖరి అవకాశం. ధోని సేనపై సాధించలేకపోయిన విజయాన్ని ఇప్పుడు మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై తప్పనిసరిగా సాధించాలి. అయితే లీగ్ చివరి దశ మ్యాచ్‌లతో పాటు ఎలిమినేటర్‌లో పుంజుకున్న కోల్‌కతా అంత ఆషామాషీ ప్రత్యర్థి కాదిపుడు. ఇంకా చెప్పాలంటే మరో సూపర్కింగ్స్లాంటి జట్టుతో మళ్లీ తలపడటమే ఈ రెండో క్వాలిఫయర్! ఇప్పుడు నైట్‌రైడర్స్‌ను ఓడిస్తేనే ఢిల్లీ టైటిల్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంటుంది. లేదంటే 2019 సీజన్‌లాగే మూడో స్థానానికి పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ సేన సర్వశక్తులు ఒడ్డి పోరాడేందుకు సిద్ధమైంది. మరోవైపు వరుస విజయాలతో జోరుమీదున్న కోల్‌కతా మూడో టైటిల్‌పై కన్నేసింది. ఇప్పటికే రెండుసార్లు విజేత అయిన ఈ మాజీ చాంపియన్ ఈ సీజన్లో ఇంకో రెండు మ్యాచ్‌లు గెలిస్తే అనుకున్నది సాధిస్తుంది. టాపార్డర్‌దే బాధ్యత క్యాపిటల్స్ గత మ్యాచ్‌లో చేసిన స్కోరు పటిష్టమైందే. కానీ టాపార్డర్‌లో పృథ్వీ షా ఒక్కడే మెరిశాడు. అనుభవజ్ఞుడైన ధావన్ (7), శ్రేయస్ అయ్యర్ (1) ఇద్దరు కలిసి కనీసం 10 పరుగులైనా చేయలేకపోయారు. ఇప్పుడు రెండో క్వాలిఫయర్ రూపంలో ఇద్దరికీ మరో అవకాశం వచ్చింది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ బాధ్యతను పంచుకుంటే మిడిలార్డర్లో కెప్టెన్ రిషభ్ పంత్, హెట్‌మైర్ ధనాధన్ మెరుపులతో స్కోరు అమాంతం పెంచేయగలరు. గత మ్యాచ్‌లో తడబడిన టాపార్డర్‌కు చికిత్స చేసింది కూడా పంత్, హెట్మైర్లే! ప్రమాదకారిగా మారిన కోల్‌కతా స్పిన్నర్ సునీల్ నరైన్‌ను ఎదుర్కోవడంపై పాంటింగ్ కోచింగ్ బృందం కసరత్తు చేయాలి. లేదంటే బెంగళూరులాగే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. బౌలింగ్ విభాగంలో నోర్జే, రబడ చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. టామ్ కరన్, సీనియర్ స్పిన్నర్ అశ్విన్, అక్షర్ పటేల్‌లు కూడా కోల్‌కతాను కట్టడి చేస్తే ఢిల్లీ ఫైనల్ చేరుకోవచ్చు. జోరుమీదున్న కోల్‌కతా లీగ్‌లో తన కిందున్న ముంబైకి ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా ఎలిమినేటర్ చేరుకున్న నైట్‌రైడర్స్ అక్కడ తనకంటే మెరుగైన బెంగళూరును ఇంటిదారి పట్టించింది. ఇప్పుడు ఏకంగా లీగ్ టాపర్‌ను ఓడించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్లలో శుబ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ చక్కని ఆరంభాలిస్తున్నారు. నితీశ్ రాణా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నాడు. అయితే అనుభవజ్ఞులైన దినేశ్ కార్తీక్, కెప్టెన్ మోర్గాన్, షకీబ్‌లు కూడా ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడితే నైట్‌రైడర్స్‌కు తిరుగుండదు. గత మ్యాచ్‌లో నరైన్ ఆల్‌రౌండ్ షో హైలైట్. మేటి హిట్టర్లను నిలదొక్కుకునే లోపే పడగొట్టేసిన నరైన్ బ్యాటింగ్‌లో ఒకే ఓవర్లో చేసిన విధ్వంసం కోల్‌కతాను గెలుపుబాట పట్టించింది. సీమర్ ఫెర్గూసన్ ఎప్పట్లాగే తన మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు తప్పవు. యూఏఈ అంచె లీగ్‌లో ఐదు విజయాలు సాధించిన ఢిల్లీకి చెక్ పెట్టిన జట్టు కోల్‌కతానే! ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. జట్లు (అంచనా) ఢిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్ (కెప్టెన్), పృథ్వీ షా, ధావన్, శ్రేయస్, హెట్‌మైర్, అక్షర్ పటేల్, టామ్ కరన్, అశ్విన్, రబడ, అవేశ్ ఖాన్, నోర్జే. కోల్‌కతా నైట్‌రైడర్స్: మోర్గాన్ (కెప్టెన్), గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్, నరైన్, షకీబ్, ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి. -
Emma Raducanu: అద్భుతం ఆవిష్కృతం
కష్టపడితే కలలు కూడా నిజమవుతాయని... అసాధ్యమనుకున్నవి సుసాధ్యమవుతాయని... ర్యాంక్‌తో సంబంధం లేదని... వయసుతో పనిలేదని... అపార అనుభవం అక్కర్లేదని... సత్తా ఉంటే... గెలవాలనే సంకల్పం ఉంటే... అద్భుతాలు చేయవచ్చని బ్రిటన్ టెన్నిస్ టీనేజర్ ఎమ్మా రాడుకాను నిరూపించింది. మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడమే లక్ష్యంగా న్యూయార్క్ వచ్చిన ఈ 18 ఏళ్ల అమ్మాయి మూడు వారాల్లో ఊహకందని అద్భుతాన్ని ఆవిష్కరించింది. టెన్నిస్ చరిత్రలో క్వాలిఫయర్ హోదాలో గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించిన తొలి ప్లేయర్‌గా రాడుకాను చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా 44 ఏళ్ల తర్వాత బ్రిటన్ తరఫున గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. న్యూయార్క్: ఏనాటికైనా గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఆడాలని... విజేతగా నిలిచి కోర్టు అంతా కలియ తిరగాలని... స్టాండ్స్‌లోకి వెళ్లి తన వాళ్లతో సంబరాలు చేసుకోవాలని... సగర్వంగా ట్రోఫీని ముద్దాడాలని... ఐదేళ్ల ప్రాయంలో రాకెట్ పట్టినప్పటి నుంచి రాడుకాను కలల్లో ఇలాంటి దృశ్యాలే కనిపించేవి. రాడుకాను కలల్లో కనిపించిన ఈ దృశ్యాలు ఆదివారం న్యూయార్క్‌లోని ఆర్థర్ యాష్ స్టేడియంలో నిజమయ్యాయి. టైటిల్ ఫేవరెట్స్ ఒక్కొక్కరూ ఇంటిముఖం పడుతుంటే... ఎవరూ ఊహించని విధంగా సంచలనాల మోత మోగిస్తూ ఇద్దరు అన్‌సీడెడ్ క్రీడాకారిణులు 18 ఏళ్ల ఎమ్మా రాడుకాను, 19 ఏళ్ల లేలా ఫెర్నాండెజ్ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ కోసం తలపడ్డారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం నాలుగు గంటలకు ముగిసిన ఈ ఫైనల్లో ప్రపంచ 150వ ర్యాంకర్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్) గంటా 51 నిమిషాల్లో 6–4, 6–3తో ప్రపంచ 73వ ర్యాంకర్ లేలా ఫెర్నాండెజ్ (కెనడా)పై విజయం సాధించింది. చాంపియన్‌గా నిలిచిన రాడుకానుకు 25 లక్షల డాలర్లు (రూ. 18 కోట్ల 37 లక్షలు)... రన్నరప్ లేలా ఫెర్నాండెజ్‌కు 12 లక్షల 50 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 18 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఆరంభంలోనే బ్రేక్‌తో... 24 వేల మంది ప్రేక్షకులతో హౌస్‌ఫుల్ అయిన ఆర్థర్ యాష్ స్టేడియంలో రాడుకాను, లేలా ఫైనల్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా రాడుకాను ఫైనల్ చేరగా... గత నాలుగు మ్యాచ్‌లను మూడో సెట్లో నెగ్గి లేలా తుది పోరుకు సమాయత్తమైంది. డిఫెండింగ్ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్), 16వ సీడ్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కెర్బర్ (జర్మనీ), ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), రెండో సీడ్ సబలెంకా (బెలారస్)లను బోల్తా కొట్టించిన లేలా ఫైనల్లో ఫేవరెట్‌గా అడుగుపెట్టింది. కానీ క్వాలిఫయింగ్ దశ నుంచి మెయిన్ ‘డ్రా’లోకి అడుగుపెట్టిన రాడుకాను మాత్రం లేలా గత మ్యాచ్‌ల ప్రదర్శనను చూసి ఆందోళన చెందలేదు. తన సర్వీస్‌తో తొలి సెట్‌ను మొదలుపెట్టిన రాడుకాను గేమ్‌ను సాధించి 1–0తో ముందంజ వేసింది. లేలా సర్వీస్ చేసిన రెండో గేమ్‌లో రాడుకాను దూకుడు కనబరిచింది. లేలా కూడా వెనక్కి తగ్గలేదు. దాంతో ఈ గేమ్‌లో నాలుగుసార్లు డ్యూస్ (40–40) నమోదయ్యాయి. చివరకు ఐదో ప్రయత్నంలో రాడుకాను పాయింట్ సాధించి లేలా సరీ్వస్‌ను బ్రేక్ చేసి 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే లేలా డీలా పడిపోలేదు. మూడో గేమ్‌లో రాడుకాను సరీ్వస్‌లో మూడుసార్లు ‘డ్యూస్’ అయింది. నాలుగో ప్రయత్నంలో లేలా పాయింట్ గెలిచి రాడుకాను సరీ్వస్‌ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత తన సరీ్వస్‌ను నిలబెట్టుకుంది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. అనంతరం ఇద్దరూ తమ సరీ్వస్‌లను కాపాడుకోవడంతో స్కోరు 4–4తో సమమైంది. తొమ్మిదో గేమ్‌లో రాడుకాను తన సరీ్వస్‌ను నిలబెట్టుకొని పదో గేమ్‌లో లేలా సరీ్వస్‌ను బ్రేక్ చేసి 58 నిమిషాల్లో తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. గాయమైనా... తొలి సెట్‌ను నెగ్గిన ఉత్సాహంలో రెండో సెట్లోనూ రాడుకాను దూకుడు కొనసాగింది. మరోవైపు లేలా కూడా పోరాటం ఆపలేదు. మూడో గేమ్‌లో రాడుకాను సర్వీస్‌ను బ్రేక్ చేసి పుంజుకున్నట్లు కనిపించిన లేలా నాలుగో గేమ్‌లో తన సర్వీస్‌ను కోల్పోయింది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. ఆరో గేమ్‌లో లేలా సర్వీస్‌ను బ్రేక్ చేసిన రాడుకాను ఏడో గేమ్‌లో సరీ్వస్ కాపాడుకొని 5–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఎనిమిదో గేమ్‌లో లేలా తన సర్వీస్‌ను నిలబెట్టుకుంది. ఈ గేమ్ చివర్లో స్లయిడ్ షాట్ ఆడే క్రమంలో రాడుకాను ఎడమ కాలికి గాయమై రక్తస్రావమైంది. రాడుకాను మెడికల్ టైమ్ కోరగా... లేలా మాత్రం చైర్ అంపైర్ వద్ద అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ లేలా అభ్యంతరాన్ని చైర్ అంపైర్ తోసిపుచ్చి డాక్టర్‌ను కోర్టులోకి పిలిచారు. కాలికి చికిత్స చేసుకున్నాక రాడుకాను మ్యాచ్ కోసం సర్వీస్ చేసింది. ఒకసారి బ్రేక్ పాయింట్‌ను కాచుకున్న రాడుకాను రెండుసార్లు డ్యూస్ అయ్యాక మూడోసారి ఏస్ సంధించి సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. గత నాలుగు మ్యాచ్‌లను మూడో సెట్ వరకు తీసుకెళ్లి గెలిచిన లేలా ఈసారి మాత్రం సఫలం కాలేకపోయింది. మహిళల టెన్నిస్ భవిష్యత్‌ను ఈ ఫైనల్ చూపించింది. ‘డ్రా’లో ఉన్న ఏ క్రీడాకారిణి అయినా గెలవొచ్చనే సందేశాన్నిచ్చింది. బిల్లీ జీన్ కింగ్, వర్జినియా వేడ్, టిమ్ హెన్మన్లాంటి టెన్నిస్ దిగ్గజాల అడుగుజాడల్లో కొత్త తరం నడుస్తుందని ఆశిస్తున్నాను. ప్రత్యర్థి లేలా పోరాడింది. ఆమెను ఓడించడం అంత సులభం కాదు. భవిష్యత్‌లో మేం మళ్లీ మళ్లీ ఫైనల్లో తలపడాలని కోరుకుంటున్నాను. –రాడుకాను (9/11) ఉగ్రదాడి తర్వాత గత 20 ఏళ్లలో న్యూయార్క్ నగరం తేరుకున్న తీరు అపూర్వం. ఈ నగరంలానే నేనూ పుంజుకుంటాను. న్యూయార్క్ వాసుల ఆత్మస్థయిర్యమే నాకు స్ఫూర్తి. వచ్చే ఏడాదీ ఇక్కడ ఫైనల్ ఆడతాను. అప్పుడు తప్పకుండా ట్రోఫీని ఎగరేసుకుపోతాను. ఈ ఫైనల్లో ఎమ్మా బాగా ఆడింది. ఆమెకు నా అభినందనలు. –లేలా ఫెర్నాండెజ్ రన్నరప్ ట్రోఫీతో లేలా ఫెర్నాండెజ్ -
మెయిన్ ‘డ్రా’కు యూకీ అర్హత
చెన్నై: భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో భారత మాజీ నంబర్‌వన్ యూకీ బాంబ్రీ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో యూకీ 6–3, 6–1తో నికొలస్ కికెర్ (అర్జెంటీనా)పై అలవోకగా గెలిచాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌తో యూకీ తలపడతాడు. మరో మ్యాచ్‌లో ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్ 6–7 (2/7), 2–6తో జోజెఫ్ కొవాలిక్ (స్లొవేకియా) చేతిలో ఓడిపోయి మెయిన్ ‘డ్రా’ బెర్త్ దక్కించుకోలేకపోయాడు.