USA Dramatically Steal 2 Runs Force Tie Got Victory In Super Over.. టి20 మ్యాచ్‌లంటేనే జోష్‌కు పెట్టింది పేరు. ఆఖరి బంతి వరకు ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడుతుంది. అలాంటి మ్యాచ్‌ల్లో కొన్నిసార్లు హైడ్రామా నెలకొనడం చూస్తుంటాం. గెలవడం కోసం ఎంతదూరం అయినా వెళతారు అనడానికి కెనడా, అమెరికాల మధ్య జరిగిన మ్యాచ్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అమెరికాను అదృష్టం వరించి మ్యాచ్ టై కావడం.. ఆ తర్వాత సూపర్ ఓవర్‌లో కెనడాను ఓడించడం జరిగిపోయింది.
ఇక విషయంలోకి వెళితే.. 2022 టి20 ప్రపంచకప్ అమెరికన్ రీజియన్ క్వాలిఫయర్ మ్యాచ్‌ల్లో భాగంగా కెనడా, అమెరికా మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా 20 ఓవర్లలో 142 పరుగులు చేసింది. అనంతరం అమెరికా ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్‌లో చివరి బంతికి మూడు పరుగులు అవసరం అయ్యాయి. కెనడా బౌలర్ జతిందర్ పాల్ బంతిని విసరగా స్ట్రైక్‌లో ఉన్న అలీఖాన్ మిస్ చేశాడు. అయితే ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రస్టీ థియోరన్ పరుగు కోసం పిలిచాడు. అతను క్రీజులోకి చేరేలోపే కీపర్ బంతిని అందుకొని వికెట్ల వైపు వేగంగా విసిరాడు. రస్టీ రనౌట్ అయ్యాడనే సంతోషంలో కెనడా ఆటగాళ్లు సంబరాలు షురూ చేశారు.
అయితే ఇక్కడే రస్టీ తెలివిని ఉపయోగించి రనౌట్ కాదా అవునా అనేది అంపైర్లు ఇంకా నిర్థారించకపోవడంతో రస్టీ రెండో పరుగు కోసం పరిగెత్తాడు. అయితే నాన్‌స్ట్రైక్‌లో ఉన్న అలీఖాన్ మ్యాచ్ అయిపోయిందనుకొని పెవిలియన్ వైపు వెళుతున్నాడు. ఇంతలో రస్టీ పరుగు కోసం గట్టిగా అరవడంతో అలీఖాన్ వెంటనే పరుగు లఖించుకున్నాడు. అలా రెండో పరుగు పూర్తి చేసి మూడో పరుగుకోసం పరిగెత్తినప్పటికీ పూర్తిచేయలేకపోయాడు. అయితే మొదట రస్టీ రనౌట్ కాదని నిర్థారించిన అంపైర్లు రెండు పరుగులు లీగల్ అని డిక్లెర్ చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్‌లో అమెరికా 22 పరుగులు చేయగా.. కెనడా 14 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
📺 WATCH: One of the most dramatic finishes in the history of cricket as USA and Canada played out a match for the ages that went to a Super Over where #TeamUSA🇺🇸 prevailed
— USA Cricket (@usacricket) November 11, 2021
👀The final over highlights are a MUST WATCH⬇️#CANvUSA🇨🇦🇺🇸 #WeAreUSACricket🇺🇸 pic.twitter.com/UBqBNTtS7x
Comments
Please login to add a commentAdd a comment